Home /News /explained /

WHAT IS A VACCINE PASSPORT WHY IT IS REQUIRED FOR INTERNATIONAL TRAVELS BA GH

Vaccine passports: వ్యాక్సీన్ పాస్ పోర్ట్స్ అంటే ఏంటి? ఇవి ఎందుకంత అవసరం?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వ్యాక్సీన్ పాస్ పోర్ట్ అంటే వ్యాక్సినేషన్ తీసుకున్నట్లు ఇచ్చే ఓ సర్టిఫికెట్ మాత్రమే.. దీన్ని పాస్ పోర్ట్, వీసాతో పాటు ఎయిర్ పోర్టుల్లో చూపించాల్సి ఉంటుంది. కరోనా వ్యాక్సీన్ వచ్చిన తర్వాత ఈ పదాన్ని మనం ఎక్కువగా వింటున్నాం కానీ ఈ సర్టిఫికెట్ విధానం ఎప్పటి నుంచో ఉంది.

ఇంకా చదవండి ...
వ్యాక్సీన్ పాస్ పోర్ట్స్.. ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాలు తమ దేశంలోకి ఇతర దేశాల వ్యక్తులను అనుమతించే ముందు తప్పక అడుగుతున్న డాక్యుమెంట్ ఇది. గత నెలలో ఇజ్రాయెల్ మొట్టమొదటగా ఈ సర్టిఫికేషన్ ని తీసుకొచ్చింది. వ్యాక్సీన్ తీసుకున్న వారు ఈ డాక్యమెంట్ ని చూపించడం ద్వారా కొన్ని ఈవెంట్లకు హాజరు కావడం, కొన్ని సౌకర్యాలు పొందేందుకు వీలుంటుంది. సాధారణంగా కరోనా వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత ఎలాంటి ప్రత్యేకమైన సదుపాయాలు లేకుండా సాధారణమైన జీవితం గడిపే వీలుంటుంది. ఇజ్రాయెల్ రెస్టారెంట్లు, జిమ్స్, హోటల్స్ వంటివాటికి అనుమతి కోసం తమ దేశంలోని వ్యక్తులు ఇతర దేశాలకు ప్రయాణం చేయడం కోసం ఈ వ్యాక్సీన్ పాస్ పోర్ట్ ని అందించడం ప్రారంభించింది.

వ్యాక్సీన్ పాస్ పోర్ట్ అంటే ఏంటి?

వ్యాక్సీన్ పాస్ పోర్ట్ అంటే వ్యాక్సినేషన్ తీసుకున్నట్లు ఇచ్చే ఓ సర్టిఫికెట్ మాత్రమే.. దీన్ని పాస్ పోర్ట్, వీసాతో పాటు ఎయిర్ పోర్టుల్లో చూపించాల్సి ఉంటుంది. కరోనా వ్యాక్సీన్ వచ్చిన తర్వాత ఈ పదాన్ని మనం ఎక్కువగా వింటున్నాం కానీ ఈ సర్టిఫికెట్ విధానం ఎప్పటి నుంచో ఉంది. సాధారణంగా ఆఫ్రికా దేశాలకు చెందిన వ్యక్తులు అమెరికా, లేదా భారత్ వంటి దేశాలకు రావాలనుకుంటే అక్కడి ప్రజలకు ఎక్కువగా వచ్చే ఎల్లో ఫీవర్ వంటి వ్యాధులు రాకుండా వ్యాక్సీన్ వేయించుకున్నట్లు సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది. అయితే పాస్ పోర్ట్ అంటూ పిలుస్తున్నా ఈ డాక్యుమెంట్ ఎక్కువసార్లు ఓ సర్టిఫికెట్ రూపంలో లేదా డిజిటల్ డాక్యుమెంట్ రూపంలో ఉంటుంది. ఈ సర్టిఫికెట్ ఉన్న వ్యక్తి కరోనాకి వ్యతిరేకంగా వ్యాక్సీన్ తీసుకున్నారు కాబట్టి వారు ఆ వ్యాధి బారిన పడే ప్రమాదం లేదు అని దీని అర్థం. వ్యాక్సీన్ పాస్ పోర్ట్ చూపిస్తే చాలా దేశాలు ఇప్పుడు క్వారంటైన్ అవసరం లేదని చెబుతున్నాయి. అయితే కొన్ని దేశాలు వాటిని తమ స్థానిక భాషల్లో అందిస్తున్నాయి. వేరే దేశాలు మాత్రం ఆ భాషలో ఉంటే ఒప్పుకోవడం లేదు. ఇలా ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సీన్ పాస్ పోర్ట్ కి ఇదీ పద్ధతి అంటూ ఒక పద్ధతి ఏర్పడాల్సిన అవసరం ఉంది. దానికి ఇంకా మరికొన్ని రోజులు పట్టొచ్చు.

