China Vs Taiwan: చైనా- తైవాన్ మధ్య వివాదం ఏంటి? తైవాన్‌ను చైనా ఆక్రమించుకుంటుందా?

ప్రతీకాత్మక చిత్రం

China-Taiwan: ప్రస్తుతం కొందరు తైవాన్‌ వాసులు చైనాతో పునరేకీకరణకు మద్దతు ఇస్తున్నారు. జాతివాదం, పౌర జాతీయత ఇందుకు కారణాలని చెప్పుకోవచ్చు. మరికొందరు మాత్రం స్వంతంత్ర దేశంగా ఉంటేనే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

  • Share this:
తైవాన్‌ను రెచ్చగొట్టే ధోరణిని చైనా కొనసాగిస్తోంది. చైనా సైన్యం గత నాలుగు రోజుల్లో దాదాపు 150 యుద్ధ విమానాలను తమ వైమానిక రక్షణ జోన్‌లోకి తీసుకువచ్చినట్లు తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తాజాగా పేర్కొంది. ఈ విషయంపై స్పందించిన తైవాన్ ప్రెసిడెంట్ త్సాయ్ ఇంగ్-వెన్.. చైనా నియంత్రణలోకి తైవాన్ వస్తే ఎదురయ్యే విపత్కర పరిణామాల గురించి హెచ్చరించారు. ఒక మ్యాగజైన్‌కు రాసిన వ్యాసంలో దీనికి సంబంధించిన వివరాలు పేర్కొన్నారు. ఈ క్రమంలో రెచ్చగొట్టే సైనిక కార్యకలాపాలను విరమించుకోవాలని అమెరికా చైనాను కోరగా.. తైవాన్‌కు ఆయుధాలను విక్రయించడం ద్వారా అమెరికా ఈ ప్రాంతంలో అస్థితరకు కారణమైందని చైనా విదేశాంగ శాఖ ఆరోపించింది. ఈ పరిణామాలన్నీ తైవాన్ సమస్యను మళ్లీ తెరపైకి తీసుకువచ్చాయి. ఈ నేపథ్యంలో చైనా-తైవాన్-అమెరికా మధ్య గతంలో ఏం జరిగింది.. ఇప్పుడు ఏం జరుగుతోందనే వివరాలు తెలుసుకుందాం.

* చైనా-తైవాన్ ఉద్రిక్తతలు ఎలా ప్రారంభమయ్యాయి? ఈ విషయంలో అమెరికా పాత్ర ఏంటి?

చైనాతో తైవాన్ సంబంధాలు వందల ఏళ్ల క్రితం నుంచే కొనసాగుతున్నాయి. 1683లో క్వింగ్ (Qing) రాజవంశం తైవాన్‌ను నియంత్రణలోకి తీసుకుంది. కానీ అంతర్జాతీయ రాజకీయాలలో తైవాన్ పేరు మొదటి చైనా-జపాన్ యుద్ధం అనంతరం (1894-95) బయటకు వచ్చింది. ఈ యుద్ధంలో చైనా క్వింగ్ సామ్రాజ్యాన్ని ఓడించిన జపాన్.. తైవాన్‌ను ఆక్రమించుకుంది. అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోయింది. దీంతో యుద్ధ సమయంలో మిత్రరాజ్యాల పక్షం వహించిన చియాంగ్ కై-షెక్ నేతృత్వంలోని చైనీయులకు తైవాన్‌ను తిరిగి ఇచ్చారు.

Malaria Vaccine: తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. ప్రపంచంలో తొలి మలేరియా వ్యాక్సిన్..

1949లో చియాంగ్‌తో పాటు అతని పార్టీ, కుమింటాంగ్ (KMT) చైనాలో అంతర్యుద్ధాన్ని ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలో చియాంగ్.. మావో జెడాంగ్ నేతృత్వంలోని కమ్యూనిస్టుల చేతిలో ఓడిపోయారు. అనంతరం చియాంగ్ వర్గం వారు తైవాన్‌కు పారిపోయి, ఆ ప్రాంతంపై పరిపాలనా నియంత్రణను కొనసాగించారు. మావో తైవాన్‌పై దాడి చేయాలని నిర్ణయించిన తరుణంలో.. 1950లో కొరియాతో యుద్ధం చేయాల్సి వచ్చింది. దీంతో మావో ఉత్తర కొరియాలోని కమ్యూనిస్టులకు సహాయం చేయడంపై దృష్టిపెట్టారు. ఫలితంగా అప్పట్లో తైవాన్‌పై దాడిని విరమించుకున్నారు. ఈ క్రమంలో తైవాన్ భద్రత, స్వతంత్య్రానికి అమెరికా హామీ ఇచ్చింది. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో, ఆ తరువాత కూడా తూర్పు ఆసియాలో చైనా ప్రాబల్యాన్ని నిరోధించడానికి అమెరికా పావులు కదిపింది. ఈ క్రమంలో తైవాన్‌కు మిత్రదేశంగా మారింది.

