Home /News /explained /

WHAT IS RECURRING DEPOSIT ADVANTAGES AND DISADVANTAGES OF IT BA

RD Advantages and Disadvantages: రికరింగ్ డిపాజిట్ అంటే ఏంటి? దీనిలో ఉండే లాభాలు, ప్రతికూలతలు .

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

RD Benefits and Losses | ఈ డిపాజిట్ కనీస వ్యవధి ఆరు నెలల నుంచి ప్రారంభమవుతుంది. గరిష్ట డిపాజిట్ వ్యవధి పది సంవత్సరాలుగా ఉంటుంది. ఆర్‌డీలు దాదాపు ఫిక్స్‌డ్ డిపాజిట్ల వంటివే కానీ నిర్దిష్ట కాలపరిమితితో మరిన్ని ప్రయోజనాలు అందిస్తాయి. అలాగే ఇందులో లోపాలు/ ప్రతికూలతలు ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  ప్రముఖ పొదుపు పథకాల్లో ఒకటైన రికరింగ్ డిపాజిట్ (Recurring Deposit) (ఆర్‌డీ) చక్కటి రాబడి అందించే పెట్టుబడి సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. వీటిని టర్మ్ డిపాజిట్ (Term Deposit) , సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) పెట్టుబడులుగా కూడా పరిగణిస్తుంటారు. ఆర్‌డీ అనేది పెట్టుబడిదారులకు తాము ముందుగా నిర్ణయించుకున్న మొత్తాన్ని.. ముందుగా నిర్ణయించిన కాలపరిమితి వరకు ప్రతినెలా డిపాజిట్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ డిపాజిట్ కనీస వ్యవధి ఆరు నెలల నుంచి ప్రారంభమవుతుంది. గరిష్ట డిపాజిట్ వ్యవధి పది సంవత్సరాలుగా ఉంటుంది. ఆర్‌డీలు దాదాపు ఫిక్స్‌డ్ డిపాజిట్ల వంటివే కానీ నిర్దిష్ట కాలపరిమితితో మరిన్ని ప్రయోజనాలు అందిస్తాయి. అలాగే ఇందులో లోపాలు/ ప్రతికూలతలు (RD advantages and Disadvantages) ఉన్నాయి. ఈ డిపాజిట్లతో ఎలాంటి లాభనష్టాలు ఉంటాయో తెలుసుకుందాం.

  రికరింగ్ డిపాజిట్ ప్రయోజనాలు

  1. ఇది స్కూల్ ఫీజుకు, కారు లేదా బైకు కొనుగోలు చేయడం వంటి స్వల్పకాల ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు దోహదపడుతుంది. ఇది అత్యంత సురక్షితమైన, అధిక రాబడి అందించే పెట్టుబడి పథకం కూడా. కొన్ని బ్యాంకులు ప్రతినెలా నగదు జమ చేయకపోయినా ఎలాంటి పెనాల్టీలు విధించవు. దీన్నే ఫ్లెక్సిబుల్ రికరింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (Flexible Recurring Deposit) అంటారు. ఫ్లెక్సిబుల్ రికరింగ్ డిపాజిట్ ఖాతాదారులు తమకు నచ్చినపుడు అమౌంట్ విత్‌డ్రా చేసుకోవచ్చు.

  Recurring deposits: రికరింగ్ డిపాజిట్ లో డబ్బు పెడుతున్నారా..ఎక్కువ వడ్డీ అందించే బ్యాంకులు ఇవే..  2. ప్రస్తుతం ప్రముఖ బ్యాంకులన్ని ఆన్‌లైన్ సేవలను అందిస్తున్నాయి. దీనితో ఆన్‌లైన్‌లోనే ఆర్‌డీ ఖాతాను తెరవడంతో పాటు సమాచారాన్ని అప్‌డేట్ చేసుకోవచ్చు. ఖాతాను మూసివేయడం తదితర పనులు కూడా ఆన్‌లైన్‌లోనే చేయొచ్చు. మీరు మీ మొబైల్ ఫోన్‌లతో మీ ఇంట్లో కూర్చొని మీ ఆర్‌డీ ఖాతాకు సంబంధించిన పనులన్నీ చేయవచ్చు. కరెంట్ అకౌంట్ లేదా సేవింగ్స్ అకౌంట్ నుంచి నేరుగా రికరింగ్ డిపాజిట్ చెల్లించవచ్చు.

