Home /News /explained /

WHAT IS STAMP DUTY AND REGISTRATION CHARGES HERE IS CHARGES IN DIFFERENT CITIES BA

స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీ అంటే ఏంటి? వివిధ నగరాల్లో ఈ చార్జీలు ఎంత?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Registration charges | ఏదైనా స్థలం లేదా ఇల్లు, అపార్ట్ మెంట్ లాంటివి కొనుగోలు చేసేటప్పుడు చాలా అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. అందులో రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా ఉంటాయి. వీటిని కూడా మనం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే, అసలు రిజిస్ట్రేషన్ చార్జీలు అంటే ఏంటి? ఏయే మెట్రో నగరాల్లో ఎంత ఉన్నాయో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
    ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసిన తరువాత, చట్ట ప్రకారం ఆ ఆస్తిని కొనుగోలుదారులు తమ పేరుతో రిజిస్ట్రేషన్ (Property Registration) చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందుకు కొంత ట్యాక్స్ ( Property Tax) చెల్లించాలి. మీరు ప్రాపర్టీని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, ఆ ఆస్తిని అమ్మిన వారికి నిర్ణీత ధర చెల్లిస్తే సరిపోతుందని భావించకూడదు. వాటిని మీ పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అదనంగా పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రాపర్టీపై స్టాంప్ డ్యూటీ (Stamp Duty) , రిజిస్ట్రేషన్ ఛార్జీలు (Property Registration charges) , సెస్ (SESS), సర్‌చార్జీలు వర్తిస్తాయి. ఈ అన్ని ఛార్జీలు కలిపి ఆస్తి మొత్తం మార్కెట్ విలువలో 7% నుంచి 10% వరకు లేదా అంతకంటే ఎక్కువగా ఉండవచ్చు. భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో ఆస్తి మొత్తం మార్కెట్ విలువలో 5- 7 శాతాన్ని స్టాంప్ డ్యూటీగా వసూలు చేస్తున్నారు. దీంతోపాటు 1% రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేస్తున్నారు.

    స్టాంప్ డ్యూటీ అంటే ఏంటి? (What is Stamp Duty)
    స్టాంప్ డ్యూటీ అనేది రియల్ ఎస్టేట్ లావాదేవీలపై ప్రభుత్వం విధించే పన్ను. ఇల్లు వంటి రియల్ ఎస్టేట్ ఆస్తిని భౌతికంగా కలిగి ఉంటే సరిపోదు. ఆ ఆస్తి చట్టపరమైన యాజమాన్యానికి సంబంధించిన రుజువును కలిగి ఉండాలి. దీని కోసం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు తప్పనిసరిగా చెల్లించాలి. స్టాంప్ డ్యూటీని ఆస్తి విలువ ఆధారంగా లెక్కిస్తారు. ఇది ఆస్తి రకం (నివాస లేదా వాణిజ్య), వయసు, ప్రాతం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. స్టాంప్ డ్యూటీ అనేది మొత్తం ప్రాపర్టీ ధరను పెంచుతుంది. కాబట్టి, ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు ఇలాంటి రుసుములను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.

    ఇండియన్ స్టాంప్ యాక్ట్- 1899లోని సెక్షన్ 3 ఏం చెబుతోంది?
    ఆస్తి టైటిల్‌ను ఇతరుల పేరు మీదకు బదిలీ చేస్తున్నప్పుడు ప్రాపర్టీ స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. ఆస్తులను కొనుగోలు చేసినవారు ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రుసుమును వసూలు చేస్తాయి. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. ఇండియన్ స్టాంప్ యాక్ట్- 1899లోని సెక్షన్ 3 ప్రకారం.. ఆస్తిని రిజిస్టర్ చేసేటప్పుడు మీరు స్టాంప్ డ్యూటీని చెల్లించాలి.

    Dharni portal : ధరణి పోర్టల్‌లో మరిన్ని మాడ్యూల్... అవగాహన లేకపోవడం వల్లే సమస్యలు..



    మీ రిజిస్ట్రేషన్ ఒప్పందాన్ని ధ్రువీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీ వసూలు చేస్తుంది. స్టాంప్ డ్యూటీ చెల్లించిన ట్యాగ్ ఉన్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్.. కోర్టులో ఆస్తిపై మీ యాజమాన్యాన్ని నిరూపించడానికి చట్టపరమైన పత్రంగా పనిచేస్తుంది. స్టాంప్ డ్యూటీ ఛార్జీలు చెల్లించకుండా, ఆ ఆస్తిని చట్టబద్ధంగా తమ సొంతమని క్లెయిమ్ చేయలేరు. కాబట్టి కొనుగోలుదారులు స్టాంప్ డ్యూటీ మొత్తాన్ని తప్పనిసరిగా చెల్లించాలి.

    Dharani Portal: ధరణి పోర్టల్లో మరో కొత్త ఆప్షన్.. ఆ సమస్యలకు పరిష్కారం



    రిజిస్ట్రేషన్ ఫీజు అంటే ఏంటి? (What is Registration Fee)
    రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ కంటే భిన్నంగా ఉంటుంది. ఈ రెండింటినీ వేర్వేరుగా లెక్కిస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజు అనేది కోర్టు వసూలు చేసే రుసుము. ఇది రిజిస్ట్రేషన్ చట్టం కిందకు వస్తుంది. ఇది ప్రాథమికంగా కొనుగోలుదారులు, అమ్మకందారుల మధ్య టెర్మినల్ లీగల్ ఒప్పందం. ఆస్తిపై యాజమాన్యం ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి మారిందనే నోట్‌ను ఈ లీగల్ అగ్రిమెంట్ కలిగి ఉంటుంది. ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్- 1908లోని సెక్షన్ 17 ప్రకారం.. ఆస్తుల బదిలీ, అమ్మకం, లీజు వంటి ఒప్పందాలు జరిగితే, తప్పకుండా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయించాలి. రిజిస్ట్రేషన్ పీజు కూడా రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటుంది.

    దేశంలోని ప్రధాన నగరాల్లో స్టాంప్ డ్యూటీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎలా ఉన్నాయి?
    ఇంతకు ముందు చెప్పినట్లు, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉంటాయి. ప్రధాన నగరాల్లో ఇవి ఎంత వరకు ఉన్నాయో చూద్దాం.

































    సిటీస్టాంప్ డ్యూటీ ఛార్జీలురిజిస్ట్రేషన్ ఛార్జీలు
    బెంగళూరుఆస్తి విలువలో 2% నుంచి 3%1%
    ఢిల్లీడీల్ విలువలో 4% నుంచి 6%1%
    ముంబైఆస్తి విలువలో 4% నుంచి 5%1%
    చెన్నైఆస్తి విలువలో 7%1%
    కోల్‌కతాఆస్తి విలువలో 3% నుంచి 5%1%



    స్టాంప్ డ్యూటీ ఛార్జీలను నిర్ణయించే అంశాలు

    ఆస్తి వయసు:
    స్టాంప్ డ్యూటీ ఛార్జీలను నిర్ణయించడంలో ఆస్తి వయసు కీలక పాత్ర పోషిస్తుంది. స్టాంప్ డ్యూటీ ఛార్జీలను ఆస్తి మొత్తం మార్కెట్ విలువలో నిర్ణీత శాతంగా లెక్కిస్తారు. సాధారణంగా పాత భవనాలకు తక్కువ స్టాంప్ డ్యూటీ ఛార్జీలు వర్తిస్తాయి. కొత్త భవనాలపై అధిక ఛార్జీ ఉంటుంది. పాత భవనాల మార్కెట్ విలువ క్షీణించడమే దీనికి కారణం.

    యజమాని వయసు?
    దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సీనియర్ సిటిజన్‌లకు స్టాంప్ డ్యూటీ ఛార్జీలపై సబ్సిడీ ఇస్తున్నాయి. కాబట్టి, ఈ ఛార్జీని నిర్ణయించడంలో యజమాని వయసు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.



    యజమాని స్త్రీ? పురుషుడు?
    సీనియర్ సిటిజన్ల మాదిరిగానే మన దేశంలోని మహిళలకు కూడా ప్రభుత్వాలు కొన్ని రాయితీలు ఇస్తున్నాయి. ఏదైనా ఆస్తిని మహిళలు తమ పేరు మీద రిజిస్టర్ చేసుకుంటే, స్టాంప్ డ్యూటీ ఛార్జీల్లో రాయితీ లభిస్తుంది. మహిళలతో పోలిస్తే మగవాళ్లు తమ ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాలను స్టాంప్ చేయడానికి సుమారు 2% రుసుము అదనంగా చెల్లిస్తారు.

    ప్రయోజనం (Purpose):
    నివాస (రెసిడెన్షియల్) భవనాలతో పోలిస్తే వాణిజ్య (కమర్షియల్) భవనాలపై అధిక స్టాంప్ డ్యూటీ ఫీజు ఉంటుంది. వాణిజ్య భవనాలకు అదనపు సౌకర్యాలు, ఫ్లోర్ స్పేస్, సెక్యూరిటీ ఫీచర్లు అవసరమవుతాయి. ఈ మేరకు అదనపు రుసుములు వర్తిస్తాయి.

    ఆస్తి లొకేషన్
    మీ ఆస్తి మున్సిపల్ ప్రాంతంలో లేదా ఉన్నత స్థాయి పట్టణ ప్రాంతంలో ఉంటే.. అధిక స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. మీ ఆస్తి గ్రామ పంచాయతీ లేదా పట్టణ పంచాయతీల పరిధిలో ఉంటే, స్టాంప్ డ్యూటీ పరిమితి తక్కువగా ఉంటుంది.

    సౌకర్యాలు (Amenities):
    ఆస్తిని రిజిస్టర్ చేసేటప్పుడు, నిర్ణీత ప్రాంగణంలో మీరు కలిగి ఉన్న ప్రతి అదనపు సౌకర్యానికి ప్రభుత్వం మీ నుంచి అదనపు స్టాంప్ డ్యూటీ వసూలు చేస్తుంది. ప్రభుత్వం నిర్దేశించిన ఈ అదనపు సౌకర్యాలు 20కి పైగా ఉన్నాయి. మీ ఆస్తిలో ఇవి ఉంటే, వాటిపై వర్తించే ఫీజును అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. లిఫ్ట్‌లు, స్విమ్మింగ్ పూల్, లైబ్రరీ, క్లబ్, జిమ్, కమ్యూనిటీ హాల్, స్పోర్ట్స్ ఏరియా... వంటివి ఎమినిటీస్ లిస్ట్‌లో ఉన్నాయి.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు