హోమ్ /వార్తలు /Explained /

Explained : PPF అకౌంట్ అంటే ఏంటి..? PPF అకౌంట్‌ను ఎందుకు ఓపెన్ చేయాలి..? దీని ప్రయోజనాలు ఏవి..?

Explained : PPF అకౌంట్ అంటే ఏంటి..? PPF అకౌంట్‌ను ఎందుకు ఓపెన్ చేయాలి..? దీని ప్రయోజనాలు ఏవి..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రభుత్వ మద్దతు ఉన్న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పథకం అనేది భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేయడానికి సురక్షితమైన, అత్యంత అనుకూలమైన మార్గాలలో ఒకటి. ఇది స్థిరమైన ఆదాయాన్ని అందించే పెట్టుబడి సాధనం. అంటే దీనిపై స్థిరమైన రాబడికి హామీ ఉంటుంది.

ఇంకా చదవండి ...

ఆదిల్ శెట్టి, BANKBAZAAR.com CEO

ప్రభుత్వ మద్దతు ఉన్న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పథకం అనేది భవిష్యత్తు కోసం డబ్బు(Money) ఆదా చేయడానికి సురక్షితమైన, అత్యంత అనుకూలమైన మార్గాలలో ఒకటి. ఇది స్థిరమైన ఆదాయాన్ని అందించే పెట్టుబడి(Invest) సాధనం. అంటే దీనిపై స్థిరమైన రాబడికి హామీ ఉంటుంది. ఈ పథకం 15 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్‌తో(Lock In Period) వస్తుంది. మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత, అప్పటి వరకు వచ్చిన వడ్డీతో (Interest) పాటు మొత్తం కాంట్రిబ్యూషన్‌ను (Contribution) లబ్ధిదారులకు చెల్లిస్తారు. ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియో ఆదర్శవంతంగా ఉండాలంటే.. అందులో అగ్రెసివ్ ఇన్‌స్ట్రుమెంట్స్ (రిస్క్ ఉండేవి), డిఫెన్సివ్ ఇన్‌స్ట్రుమెంట్స్ (రిస్క్ లేనివి) ఉండాలి.

PPF పెట్టుబడి పోర్ట్‌ఫోలియో డిఫెన్సివ్ ఇన్వెస్ట్‌మెంట్ కిందకు వస్తుంది. PPF పథకాన్ని 1968లో ప్రారంభించారు. పదవీ విరమణ నాటికి డబ్బు ఆదా చేసేలా ప్రజలను ప్రోత్సహించడం ఈ స్కీమ్ లక్ష్యం. PPF అకౌంట్‌తో అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటంటే..

Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ సేల్... రూ.10,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

తక్కువ మొత్తంతో పెట్టుబడి ప్రారంభించవచ్చు

PPF అకౌంట్‌ను అతి తక్కువగా రూ.100తో కూడా ఓపెన్ చేయవచ్చు. ఆ తర్వాత ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 డిపాజిట్ చేయాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో PPFలో ఇన్వెస్ట్ చేయగల గరిష్ట పెట్టుబడి మొత్తం రూ. 1.5 లక్షలు. మీవద్ద నిధులు లేకపోతే కనీసం రూ.100 పెట్టుబడి పెట్టవచ్చు. తర్వాత మీ జీతం పెరిగితే, అందుకు అనుగుణంగా కాంట్రిబ్యూషన్ పెంచుకోవచ్చు.

రాబడికి హామీ

PPF పెట్టుబడికి సావరిన్ గ్యారెంటీ సపోర్ట్ ఉంటుంది. కాబట్టి డిఫాల్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. PPFపై వడ్డీ రేటును భారత ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో సమీక్షిస్తూ, సవరిస్తుంది. PPFపై ఫ్లోటింగ్ వడ్డీ రేటు వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వ స్థూల ఆర్థిక అంశాల ఆధారంగా ఈ వడ్డీ రేట్లు మారవచ్చు. అయితే ప్రతి త్రైమాసికానికి నిర్ణీత వడ్డీ స్థిరంగా అందుతుంది. ప్రస్తుతం PPF వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. ఇది ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే మెరుగైన రాబడిగా చెప్పుకోవచ్చు.

దీర్ఘకాలంలో మెరుగైన రాబడి

PPF ఫ్లోటింగ్ వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంది. అందువల్ల వడ్డీ రేటు ట్రెండ్ ఎక్కువగా ఉన్నప్పుడు PPFలో మీ పెట్టుబడిపై ఎక్కువ రాబడి అందుతుంది. ఇతర ప్రభుత్వ మద్దతు ఉన్న పథకాలతో పోలిస్తే.. PPF వడ్డీ రేటు స్థిరంగా, ఎక్కువగా ఉంటుంది. PPF కంటే EPF వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. అయితే జీతం పొందే ఉద్యోగులు మాత్రమే ఇందులో పెట్టుబడి పెట్టగలరు. SCSSలో సీనియర్ సిటిజన్లు, SSAలో ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు/సంరక్షకులు మాత్రమే పెట్టుబడి పెట్టవచ్చు.

PPF, ఇతర ప్రభుత్వ డిపాజిట్ పథకాలు అందించే వడ్డీ రేట్లను పోల్చి చూద్దాం.

ప్రభుత్వ డిపాజిట్ పథకాలపై వడ్డీ- 5 సంవత్సరాల ట్రెండ్

డిపాజిట్ స్కీమ్ వడ్డీ రేటు (pa)

FY 2017-18 FY 2018-19 FY 2019-20 FY 2020-21 FY 2021-22

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ 7.60-7.90 7.60-8.00 7.90-8.00 6.8 6.8

(ఏదేళ్ల మెచూరిటీ)

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ 7.60-7.90 7.60-8.00 7.90-8.00 7.1 7.1

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ 8.30-8.40 8.30-8.70 8.60-8.70 7.4 7.4

సుకన్య సమృద్ధి అకౌంట్ 8.10-8.40 8.10-8.50 8.40-8.50 7.6 7.6

EPF 8.55 8.65 8.5 8.5 8.1

ఇది 2022 మార్చి 31 నాటి డేటా. నిర్ణీత కాలంలో స్కీమ్‌ల వడ్డీ రేటు పరిధిని ఈ డేటాలో చూడవచ్చు.

పన్ను ప్రయోజనాలు

ప్రస్తుతం మార్కెట్‌లో ట్రిపుల్ ట్యాక్స్ ప్రయోజనాలు, ఎగ్జెమ్ట్, ఎగ్జెమ్ట్, ఎగ్జెమ్ట్ (EEE) స్టేటస్‌ను అందించే ఇన్వెస్ట్‌మెంట్ ప్రొడక్ట్స్ చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. వాటిలో PPF ఒకటి. EEE అంటే పెట్టుబడి పెట్టిన మొత్తం, సంపాదించిన వడ్డీ, మెచ్యూరిటీ మొత్తంపై పన్ను మినహాయింపు. ఈ పెట్టుబడి నుంచి అందే రాబడిపై ఎలాంటి ట్యాక్స్ వర్తించదు. ఎక్కువ వడ్డీ రేటు, ట్రిపుల్ ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి PPF పెట్టుబడిదారులను ఆకర్షిస్తుంటాయి.

Alzheimer’s Disease: అల్జీమర్స్ వ్యాధిని ముందుగానే గుర్తించే స్మార్ట్‌ యాప్‌.. ఆవిష్కరించిన అమెరికన్ పరిశోధకులు..


ఆర్థిక లక్ష్యాలను ట్రాక్ చేసే లాక్-ఇన్ పీరియడ్

PPF పథకానికి 15 ఏళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉంది. అయితే నిబంధనలు, షరతులకు లోబడి దీనిపై లోన్, పార్షియల్ విత్‌డ్రా ఆప్షన్ల ద్వారా నిధులు తీసుకోవచ్చు. కానీ లాక్ ఇన్ పీరియడ్ ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే పెట్టుబడిదారులకు రిటైరల్ సేవింగ్స్‌ కంటే ఎక్కువ రాబడిని అందిస్తుంది. దీంతోపాటు ప్రణాళికాబద్ధమైన ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి PPF చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణ సేవింగ్స్‌తో దీర్ఘకాలంలో ఇలాంటి లక్ష్యాలను చేరుకోవడం కష్టంగా ఉంటుంది.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు

PPF పెట్టుబడితో పాటు వచ్చే పన్ను ప్రయోజనాలను పొందుతూ, ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకుంటే.. ఇన్వెస్టర్లు లబ్ధి పొందగలరు. కానీ కేవలం పన్ను ప్రయోజనాల కోసమే పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టి కొందరు తప్పులు చేస్తుంటారు. PPF అనేది మీ ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలో ఇతర ఇన్వెస్ట్‌మెంట్ అసెట్ క్లాస్‌లతో పాటు ముఖ్యమైన భాగంగా ఉండాలి. మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి.. PPF కేటాయింపు ఆధారంగా రాబడి అంచనాలు, రిస్క్‌ తీసుకోగల సామర్థ్యంతో పాటు అవసరమైన ఇతర కీలకమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

First published:

Tags: Investments, Money savings, PPF, Saving account

ఉత్తమ కథలు