హోమ్ /వార్తలు /Explained /

Explained: వ్యవసాయ చట్టాల రద్దు వెనుక అసలైన కారణాలేంటి? ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో లబ్ధి కోసమే ఈ నిర్ణయమా?.. తెలుసుకోండి

Explained: వ్యవసాయ చట్టాల రద్దు వెనుక అసలైన కారణాలేంటి? ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో లబ్ధి కోసమే ఈ నిర్ణయమా?.. తెలుసుకోండి

నరేంద్ర మోదీ

నరేంద్ర మోదీ

ప్రభుత్వం సాగు చట్టాలను ఎందుకు అమలు చేయాలనుకుంది? మళ్లీ ఎందుకు ఉపసంహరించుకుంది? చట్టాలను రద్దు చేయడం వల్ల రాజకీయంగా, ఆర్థికంగా ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రైతులు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వివాదాస్పద సాగు చట్టాలను (Farm laws) ప్రధానమంత్రి మోదీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా రైతుల సంబరాలు సాగుతున్న వేళ సామాన్యులను చట్టాల గురించి కొన్ని ప్రశ్నలు వేధిస్తున్నాయి. చట్టాల రద్దు(Farm laws) పై వాడీవేడీ చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం సాగు చట్టాలను (Farm laws) ఎందుకు అమలు చేయాలనుకుంది? మళ్లీ ఎందుకు ఉపసంహరించుకుంది? చట్టాలను రద్దు చేయడం వల్ల రాజకీయంగా, ఆర్థికంగా ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Pollution Meter: మీ ఇంట్లో వాయు కాలుష్యం ఎంతుంది? వీటితో తెలుసుకోండి..జాగ్రత్తపడండి


ప్రధాని నరేంద్ర మోదీ రద్దు చేసిన చట్టాలు ఇవే..

1. రైతులు తాము పండించిన పంటను ఎలాంటి మార్కెట్, సెస్, లేవి రుసుము చెల్లించకుండా దేశంలో ఎక్కడైనా సరే విక్రయించేందుకు వీలుగా రైతు ఉత్పత్తుల వాణిజ్య వ్యాపార చట్టం,

2. పంట ధర ముందుగానే నిర్ణయించి వ్యాపార సంస్థలతో ఒప్పందం కుదుర్చుకునేందుకు వీలుగా ధరల హామీ, వ్యవసాయ సేవలపై రైతుల ఒప్పంద చట్టం,

3. నిత్యావసర సరుకుల ఎగుమతి నిల్వ పరిమితి ఆంక్షలను తొలగించేందుకు వీలుగా నిత్యావసర సరుకుల చట్టం.

పైన కనిపించే మూడు సాగు చట్టాలను ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ దేశార్థికాభివృద్ధి కోసం మూడో విడత ఆత్మ నిర్మల్ భారత్ అభియాన్ లో భాగంగా ప్రకటించారు.

Online Course: కంప్యూట‌ర్ సైన్స్ టీచింగ్ స్కిల్స్‌పై ఆన్‌లైన్ కోర్స్‌.. ఫీజు, ద‌ర‌ఖాస్తు విధానం


చట్టాలు ఎందుకు అవసరం అనిపించింది?

రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వచ్చే వ్యవసాయ మార్కెటింగ్‌లో సంస్కరణలు తీసుకురావాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. రాష్ట్రాల వ్యవసాయోత్పత్తుల మార్కెట్ కమిటీ (APMC) చట్టాలలో సంస్కరణల ఇష్యూని 2000 కాలంలోనే కేంద్రం చేపట్టింది. అప్పటి ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలోని వ్యవసాయ మంత్రిత్వ శాఖ 2003లో మోడల్ ఏపీఎంసీ చట్టాన్ని రూపొందించి, రాష్ట్రాలకు పంపిణీ చేసింది. ఆ తర్వాత వచ్చిన యూపీఏ ప్రభుత్వం కూడా ఈ సంస్కరణలకు ప్రాధాన్యమిచ్చింది. అయితే ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశం కాబట్టి, మోడల్ ఏపీఎంసీ (APMC) చట్టాన్ని రాష్ట్రాలు స్వీకరించేలా చేయడంలో కేంద్రం నామమాత్రపు విజయం కూడా సాధించలేదు. అందుకే వ్యవసాయ సంస్కరణల కోసం ప్రస్తుత ప్రభుత్వం సాగు చట్టాలకు ఆమోదముద్ర వేసింది. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో హడావుడిగా సాగు సంస్కరణలను ఆర్డినెన్స్‌లుగా ప్రకటించడం అప్పట్లో పలు అనుమానాలకు తావిచ్చింది. కార్పొరేట్ వర్గాలకు కొమ్ము కాస్తూ ప్రభుత్వం ఒక ఎజెండాతో సాగు చట్టాలు తీసుకొచ్చినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది.

ఏ పరిస్థితుల్లోచట్టాల రద్దుకు నిర్ణయం తీసుకున్నారు?

సాగు సంస్కరణలను తీసుకొచ్చి వాటిని జూన్ 2020లో ఆర్డినెన్స్‌లుగా ప్రకటించింది కేంద్రం. 2020 సెప్టెంబర్‌లో ప్రభుత్వం వాటిని బిల్లులుగా ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంటులో నిరసనలు భగ్గుమన్నాయి. బిల్లులను పార్లమెంటరీ ప్యానెల్ క్షుణ్ణంగా పరిశీలించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వం ఈ డిమాండ్లను తోసిపుచ్చి చట్టాన్ని ముందుకు తెచ్చింది. అప్పుడు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న అకాలీదళ్ ఆర్డినెన్స్‌ల గురించి పెదవి మెదపలేదు. ఆ తర్వాత చట్టంపై అసహనంతో ప్రభుత్వానికి దూరమైపోయింది. ప్రభుత్వం పార్లమెంటులో చట్టాన్ని తీసుకురాగా.. అకాలీదళ్‌ సభ్యురాలు హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. మిత్రపక్షమే కాదు ప్రతిపక్ష రాజ్యసభ మంత్రులు కూడా నిరసనలు చేయడంతో వారిని సస్పెండ్ చేశారు. అలాంటి పరిస్థితుల నడుమ పార్లమెంటులో సాగు చట్టాలకు ఆమోదం లభించింది.

రైతుల నిరసనలు ఎలా, ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి?

సెప్టెంబర్ 2020 వేసవి కాలం నుంచి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే బిల్లులను అమలు చేయాలని పట్టుబట్టిందో ఆ క్షణం నుంచి రైతుల్లో భయం మొదలైంది. ప్రైవేట్ వ్యాపారులు వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడం ప్రారంభిస్తే.. గోధుమలు, వరి, తదితర పంటలు కొనుగోలు చేసే ప్రస్తుత ఏపీఎంసీ వ్యవస్థలు మూతపడతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యాపారుల కారణంగా ఏపీఎంసీ వ్యవస్థ అనవసరంగా మారి ఆ తర్వాత కనుమరుగవుతుందని భయపడ్డారు. ఏపీఎంసీ వ్యవస్థ నిర్వీర్యంగా మారితే కనీస మద్దతు ధరల (MSP) కొనుగోళ్లకు ముగింపు కార్డు పడుతుందని ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత నవంబర్ 3 నుంచి రైతులు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే.

ప్రభుత్వం రైతుల మధ్య చర్చలు ఎలా ప్రారంభమయ్యాయి?

రైతుల నిరసనలు ప్రారంభమైన చాలా రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం చర్చల కోసం యూనియన్ లీడర్లను ఢిల్లీ రావాలని పిలుపునిచ్చింది. రైతుల ప్రతినిధులు, ప్రభుత్వం మధ్య అక్టోబర్ 2020, జనవరి 2021 వరకు మొత్తం 11 చర్చలు జరిగాయి. కానీ ఈ చర్చలన్నీ విఫలమయ్యాయి.

ఢిల్లీ, పంజాబ్‌లలో జరిగిన నిరసనలు ఇతర చోట్ల ఎలాంటి ప్రభావం చూపించాయి?

నవంబర్ 2020లో భారత రాజధానిలో నిరసనలు మొదలయ్యాయి. పంజాబ్ తరువాత హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని రైతులు కూడా చట్టాలకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేశారు. కొన్ని సందర్భాల్లో ఒడిదుడుకులు ఎదురైనా రైతులు మాత్రం సంవత్సరం పొడుగూతా నిరసనలను నిరవధికంగా కొనసాగించారు.

రద్దు ప్రకటించక ముందు మూడు చట్టాల స్టేటస్ ఏంటి?

సుప్రీం కోర్టు 3 సాగు చట్టాల అమలుపై జనవరి 12న స్టే విధించింది. మూడు వ్యవసాయ చట్టాలలో ఒకదాని ద్వారా చట్టాన్ని సవరించి, స్టాక్ పరిమితులను విధించేందుకు ప్రభుత్వం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, 1955లోని పాత నిబంధనలను ఉపయోగించింది.

చట్టాల రద్దు ఎన్నికల్లోలబ్ధి కోసమేనే?

ఇప్పటికే చట్టాల అమలుపై స్టే విధించినందున, ఈ చట్టాల నిర్వహణ విషయంలో ప్రధాని ప్రకటన ఎలాంటి ప్రభావం చూపదు. ఉత్తరప్రదేశ్, పంజాబ్‌తో సహా ఐదు రాష్ట్రాల్లో వచ్చే ఏడాదిలో జరిగే కీలకమైన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కొంత లబ్ది పొందే అవకాశం ఉంది. ఇది పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముందు ప్రభుత్వానికి కొంత ఉపశమనం కలిగిస్తుంది.

ప్రభుత్వం హఠాత్తుగా ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది?

సిక్కు కమ్యూనిటీలో వ్యతిరేకత తగ్గించాలనేది ప్రభుత్వ ఆలోచన అని చాలా మంది భావిస్తున్నారు. సిక్కు నిరసనకారులు రాబోయే ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో ఉద్రిక్తతకు దారితీసే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావించింది. పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపక్షాల కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇది రాజకీయంగా బీజేపీ, ప్రధానమంత్రిపై ఎలా ప్రభావం చూపుతుంది?

ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రైవేటీకరణ, మానిటైజేషన్ చర్యల గురించి ప్రకటించింది ప్రభుత్వం. అయితే సాగు చట్టాలు రద్దు చేయడంతో ఉద్యోగుల సంస్థలు నిరసనలు చేసే ప్రమాదం ఉంది. ఈ రద్దుతో ఎన్‌డీఏ ప్రభుత్వం తన నిర్ణయాన్ని రెండవ సారి వెనక్కి తీసుకున్నట్లయింది. 2015లో భూసేకరణ సంస్కరణలకు ఆర్డినెన్స్ జారీ చేశారు. తర్వాత తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు.

ప్రతిపక్ష పార్టీలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

రాహుల్ గాంధీ మమతా బెనర్జీ వంటి రాజకీయ నేతలు రైతుల నిరసనలకు మద్దతు తెలిపారు కానీ భాజపా సర్కార్ వారిని దుయ్యబట్టింది. అయితే రద్దు చేసిన తర్వాత ప్రతిపక్ష పార్టీలకు ఎలాంటి క్రెడిట్ దక్కదనేది విశ్లేషకుల అభిప్రాయం.

ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగానే చట్టాల రద్దు తెరమీదకు వచ్చిందా

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరాతిఘోరమైన పరాజయాల పాలవుతుందనే భయంతో సాగు చట్టాల రద్దు ప్రకటించినట్టు తెలుస్తోంది. ఎలక్షన్ల కారణంగానే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ప్రభుత్వం తీసుకున్న ఇతర నిర్ణయాలపై ప్రభావం ఉంటుందా?

నిజానికి సాగు చట్టాలను మాత్రమే కాదు ఇంతకుముందు తీసుకున్న నిర్ణయాలను కూడా మోదీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం, 2019లో అమల్లోకి వచ్చింది. కరోనా పుణ్యమాని దానికి వ్యతిరేక నిరసనలు ఆగిపోయాయి కానీ దాని అమలు ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. దాదాపు రెండేళ్లు గడిచినా, CAA అమలుకు సంబంధించిన నిబంధనలను హోం మంత్రిత్వ శాఖ ఇంకా రూపొందించలేదు.

First published:

Tags: Farm Laws

ఉత్తమ కథలు