Home /News /explained /

WHAT IS CENTRAL BANK DIGITAL CURRENCY HERE ARE THE DETAILS GIVEN BY RBI ABOUT CBDC GH VB

CBDC: సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ అంటే ఏంటి..? CBDC గురించి ఆర్‌బీఐ తెలియజేసిన వివరాలు ఏంటి..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

డిజిటల్‌ కరెన్సీలను ప్రారంభించే యోచనలో ప్రపంచ దేశాలు ఉన్నాయి. ఇండియాలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనలతో CBDC అనే పదం గురించి అందరూ చర్చించుకొంటున్నారు.

డిజిటల్‌ కరెన్సీలను(Digital Currency) ప్రారంభించే యోచనలో ప్రపంచ దేశాలు ఉన్నాయి. ఇండియాలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ప్రకటనలతో CBDC అనే పదం గురించి అందరూ చర్చించుకొంటున్నారు. ఈ పదం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇది ఏమిటి, ఎలా పని చేస్తుంది. క్రిప్టో లేదా బ్లాక్‌చెయిన్ అంటే ఏంటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. CBDC అనేది సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(Central Bank Digital Currency), ఇది ప్రభుత్వం జారీ చేసిన డిజిటల్ కరెన్సీ. ఆయా దేశాల్లోని సెంట్రల్‌ బ్యాంకులు ఈ కరెన్సీని నిర్వహిస్తాయి. భారతదేశం విషయంలో.. సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిర్వహిస్తుంది. సరళంగా చెప్పాలంటే.. CBDC అనేది ఒక నిర్దిష్ట దేశానికి చెందిన చట్టపరమైన టెండర్. ఎందుకంటే దీన్ని సెంట్రల్ బ్యాంక్ జారీ చేస్తుంది, డిజిటల్ రూపంలో ఉంటుంది. ఇది ఒక దేశం మానిటరీ అథారిటీ జారీ చేసిన అధికారిక కరెన్సీకి ఎలక్ట్రానిక్ రికార్డ్ లేదా డిజిటల్ టోకెన్ వంటిది.

2021లో బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్(BIS) నిర్వహించిన ఓ సర్వేలో 86 శాతం సెంట్రల్ బ్యాంకులు సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ సామర్థ్యాన్ని అన్వేషిస్తున్నాయని, 15 శాతం దేశాలు తమ పైలట్ ప్రాజెక్ట్‌లను ప్రారంభించబోతున్నాయని వెల్లడించింది. CBDC కొత్త మాధ్యమం, ఖాతా యూనిట్, విలువ నిల్వ, వాయిదా వేసిన చెల్లింపుల ప్రమాణంగా ప్రాథమిక విధులను పూర్తి చేస్తుంది.

CBDC అనేది సెంట్రల్ బ్యాంక్ జారీ చేసే కరెన్సీకి సమానం కానీ కాగితం కంటే భిన్నమైన రూపాన్ని తీసుకుంటుంది. RBI ప్రారంభించిన CBDC భారతదేశ ఫియట్ కరెన్సీ, భారత జాతీయ రూపాయి (INR) తరహాలో నగదుకు సమానంగా మార్చుకోవచ్చని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా చెప్పారు. ఇది ఎలక్ట్రానిక్ రూపంలో సావరిన్ కరెన్సీ మరియు సెంట్రల్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్‌లో బాధ్యత (చలామణిలో ఉన్న కరెన్సీ)గా కనిపిస్తుంది అని ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.

సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ(CBDC) అవసరం?
లెడ్జర్ సాంకేతికత(DLT) ఆధారంగా సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ పనిచేస్తుంది, అనుమతి ఉన్న బ్యాక్‌చెయిన్‌ టెక్నాలజీ వినియోగిస్తుంది, అనుమతి లేని క్రిప్టో ఆస్తులకు భిన్నంగా ఉంటుంది. బ్లాక్‌చెయిన్‌కు నియంత్రణకు సంబంధించిన అధికారాలు మానిటరీ అథారిటీకి ఉంటాయి. సెంట్రల్ బ్యాంకులు కాగితపు కరెన్సీ వినియోగాన్ని తగ్గించుకుంటున్నాయి. ఇప్పుడు మరింత ఆమోదయోగ్యమైన ఎలక్ట్రానిక్ రూపమైన కరెన్సీని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. డిజిటల్ కరెన్సీ మరింత ప్రభావవంతంగా ఉంటుంది. ప్రైవేట్ కరెన్సీల యొక్క హానికరమైన పరిణామాలను నివారించగలదు.

డిజిటల్‌ కరెన్సీ ప్రయోజనాలు
ఆర్థిక వ్యవస్థలో ఫైనల్‌ పేమెంట్‌ ఆప్షన్‌గా సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ కనిపిస్తుంది. దీని ద్వారా ఆర్థిక సంస్థల్లో, బ్యాంకుల్లో సెటిల్మెంట్‌ రిస్కులు తగ్గుతాయి. CBDC విలువ వాస్తవ నిల్వగా ఉంటుంది. విలువను ఒక ఎంటిటీ నుంచి మరొకదానికి బదిలీ చేస్తుంది. దీని ద్వారా లావాదేవీలకు కూడా తక్కువ ఖర్చు అవుతుంది. డబ్బు ప్రవాహాన్ని సులభతరం చేస్తుంది. CBDCలు గ్లోబలైజ్డ్ కాస్ట్ ఎఫెక్టివ్ పేమెంట్ సెటిల్‌మెంట్ సిస్టమ్ వైపు కదులుతాయి. ఉదాహరణకు భారతీయ దిగుమతిదారులు మధ్యవర్తి అవసరం లేకుండా డిజిటల్ డాలర్లలో రియల్ టైమ్ ఆధారంగా ఎగుమతి చేసిన అమెరికన్‌కు చెల్లించవచ్చు. యూఎస్‌ ఫెడరల్ రిజర్వ్ వ్యవస్థ సెటిల్మెంట్ కోసం తెరిచి ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. కరెన్సీ సెటిల్‌మెంట్లలో టైమ్ జోన్ తేడాలపై పట్టింపులు ఉండవు. CBDCలు ఫియట్ కరెన్సీల తరహాలో పనిచేస్తాయి కాబట్టి ఈ లావాదేవీ అంతిమంగా ఉంటుంది.

BSP: మాయవతి కీలక నిర్ణయం.. అల్లుడు ఆకాశ్ చేతికి అంకుశం.. యూపీలో ఘోర వైఫల్యం తర్వాత..


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) విడుదల చేసిన నోట్ ప్రకారం.. లిక్విడిటీ, స్కేలబిలిటీ, అంగీకారం, లావాదేవీల సౌలభ్యం, ప్రస్తుత డబ్బు రూపాలతో పోల్చితే సెటిల్‌మెంట్ వంటి ప్రయోజనాలను వేగంగా అందించే సామర్థ్యాన్ని CBDC కలిగి ఉంది. ఇది సమీప భవిష్యత్తులో నగదు రహిత ఆర్థిక వ్యవస్థకు ఆచరణాత్మక మార్పు కావచ్చు. ప్రభుత్వం అందించిన సహాయక మౌలిక సదుపాయాలతో CBDCని ప్రజలు సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఇది డిజిటల్ ఎకానమీ వైపు వెళ్లే ప్రభుత్వ లక్ష్యాన్ని పెంచుతుంది. ఇది ఇంటర్‌ఆపరేబిలిటీ అనుకూల వాతావరణాన్ని తీసుకురాగలదు. దీంతో వేగంగా రరియల్‌టైమ్‌ చెల్లింపులు జరుగుతాయి.

CBDCలలో భారతదేశం vs ప్రపంచ దేశాలు
ఇటీవల క్రిప్టో కరెన్సీలు, వర్చువల్ కరెన్సీలపై ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు ఆందోళనలు వ్యక్తం చేశాయి. ఇవి భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థలకు సవాలుగా మారుతాయనే ఉద్దేశంతో క్రిప్టోలను కొన్ని దేశాలు ఇప్పటికే నిషేధించాయి. దీంతో కేంద్ర బ్యాంకులు సొంతంగా డిజిటల్ కరెన్సీలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో ఆర్బీఐ సీబీడీసీని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.

2022-23 ఆర్థిక సంవత్సరంలో CBDC లేదా డిజిటల్ రూపాయిని ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే 2021 నుంచి డిజిటల్‌ కరెన్సీని తీసుకురావడంపై కేంద్రం దృష్టి సారించింది. అప్పటి నుంచి సమాలోచనలు జరుగుతున్నాయి. రిటైల్ , హోల్‌సేల్ చెల్లింపులు, అంతర్లీన సాంకేతికత, యూజ్‌ కేసెస్‌, వ్యాలిడేషన్‌ మెకానిస్మ్‌(టోకెన్‌ బేస్డ్‌ లేదా అమౌంట్‌ బేస్డ్‌), డినామినేషన్స్, ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇష్యూలో డిజిటల్‌ కరెన్సీని ఆర్‌బీఐ పరిశీలిస్తోంది.

Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 133 మంది ప్రయాణికులతో పర్వతాల్లో కుప్పకూలిన బోయింగ్ .. బూడిదేనా?


నైజీరియా తన డిజిటల్ కరెన్సీని నైరాను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. వెనిజులా కూడా తన CBDC డిజిటల్‌ బొలివర్‌ ప్రారంభించాలని యోచిస్తోంది. దక్షిణ కొరియా డిజిటల్ యువాన్‌ను పప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ECB), యూఎస్‌, రష్యా, చైనా మరియు టర్కీలు కూడా CBDCల కోసం తమ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి.
Published by:Veera Babu
First published:

Tags: Explained, Nirmala sitharaman, Rbi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు