Home /News /explained /

WHAT IS MUTUAL CONSENT DIVORCE HOW WE CAN APPLY FOR IT HERE FULL DETAILS NS GH

Mutual Consent Divorce: మ్యూచువల్ డైవర్స్ అంటే ఏంటి? ఎలా తీసుకోవాలి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భార్యాభర్తలిద్దరూ విడాకులు కావాలని కోరుకుంటే వారు ఇద్దరి పరస్పర అవగాహనతో విడాకులు తీసుకునే వీలుంటుంది. దీని గురించి వివరాలు మీకోసం..

పెళ్లి అంటే ఇద్దరు వ్యక్తులను ఒక అందమైన బంధంలో కలిపి ఉంచడం. అయితే ఆ బంధం అందంగా లేనప్పుడు.. పెళ్లి అనే బంధంలో ఇద్దరూ ఇబ్బంది పడుతున్నప్పుడు విడాకులు తీసుకోవడమే సరైన మార్గం అని నిర్ణయించుకుంటారు జంటలు. ఇద్దరి మధ్య అవగాహన లోపం కావచ్చు, ఒకరి ప్రవర్తన ఒకరికి నచ్చకపోవడం కావచ్చు.. కారణాలేవైనా భార్యాభర్తలిద్దరూ విడాకులు కావాలని కోరుకుంటే వారు ఇద్దరి పరస్పర అవగాహనతో విడాకులు తీసుకునే వీలుంటుంది. దీని గురించి వివరాలు మీకోసం..

1. మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ అంటే ఏంటి?
భార్యాభర్తలు ఇద్దరూ పరస్పర అవగాహనతో విడిపోవడానికి అంగీకరిస్తే ఇద్దరూ కలిసి మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ ఫైల్ చేసి విడాకులు తీసుకునే వీలుంటుంది. హిందూ వివాహ చట్టం లోని సెక్షన్ 13బి, ప్రత్యేక వివాహ చట్టం 1954 లోని సెక్షన్ 28 ప్రకారం ఫ్యామిలీ కోర్టు ముందు ఈ విడాకులు తీసుకునే వీలుంటుంది.

2. విడాకుల పిటిషన్ ఎక్కడ ఫైల్ చేయాలి?
ఈ విడాకుల కోసం పెళ్లి జరిగిన ప్రదేశంలో ఉన్న ఫ్యామిలీ కోర్టు లేదా దంపతులు ఇద్దరూ ఇంతకుముందు నివసించిన ప్రదేశానికి దగ్గర్లో ఉన్న ఫ్యామిలీ కోర్టు లేదా ప్రస్తుతం భార్య నివసిస్తున్న ప్రాంతంలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కేసు వేసే అవకాశం ఉంటుంది.

3. ఈ పిటిషన్ ని ఎవరు ఫైల్ చేయాలి?
సాధారణంగా విడాకుల పిటిషన్ ఎవరైనా వేసే వీలు కల్పించింది కోర్టు. కానీ విడాకులకు సంబంధించిన వివరాలన్నీ ఫైల్ చేయడానికి, ప్రత్యేకంగా వివరాలన్నీ పొందుపర్చేందుకు ఒక లాయర్ సహకారం తీసుకోవడం తప్పనిసరి అవుతుంది. దీనివల్ల మీరు విడిపోయినప్పుడు మీ హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా లాయర్ పక్కాగా డాక్యుమెంట్స్ తయారుచేసే వీలుంటుంది.

4. మ్యూచువల్ డైవర్స్ తీసుకునే పద్దతి ఏంటి?
మ్యూచువల్ డైవర్స్ తీసుకోవాలంటే కోర్టులో రెండు రకాల ఫైలింగ్ చేయాల్సి ఉంటుంది.
1. పిటిషన్ ఫర్ ఫస్ట్ మోషన్ 13బి(1) దీని ప్రకారం మొదటి సారి స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన తర్వాత కనిష్టంగా ఆరు నెలలు గరిష్టంగా 18 నెలల పాటు కూలింగ్ పిరియడ్ ని అందిస్తారు. ఈ సమయంలో ఇరు వర్గాలు తమ ఆలోచనను ఓసారి పునరాలోచించుకొని ఒకవేళ విడాకులు వద్దనుకుంటే రిటర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇద్దరూ విడాకులు కావాలని కోరుకుంటే రెండో పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది.
2. పిటిషన్ ఆఫ్ సెకండ్ మోషన్ 13బి(2) ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 : దీని ద్వారా విడాకులు తీసుకోవచ్చు.

5. ఈ కూలింగ్ పిరియడ్ తొలగించే వీలుంటుందా?
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నాలుగు ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే ఈ కూలింగ్ పిరియడ్ ని తొలగించే వీలుంటుంది. ఈ సందర్భాల్లో పరిస్థితులను ఆధారంగా చేసుకొని కోర్టు ఈ నిర్ణయం తీసుకుంటుంది. దీనికోసం సెకండ్ మోషన్ కి చెందిన మరో పిటిషన్ ని కూడా జోడిస్తూ కూలింగ్ పిరియడ్ మీ కేసులో ఎందుకు అవసరం లేదో వివరిస్తూ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

6. ఎంత సమయం పడుతుంది?
సాధారణంగా ఇరు పక్షాల నుంచి ఒకరు లేదా ఇద్దరు న్యాయవాదులు డైవర్స్ పిటిషన్ రిప్రసెంట్ చేసే వీలుంటుంది. ఇద్దరి అంగీకారం ఉంటే విడాకులు కేవలం 1 లేదా 2 నెలల సమయంలోనే వచ్చేస్తాయి.

Prachi Mishra, Supreme Court Lawyer
Published by:Nikhil Kumar S
First published:

Tags: Divorce, High Court, Marriage

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు