COVID–19 PNEUMONIA: కరోనా న్యుమోనియా అంటే ఏంటి? ఎలా సోకుతుంది? లక్షణాలేంటి?

ప్రతీకాత్మకచిత్రం

కరోనా నుంచి కోలుకున్న కొందర్లో బ్లాక్​ ఫంగస్​ అనే వ్యాధి వస్తుందన్న సంగతి తెలిసిందే. ఇక, మరికొందరిలో న్యూమోనియా సమస్యలు కూడా వస్తున్నాయి. ఎక్కువ వయస్సు ఉన్నవారు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు, ఐసీయూల్లో చికిత్స తీసుకన్న వారిలో ఈ సమస్య అధికంగా ఉందని డాక్టర్లు గుర్తించారు.

  • Share this:
(డాక్టర్ నికేత్ రాయ్, ఎంబీబీఎస్, ఎండీ, మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ అసోసియేటెడ్ లోక్​ నాయక్ హాస్పిటల్, న్యూఢిల్లీ)

కరోనా నుంచి కోలుకున్న కొందర్లో బ్లాక్​ ఫంగస్​ అనే వ్యాధి వస్తుందన్న సంగతి తెలిసిందే. ఇక, మరికొందరిలో న్యూమోనియా సమస్యలు కూడా వస్తున్నాయి. ఎక్కువ వయస్సు ఉన్నవారు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు, ఐసీయూల్లో చికిత్స తీసుకన్న వారిలో ఈ సమస్య అధికంగా ఉందని డాక్టర్లు గుర్తించారు. దీంతో, కరోనా నుంచి కోలుకున్న వారిలో ఉపిరితిత్తుల ఇన్​ఫెక్షన్​ బారిన పడుతున్న వారి సంఖ్య 10 నుంచి 15 శాతంగా ఉందని తేలింది. అసలు కరోనా వైరస్​ గాలి ద్వారా ఉపిరితిత్తులను ఎలా చేరుకుంటుంది? న్యూమోనియా లక్షణాలేంటి? ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి విషయాలను తెలుసుకుందాం.

ఊపిరితిత్తులు అంటే?
మానవులు శ్వాస తీసుకోవడానికి ప్రధాన పాత్ర వహించే అవయవాలే ఊపిరితిత్తులు. నోరు, ముక్కు ద్వారా తీసుకునే గాలి ఊపిరితిత్తులను చేరుకొని రక్త ప్రసరణ సజావుగా జరిగేలా చేస్తుంది. కుడి వైపు గల ఊపిరితిత్తులను ఎగువ, మధ్య, దిగువ లోబ్ అనే మూడు భాగాలుగా విభజించారు. ఎడమ వైపు గల ఊపిరితిత్తులను ఎగువ, దిగువ లోబ్ అని రెండు భాగాలుగా విభజించారు. మనం పీల్చుకునే గాలి 20% ఆక్సిజన్ ఉంటుంది. గాలి పీల్చుకున్నప్పుడు ముక్కు, నోరు ద్వారా ఆక్సిజన్​ ఊపిరితిత్తుల్లోకి చేరుకుంటుంది. ఊపిరితిత్తులు అనేక అల్వియోలీలను కలిగి ఉంటాయి. అల్వియోలీ ఆక్సిజన్‌ను రక్తానికి బదిలీ చేస్తుంది. ఇది శరీరంలోని అన్ని కణాలకు అనగా తల నుంచి కాలి వరకు ఆక్సిజన్​ను సరఫరా చేస్తుంది. ప్రతిగా ఇది కార్బన్ డై ఆక్సైడ్ వంటి చెడు వాయువులను బయటికి పంపిస్తుంది. దీనిని ఎయిర్ ఎక్స్ఛేంజ్ అంటారు. మన శరీరంలోని అన్ని కణాలు, కణజాలాలు, అవయవాలు జీవించడానికి ఆక్సిజన్ అవసరం ఎంతో అవసరమన్న సంగతి తెలిసిందే. అందువల్ల, శరీరానికి ఆక్సిజన్​ అందించడంలో ఊపిరితిత్తులు కీలక పాత్ర వహిస్తాయి.

న్యుమోనియా అంటే ఏంటి?
న్యుమోనియా అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. ఇది రక్తానికి అవసరమైన ఆక్సిజన్‌ను సరఫరా చేయడంలో అడ్డంకులు సృష్టిస్తుంది. తద్వారా శరీరంలో బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు వంటి సూక్ష్మజీవుల సంక్రమణ ఎక్కువవుతాయి. న్యుమోనియా సంక్రమిస్తే శరీరంలో గాలి చొరబడటానికి కూడా స్థలం మిగిలి ఉండదు. తద్వారా, రక్తానికి ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది.

న్యుమోనియా ఎలా సోకుతుంది?
సాధారణంగా మన రోగనిరోధక వ్యవస్థ సూక్ష్మజీవులను చంపడానికి పోరాడుతుంది. అయితే, చనిపోయిన సూక్షజీవులు ఊపిరితిత్తుల్లో చేరడానికి న్యుమోనియా కారణమవుతుంది. శరీరంలోకి ఆక్సిజన్​ రాకుండా, లోపలి కార్భన్​ డయాక్సైడ్​ బయటికి పోకుండా న్యూమోనియా కొంతవరకు అడ్డకుంటుంది. ఇలా వాయు మార్పిడి జరగకపోవడం వల్ల దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు తలెత్తుతాయి.

కరోనా న్యుమోనియా ఇతర న్యుమోనియాతో ఎలా భిన్నంగా ఉంటుంది?
కరోనా వైరస్ వల్ల కలిగే న్యుమోనియాను ఇతర వైరస్లు, బ్యాక్టీరియా లేదా ఫంగస్ వల్ల కలిగే న్యుమోనియాను లక్షణాలను బట్టి వర్గీకరించడం చాలా కష్టం. దీని ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి ల్యాబరేటరీ టెస్టులు చాలా అవసరం. కరోనా వైరస్ ఊపిరితిత్తులను దెబ్బతీస్తుందని అనేక అధ్యయనాల్లో తేలింది. అయితే, ఇది ఊపిరితిత్తుల్లోకి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మన శరీరంలో సహజంగా ఉండే సొంత రోగనిరోధక కణాలు ఉపయోగపడతాయి. అయితే, వైరస్​ నెమ్మదిగా ఊపిరితిత్తుల మీదుగా కదులుతున్నప్పుడు, జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోకపోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాక, కరోనా సోకిన రోగుల్లో మూత్రపిండాలు, మెదడు, గుండె, ఇతర అవయవాలు దెబ్బతింటాయి.

కరోనా రోగులందరూ న్యుమోనియాతో బాధపడుతున్నారా?
కరోనా సోకిన వారందరికీ న్యుమోనియా వస్తుందని చెప్పలేం. అయితే, 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు, అధిక రక్తపోటు, గుండె సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, డయాబెటిస్, ఊబకాయం లేదా క్యాన్సర్ వంటి సమస్యలు ఉన్నవారిలో న్యూమోనియా ప్రమాదం ఎక్కవనే చెప్పవచ్చు. అయితే, యువకులు కూడా కరోనా బారీన పడుతుండటాన్ని చూస్తున్నాం. అయితే, కరోనా సోకిన వారిలో సుమారు 80% మంది ఆసుపత్రి చికిత్స అవసరం లేకుండానే కోలుకుంటున్నారు. సుమారు 15% మందికి మాత్రమే ఆక్సిజన్ అవసరం ఏర్పడుతుంది. కేవలం 5% మందికి మాత్రమే వెంటిలేటర్ వంటి ఇంటెన్సివ్ కేర్ చికిత్స అవసరం. కాబట్టి, కరోనా సోకినప్పటికీ చనిపోయే అవకాశాలు చాలా తక్కువని గుర్తించుకోవాలి.

న్యుమోనియాకు ఎన్ని రోజుల చికిత్స అవసరం?
ఇతర సాధారణ న్యుమోనియా చికిత్సలతో పోలిస్తే, కరోనాతో వచ్చే న్యుమోనియాకు చికిత్స చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీని నుండి పూర్తిగా కోలుకోవడానికి వారాలు లేదా నెలల సమయం పట్టవచ్చు. కొన్ని సందర్భాల్లో ఊపిరితిత్తులను పూర్తిగా దెబ్బతీస్తుంది. అయితే, సరైన సమయంలో ఆక్సిజన్ అందజేస్తే దెబ్బతిన్న ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపర్చవచ్చు.

కరోనా నుంచి కోలుకున్నాక ఏం చేయాలి?
కరోనా నుంచి కోలుకున్నప్పటికీ న్యూమోనియా బారీన పడే అవకాశం ఉంది. అందువల్ల, మీ వైద్యుడు చెప్పిన సూచనలు, సలహాలు పాటించండి. అవసరమైతే చెస్ట్​ ఫిజియోథెరపీని చేయించుకోండి. ఆరోగ్యకరమైన జీవనశైలి, పోషకాలున్న ఆహారాన్నే తీసుకోండి. మానసిక, శారీరక శ్రేయస్సు కోసం ధ్యానం, యోగా వంటివి క్రమం తప్పకుండా సాధన చేయండి.
Published by:Krishna Adithya
First published: