హోమ్ /వార్తలు /Explained /

Pegasus spyware: ‘పెగాసస్‌’ స్పైవేర్ అంటే ఏంటి.. ‘జీరో-క్లిక్’ అటాక్స్‌ ఎలా జరుగుతాయి? వాటిని ఎలా నిరోధించాలి?

Pegasus spyware: ‘పెగాసస్‌’ స్పైవేర్ అంటే ఏంటి.. ‘జీరో-క్లిక్’ అటాక్స్‌ ఎలా జరుగుతాయి? వాటిని ఎలా నిరోధించాలి?

‘పెగాసస్‌’ స్పైవేర్ అంటే ఏంటి.. ‘జీరో-క్లిక్’ అటాక్స్‌ ఎలా జరుగుతాయి? (ప్రతీకాత్మక చిత్రం)

‘పెగాసస్‌’ స్పైవేర్ అంటే ఏంటి.. ‘జీరో-క్లిక్’ అటాక్స్‌ ఎలా జరుగుతాయి? (ప్రతీకాత్మక చిత్రం)

Pegasus spyware: ‘పెగాసస్‌’ స్పైవేర్ ఇప్పుడు దేశంలో కలకలం రేపుతోంది. అసలేంటి ఇది? ‘జీరో-క్లిక్’ అటాక్స్‌ ఎలా జరుగుతాయి? వాటిని ఎలా నిరోధించాలి..?

Pegasus spyware: ప్రస్తుతం దేశమంతా పెగాసస్ స్పైవేర్ వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పార్లమెంటు సమావేశాల్లో అధికార, విపక్షాలు ఈ ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్ ఉదంతంపై ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. స్పియర్-ఫిషింగ్ పద్ధతులను ఉపయోగించి టెక్స్ట్ లింక్‌లు లేదా మెసేజెస్ క్లిక్స్ ద్వారా మొబైల్ ఫోన్లలోకి స్పైవేర్ జోప్పించే స్థాయి నుంచి... ‘జీరో-క్లిక్’ అటాక్స్‌ ప్రయోగించే స్థాయికి ఎదిగిన స్పైవేర్ పద్ధతులు ఆందోళనలు కలిగిస్తున్నాయి. ప్రస్తుతం మొబైల్ వినియోగదారులను వణికిస్తున్న ‘పెగాసస్‌’ స్పైవేర్ ని అత్యంత శక్తివంతమైనదిగా టెక్ నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే ఫోన్ యూజర్ ఎలాంటి లింక్ ఓపెన్ చేయకపోయినా.. అసలు ఆ వ్యక్తి ప్రమేయం లేకపోయినా.. పెగాసస్‌ స్పైవేర్ మొబైల్‌ని హ్యాక్ చేసేస్తుంది.

క్లాడియో గౌర్నియరీ అనే ప్రముఖ హ్యాకర్, సెక్యూరిటీ పరిశోధకుడు, మాల్‌వేర్‌ విశ్లేషకుడు... ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఆధారిత సెక్యూరిటీ ల్యాబ్‌ని రన్ చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘పెగాసస్‌’ స్పైవేర్ ఒక్కసారి మొబైల్ ఫోన్ లోకి చొరబడితే... అది మొబైల్ యజమాని కంటే ఎక్కువ కంట్రోల్ కలిగి ఉంటుంది" అని తెలిపారు. "పెగాసస్‌ ఐఫోన్ లోకి చొరబడిన క్షణాల్లోనే కీలకమైన అధికారాలను తన స్వాధీనంలోకి తెచ్చుకుంటుంది. ఆ తర్వాత కాంటాక్ట్ లిస్టు, మెసేజెస్, ఇంటర్నెట్ బ్రౌజింగ్ హిస్టరీ వంటి అన్ని విషయాలనూ యాక్సెస్ చేస్తుంది. ఆ విషయాలన్నిటినీ హ్యాకర్‌కి చేరవేస్తుంది" అని తెలిపారు.

ఇది కూడా చదవండి: Asteroid: భూమివైపు గ్రహశకలం... తాజ్‌మహల్ కంటే 3 రెట్లు పెద్దది

జీరో-క్లిక్ అటాక్స్‌ ఎలా జరుగుతాయి?

మానవ తప్పిదం లేదా మానవ ఇంటరాక్షన్ లేకుండానే జీరో-క్లిక్ సైబర్ అటాక్స్‌ అనేవి పెగాసస్‌ వంటి స్పైవేర్లకు మొబైల్‌ని కంట్రోల్ చేయడానికి సహాయ పడుతుంటాయి. నేరుగా సిస్టమ్ పైనే అటాక్ జరుగుతుంది కాబట్టి ఫిషింగ్ అటాక్ గురించి అవగాహన ఉన్నా... లేదా లింక్స్ పై క్లిక్ చేయకూడదు అని తెలిసినా ఎలాంటి ఉపయోగమూ ఉండదు. సాఫ్ట్ వేర్ పైన ఎక్కువగా జరిగే ఈ అటాక్స్ హానికరమైనవా కాదా అనేది నిర్ధారించడానికి సమయం కూడా ఉండదు. చాలా రహస్యంగా ఫోన్ లోకి చొరబడే ఈ స్పైవేర్లను గుర్తించడం కూడా చాలా కష్టం.

ఈ ఏడాది ప్రారంభంలో సైబర్‌ సెక్యూరిటీ సంస్థ జెకాప్స్.. ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లు మెయిల్ అప్లికేషన్ ద్వారా అన్‌సిస్టెడ్ దాడులను ఎదుర్కొంటాయని తెలిపింది. ఐఫోన్ లలో ఉన్న సెక్యూరిటీ వ్యవస్థ.. రిమోట్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేసే సామర్థ్యాలకు అనుమతిస్తుందని... కొంత మొత్తంలో మెమరీని వినియోగించే ఈమెయిల్‌ల ద్వారా అటాకర్లకు మొబైల్‌ని రిమోట్‌గా హ్యాక్ చేసే వీలు కల్పిస్తుందని జెకాప్స్ బ్లాగ్ వెల్లడించింది. యాపిల్ వైర్ లెస్ డివైజ్ లింక్ ద్వారా కూడా ఈ దాడులు జరుగుతాయని టెక్నాలజీ నిపుణులు వెల్లడించారు. iOS 13.3.1 సెక్యూరిటీ ప్యాచ్ అప్ డేట్ రిలీజ్ చేసినప్పుడు యాపిల్ సంస్థ మాట్లాడుతూ.. ఈ సమస్యను పరిష్కరించామని తెలిపింది. కానీ దాడులు జరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ఆండ్రాయిడ్ 4.4.4 వర్షన్, అంతకంటే ఎక్కువ వర్షన్ మొబైల్ ఫోన్ల పై కూడా ఈ దాడులు జరిగే అవకాశం ఉంది. వాట్సాప్, గ్రాఫిక్స్ లైబ్రరీ, స్ట్రీమింగ్ మూవీస్, గేమ్స్ తదితర మార్గాల ద్వారా స్పైవేర్ దాడులు జరుగుతాయి.

ఇది కూడా చదవండి: Video: పెళ్లిలో దెయ్యంలా కనిపించిన వధువు... పారిపోయిన వరుడు

జీరో-క్లిక్ అటాక్స్‌ నిరోధించవచ్చా..?

ఈ సైబర్ దాడులను గుర్తించడమే కష్ట సాధ్యం కాబట్టి నిరోధించడం అనేది దాదాపు అసాధ్యం. మొబైల్ వినియోగదారులు చేయాల్సిందల్లా తమ సెక్యూరిటీ ప్యాచ్ లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. గూగుల్ ప్లే స్టోర్ యాప్, యాపిల్ ప్లే స్టోర్ల నుంచి మాత్రమే అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఈ దాడుల నుంచి తప్పించుకోవాలంటే.. మీ అప్లికేషన్లను అన్ఇన్స్టాల్ చేసి.. బ్రౌజర్స్ ద్వారా మెయిల్స్, మెసేజెస్ చెక్ చేసుకోండి.

First published:

Tags: Technology

ఉత్తమ కథలు