Home /News /explained /

WHAT IS A WINDFALL TAX AND WHY IS IT BACK IN DISCUSSION KNOW FULL DETAILS HERE GH VB

Explained: విండ్‌ఫాల్ టాక్స్ అంటే ఏంటి..? ఇది ఇప్పుడు ఎందుకు తెరపైకి వచ్చింది..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ముడిచమురు ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో చమురు, గ్యాస్ ఉత్పత్తిదారులను విండ్ ఫాల్ ట్యాక్స్(Windfall Tax) చెల్లించాలని ప్రభుత్వం కోరినట్లు చర్చ జరుగుతోంది.

ముడిచమురు ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో చమురు, గ్యాస్ ఉత్పత్తిదారులను విండ్ ఫాల్ ట్యాక్స్(Windfall Tax) చెల్లించాలని ప్రభుత్వం(Government) కోరినట్లు చర్చ జరుగుతోంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ONGC ఛైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్(Managing Director) అల్కా మిట్టల్ మాట్లాడుతూ.. తమకు అలాంటి సమాచారం ఏదీ అందలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో విండ్‌ ఫాల్‌ ట్యాక్స్‌(Windfall Tax) గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Indian Railways: LOL అంటే నవ్వటం కాదట.. ఇండియన్ రైల్వేస్ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే..


విండ్ ఫాల్ ట్యాక్స్ జాక్‌పాట్ లాంటిదా?
అవును.. ఊహించని విధంగా ఎక్కువ డబ్బు సంపాదించినప్పుడు ఈ ఒన్‌ టైమ్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సి వస్తుంది. రష్యా-ఉక్రెయిన్ వివాదంతో సరఫరాలో తలెత్తిన సమస్యలతో ముడిచమురు ధరలు 14 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. బ్యారెల్‌ ధర 139 డాలర్‌లకి చేరుకుంది. దీంతో చమురు, గ్యాస్ ఉత్పత్తిదారులు అకస్మాత్తుగా డబ్బు సంపాదిస్తున్నారు. కంపెనీలు తమ సామర్థ్యాన్ని మెరుగుపరిచిన కారణంగా లేదా ఏదైనా ఆవిష్కరణలు చేపట్టి ఆదాయాలను గడించడం లేదు. ఎలాంటి అభివృద్ధి చర్యలు చేపట్టకుండానే వారు ఈ భారీ లాభాలను ఆర్జిస్తున్నారు. అందువల్ల బ్యారెల్‌ ముడి చమురు ధర 70 డాలర్‌ల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, పన్ను అమలులోకి రావచ్చు. ఈ పన్ను ఆదాయంతో వినియోగదారుల ఇంధన బిల్లులకు సబ్సిడీ అందజేసే అవకాశం ఉంటుంది.

* కానీ ఇది ఇప్పుడే ఎందుకు వార్తల్లో నిలుస్తోంది?
2018లో చమురు ధరలు బ్యారెల్‌కు 80 డాలర్‌లు దాటినప్పుడు కూడా ఇటువంటి పన్ను విధానం గురించి పాలసీ మేకర్‌లు ఆలోచించారు. ఆ సమయంలో జాయింట్ కాంప్రెహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ (JCPOA) నుంచి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైదొలిగిన తర్వాత, ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. చమురు ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం పెరగడంతో ఈ పన్ను మళ్లీ చర్చలోకి వచ్చింది. హంగరీ, ఇటలీ వంటి కొన్ని యూరోపియన్ దేశాలు ఇప్పటికే విండ్ ఫాల్ ట్యాక్స్ విధించాయి. గత గురువారం యునైటెడ్ కింగ్‌డమ్ కూడా సుమారు 5 బిలియన్‌ పౌండ్‌లను సేకరించడానికి ఒక సంవత్సరానికి అదనంగా 25 శాతం లెవీని ప్రకటించింది.

* మార్కెట్ ఎలా స్పందించింది?
ఈ ట్యాక్స్‌పై నివేదికలు వెలువడిన కొద్ది రోజుల తర్వాత, ONGC, BPCL స్టాక్‌లపై వరుసగా 9 శాతం, 5 శాతం కరెక్షన్‌ కనిపించింది. ONGCపై సిద్ధం చేసిన ఇటీవలి నివేదికలో నోమురా ఒక విషయం పేర్కొంది. గత కొన్ని సంవత్సరాలుగా సంస్థ డీ-రేట్ అవుతోందని, విండ్‌ఫాల్ టాక్స్‌లు ఇందుకు కారణం కావచ్చని స్పష్టం చేసింది. ఆయిల్‌ రియలైజేషన్‌లో ప్రతి బ్యారెల్‌కు 5 డాలర్‌ల మార్పు ONGC 2023 ఆర్థిక సంవత్సరం స్టాండ్‌అలోన్‌ ఈపీఎస్‌పై 8 శాతం (రూ.2.67/షేర్‌) ప్రభావం చూపుతుందని, గ్యాస్ రియలైజేషన్‌లో ప్రతి 0.5/mmbtu మార్పు ONGC 2023 ఆర్థిక సంవత్సరం స్టాండలోన్ ఈపీఎస్‌పై 4 శాతం ప్రభావం చూపుతుందని పేర్కొంది.

* ప్రభుత్వానికి సహాయం చేస్తుందా?
సెంట్రల్ బ్యాంక్ తన అనుకూల వైఖరిని ఉపసంహరించుకున్నప్పుడు, అధిక వ్యయంతో ఆర్థిక వ్యవస్థకు సపోర్ట్‌ ఇవ్వవలసి వచ్చినప్పుడు, పెరుగుతున్న ముడి ధరల కారణంగా కరెంట్ ఖాతా లోటు ఏర్పడినప్పుడు దానికి పన్నులు అవసరం. ప్రభుత్వం ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 తగ్గింది. దీని కారణంగా దాదాపు రూ.లక్ష కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతుంది. దీనిని విండ్‌ఫాల్ ట్యాక్స్‌తో భర్తీ చేయవచ్చు.

Instagram Features: ఇన్‌స్టాగ్రామ్‌లో ప్ర‌త్యేక ఫీచ‌ర్స్‌.. తెలుసుకోండి.. ట్రై చేయండి

ప్రభుత్వం పరిగణించాల్సిన ఇతర అంశాలు కూడా ఉన్నాయి. చమురు ఉత్పత్తిదారులతో ఉత్పత్తి-భాగస్వామ్య ఒప్పందాల(PSC)పై ప్రభుత్వం సంతకం చేసింది, దీని ద్వారా ఆయా కంపెనీలు సంపాదించిన లాభాలలో ప్రభుత్వం వాటా పొందుతుంది. ఈ కారణంగా లాభాలలో కొంత భాగాన్ని ప్రభుత్వం కోల్పోవడాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. చమురు, గ్యాస్ ఉత్పత్తిదారులతో సహా పీఎస్‌యూల నుంచి ప్రభుత్వం డివిడెండ్‌లను పొందుతోంది. గత నవంబర్‌లో ఓఎన్‌జీసీ రూ.4,180 కోట్లు, బీపీసీఎల్ రూ.575 కోట్ల డివిడెండ్‌లు చెల్లించినట్లు డీఐపీఏఎం కార్యదర్శి ట్వీట్ చేశారు. కొత్త పన్ను చెల్లించడం వల్ల లాభాలు తగ్గితే, ఈ డివిడెండ్లు కూడా తగ్గే అవకాశం ఉంది.
Published by:Veera Babu
First published:

Tags: Explained, Market, Oil and gas, Price, Windfall tax

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు