Who are Taliban in Afghanistan: ఆఫ్ఘానిస్తాన్లో ఏం జరుగుతోంది?: ఎవరీ తాలిబన్లు

ప్రతీకాత్మక చిత్రం

ఆఫ్ఘానిస్తాన్లో తాలిబన్లు తిరిగి పట్టు సాధిస్తున్నారు. ఆఫ్ఘానిస్తాన్ దేశం నుంచి అంత‌ర్జాతీయ‌ దళాల ఉపసంహరణ ప్రక్రియ మొదలవ్వడంతో   ఒక్కో ప్రాంతం తాలిబన్లు స్వాధీనం చేసుకొంటున్నారు.  ఇప్పటికే  కాందహార్  ఆక్రమించిన తాలిబన్ దళాలు.. కాబూల్ ను స్వాధీనం చేసుకునే దిశగా కదులుతున్నాయి. 

  • Share this:


    ఆఫ్ఘానిస్తాన్లో తాలిబన్లు తిరిగి పట్టు సాధిస్తున్నారు. ఆఫ్ఘానిస్తాన్ దేశం నుంచి అంత‌ర్జాతీయ‌ దళాల ఉపసంహరణ ప్రక్రియ మొదలవ్వడంతో   ఒక్కో ప్రాంతం తాలిబన్లు స్వాధీనం చేసుకొంటున్నారు.  ఇప్పటికే  కాందహార్ ను  ఆక్రమించిన తాలిబన్ దళాలు.. కాబూల్ ను స్వాధీనం చేసుకునే దిశగా కదులుతున్నాయి.  ఇప్పటికే దేశంలోనే రెండు, మూడో అతి పెద్ద నగరాలను వారి నియంత్రణలోకి తీసుకొన్నాయి. దీంతో  ఆఫ్ఘానిస్తాన్లో ఏం జరగబోతుందో అని అక్కడి ప్రజలతో పాటు ప్రపంచం పరిశీలిస్తోంది.

    రెండు ద‌శాబ్దాల త‌రువాత అంత‌ర్జాతీయ ద‌ళాలు ఆఫ్ఘానిస్తాన్ నుంచి వెనుదిరుగుతున్నాయి. దీంతో తాలిబ‌న్ తెగ‌లు తిరిగి ఆఫ్ఘాన్ పై ప‌ట్టు సాధిస్తున్నాయి. ఆఫ్ఘానిస్తాన్ ప్ర‌భుత్వ సేన‌లు ఘోరంగా ఓడిపోతున్నాయి. ఆఫ్ఘానిస్తాన్‌లోని రెండో పెద్ద న‌గ‌రం కాంద‌హార్‌ను నియంత్ర‌ణ‌లోకి తీసుకున్నారు.  హెర‌త్ ప‌ట్ట‌ణం కూడా ప్ర‌భుత్వ ఆధీనంలోనుంచి పోవ‌డం పెద్ద దెబ్బ‌. లష్కర్ గాహ్ కూడా తాలిబ‌న్‌లు ఆక్ర‌మించుకున్నారు. కాబూల్ ని కూడా ప్ర‌భుత్వం కాప‌డ‌లేక పోతే ప్ర‌భుత్వం తాలిబ‌న్‌ల‌కు లొంగిపోవాల్సి వ‌స్తుంది.

    ఎవరీ తాలిబన్లు..
    తాలిబ‌న్‌లు పష్టున్ తెగ‌ల‌కు చెందిన వారు. పష్టున్ అంటే విద్యార్థి అని అర్థం. 1996-2001 వరకు  ఆఫ్టానిస్తాన్ సంప్రదాయ ఇస్లామిక్ దేశంగా ఉండేది. 1989 లో సోవియ‌ట్ ద‌ళాల ఆఫ్ఘానిస్తాన్ నుంచి త‌మ ద‌ళాల‌ను ఉప‌సంహ‌రించాయి. అనంత‌రం దేశంలో ఏర్పడిన‌ అస్థిర‌త‌ను ఆస‌రాగా చేసుకొని తాలిబ‌న్ నాయ‌కుడు మోలా మ‌హ్మ‌ద్ ఓమ‌ర్ ఇండియ‌న్ ముజాహుదీన్ ద‌ళం స‌హ‌కారంతో ఆఫ్ఘానిస్తాన్‌ను ఆధీనంలోకి తీసుకొని నియంత్రించాడు. తాలిబ‌న్‌లు దేశంపై ప‌ట్టు సాధించి స‌మాచార‌, సాంకేతిక, రాజ‌కీయ అంశాల‌ను ప్ర‌భావితం చేశారు. మ‌హిళా స్వేచ్ఛ‌పై ఆంక్ష‌లు విధించారు. మ‌హిళ‌లు చ‌దువు ఎక్కువగా చదువుకోకూడదని బుర్కా విధిగా ధ‌రించాల‌ని ఆదేశించి అమ‌లు చేశారు.
    అమెరికాపై 2001 సెప్టెంబ‌ర్ 11న జ‌రిగిన ఉగ్ర‌వాద దాడికి కార‌ణ‌మైన లాడెన్‌ను అప్ప‌గించ‌డానికి మోలా మ‌హ్మ‌ద్ ఓమ‌ర్ ప్ర‌భుత్వం నిరాకారించ‌డంతో జ‌రిగిన ప‌రిమాణాల కార‌ణంగా అమెరికా ఆదేశాలతో అంతర్జాతీయ ద‌ళాలు ఆఫ్ఘానిస్తాన్‌ను ఆక్ర‌మించి త‌మ నియంత్ర‌ణ‌లోకి తీసుకొచ్చాయి. దీంతో కొంద‌రు తాలిబ‌న్‌లు పాకిస్తాన్ దేశం ఆశ్రయం పొందారు. దాదాపుగా 20 సంవ‌త్స‌రాల త‌రువాత 14 నెల‌ల కాల వ్య‌వ‌ధిలో అమెరికా ప్ర‌భుత్వం ఆఫ్ఘానిస్తాన్‌ను నుంచి సైనిక ద‌ళాల‌ను ఉప‌సంహ‌రిస్తోంది. దీంతో అక్క‌డ తిరిగి తాలిబ‌న్‌లు ప‌ట్టు సాధిస్తున్నారు.

    Published by:Sharath Chandra
    First published: