Home /News /explained /

WHAT IS A TOP UP LOAN AND WHEN SHOULD YOU GO FOR IT MK GH

Top-up Loan: టాప్-అప్ లోన్ అంటే ఏంటి..? దీన్ని ఎప్పుడు ఎంచుకోవాలి..?

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

అతి తక్కువ డాక్యుమెంటేషన్‌తో ఆర్థిక సంస్థలు అందించే అదనపు లోన్‌ను టాప్‌ అప్ లోన్ అంటారు. బ్యాంకులు లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఇతర ఆర్థిక సంస్థలు వీటిని అందిస్తాయి. అత్యవసర సమయాల్లో వీటిని కస్టమర్లు ఎంచుకోవచ్చు. ఖాతాదారులు తమ గృహ రుణం కంటే ఎక్కువ మొత్తాన్ని అప్పుగా తీసుకునే వీలు ఉంటుంది.

ఇంకా చదవండి ...
ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు కస్టమర్లకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అనేక రకాల లోన్లను అందిస్తున్నాయి. పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ వంటివి అత్యవసర సమయాల్లో ఆర్థిక అవసరాలను తీర్చగలవు. అయితే ఈ జాబితాలో టాప్ అప్ లోన్ కూడా ముఖ్యమైనది. ఇప్పటికే తీసుకున్న హోమ్ లోన్ పై అతి తక్కువ డాక్యుమెంటేషన్‌తో ఆర్థిక సంస్థలు అందించే అదనపు లోన్‌ను టాప్‌ అప్ లోన్ అంటారు. బ్యాంకులు లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఇతర ఆర్థిక సంస్థలు వీటిని అందిస్తాయి. అత్యవసర సమయాల్లో వీటిని కస్టమర్లు ఎంచుకోవచ్చు. ఖాతాదారులు తమ గృహ రుణం కంటే ఎక్కువ మొత్తాన్ని అప్పుగా తీసుకునే వీలు ఉంటుంది.

ఎమర్జెన్సీ ఫైనాన్సింగ్ పొందడానికి టాప్-అప్ లోన్లు మంచి మార్గమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే దీని గురించి పూర్తిగా తెలుసుకోవడంతో పాటు, ఈ లోన్ ఆప్షన్‌ను ఎప్పుడు ఎంచుకోవాలో తెలుసుకోవాలని సూచిస్తున్నారు.

ఎవరు అర్హులు?
ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ, డిఫాల్ట్‌గా మారకుండా ప్రతి నెలా EMIలను తిరిగి చెల్లిస్తున్న రుణగ్రహీతలు మాత్రమే టాప్ అప్ లోన్‌కు అర్హులు. లోన్ తీసుకున్న వారి రీ-పేమెంట్ ట్రాక్ రికార్డ్ ఆధారంగానే ఆర్థిక సంస్థలు వారికి టాప్-అప్ లోన్‌ ఇవ్వాలా వద్దా అని నిర్ధారిస్తాయి. సాధారణ లోన్‌కు సంబంధించిన నియమ నిబంధనలే దీనికి కూడా వర్తిస్తాయి.

వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి?
అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు చాలామంది పర్సనల్ లోన్‌ ఎంచుకుంటారు. లేదంటే బంగారం, ఇతర ఆస్తులను తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటారు. అయితే వీటిపై వడ్డీరేటు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇప్పటికే ఉన్న హోమ్‌ లోన్‌పై టాప్-అప్ లోన్ తీసుకోవడం మంచి ఆప్షన్‌ అని నిపుణులు చెబుతున్నారు. ఇవి సులభంగా అందుబాటులో ఉండటంతో పాటు తక్కువ వడ్డీ రేటుతో లభిస్తాయి.

దరఖాస్తు ప్రక్రియ?
టాప్-అప్ లోన్ అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే.. దీనికోసం కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. రుణగ్రహీత వివిధ డాక్యుమెంట్లను అందించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే హోమ్ లోన్ కోసం అవసరమైన పత్రాలను బ్యాంకులు సేకరిస్తాయి. దీంతో అర్హత ప్రకారం తక్కువ సమయంలోనే లోన్ మంజూరు అవుతుంది. మంజూరు చేసిన లోన్‌ మేరకు.. ప్రస్తుత రుణాలపై చెల్లిస్తున్న EMIలు పెరుగుతాయి. ఈ ప్రయోజనాల వల్ల టాప్-అప్ లోన్‌ను తక్షణ ఫైనాన్సింగ్ (instant financing) ఆప్షన్‌గా కూడా పరిగణించవచ్చు.

ఎలాంటి అవసరాలకు ఈ లోన్ తీసుకోవచ్చు?
సాధారణంగా ఇంటి నిర్మాణానికి, కొనుగోళ్లకు మాత్రమే హోమ్‌ లోన్‌ తీసుకుంటారు. అయితే అదనపు ఇంటి ఖర్చుల కోసం టాప్-అప్ లోన్‌ తీసుకోవచ్చు. కానీ ఇలా తీసుకునే రుణాన్ని కచ్చితంగా ఇంటి నిర్మాణం, సంబంధిత అవసరాల కోసమే ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇంటి మరమ్మతులు లేదా ఫర్నిషింగ్ కోసం లేదా వ్యాపార విస్తరణ, పిల్లల విద్య, వైద్య అత్యవసర ఖర్చులు, వివాహాలు వంటి పెద్ద ఖర్చుల కోసం కూడా వినియోగించవచ్చు.
Published by:Krishna Adithya
First published:

Tags: Bank loans

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు