ఇటీవల కాలంలో ఇండియన్ స్టాక్ మార్కెట్లో (Stock Market) ఐపీఓలు (IPO) విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అనేక స్టార్టప్ (Startup) (కొత్తగా వచ్చిన) కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వస్తుండటం విశేషం. ఇటీవలే వన్97 కమ్యూనికేషన్స్ రూ.18,300 కోట్ల ఇష్యూ సైజుతో తన పబ్లిక్ ఆఫర్‌ను ముగించింది. దాంతో భారతీయ కంపెనీకి సంబంధించిన అతిపెద్ద ఐపీఓగా పేటీఎం నిలిచింది. 2021లో ప్రకటించిన ఇతర ప్రధాన ఐపీఓలలో పాలసీ బజార్ మాతృసంస్థ పీబీ ఫిన్‌టెక్, ఫుడ్ అగ్రిగేటర్ జొమాటో, కేఎఫ్‌సీ, ఆన్లైన్ ఫార్మసీ ఫార్మ్ఈజీ, ఫ్యాషన్ రిటైల్ కంపెనీ నైకా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలో ఐపీఓలపై ఫ్యూచర్ ట్రెండ్ ఏంటి? టెక్ స్టార్టప్‌లను సులభంగా లిస్టింగ్ చేయడానికి రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ ఎలా మార్చారు? వంటి విషయాలు తెలుసుకుందాం.
* టెక్ స్టార్టప్‌లు ఐపీఓలకు ఎందుకు వెళ్తున్నాయి?
గ్లోబల్ ఇన్స్టిట్యూషనల్ పెట్టుబడిదారులు భారతదేశ టెక్నాలజీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని ఆసక్తి చూపుతున్నట్లు పలు కంపెనీలు భావిస్తున్నాయి. అందుకే భారతీయ సంస్థలు ఐపీఓలకు వెళ్లడానికి మొగ్గుచూపుతున్నాయి. పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ ఇటీవల మాట్లాడుతూ.. అంతర్జాతీయ పెట్టుబడిదారులు భారతీయ స్టార్టప్‌లలో పబ్లిక్ ఆఫర్లు, ప్రైవేట్ పెట్టుబడుల ద్వారా పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నారని చెప్పారు.
SBI Savings Account: మీ ఇంటి నుంచే ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేయండి... ప్రాసెస్ ఇదే
ఇప్పటికే ఉన్న షేర్‌హోల్డర్ల నుంచి మరిన్ని పెట్టుబడుల ఐపీఓలకు ప్రాధాన్యత ఇవ్వడానికి కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. కరోనా తర్వాత విస్తరణ ప్రణాళికల కోసం తగినంత మూలధనాన్ని ఏర్పరచుకోవడానికి స్టాక్ మార్కెట్లను కూడా కంపెనీలు మెరుగు పరచాలని చూస్తున్నాయి. శుక్రవారం 60,687 వద్ద ముగిసిన సెన్సెక్స్, అక్టోబర్‌లో మొదటిసారిగా 61,000 మార్క్‌ను దాటింది. ఇది ఏడాది క్రితం స్థాయి కంటే 40 శాతం వద్ద ట్రేడవుతోంది.
* ఈ ఏడాది టెక్ కంపెనీల పబ్లిక్ ఆఫర్లకు ఎలాంటి స్పందన లభించింది?
ఇటీవలి ఆఫర్లలో పేటీఎం ఐపీఓ 1.89 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. అయితే FSN E-కామర్స్ వెంచర్స్ (Nykaa) బిడ్డింగ్ చివరి రోజులో 82 కంటే ఎక్కువ సార్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఈ కాస్మెటిక్స్ కంపెనీ 79.4% ప్రీమియంతో ఐపీఓ ధర రూ. 1,125 వద్ద జాబితా అయ్యింది. ఇన్సూరెన్స్-టెక్ కంపెనీ పాలసీబజార్ మాతృ సంస్థ పీబీ ఫిన్‌టెక్ తన ఆఫర్‌ను బిడ్డింగ్ చివరి రోజున అంటే నవంబర్ 3న 16.6 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయింది.
* ఆఫర్‌పై ఉన్న ఐపీఓలను పెట్టుబడిదారులు ఎలా అంచనా వేయాలి?
ప్రతి స్టార్టప్‌ను ప్రత్యేక వ్యాపారంగా చూడాలని పరిశోధన విశ్లేషకులు పెట్టుబడిదారులకు సూచిస్తున్నారు. టెక్ కంపెనీలు లేదా స్టార్టప్‌లు తమ వ్యాపారాన్ని ఎంత విస్తృతంగా నడిపిస్తున్నాయి.. భవిష్యత్తులో అవి లాభాల్లో నడుస్తాయా? అనే కోణంలో చూడాలని నిపుణులు చెబుతున్నారు. బ్యాంకులు కూడా తమ డిజిటల్ ఉనికిని పెంచుకున్నందున, టెక్నాలజీ అప్గ్రేడ్లు చేసినందున.. ఐపీఓలకు వెళ్లే ఫిన్‌టెక్ కంపెనీలను పెట్టుబడిదారులు జాగ్రత్తగా అంచనా వేయాలని పెట్టుబడి నిపుణులు సలహా ఇస్తున్నారు.
* రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ స్టార్టప్‌లను ఐపీఓల కోసం ఎలా ప్రోత్సహించింది?
స్టార్టప్ కంపెనీలు భారతీయ ఎక్స్ఛేంజీలలో సులభంగా లిస్ట్ అయ్యేలా చేయడానికి అనేక నిబంధనలను సడలించింది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI). సెబీ ఈ ఏడాదిలో ప్రారంభ దశ పెట్టుబడిదారులు ప్రీ-ఇష్యూ మూలధనంలో 25 శాతం కలిగి ఉండాల్సిన సమయాన్ని రెండేళ్ల నుంచి ఒక ఏడాదికి తగ్గించింది. గతంలో పబ్లిక్ ఇష్యూకి స్టార్టప్‌లను విచక్షణతో కేటాయింపులు చేయకుండా మోకాలడ్డిన నిబంధనలను కూడా సవరించింది. కొత్త రూల్స్ ప్రకారం స్టార్టప్‌లు ఐపీఓ ఇష్యూ సైజులో 60% వరకు అర్హత కలిగిన పెట్టుబడిదారునికి కేటాయించడానికి అనుమతిస్తాయి. ఇలాంటి షేర్లపై 30 రోజుల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IPO, Start-Up, Stock Market