మనకు ఎలాంటి పాస్ పోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి?

ఇజ్రాయెల్ ప్రభుత్వం అందిస్తోన్న సర్టిఫికెట్లలా చాలా సంస్థలు, ఎన్ జీవోలు అంతర్జాతీయ ప్రయాణాల కోసం వ్యాక్సీన్లు వేసి వ్యాక్సీన్ పాస్ పోర్ట్ లను అందిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ లైన్స్ ని అనుసంధానం చేసే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ IATA ట్రావెల్ పాస్ పేరుతో ఓ యాప్ ని తయారుచేస్తోంది. ఇందులో భాగంగా ఎయిర్ లైన్స్, ఏవియేషన్ ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి వ్యక్తికి తమ వ్యాక్సినేషన్ ప్రూఫ్ ని, దాని వాలిడిటీని చూపించేందుకు ఒక కామన్ యాప్ అందుబాటులోకి వస్తుంది. కామన్స్ ప్రొజెక్ట్ అనే నాన్ ప్రాఫిట్ సంస్థ కామన్ పాస్ అనే యాప్ తయారుచేస్తోంది. దీని ద్వారా ప్యాసెంజర్ వ్యాక్సినేషన్ రికార్డును యాప్ రూపంలో తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం న్యూయార్క్, బోస్టన్, లండన్, హాంగ్ కాంగ్ వంటి ప్రదేశాలకు వెళ్లేందుకు కామన్ పాస్ టెస్టింగ్ ని వెరిఫికేషన్ గా చాలామంది ప్రయాణికులు ఉపయోగించారట.

ఇవి ఎవరికి ఉపయోగపడతాయి?

వ్యాక్సీన్ పాస్ పోర్టుల ముఖ్యోద్దేశం టూరిజం, హోటల్ పరిశ్రమలకు సహాయపడడమే. కరోనా లాక్ డౌన్ వల్ల ఈ రెండు రంగాలు చాలా ప్రభావితమయ్యాయి. అంతర్జాతీయ ప్రయాణాలు, హోటల్ బుక్సింగ్ అన్నీ తగ్గిపోయాయి. ఈ వ్యాక్సీన్ పాస్ పోర్ట్ ద్వారా ఇవి ఉన్నవారిని దేశాలు తమ దేశంలోకి అడుగుపెట్టేందుకు అవకాశం కల్పిస్తే ఈ రంగాలు కోలుకునే అవకాశం ఉంది. అయితే ప్రతి దేశానికీ ఈ వ్యాక్సీన్ పాస్ పోర్టులు అందించేందుకు తమదైన ప్రత్యేక వ్యవస్థ ఉండడం, వాటికి తగినట్లే ఆధారాలను అందించడం ద్వారా అవి వేరే దేశాలు ఒప్పుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.

వ్యాక్సీన్ పాస్ పోర్ట్స్ అందించడం పట్ల ఏదైనా వ్యతిరేకత ఉందా?

అంతర్జాతీయ ప్రయాణాలు చేసేందుకు ప్రూఫ్ గా వ్యాక్సీన్ పాస్ పోర్టులను ఉపయోగించడం పట్ల WHO ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో వ్యాక్సీన్ ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందన్న విషయం మనకు పూర్తిగా తెలీదు. వ్యాక్సీన్ వేసుకోవడం వల్ల వారి నుంచి ఇతరులకు ఆ వైరస్ వ్యాపించదు అన్న సంకేతాలు ఇంకా శాస్త్రవేత్తల నుంచి రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వ్యాక్సీన్ పాస్ పోర్ట్ లను అంతర్జాతీయ ప్రయాణాల కోసం ఇతర దేశాల నుంచి దేశంలోకి అడుగుపెట్టేందుకు, తమ దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లేందుకు తప్పనిసరి చేయడం వల్ల ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించలేం. దీనితో పాటు ప్రస్తుతం వ్యాక్సీన్ల లభ్యత చాలా తక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ ప్రయాణాలకు వెళ్లేందుకు వీటిని తీసుకోవడం ప్రారంభిస్తే అవి నిజంగా అవసరమైన వ్యక్తులకు అందడం ఆలస్యం అవుతుంది. హైరిస్క్ ఉన్నవారికి అవి అందడం ముందుగా జరగాల్సిన ప్రక్రియ. పైగా ఇవి కేవలం డిజిటల్ మోడ్ లో ఇవ్వడం వల్ల వివిధ సంస్థలు ప్రయాణీకులు ఎక్కడెక్కడికి వెళ్లారు అన్న విషయం తెలుసుకునే వీలుంటుంది కాబట్టి దీనివల్ల ప్రైవసీ సమస్యలు వచ్చే అవకాశం ఉందని కూడా నిపుణులు భావిస్తున్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Corona virus, Coronavirus, Covid-19, COVID-19 vaccine, Passport

తదుపరి వార్తలు