  3. ఆర్‌డీ వడ్డీ రేట్లు కాల పరిమితి, డిపాజిట్ మొత్తంపై ఆధారపడి ఉంటుంది. బ్యాంకులను బట్టి కూడా వడ్డీ రేటు మారుతుంటుంది. వడ్డీ త్రైమాసికం ఆధారంగా మారుతుంది. దీని వడ్డీ ఫిక్స్‌డ్ డిపాజిట్లతో సమానంగా ఉంటుంది. ఆర్‌డీ క్యాలిక్యులేటర్ ఉపయోగించి వడ్డీని కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం టాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్(TDS) అనేది కొంతమేర రికరింగ్ డిపాజిట్ ఖాతాల వడ్డీకి వర్తించదు. రికరింగ్ డిపాజిట్ ని హామీగా పెట్టి.. డిపాజిట్ చేసిన మొత్తంలో 80, అంతకన్నా ఎక్కువ శాతం వరకు లోన్స్ పొందొచ్చు.

  Paytm Offer: డిసెంబర్ 25 వరకు Paytm వాలెట్‌లో డబ్బును లోడ్ చేస్తే, రూ.90 వరకు గిఫ్ట్ వోచర్‌లను పొందండి...  4. బ్యాంకులు ఆర్‌డీ ఖాతాలు తీసుకున్న సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీని అందిస్తాయి. సీనియర్ సిటిజన్లకు సాధారణంగా ఇతరులకు ఇచ్చే సాధారణ వడ్డీ రేటు కంటే 0.50% ఎక్కువగా ఉంటుంది. ఆర్‌డీ చిన్న పిల్లలు, మహిళలకు కూడా మంచి పొదుపు పథకంగా ఉపయోగపడుతుంది. 100-1000 రూపాయలతో కూడా ఆర్‌డీ అకౌంట్ తెరవచ్చు. కాబట్టి తక్కువ ఆదాయం గల వారికి కూడా పొదుపు చేయడం అలవాటవుతుంది. అయితే కనీస మొత్తం, గరిష్ట మొత్తం అనేవి బ్యాంక్‌ను బట్టి మారుతాయి.

  5. బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉంటే, ఆర్‌డీ ఖాతా సులభంగా తెరవచ్చు. బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్‌తో ఆర్‌డీ అకౌంట్‌ను లింకు చేయగలవు. డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కూడా చాలా తక్కువ సమయంలో సులభంగా పూర్తవుతుంది. కొన్ని సందర్భాల్లో మెచూరిటీ పిరియడ్ కు ముందే ఖాతా క్లోజ్ చేయొచ్చు.

  చలికాలంలో వేడినీటి స్నానం కోసం Best Geysers ఇవే...Flipkart లో బంపర్ డిస్కౌంట్స్..ధరలు ఎంతంటే...  6. పోస్టాఫీసులో రూ.10తో కూడా ఖాతా తెరవచ్చు. చెక్కు/ న‌గ‌దు పద్ధతిలో అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. మీ ఆర్‌డీ అకౌంట్‌ను ఒక పోస్టాఫీస్ నుంచి మరొక పోస్టాఫీసుకు బదిలీ చేయొచ్చు. పదేళ్ల వయసున్న పిల్లలు కూడా తపాలా కార్యాలయంలో అకౌంట్ తెరిచి తమ సొంతంగా మేనేజ్ చేయవచ్చు. ఇద్దరు పెద్దవారు జాయింట్‌గా ఒకటే అకౌంట్ కూడా తెరవచ్చు. అయితే పోస్టాఫీసులో ఆర్‌డీ కాలపరిమితి ఐదేళ్ల వరకే ఉంటుంది.