Pakistan Earthquake: పాకిస్తాన్‌లో భారీ భూకంపం.. భవనాలు కూలి 20 మందికిపైగా మృతి

* తైవాన్‌లో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి?
ప్రస్తుతం కొందరు తైవాన్‌ వాసులు చైనాతో పునరేకీకరణకు మద్దతు ఇస్తున్నారు. జాతివాదం, పౌర జాతీయత ఇందుకు కారణాలని చెప్పుకోవచ్చు. కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ 2020లో నిర్వహించిన పోల్స్ ప్రకారం.. తైవాన్ నివాసితులలో దాదాపు మూడింట రెండు వంతుల మంది తమ గుర్తింపును కేవలం 'తైవానీస్' గానే పరిగణిస్తున్నారు. కేవలం మూడు శాతం మంది మాత్రమే తమను తాము 'చైనీయులు'గా భావిస్తున్నారు. తైవానీస్ గుర్తింపు అనే బలమైన భావన.. చైనాతో తైవాన్ పునరేకీకరణకు అవరోధంగా మారుతోంది. తైవాన్ భవిష్యత్తు అయిన లక్షలాది మంది తైవానీస్ యువకులు.. తమకు చైనాతో ఎలాంటి సాంస్కృతిక సంబంధాలు లేవని భావిస్తున్నారు.

Shocking: చర్చిలో పాడుపని... 3లక్షల మంది చిన్నారులపై లైంగిక వేధింపులు... సంచలన నివేదిక

తైవాన్ నివాసితులు తమ దేశంలోని ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థపై విధేయత చూపుతున్నారు. చాలా మంది తైవానీస్ ప్రజలు "ఒక దేశం- రెండు వ్యవస్థలు" విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే తైవాన్ ప్రజలు ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నారు. స్వేచ్ఛను కోరుకునే ఈ ప్రాంత వాసులు.. చైనా లాంటి కమ్యూనిస్టు పాలనను కోరుకోవట్లేదు. పునరేకీకరణ తర్వాత తైవాన్‌కు స్వయంప్రతిపత్తిని ఇస్తామన్న చైనా వాగ్దానాన్ని సైతం తైవాన్ వాసులు విశ్వసించట్లేదు. ప్రత్యేకించి హాంకాంగ్‌ విషయంలో చైనా వ్యవహార శైలిని వారు ఎత్తిచూపుతున్నారు.

* చైనాకు తైవాన్ ఎందుకు ముఖ్యమైనది?
చైనా కమ్యూనిస్ట్ పార్టీ తైవాన్‌ను.. తమ దేశం నుంచి విడిపోయిన ప్రావిన్స్‌గా పరిగణిస్తుంది. ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ఇటీవల మాట్లాడుతూ.. తైవాన్ చైనాలో విలీనం కావాలని, అవుతుందని స్పష్టంగా చెప్పారు. చైనా ముందు నుంచి తైవాన్‌ను చారిత్రాత్మకంగా తమ దేశంలోని ఒక భాగంగా పరిగణించింది. జాతీయత, ప్రాదేశిక సమగ్రత లక్ష్యాలుగా డ్రాగన్ దేశం తైవాన్‌ పునరేకీకరణకు పావులు కదుపుతోంది.

పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా 100వ వార్షికోత్సవం జరిగే 2049 నాటికి చైనాను అతిపెద్ద శక్తిగా నిలిపేందుకు ప్రణాళికలు రచించారు జిన్‌పింగ్. ఆసియాలో ఆర్థిక ప్రాబల్యంతో పాటు టిబెట్, హాంకాంగ్, తైవాన్ వంటి భూభాగాలను విలీనం చేసుకొని "గ్రేటర్ చైనా" పేరుతో నియంత్రణను తిరిగి పొందడానికి చైనా అధ్యక్షుడు పావులు కదుపుతున్నట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి.

Couple: ఆ వీడియోలను అమ్ముకుని నెలకు రూ.30 లక్షలు సంపాదించారు..

తైవాన్‌కు స్వాతంత్ర్యం ప్రకటిస్తే.. జిన్‌పింగ్, చైనా కమ్యూనిస్ట్ పార్టీ జాతీయవాదానికి అవరోధాలు ఎదురవుతాయి. ఇది టిబెట్, జిన్జియాంగ్‌లలో వేర్పాటువాద ఉద్యమాలను ప్రోత్సహిస్తుంది. ఇవన్నీ డ్రాగన్‌ దేశానికి అమవానాలుగా మిగిలిపోతాయి. చైనా పునరేకీకరణ లక్ష్యాల్లో ప్రధానమైనది.. యునైటెడ్ స్టేట్స్‌తో ప్రచ్ఛన్న యుద్ధం. దశాబ్దాలుగా తైవాన్‌కు యూఎస్ ఆర్థిక, సైనిక పరమైన మద్దతును అందించింది. ఈ ప్రాంతానికి అధికారికంగా స్వాతంత్ర్యం ఇచ్చినట్లు ప్రకటిస్తే.. చైనా ప్రతిష్టకు భారీ నష్టం కలిగినట్లు అంతర్జాతీయ సమాజం భావిస్తుంది.

* అమెరికా వైఖరి ఎలా ఉంది?
తైవాన్‌పై చైనా దాడి చేస్తే.. రక్షణకు హామీ ఇస్తామని అమెరికా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఆ ప్రాంతానికి సాయం అందిస్తూనే ఉంది. సాధారణంగా అంతర్జాతీయ సంబంధాల విషయంలో.. ఆర్థిక శక్తి, వ్యూహాత్మక, సైద్ధాంతిక కారణాలతోనే చిన్న దేశాలకు పెద్ద దేశాలు హామీ ఇస్తాయి. తైవాన్- అమెరికా సంబంధాల విషయంలోనూ ఈ మూడు కారకాలను పరిగణనలోకి తీసుకోవాల్సిందే. ఎందుకంటే అమెరికాకు 10వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలుస్తోంది తైవాన్. ఈ ప్రాంతం చైనా ఆదీనంలోకి వెళ్తే.. 600 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, హైటెక్ పరిశ్రమ, సెమీకండక్టర్ ఉత్పత్తిపై డ్రాగన్ దేశం పట్టు సాధిస్తుంది.

Shooting In Space : అంతరిక్షంలో తొలి సినిమా షూటింగ్​.. నింగిలోకి దూసుకెళ్లిన హీరోయిన్..

దీనికి తోడు చైనా నియంత్రణలోకి తైవాన్ వెళ్తే.. ఈ ప్రాంతానికి తూర్పు వైపు 150 నాటికల్ మైళ్ల దూరంలో క్షిపణి పరిధిని చైనా పెంచవచ్చు. ఇది చైనాను తూర్పు చైనా సముద్రంలో ఆధిపత్య శక్తిగా చేస్తుంది. దీంతోపాటు ఆ దేశం జపాన్ లేదా యూఎస్ ద్వీపం భూభాగమైన గువామ్‌పై దాడి చేయడం సులభం అవుతుంది. అందువల్ల తైవాన్‌ పునరేకీకరణను అమెరికా సమర్థించట్లేదు. ఈ కారణాల వల్ల.. అన్ని విధాలుగా తైవాన్ తమకు అత్యంత ముఖ్యమైన మిత్రదేశమని యూఎస్ భావిస్తోంది.

* చైనా తైవాన్‌పై దాడి చేస్తుందా? లేదంటే తైవాన్ స్వాతంత్య్రాన్ని ప్రకటించుకుంటుందా?
ఒకవేళ చైనా తైవాన్‌పై దాడి చేస్తే.. దాని ఫలితాలు తీవ్రంగా ఉండవచ్చు. దీనివల్ల చైనా ఆర్థిక, దౌత్యపరమైన నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ద్వీపంపై దాడి చేస్తే చైనాపై అంతర్జాతీయంగా వ్యతిరేకత పెరుగుతుంది. తైవాన్ సానుభూతిని పొందుతుంది. ఫలితంగా ప్రపంచ నాయకుడిగా తనను తాను నిలబెట్టుకోవడానికి చైనా చేసే ప్రయత్నాలకు విలువ లేకుండా పోతుంది.

Online Classes: ఆన్‌లైన్ క్లాసు. లైవ్‌లో విద్యార్థి సెక్స్. షాకైన టీచర్, తోటి విద్యార్థులు

తైవాన్ అధికారికంగా స్వతంత్ర్యం ప్రకటించుకోవడం కూడా అసంభవమని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషిస్తున్నారు. చాలా మంది తైవానీస్ ప్రజలు యథాతథ స్థితికి మద్దతు ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్వతంత్య్రం ప్రకటించుకుంటే, చైనా తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడకపోవచ్చని ప్రజలు భావిస్తున్నారు. మరోవైపు చైనా తైవాన్ కంటే సైనికపరంగా ఎంతో ముందజలో ఉంది. దీనికి తోడు చైనా ఆ దేశంపై దండయాత్ర చేస్తే.. తాము రక్షిస్తామని అమెరికా ఎలాంటి హామీ ఇవ్వలేదు. అందువల్ల తైవాన్ సైతం స్వతంత్య్రాన్ని ప్రకటించుకోకపోవచ్చు. అందువల్ల చైనా బెదిరింపులు కొనసాగుతున్నప్పటికీ.. భవిష్యత్తులో కూడా యథాతథ స్థితి కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published: