హోమ్ /వార్తలు /explained /

Stamp Duty FAQs : ఆస్తులను కొనేటప్పుడు స్టాంప్ డ్యూటీ ఛార్జీలను ఎలా లెక్కిస్తారు? దీంతో లాభం ఏంటి?

Stamp Duty FAQs : ఆస్తులను కొనేటప్పుడు స్టాంప్ డ్యూటీ ఛార్జీలను ఎలా లెక్కిస్తారు? దీంతో లాభం ఏంటి?

Stamp Duty Charges Explained | ఆన్‌లైన్ కాలిక్యులేటర్‌ని ఉపయోగించలేకపోతే.. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు వివరాలు తెలుసుకోవడానికి మీ సమీపంలోని ప్రాపర్టీ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు వెళ్లి, అన్ని వివరాలు మాన్యువల్‌గా తెలుసుకోవచ్చు. ప్రభుత్వం నిర్దేశించిన నియమ, నిబంధనలకు లోబడి, అన్ని రకాల రిజిస్ట్రేషన్ రుసుముల గురించి అధికారులు సమాచారం అందిస్తారు.

Stamp Duty Charges Explained | ఆన్‌లైన్ కాలిక్యులేటర్‌ని ఉపయోగించలేకపోతే.. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు వివరాలు తెలుసుకోవడానికి మీ సమీపంలోని ప్రాపర్టీ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు వెళ్లి, అన్ని వివరాలు మాన్యువల్‌గా తెలుసుకోవచ్చు. ప్రభుత్వం నిర్దేశించిన నియమ, నిబంధనలకు లోబడి, అన్ని రకాల రిజిస్ట్రేషన్ రుసుముల గురించి అధికారులు సమాచారం అందిస్తారు.

Stamp Duty Charges Explained | ఆన్‌లైన్ కాలిక్యులేటర్‌ని ఉపయోగించలేకపోతే.. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు వివరాలు తెలుసుకోవడానికి మీ సమీపంలోని ప్రాపర్టీ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు వెళ్లి, అన్ని వివరాలు మాన్యువల్‌గా తెలుసుకోవచ్చు. ప్రభుత్వం నిర్దేశించిన నియమ, నిబంధనలకు లోబడి, అన్ని రకాల రిజిస్ట్రేషన్ రుసుముల గురించి అధికారులు సమాచారం అందిస్తారు.

ఇంకా చదవండి ...

  స్టాంప్ డ్యూటీ (Stamp Duty) అనేది కొత్త ప్రాపర్టీని కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలుదారులు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్. ఈ రుసుము చెల్లిస్తేనే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ (Property Registration) చెల్లుబాటు అవుతుంది. ఇది యాజమాన్యానికి చట్టపరమైన రుజువుగా పనిచేస్తుంది. స్టాంప్ డ్యూటీ చెల్లించకుండా, మీరు ఆస్తికి చట్టపరమైన యజమాని హోదాను పొందలేరు. భారతదేశంలో స్టాంప్ డ్యూటీ రేటు ఆస్తి మార్కెట్ (Property Market Value) విలువలో నాలుగు శాతం నుంచి తొమ్మిది శాతం వరకు ఉంటుంది.

  స్టాంప్ డ్యూటీ ఛార్జీలను ఎలా లెక్కిస్తారు? (How to calculate stamp duty)

  కొనుగోలుదారులు చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ ఛార్జీని అనేక అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు. ఇందుకు ప్రభుత్వం ఆస్తి మొత్తం మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుంటుంది. మీ ఆస్తి మార్కెట్ విలువ ఎక్కువగా ఉంటే, మీరు పెద్ద మొత్తంలో ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఆస్తి మార్కెట్ విలువ తక్కువగా ఉంటే, తక్కువ ఛార్జీలు వర్తిస్తాయి. ఒకవేళ ఆస్తి మార్కెట్ విలువ, అగ్రిమెంట్ విలువ రెండింటినీ కొనుగోలుదారులు కలిగి ఉంటే, వీటిలో ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని స్టాంప్ డ్యూటీగా చెల్లించాల్సి ఉంటుంది.

  స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించేందుకు అవసరమయ్యే డాక్యుమెంట్లు
  విక్రేత (seller) పేరుతో సేల్ డీడ్
  ఖాతా సర్టిఫికేట్
  గత 3 నెలల పన్ను చెల్లించిన రసీదులు
  రిజిస్టర్డ్ డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ (జాయింట్ డెవలప్‌మెంట్ ప్రాపర్టీ విషయంలోనే)
  పవర్ ఆఫ్ అటార్నీ (ఉంటేనే..)
  భూమి యజమాని, బిల్డర్ చేసుకునే జాయింట్ డెవలప్‌మెంట్ అగ్రిమెంట్, GPA, షేరింగ్/సప్లిమెంటరీ అగ్రిమెంట్
  గత రిజిస్టర్డ్ అగ్రిమెంట్స్ కాపీలు (రీసేల్ ప్రాపర్టీ విషయంలో)
  RTC (రికార్డ్స్ ఆఫ్ రైట్స్ అండ్ టెనెన్సీ కార్ప్స్) లేదా 7/12 ఎక్స్‌ట్రాక్ట్
  సంబంధిత అథారిటీ జారీ చేసిన కన్వర్షన్ ఆర్డర్
  ఏదైనా బకాయి ఉన్న రుణ మొత్తం విషయంలో తాజా బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు
  ప్రస్తుత తేదీ వరకు ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్
  సేల్ అగ్రిమెంట్
  విద్యుత్ బిల్లు
  అపార్ట్‌మెంట్ అసోసియేషన్ నుంచి పొందిన NOC
  మంజూరైన బిల్డింగ్ ప్లాన్
  బిల్డర్ నుంచి పొందిన ఆక్యుపెన్సీ / పొసెషన్ సర్టిఫికేట్
  భూమి యజమాని టైటిల్ డాక్యుమెంట్లు
  సొసైటీ షేర్ సర్టిఫికేట్ & సొసైటీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫోటోకాపీ

  స్టాంప్ డ్యూటీ ఎలాంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది? (Factors that decide Stamp Duty)

  ప్రాపర్టీ ధర, విలువతో పాటు.. ప్రాపర్టీ రకం, ఆస్తి ఉన్న లొకేషన్, యజమాని లింగం, వయసు, ఆస్తి వినియోగం, అంతస్తుల సంఖ్య.. వంటి అంశాలపై ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ రుసుము, స్టాంపు డ్యూటీ ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఆస్తి విలువను నిర్ణయించడానికి, సంబంధిత అధికారులు స్టాంప్ డ్యూటీ రెడీ రికనర్‌ను (Stamp Duty Ready Reckoner) ఉపయోగిస్తారు. ఇది స్టాంప్ డ్యూటీని లెక్కించడంలో తోడ్పడే మార్గదర్శకుడిగా ఉంటుంది. స్టాంప్ డ్యూటీ రెడీ రెకనర్‌ను ప్రతి సంవత్సరం జనవరి 1న సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం ప్రచురిస్తుంది.

  సాధారణంగా రికనర్ రేటు/మార్కెట్ విలువ/సర్కిల్ రేటు లేదా ఆస్తి కన్సిడరేషన్ వ్యాల్యూ.. వీటిలో ఏది ఎక్కువైతే, అంత మొత్తం స్టాంప్ డ్యూటీ విధిస్తారు. కన్సిడరేషన్ వ్యాల్యూ అనేది రెండు పార్టీలు అంగీకరించిన ఏదైనా కొనుగోలు/అమ్మకం లావాదేవీ మొత్తం. ఉదాహరణకు, మీ ఫ్లాట్ అగ్రిమెంట్ విలువ రూ. 60 లక్షలు, సర్కిల్ రేటు రూ. 50 లక్షలు అయితే.. స్టాంప్ డ్యూటీని ఎక్కువ విలువపై లెక్కిస్తారు. అంటే ఈ సందర్భంలో రూ. 60 లక్షలను పరిగణనలోకి తీసుకుంటారు.

  స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీ అంటే ఏంటి? వివిధ నగరాల్లో ఈ చార్జీలు ఎంత?

  ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ సమయంలో వీటిపై అవగాహన ముఖ్యం

  ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ సమయంలో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల విషయంలో గందరగోళానికి గురికాకుండా, ముందుగానే వివిధ అంశాలపై కొనుగోలుదారులు అవగాహన పెంచుకోవాలి. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్‌పై స్టాంప్ డ్యూటీ ఛార్జీలు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. బిల్డింగ్ రకం లేదా ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి.. వంటి వివిధ అంశాలను రాష్ట్రాలు పరిగణనలోకి తీసుకుంటాయి. కొన్ని రాష్ట్రాలు ఇండిపెండెంట్ హౌజ్‌లపై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను లెక్కించడానికి.. ఇంటిని నిర్మించిన ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకుంటాయి.

  అయితే అపార్ట్‌మెంట్ల విషయంలో బిల్ట్-అప్ ఏరియా ఆధారంగా ఒక ఫిగర్ వస్తుంది. స్టాంప్ డ్యూటీని రాష్ట్ర బడ్జెట్ ప్రకారం రాష్ట్రాలు ఏటా సవరించవచ్చు. కొన్ని రాష్ట్రాలు మహిళలకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలపై రాయితీని అందిస్తున్నాయి. సీనియర్ సిటిజన్లకు సైతం ప్రత్యేక రాయితీలు ఉన్నాయి. అయితే రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఛార్జీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదనంగా కొన్ని రకాల ట్యాక్స్‌లు విధించవచ్చు.

  Real Estate: కరోనా కాలంలో పుంజుకున్న రియల్ ఎస్టేట్.. కారణాలివే..

  స్టాంప్ డ్యూటీ క్యాలిక్యులేటర్ (Stamp Duty Calculator)

  స్టాంప్ డ్యూటీని లెక్కించేందుకు అనేక ఆన్‌లైన్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఆన్‌లైన్ స్టాంప్ డ్యూటీ క్యాలిక్యులేటర్‌ల సాయంతో కొన్ని సెకన్లలోనే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కోసం చెల్లించాల్సిన ఫీజులపై ఒక అవగాహనకు రావచ్చు. ఇందుకు కొన్ని వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలి.

  ఆన్‌లైన్ స్టాంప్ డ్యూటీ క్యాలిక్యులేటర్‌లో మీ ప్రాపర్టీకి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని నమోదు చేయండి. ప్రాపర్టీ ఉన్న రాష్ట్రం, ఆస్తి మొత్తం విలువ, తదితర వివరాలు నింపండి. ఆ తరువాత “Calculate” బటన్‌ను ప్రెస్ చేస్తే, స్టాంప్ డ్యూటీకి సంబంధించిన అన్ని వివరాలు ప్రత్యక్షమవుతాయి.

  Hyderabad House Sales: ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్ రికార్డ్.. ఆ ప్రాంతాల్లో ఇళ్లకు యమ డిమాండ్.. వివరాలివే

  రిజిస్ట్రేషన్ ఛార్జీలను తెలుసుకునేందుకు కూడా ఆన్‌లైన్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఫీజు క్యాలిక్యులేటర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే మొత్తం రిజిస్ట్రేషన్ ఫీజును లెక్కించేందుకు సెస్, సర్‌ఛార్జ్‌లను సైతం నమోదు చేయాలి.

  ఇలాంటి ఆన్‌లైన్ కాలిక్యులేటర్‌ని ఉపయోగించలేకపోతే.. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు వివరాలు తెలుసుకోవడానికి మీ సమీపంలోని ప్రాపర్టీ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు వెళ్లి, అన్ని వివరాలు మాన్యువల్‌గా తెలుసుకోవచ్చు. ప్రభుత్వం నిర్దేశించిన నియమ, నిబంధనలకు లోబడి, అన్ని రకాల రిజిస్ట్రేషన్ రుసుముల గురించి అధికారులు సమాచారం అందిస్తారు.

  First published:

  ఉత్తమ కథలు