  7. ఒక ఖాతాదారుడు ఎన్ని ఆర్‌డీ ఖాతాలు అయినాసరే ఓపెన్ చేయొచ్చు. కొన్ని బ్యాంకులు అడ్వాన్స్ డిపాజిట్లు చేసేందుకు అనుమతిస్తాయి. ప్రతి నెలా క్రమం తప్పకుండా నిర్దిష్ట సమయం వరకు డిపాజిట్ చేయడం ద్వారా మెచూరిటీ టైంలో అందే నగదు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. దీనికితోడు ఎలాంటి రిస్క్ లేకుండా రాబడి అనేది గ్యారెంటీగా దక్కుతుంది.

  8. భారతీయులు, సీనియర్ సిటిజన్లు చిన్నపిల్లలు, ఎన్నారైలు కూడా ఆర్‌డీ ఖాతా ఓపెన్ చేయొచ్చు.

  9. ఆర్థిక అవసరాలు, లక్ష్యాలకు తగ్గట్లు అనేక ఆర్డీ స్కీమ్స్ ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉన్నాయి. వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అందించే వేర్వేరు రకాల ఆర్‌డీ స్కీమ్స్‌ను విభిన్న అవసరాల కోసం పెట్టుబడిదారులు ఎంచుకొని ఆర్థిక లక్ష్యాలు చేరుకోవచ్చు.

  రికరింగ్ డిపాజిట్ ప్రతికూలతలు లేదా నష్టాలు

  1. ఒక్కసారి మీరు సాధారణ రికరింగ్ డిపాజిట్ అకౌంట్‌లో నగదు జమ చేసిన తర్వాత.. మళ్లీ కాలపరిమితి తీరేంతవరకూ విత్‌డ్రా చెయ్యలేరు. ముందస్తుగా విత్‌డ్రా చేయాలనుకుంటే కొంతమేర పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. అలాగే సాధారణంగా మీకు అందించాల్సిన వడ్డీని తగ్గించి ఇస్తుంది. ఫలితంగా మీ వడ్డీ ఆదాయంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

  2. ఒకవేళ మీరు చాలా తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే, రాబడి కూడా అందుకు తగినట్లుగానే ఉంటుంది. తక్కువ మొత్తంలో తక్కువ కాలం పాటు డిపాజిట్ చేయడం వల్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే తక్కువ వడ్డీ లభిస్తుంది.

  Mercedes-Benz EV: ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు...1000 కిలోమీటర్లు..నాన్ స్టాప్ గా వెళ్లొచ్చు...మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రిక్ కారు...  3. మీరు ముందస్తుగా నిర్ణయించుకున్న డిపాజిట్ మొత్తాన్ని భవిష్యత్తులో మార్చుకోలేరు. ఒకవేళ మీరు వెయ్యి రూపాయలతో రికరింగ్ డిపాజిట్ ఓపెన్ చేస్తే.. దాని మెచూరిటీ పిరియడ్ వరకు వెయ్యి రూపాయలు మాత్రమే డిపాజిట్ చేయగలరు. భవిష్యత్తులో మీ సంపాదన పెరిగి ఎక్కువ డిపాజిట్ చేయాలనుకున్నా వీలుపడదు.

  4. కొన్ని బ్యాంకులు సమయానికి డిపాజిట్ చేయనప్పుడు నెలకు కొంత మొత్తంలో జరిమానా విధిస్తాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ ఖాతాలోని వడ్డీ ఆదాయం రూ.40,000(సీనియర్ సిటిజన్లకు రూ.50,000) దాటితే టీడీఎస్ కట్టాల్సి ఉంటుంది.

  5. రికరింగ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్‌మెంట్, రాబడి పరిధి పరిమితంగా ఉంటుంది. పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసి రిస్క్‌ను భరిస్తూ లాభాలు ఆశించే వారికి ఇవి సరైన ఎంపిక కాదు. ఇవి పెద్ద పెట్టుబడి ప్రొడక్ట్స్ జాబితాలోకి రాకపోవడం మరో ప్రతికూలత.
  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Recurring Deposits, Save Money

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు