Home /News /explained /

WHAT IS HOME LOAN OVERDRAFT FACILITY AND WHO SHOULD OPT FOR IT GH VB

Explained: హోమ్‌ లోన్‌ ఒవర్‌డ్రాఫ్ట్‌ ఫెసిలిటీ అంటే ఏంటి..? దాన్ని ఎవరు ఎంచుకోవచ్చు..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇంటిపై పన్నుఅందించే సదుపాయంగా హోమ్‌ లోన్‌ ఒవర్‌డ్రాఫ్ట్‌ను చెప్పుకోవచ్చు. దీన్ని స్వల్పకాలిక రుణమని కూడా అంటారు.

ఇల్లు కట్టడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఎన్ని కష్టాలు, ఖర్చులు ఉంటాయో ఆ ఇంటి యజమానులకే తెలుస్తుంది. అంతే కాదు ఇంటి కోసం తీసుకునే హోమ్‌ లోన్‌(Home Loan) చెల్లింపు కూడా ఒక దీర్ఘకాలిక హామీ ఒప్పందం. 20 నుంచి 30 ఏళ్ల పాటు ఆ హామీకి కట్టుడి ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ వ్యవధి తక్కువ ఎంచుకుంటే EMI మొత్తం పెరుగుతుంది. హోమ్‌ లోన్‌ విషయంలో ఆర్థికంగా, మానసికంగా వినియోగదారులు ఎదుర్కొనే కష్టాలను కొత్త తరం ఆర్థిక సంస్థలు గ్రహిస్తున్నాయి. వారిపై భారం తగ్గించేందుకు కొత్త సదుపాయాలు అందిస్తున్నాయి. అందులో ఒకటి హోమ్‌ లోన్‌పై ఒవర్‌ డ్రాఫ్ట్(Over Draft) సదుపాయం. ఇంటిపై పన్నుఅందించే సదుపాయంగా హోమ్‌ లోన్‌ ఒవర్‌డ్రాఫ్ట్‌ను చెప్పుకోవచ్చు. దీన్ని స్వల్పకాలిక రుణమని కూడా అంటారు. అత్యవసరంగా ఏదైనా కొనుగోలు చేయాలి, చేతిలో డబ్బు లేదు. ఆ సమయంలో ఈ సదుపాయం బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇది ఖరీదైన వ్యవహారం కూడా. కాబట్టి ఒవర్‌డ్రాఫ్ట్‌ సదుపాయం పొందే ముందు దాని వల్ల అయ్యే ఎంతో బేరీజు వేసుకోవడం మంచిది.

ఈ 5 రాశుల మగవారు బెస్ట్ డాడ్..ఎంతో ఆప్యాయత కలిగిన ఆదర్శవంతులు..


హోమ్‌ లోన్‌ ఒవర్‌డ్రాఫ్ట్‌ లాభనష్టాలు..
సౌకర్యవంతమైన రీపేమెంట్‌:
ఆదాయం పెరిగినప్పుడు EMI మొత్తాన్ని పెంచుకుందామని భావించే రుణగ్రహీతలకు ఈ సదుపాయం బాగుంటుంది. మీ బకాయి మొత్తంపై మీరు అదనపు చెల్లింపులు జరిపితే అది మీ అసలు, వడ్డీ భారాన్ని తగ్గిస్తుంది. ఇలా చేయడం వలన దీర్ఘకాలం సాగే రుణ చెల్లింపు వ్యవధిని తగ్గించుకోవచ్చు. అంతే కాదు హోమ్‌ లోన్‌పై ఉండే ఒవర్‌డ్రాఫ్ట్ కారణంగా మీరు ప్రీ-పెయిడ్‌ పెనాల్టీల భారాన్ని దూరం పెట్టవచ్చు.

మిగులు మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే సదుపాయం:
సాధారణ హోమ్‌ లోన్స్‌తో పోలిస్తే ఒవర్‌డ్రాఫ్ట్‌ తీసుకుంటే రుణగ్రహీతల చేతిలో డబ్బు ఉంటుంది. మీకు డబ్బు ఎప్పుడు అవసరమైతే అప్పుడు మీరు మీ ఖాతాలో ఉండే మిగులు మొత్తం నుంచి విత్‌ డ్రా చేసుకోవచ్చు. పెళ్లి, ఇంటి ఖర్చులు, ఇతర రకాల అప్పులు తీర్చేందుకు ఈ సదుపాయం ఎంతో ఉపయోగపడుతుంది. వీటి కోసం ఎక్కువ వడ్డీతో ఉండే పర్సనల్‌ లోన్స్‌ తీసుకునే బాధ తప్పుతుంది. డబ్బు అవసరం ఉంటుందని భావించే హోమ్‌ లోన్‌ గ్రహీతలు ఈ సదుపాయాన్ని ఎంచుకోవచ్చు. ఇది అవసరమైన వెసులుబాటు కల్పిస్తుంది. దీని వలన మీ క్రెడిట్‌ స్కోర్‌ కూడా ప్రభావితం కాదు.

ఉపయోగానికి తగ్గట్టు చెల్లింపులు:
హోమ్‌ లోన్‌పై ఒవర్‌డ్రాఫ్ట్‌ అనేది ఒక ఆఫ్రూవ్డ్ లోన్‌లాగా పనిచేస్తుంది. మీ అవసరానికి అనుగుణంగా మీరు డబ్బు విత్‌ డ్రా చేసుకోవచ్చు. మీరు తీసుకున్న మొత్తానికి మాత్రమే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ వడ్డీ రేటు అన్నది ప్రైమ్‌ ఇంట్రస్ట్ రేటుతో ముడిపడి ఉంటుంది, అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.

ఈ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చా?
రుణగ్రహీతలకు ఇది ఎంతో వెసులుబాటు కల్పించే సౌకర్యం. స్వల్పకాలిక అవసరాల కోసం డబ్బు తరచూ అందుబాటులో ఉంటుంది. బోనసులు అందుకునే ఉద్యోగులు, సీజనల్‌ అమ్మకాలతో అదనపు డబ్బు సమకూర్చుకునే వ్యాపారులు తమ దగ్గరున్న అదనపు మొత్తాన్ని హోమ్‌ లోన్‌ అకౌంట్‌లో జమచేయవచ్చు. ఈ సదుపాయాన్ని సరైన రీతిలో ఉపయోగించుకుంటే ఎటువంటి ప్రీపేమెంట్‌ జరిమానాలు లేకుండా తమ రుణాన్ని వేగంగా చెల్లించవచ్చు.

Explained: ప్రపంచ వ్యాప్తంగా వర్డ్‌లె గేమ్‌కు పెరుగుతున్న క్రేజ్.. దీన్ని ఎలా ఆడాలి..? ఇది ఎందుకు వైరల్ అవుతోంది..?


కానీ హోమ్‌ లోన్‌ ఒవర్‌డ్రాఫ్ట్‌ సదుపాయాన్ని తీసుకోవాలనుకునే రుణగ్రహీతలు ముందు దానిలో ఉండే లాభనష్టాలు బేరీజు చేసుకొని ఆ తర్వాత ముందుకు సాగడం మంచిది. సాధారణ హోమ్‌ లోన్‌ వడ్డీతో పోల్చితే దీనిపై వడ్డీ రేటు 20-60 పాయింట్లు ఎక్కువుంటుంది. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని మీరు డబ్బు అదనంగా డిపాజిట్‌ చేయకపోతే, మీరు ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి రావచ్చు. చేతిలో మిగులు మొత్తం ఉంటుందని భావించే వారికే ఈ ఒవర్‌డ్రాఫ్ట్‌ సౌకర్యం బాగుంటుంది.

చాలా మంది ఈ సదుపాయాన్ని తీసుకునేవారు తాము డిపాజిట్‌ చేసే మొత్తంపై వడ్డీ వస్తుందని భావిస్తారు. ఈ సదుపాయం కేవలం వడ్డీ చెల్లింపు మొత్తాన్ని తగ్గిస్తుంది కానీ, దాని వలన ఎటువంటి సంపాదన రాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి, ఒవర్‌ డ్రాఫ్ట్ సదుపాయం తీసుకునే ముందు అందులోని నియమనిబంధనలు క్షుణ్ణంగా చదివి అవగాహనతో కూడిన నిర్ణయం తీసుకోండి, గరిష్ఠ లాభాలు వచ్చేలా చూసుకోండి.
Published by:Veera Babu
First published:

Tags: Explained

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు