Home /News /explained /

WHAT IS EXPRESSVPN WHY IS IT LEAVING INDIA AND WHAT IS THE NEW VPN RULE THAT YOU MUST KNOW GH VB

ExpressVPN: ఇండియాలో వ్యాపారాలు ఆపేసిన ExpressVPN.. అసలేంటి ఇది..? ఎందుకు ఇలా చేసింది..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ExpressVPN అనేది భారతీయ ఇంటర్నెట్ వినియోగదారులలో ప్రసిద్ధి చెందిన VPN (వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్) సేవలు అందించే సంస్థ. ఈ సంస్థ 13 సంవత్సరాల క్రితం 2009లో ప్రారంభమైంది. యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన యాడ్‌వేర్ ప్లాట్‌ఫారమ్ అయిన కేప్ టెక్నాలజీస్ యాజమాన్యంలో ఉంది.

ఇంకా చదవండి ...
ఇండియాలో వీపీఎన్‌(VPN) సేవలకు సంబంధించి ప్రభుత్వం(Goverment) కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల కారణంగా ExpressVPN అనే సంస్థ ఇండియా తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వినియోగదారుల అసలు పేర్లు, వారికి కేటాయించిన IP అడ్రస్, ఇతర గుర్తింపు డేటాను నిల్వ చేయాలని ప్రభుత్వం అన్ని VPN ప్రొవైడర్లను ఆదేశించిన తర్వాత ఇండియన్ బేస్డ్ సర్వర్‌లను తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త VPN నియమాలు 2022 జూన్ 27 నుంచి అమలులోకి వస్తాయి.

* EXPRESSVPN అంటే ఏంటి?
ExpressVPN అనేది భారతీయ ఇంటర్నెట్ వినియోగదారులలో ప్రసిద్ధి చెందిన VPN (వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్) సేవలు అందించే సంస్థ. ఈ సంస్థ 13 సంవత్సరాల క్రితం 2009లో ప్రారంభమైంది. యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన యాడ్‌వేర్ ప్లాట్‌ఫారమ్ అయిన కేప్ టెక్నాలజీస్ యాజమాన్యంలో ఉంది. ExpressVPN గోప్యత, భద్రతకు ప్రాధాన్యం ఇస్తుంది. ఇది వినియోగదారుల వెబ్ ట్రాఫిక్‌ను ఎన్‌క్రిప్ట్‌ చేస్తుంది, IP చిరునామాలను దాచి ఉంచుతుంది. ExpressVPNను 2009లో వార్టన్ స్కూల్ పూర్వ విద్యార్థులు పీటర్ బుర్‌చార్డ్, డాన్ పోమెరాంట్జ్ స్థాపించారు. ఇంటర్నెట్ వినియోగదారుల ఆన్‌లైన్ భద్రత కోసం ఉన్న న్యాయవాద గ్రూప్‌ VPN ట్రస్ట్ ఇనిషియేటివ్‌లో కూడా ఈ VPN ప్రొవైడర్‌కు సభ్యత్వం ఉంది.

Germany-Ukraine: IRIS-T SLM అంటే ఏంటి..? ఉక్రెయిన్ కు ఈ IRIS-T SLMను అందించనున్న జర్మనీ..


ExpressVPNను 2021 సెప్టెంబర్‌లో కేప్ టెక్నాలజీస్ కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఉన్న ఇతర VPN సేవలు, ప్రైవేట్ ఇంటర్నెట్ యాక్సెస్, సైబర్‌గోస్ట్, జెన్‌మేట్ సహా యాంటీవైరస్ సొల్యూషన్‌ల పోర్ట్‌ఫోలియోకు ExpressVPNను యాడ్‌ చేసింది.

ExpressVPN Windows, macOS, iOS, Android, Linux, రూటర్‌ల కోసం యాప్‌లను తీసుకొచ్చింది. ExpressVPN మీడియా స్ట్రీమర్ అని పేర్కొనే స్మార్ట్ డీఎన్‌ఎస్‌ ఫీచర్‌ను అందిస్తోంది. వాటికి సపోర్ట్‌ ఇవ్వని పరికరాలకు VPN సామర్థ్యాలను జోడించడానికి, రౌటర్ యాప్, రౌటర్‌లో VPNని సెటప్ చేయడానికి అనుమతిస్తుంది. సపోర్ట్‌ చేయని గేమింగ్ కన్సోల్‌లను దాటవేస్తుంది.

* ఇంటర్నెట్ VPN సర్వీస్‌ ఏం చేస్తుంది?
VPN లేదా వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ అనేది ఒక మాస్కింగ్ టెక్నిక్, ఇది పరికరం ప్రైవేట్ నెట్‌వర్క్‌కి కనెక్ట్ అయినట్లుగా ఇంటర్నెట్ ద్వారా డేటాను పంపడానికి, స్వీకరించడానికి వీలు కల్పిస్తుంది. దీన్ని భారతదేశంలో వినియోగిస్తున్నారు, ఎందుకంటే పబ్లిక్ నెట్‌వర్క్‌లో యాక్సెస్ చేయలేని డేటాను పొందడానికి VPN అవకాశం కల్పిస్తుంది. రిమోట్ వర్క్‌ కోసం ఎక్కువగా వీపీఎన్‌ ఉపయోగపడుతుది. అనేక సార్లు వినియోగదారులు ఉన్న ప్రాంతంలో నిషేధం ఉన్న సమాచారాన్ని రిమోట్‌ లొకేషన్‌ ద్వారా యాక్సెస్‌ చేస్తారు. ఇందుకు వీపీఎన్‌ ఉపయోగపడుతుంది.

VPNలు ఆన్‌లైన్ కనెక్షన్‌లను పూర్తిగా అనానమస్‌గా కనిపించకపోయినా.. ప్రైవసీ, సెక్యూరిటీని పెంచుతాయి. VPN IP అడ్రెస్‌ను దాచడం ద్వారా VPN ప్రొవైడర్లు అమలు చేస్తున్న ప్రత్యేకంగా కాన్ఫిగర్ చేసిన రిమోట్ సర్వర్‌లకు దారి మళ్లిస్తుంది. అంటే ఇంటర్నెట్ ప్రొవైడర్ లేదా వెబ్‌సైట్‌లు లేదా యాప్‌ల వంటి ఇతర థర్డ్‌ పార్టీలు వ్యక్తి సందర్శించే వెబ్‌సైట్‌లను లేదా పంపే లేదా స్వీకరించే డేటాను చూడలేవు.

* ExpressVPN ఇండియా సర్వర్‌లను ఎందుకు మూసివేస్తోంది
VPN ప్రొవైడర్లు వినియోగదారు సమాచారాన్ని కనీసం ఐదేళ్ల పాటు నిల్వ ఉంచాలని భారతదేశంలోని ఇటీవల తీసుకొచ్చిన చట్టం చెబుతోంది. ఈ కారణంగా భారతదేశానికి చెందిన అన్ని VPN సర్వర్‌లను తొలగిస్తున్నట్లు ExpressVPN తెలిపింది. అయితే భారతీయ వినియోగదారులు ఇప్పటికీ VPN సర్వర్‌లకు కనెక్ట్ చేయగలరని కంపెనీ తెలిపింది, అది వారికి భారతీయ IP చిరునామాలను ఇస్తుంది, వారు భారతదేశంలో ఉన్నట్లుగా ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తారు. అయితే ఇవి సింగపూర్, UKలో ఉన్న వర్చువల్ సర్వర్లు.

ఇంటర్నెట్ స్వేచ్ఛను పరిమితం చేయడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో పాల్గొనడానికి ExpressVPN నిరాకరిస్తున్న ట్లు కంపెనీ తన ప్రకటనలో తెలిపింది. ExpressVPN బ్రౌజింగ్ హిస్టరీ, ట్రాఫిక్ డెస్టినేషన్, డేటా కంటెంట్ లేదా డీఎన్‌ఎస్‌ క్వెరీల లాగింగ్‌తో సహా యూజర్ యాక్టివిటీ లాగ్‌లను ఎప్పటికీ సేకరించదని పేర్కొంది. VPN ప్రొవైడర్ కనెక్షన్ లాగ్‌లు, అవుట్‌గోయింగ్ VPN IP చిరునామాలు, కనెక్షన్ టైమ్‌స్టాంప్‌లు లేదా సెషన్ వ్యవధిని ఎప్పుడూ స్టోర్‌ చేయదని స్పష్టం చేసింది. ఒక వ్యక్తిని, వారి ఆన్‌లైన్ యాక్టివిటీని గుర్తించగల ఏ డేటాను స్టోర్‌ చేయమని కంపెనీ తెలిపింది.

* తప్పక తెలుసుకోవలసిన కొత్త VPN నియమాలు ఏంటి?
ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(CERT-In) ఏప్రిల్‌లో VPN ప్రొవైడర్‌లను ఐదేళ్ల వరకు వినియోగదారు డేటాను సేకరించి నిల్వ చేయమని కోరుతూ కొత్త ఆదేశాన్ని జారీ చేసింది. సైబర్ నేరాలను పరిశోధించే నిమిత్తం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పింది.

Ukraine-Russia: ఉక్రెయిన్‌ యుద్ధంలో పుతిన్ తన లక్ష్యాలను సాధిస్తున్నారా..?యుద్ధం ముగినట్లేనా..?


VPN ప్రొవైడర్ల డేటా సెంటర్‌లతో పాటు, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లు, క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలు తప్పనిసరిగా కస్టమర్ల పేర్లు, ఓనర్‌షిప్‌ ప్యాటర్న్స్‌, కాంట్యాక్ట్‌ ఇన్‌ఫర్మేషన్‌, ఈ సేవలను వినియోగిస్తున్నందుకు గల కారణాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త మార్గదర్శకాలు జూన్ 27 నుంచి అమలులోకి వస్తాయి. సైబర్ నేరాలను కనుగొన్న ఆరు గంటలలోపు వాటికి ప్రతిస్పందించే లక్ష్యంతో CERT-ఇన్ ఈ చర్యలు తీసుకుంది. CERT-In ప్రకారం.. సంస్థలు తప్పనిసరిగా డేటా ఉల్లంఘనలు, నకిలీ మొబైల్ యాప్‌లు, సర్వర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దాడులు, సోషల్ మీడియా ఖాతాల చట్టవిరుద్ధమైన యాక్సెస్‌ను రిపోర్ట్‌ చేయాలి. అవసరమైన సమాచారాన్ని బహిర్గతం చేయడంలో విఫలమైన సంస్థలు IT చట్టంలోని సెక్షన్ 70B (7)కి లోబడి ఉంటాయి. దీని కింద ఒక సంవత్సరం వరకు జైలు శిక్షను విధించే అవకాశం ఉంటుంది.
Published by:Veera Babu
First published:

Tags: Explained, ExpressVPN, Online, Privacy

తదుపరి వార్తలు