హోమ్ /వార్తలు /explained /

Domestic Violence: గృహ హింస బాధితులకు రక్షణనిచ్చే చట్టాలు.. మగ, ఆడ ఇద్దరికీ..

Domestic Violence: గృహ హింస బాధితులకు రక్షణనిచ్చే చట్టాలు.. మగ, ఆడ ఇద్దరికీ..

మన దేశంలో స్త్రీల పైన హింస రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా.. న్యాయ వ్యవస్థ బాధితులకు అండగా నిలబడుతున్నా.. హింసకు గురయ్యే వారి సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. చాలామందికి తమకు చట్టం సహాయం చేస్తుందన్న విషయం కూడా తెలీదు.

మన దేశంలో స్త్రీల పైన హింస రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా.. న్యాయ వ్యవస్థ బాధితులకు అండగా నిలబడుతున్నా.. హింసకు గురయ్యే వారి సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. చాలామందికి తమకు చట్టం సహాయం చేస్తుందన్న విషయం కూడా తెలీదు.

మన దేశంలో స్త్రీల పైన హింస రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా.. న్యాయ వ్యవస్థ బాధితులకు అండగా నిలబడుతున్నా.. హింసకు గురయ్యే వారి సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. చాలామందికి తమకు చట్టం సహాయం చేస్తుందన్న విషయం కూడా తెలీదు.

ఇంకా చదవండి ...

    మన దేశంలో స్త్రీల పైన హింస రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా.. న్యాయ వ్యవస్థ బాధితులకు అండగా నిలబడుతున్నా.. హింసకు గురయ్యే వారి సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. చాలామందికి తమకు చట్టం సహాయం చేస్తుందన్న విషయం కూడా తెలీదు. అందుకే దాన్ని భరిస్తూ ఉండిపోతారు. ఇలాంటి వారిలో గృహ హింస బాధితులు ఎక్కువ మంది ఉంటారు. కొందరు కుటుంబ గౌరవం కోసం, మరికొందరు బయటకు వస్తే తమ పిల్లల పరిస్థితి ఏంటి అని ఇలా రకరకాల కారణాలతో వారు గృహ హింస ను భరిస్తుంటారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. హింసను భరించిన కొద్దీ అది పెరుగుతూ పోతుంది. ఒక రోజు మన జీవితాన్నే నాశనం చేస్తుంది. అందుకే మొదటిసారి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే చట్టాల సాయంతో మీ కుటుంబ సభ్యులను మార్చుకునే ప్రయత్నం చేయాలి. గృహ హింస బాధితులకు చట్టం ఎలాంటి సహకారం అందిస్తుందో తెలుసుకుందాం..

    గృహ హింస అంటే..

    ఒక వ్యక్తి శారీరక, మానసిక ఆరోగ్యానికి హాని కలిగించే లేదా గాయపరిచే ప్రమాదానికి గురి చేసే ఎలాంటి చర్య అయినా గృహ హింస కిందకే వస్తుంది. అవతలి వ్యక్తి మిమ్మల్ని శారీరక, మానసిక, ఆర్థిక, లైంగిక దాడుల్లో దేనికి గురి చేసినా అది గృహ హింస కిందకే వస్తుంది. ఇలాంటి హింసకు గురవుతున్న వారు ముఖ్యంగా మహిళలకు చట్టం చాలా రక్షణ కల్పిస్తుంది.

    కేసు ఎలా ఫైల్ చేయాలంటే..

    గృహ హింస కి గురైన మహిళ స్థానిక మహిళా కోర్టు, మహిళా పోలీస్ స్టేషన్ లేదా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వద్ద తనపై జరిగిన హింస గురించి వివరిస్తూ కేసు ఫైల్ చేయవచ్చు. నిందితులపై కేవలం క్రిమినల్ కేసులు మాత్రమే కాదు.. సివిల్ కేసు పెట్టే అవకాశం కూడా ఉంటుంది.

    ఇన్సిడెంట్ రిపోర్ట్ అంటే..

    గృహ హింస బాధితులు కేసు ఫైల్ చేయగానే ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎంక్వైరీ ప్రారంభిస్తారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి దగ్గర సమాచారం సేకరించి.. ఆ తర్వాత జరిగిన సంఘటనల గురించి సాక్షులను ప్రశ్నించి రిపోర్ట్ తయారు చేస్తారు. ఈ రిపోర్ట్ నే ఇన్సిడెంట్ రిపోర్ట్ అంటారు.

    గృహ హింస బాధితులకు సాయం చేసే చట్టాలు..

    గృహ హింస బారిన పడిన మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం 2005లో గృహ హింస నిరోధక చట్టం తీసుకొచ్చింది. అంతేకాదు.. సెక్షన్ 498ఎ, 406,323,354 ల ప్రకారం గృహ హింస కేసులో నిందితులకు శిక్ష పడుతుంది. ఈ నిందితుల్లో ఆడవారు ఉంటే వారిపై కూడా ఈ చట్టం ద్వారా శిక్ష అమలు చేసే వీలుంటుంది.

    ఎవరికి రక్షణ ఉంటుంది?

    కేవలం వివాహం అయిన మహిళలకే కాకుండా లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉండేవారికి కూడా గృహ హింస చట్టం రక్షణ కల్పిస్తోంది. పెళ్లయిన లేదా లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న స్త్రీని ఇల్లు వదిలి వెళ్లిపోవాలని హింసించడం కూడా గృహ హింస కిందకే వస్తుంది. ఈ చట్టం కింద ఎల్ జీబీటీ లకు కూడా రక్షణ ఉంటుంది.

    ఎలాంటి సాక్ష్యాలు అవసరం..

    గృహ హింస జరిగిందని నిర్ధారించేందుకు దాన్ని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి వాంగ్మూలం, డాక్యుమెంటరీ ప్రూఫ్, ఆడియో, వీడియో ప్రూఫ్ వంటివి సాక్ష్యాలుగా పనికొస్తాయి.

    మగవారు గృహ హింసకి గురైతే ఏం చేయాలి?

    మగవారిపై కూడా గృహ హింస జరగొచ్చు. ఇలాంటప్పుడు వారు వెంటనే ఈ విషయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి FIR కాపీ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మెడికల్ డాక్యుమెంట్స్ వంటి ఆధారాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది.

    498ఎ కి గృహ హింస చట్టానికి మధ్య తేడా ఏంటి?

    గృహ హింస చట్టం అనేది కేవలం వరకట్నం కోసమే కాకుండా ఎలాంటి సందర్భాల్లో అయినా.. ఎందుకోసమైన ఒక వ్యక్తి తన కుటుంబంలోని మరో వ్యక్తి ముఖ్యంగా స్త్రీలను హింసిస్తే వారికి వర్తించే చట్టం. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎలా హింసించినా అది గృహ హింస కిందకే వస్తుంది. ఒక స్త్రీ వరకట్నం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ అది తీసుకురానప్పుడు హింసిస్తే దానికి 498ఎ కింద కేసు నమోదు చేస్తారు.

    (Article By- Prachi Mishra, Supreme Court Lawyer )

    First published:

    ఉత్తమ కథలు