ఆర్థికపరమైన మోసాలు, మోసపూరిత ఘటనలు క్రెడిట్ స్కోర్‌పై(Credit Score) ప్రభావం చూపుతాయి. ఐడెంటిటీ థెఫ్ట్, క్రెడిట్ రిపోర్ట్‌లోని(Credit Report) లోపాలు ఒక వ్యక్తి క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తాయి. ఇలాంటి వాటిపై బ్యాంకు కస్టమర్లు అవగాహన పెంచుకోవాలి. భారతదేశంలో నాలుగు క్రెడిట్ బ్యూరోలు క్రెడిట్ రిపోర్టులను నిర్వహిస్తున్నాయి. ఏదైనా క్రెడిట్ బ్యూరో సంస్థ తప్పిదాలు, బ్యాంక్(Bank) లేదా ఆర్థిక సంస్థ నివేదికలోని పొరపాట్లు, వేరొకరి రుణాలు క్రెడిట్ రిపోర్ట్‌కు ట్యాగ్(Tag) అవడం వంటి కారణాలతో క్రెడిట్ స్కోర్ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే భవిష్యత్తులో రుణాలు పొందడం కష్టమవుతుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వసూలు చేస్తున్న వడ్డీ రేటు, లోన్ల రీపేమెంట్‌పై క్రెడిట్ స్కోర్ ఆధారపడి ఉంటుంది.
ఆస్తులపై రుణాలు పొందేందుకు అప్లై చేసినప్పుడు రుణాలకు సంబంధించిన వివరాలను, రుణ గ్రహీత క్రెడిబిలిటీని బ్యాంకులు ఆరా తీస్తాయి. గతంలో రుణాల చెల్లింపునకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే దరఖాస్తును తిరస్కరిస్తాయి. ఎక్కువ వడ్డీకి రుణం అందించే అవకాశం కూడా ఉంది.
క్రెడిట్ స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే తక్కువ వడ్డీకి రుణాలు దక్కుతాయి. ససిబిల్ స్కోర్ 700 కంటే ఎక్కువ ఉంటే.. దాదాపు 6.7 శాతం వడ్డీతో రూ.2 కోట్ల గృహ రుణాన్ని పొందవచ్చు. సిబిల్ స్కోర్ 600 కంటే తక్కువగా ఉంటే 7.5 శాతం వడ్డీ రేటుతో రుణాలు పొందే అవకాశం ఉంటుంది. రుణాలు తీసుకొని చెల్లించకపోవడమే కాకుండా క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపే అనేక ఇతర అంశాలు ఉన్నాయి. ఆర్థికపరమైనవే కాకుండా ఇతర చర్యలు కూడా ప్రభావం చూపుతాయి.
* చాలా చోట్ల లోన్ కోసం అప్లై చేయడం
డబ్బు కోసం చాలా మంది తరచుగా రుణాల కోసం అప్లై చేస్తుంటారు. ఈ ప్రవర్తన క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది. లోన్ అవసరం ఎక్కువగా ఉన్నట్లు భావిస్తారు. రుణం కోసం దరఖాస్తు చేసుకున్న క్షణంలో ఒక ఆర్థిక సంస్థ ముందుగా సంబంధిత వ్యక్తి క్రెడిట్ రిపోర్ట్‌ను తనిఖీ చేస్తుంది. ఓ వ్యక్తి క్రెడిట్ రిపోర్ట్‌ను ఎక్కువసార్లు వివిధ సంస్థలు పరిశీలించినట్లు తెలిస్తే.. ఎక్కువ సార్లు లోన్ కోసం ప్రయత్నించినట్లు తెలుస్తుంది.
* హామీ లేని రుణాలు
క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేసే మరో అంశం.. క్రెడిట్ కార్డ్ అప్పులు, పర్సనల్ లోన్లు. వీటిని అన్సెక్యూర్డ్ లోన్లుగా పేర్కొంటారు. హోంలోన్, జీవిత బీమా పాలసీలను సెక్యూర్డ్ లోన్లుగా పేర్కొంటారు. ఈ రెండింటి మధ్య నిష్పత్తిని సక్రమంగా చూసుకోవాలి.
* మొత్తం క్రెడిట్ లిమిట్ ఉపయోగించడం
క్రెడిట్ కార్డ్ లలిమిట్మమొత్తం, ఒకటి లేదా ఎక్కువ కార్డుల్లో ఓవర్‌డ్రాఫ్ట్ వినియోగం క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుంది. క్రెడిట్ వినియోగం ఎక్కువగా ఉండటం, క్రెడిట్ లిమిట్ తక్కువగా ఉండటం అసమర్థతను సూచిస్తుంది. ఒక క్రెడిట్ కార్డ్ పరిమితిలో 90 శాతాన్ని ఉపయోగించకుండా, మూడు కార్డులుంటే ఒక్కో దానిలో 30 శాతం ఉపయోగించడం మేలు. అప్పుడు క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉంటుంది.
* సెటిల్మెంట్లు
రుణాలను తిరిగి చెల్లించడంలో జాప్యం నెలకొన్నా, చెల్లించకపోయినా క్రెడిట్ స్కోర్ ప్రభావితం అవుతుంది. పూర్తిగా చెల్లించని రుణాలు క్రెడిట్ స్కోర్‌లో ఎరుపు రంగు జెండా తరహాలో కనిపిస్తాయి. మీరు డిఫాల్ట్‌కు గురయ్యే అవకాశం ఉందని భవిష్యత్ రుణదాతలకు తెలియజేస్తుంది. అలాంటి రుణగ్రహీతలు బ్యాంకులకు అక్కర్లేదు.
* హామీదారుగా సంతకం
ఎవరైనా బ్యాంకు రుణం తీసుకున్నప్పుడు రుణ హామీదారుగా ఉంటే.. ఆ వ్యక్తి సక్రమంగా లోన్లు తిరిగి చెల్లించకపోతే.. ఆ రుణ బాధ్యత హామీదారునిదే అని గుర్తించాలి.
* ఇప్పటికే ఉన్న రుణాలను త్వరగా చెల్లించాలి
క్రెడిట్ స్కోర్‌ని మెరుగుపరచడానికి.. చాలా ఎక్కువ రుణాలు ఉంటే.. ఆ జాబితాను తగ్గించుకోవాలి. ముందుగా అత్యధిక వడ్డీ రేటు చెల్లిస్తున్న రుణాలను పూర్తి చేసుకోవాలి. అప్పుడే క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉంటుంది.
* దిద్దుబాట్లలో జాప్యం
క్రెడిట్ రిపోర్టులలో ఏవైనా తప్పులు ఉంటే.. తనిఖీ చేసుకోవాలి. లోపాన్ని గుర్తించినప్పుడు బ్యాంక్‌తో మాట్లాడి వెంటనే సరిదిద్దుకోవాలి. అవి పూర్తవ్వక ముందే రుణం కోసం దరఖాస్తు చేయకూడదు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.