WHAT IS CIBIL SCORE WHAT IS THE IMPACT OF GETTING A LOAN FULL DETAILS HERE GH VB
CIBIL SCORE: సిబిల్ స్కోర్ అంటే ఏంటి..? లోన్లు పొందడంపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుంది..?
ప్రతీకాత్మక చిత్రం
సిబిల్ స్కోర్ అంటే వినియోగదారుల క్రెడిట్ స్కోర్(Credit Score) అని అర్థం. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి పొందిన రుణాలు, తిరిగి చెల్లించిన వివరాల ఆధారంగా క్రెడిట్ స్కోర్ లెక్కిస్తారు.
సిబిల్ (CIBIL) అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(ఇండియా) లిమిటెడ్. ఆయా వ్యక్తులకు సంబంధించిన రుణాలు (Loans), క్రెడిట్ కార్డు(Credit Card)ల చెల్లింపు వ్యవహారాలపై సమాచారాన్ని సేకరించి Credit Information Bureau(India) Limited రిపోర్ట్స్ తయారు చేస్తుంది. బ్యాంకులు(Banks), ఆర్థిక సంస్థలు ప్రతి నెలా రుణాలు తీసుకొన్న వారి వివరాలను సిబిల్‌కు అందజేస్తాయి. ఈ వివరాల ఆధారంగా ఆయా వ్యక్తులకు సంబంధించిన క్రెడిట్ స్కోర్‌ను సిబిల్ అందిస్తుంది. ఈ రోజుల్లో ఎలాంటి రుణాలు పొందాలన్నా సిబిల్ స్కోర్ కీలకం.
సిబిల్ స్కోర్ అంటే ఏంటి?
సిబిల్ స్కోర్ అంటే వినియోగదారుల క్రెడిట్ స్కోర్(Credit Score) అని అర్థం. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి పొందిన రుణాలు, తిరిగి చెల్లించిన వివరాల ఆధారంగా క్రెడిట్ స్కోర్ లెక్కిస్తారు. రుణాలు తిరిగి చెల్లించడంలో సమస్యలు ఉన్నా, గడువును మించి చెల్లించినా వాటి ప్రభావం సిబిల్ స్కోర్‌పై కనిపిస్తుంది. సిబిల్ స్కోర్ 300 నుంచి 900 వరకు ఉంటుంది. ఎంత ఎక్కువగా ఉంటే ఆ వక్తి ఆర్థిక వ్యవహారాలు అంత చక్కగా ఉన్నాయని భావిస్తారు. భవిష్యత్తులో ఈ సిబిల్ స్కోర్ ఆధారంగానే కొత్త రుణాలు పొందడం, క్రెడిట్ కార్డులు ఇవ్వడం వంటివి ఆధారపడి ఉంటాయి. 2000 సంవత్సరంలో ఏర్పాటైన సిబిల్‌ను అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రామాణికంగా తీసుకొంటున్నాయి. ప్రతి నెలా అవి అందించే వివరాలపైనే సిబిల్ స్కోర్ లెక్కిస్తారు కాబట్టి, సిబిల్పైన ఆధారపడి రుణాలు ఇస్తున్నాయి.
సిబిల్ రిపోర్ట్ అంటే ఏంటి?
సిబిల్ రిపోర్ట్‌లో సంబంధిత వ్యక్తి సిబిల్ స్కోర్, రుణాలు తీసుకోవడం, చెల్లించడం, వ్యక్తిగత వివరాలు, కాంట్యాక్ట్ ఇన్ఫర్మేషన్, ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్, లోన్ అకౌంట్ వివరాలు ఉంటాయి. వినియోగదారులకు రుణం మంజూరు చేయాలా? లేదా? అనే అంశంపై బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సిబిల్ స్కోర్, రిపోర్టును బట్టి నిర్ణయం తీసుకొంటాయి.
సిబిల్ స్కోర్ నష్టపోవడానికి కారణాలు?
సిబిల్ స్కోర్‌ను స్కోరింగ్ అల్గారిథమ్ లెక్కిస్తుంది. పెద్ద మొత్తంలో డేటా పాయింట్స్(Data Points), మాక్రో లెవల్ క్రెడిట్ ట్రెండ్స్(Macro Level Credit Trends) ఆధారంగా పని చేస్తుంది. దాదాపు ఓ వ్యక్తికి సంబంధించిన 36 నెలల రుణాల వివరాలను, చెల్లింపులను పరిశీలిస్తుంది. ప్రధానంగా నాలుగు రకాల అంశాలతో సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది. అవి.. పేమెంట్ హిస్టరీ(Payment History), సెక్యూర్డ్ లేదా అన్ సెక్యూర్డ్ లోన్స్(Secured Or Unsecured Loans), ఎంక్వైరీస్( Enquiries) అండ్ క్రెడిట్ యుటిలైజేషన్(Credit Utilisation).
కొత్తగా వినియోగిస్తున్న అల్గారిథమ్ అదనంగా మరికొన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొంటోంది. మొట్ట మొదటి లోన్ అకౌంట్ క్రియేట్ అయిన తేదీ, ఎక్కువ కాలం వరకు ఉన్న లోన్, ప్రస్తుతం ఉన్న లోన్లు, ప్రతి నెలా తిరిగి చెల్లించాల్సిన మొత్తం, ఇటీవలే పూర్తయిన లోన్లు వంటి సమాచారాన్ని కూడా పరిశీలించి సిబిల్ స్కోర్ అందిస్తోంది.
పాజిటివ్ క్రెడిట్ ప్రొఫైల్ ఎలా సాధ్యం?
సిబిల్ స్కోర్ గతంలో తీసుకొన్న రుణాలు, చెల్లింపులను చూపినా.. దాని ప్రభావం భవిష్యత్తు అవసరాలపై స్పష్టంగా ఉంటుంది. అలా జరుగకుండా ఉండాలంటే పాజిటివ్ క్రెడిట్ ప్రొఫైల్‌ను సాధించాలి. ఉన్న లోన్లకు సంబంధించిన మొత్తాన్ని గడువు లోగా తిరిగి చెల్లించేయాలి. ఆలస్యంగా చెల్లించడం సిబిల్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుంది. ఎక్కువగా రుణాలు తీసుకోకూడదు, ఖర్చులను కూడా తగ్గించుకోవాలి, ఎక్కువ లిమిట్ ఉన్నవి కాకుండా తక్కువ లిమిట్ ఉన్న క్రెడిట్ కార్డులకు అప్లై చేయడం మేలు.
హోంలోన్ వంటి సెక్యూర్డ్ లోన్లతో పెద్ద ప్రభావం చూపకపోయినా పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు వంటి అన్సెక్యూర్డ్ లోన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అన్సెక్యూర్డ్ లోన్లు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. జాయింట్ అకౌంట్, మీరు హామీగా ఉంటూ సంతకం చేసిన లోన్ల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల పొరపాట్లు కూడా హామీగా ఉన్న వ్యక్తిపై ప్రభావం చూపుతాయి. తరచూ సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవాలి. రిజెక్ట్ అయిన లోన్లను కూడా రిపోర్టులో చేర్చి ఉన్నట్లు తెలిస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.