హోమ్ /వార్తలు /Explained /

COVID Tests: కరోనా టెస్ట్​లు ఎన్ని రకాలు? అవి కచ్చితమైన ఫలితాన్ని ఇస్తాయా? పూర్తి వివరాలు

COVID Tests: కరోనా టెస్ట్​లు ఎన్ని రకాలు? అవి కచ్చితమైన ఫలితాన్ని ఇస్తాయా? పూర్తి వివరాలు

ఏపీలో ఇప్పటివరకు 19,02,923 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 18,54,754 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 35వేల 325కి తగ్గింది.

ఏపీలో ఇప్పటివరకు 19,02,923 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 18,54,754 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 35వేల 325కి తగ్గింది.

Covid test: కరోనా వైరస్​ను గుర్తించడానికి అనేక పద్ధతులు లేదా పరీక్షలు ఉన్నాయి. ఆ పరీక్షలేంటి? ఎలా చేస్తారు? ఫలితాలు ఎలా వస్తాయి? వంటి వివరాలు చూద్దాం.

యావత్ ప్రపంచాన్నీ గడగడలాడిస్తోంది కరోనా వైరస్. సెకండ్ వేవ్‌లో భారత్‌లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. నిత్యం లక్షలాది మంది ఈ వ్యాధి బారినపడుతున్నారు. వేలాది మంది మరణిస్తున్నారు. కోవిడ్-19 అనేది SARS COV 2 అనే మూల వైరస్​ వల్ల సోకే వ్యాధి. చైనాలో 2019 డిసెంబర్​లో మొదటి కరోనా కేసు నమోదైంది. కరోనా వైరస్ డిసీజ్ పేరుతో, 2019లో వెలుగుచూసిన ఈ వ్యాధికి COVID–19 అనే పేరు పెట్టారు. కరోనా ఒక RNA వైరస్. ఇది మానవ శరీరంలో వైరస్ సంక్రమణకు దోహదం చేస్తుంది. ఈ వైరస్​ను గుర్తించడానికి అనేక పద్ధతులు లేదా పరీక్షలు ఉన్నాయి. ఆ పరీక్షలేంటో తెలుసుకుందాం.

1. కరోనా వైరస్​ను గుర్తించేందుకు ఏయే పద్ధతులున్నాయి?

కరోనా వైరస్​ను గుర్తించడానికి ప్రధానంగా RTPCR, RAT (కార్డ్ టెస్ట్) అనే రెండు పద్ధతులు ఉన్నాయి.

2. ఆర్టీపీసీఆర్ అంటే ఏంటి?

RTPCR అంటే రివర్స్ ట్రాన్స్​స్క్రిప్టేస్ పాలిమరేస్ చైన్ రియాక్షన్. దీన్నే రియల్ టైమ్ పిసిఆర్ అని కూడా అంటారు. దీని ద్వారా వైరస్ ఉనికిని కచ్చితత్వంతో, చాలా తక్కువ సమయంలో గుర్తించవచ్చు. కేవలం 3-6 గంటల్లో ఫలితాన్ని రాబట్టవచ్చు. అయితే భారీ సంఖ్యలో శాంపిల్స్‌ పరిశీలిస్తే, రిపోర్టింగ్ ఆలస్యం కావచ్చు.

3. పాజిటివ్​, నెగెటివ్​ రిపోర్ట్స్ తేడా ఏమిటి?

టెస్ట్​ చేసిన శాంపిల్​లో వైరస్​ ఉంటే పాజిటివ్​ రిపోర్ట్ వస్తుంది. ఒకవేళ, శాంపిల్​లో వైరస్​ లేకపోతే నెగెటివ్​ రిపోర్ట్ వస్తుంది. కాబట్టి, RTPCR టెస్టింగ్​ రిపోర్ట్​లో వైరస్ ఉనికి ఉంటే కచ్చితంగా మీకు కరోనా సోకినట్లే భావించవచ్చు. కానీ నెగెటివ్ వచ్చినంత మాత్రాన వైరస్​ లేదని కచ్చితంగా చెప్పలేము. అందువల్ల, నెగెటివ్​ వస్తే మరోసారి RTPCR టెస్ట్​ చేయించుకోవడం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.

4. RTPCR ఎంత కచ్చితమైన రిజల్ట్​ ఇస్తుంది?

ముక్కు, గొంతు నుంచి తీసిన శాంపిల్​ను RTPCR ద్వారా టెస్ట్​ చేస్తే 85% కచ్చితమైన ఫలితం వస్తుంది. అంటే, ఒకవేళ కరోనా సోకి ఉంటే 100 శాంపిల్స్​లో 85 శాంపిల్స్​ పాజిటివ్​ రిజల్ట్​ ఇస్తాయి. మిగతా 15 శాంపిల్స్​లో కూడా వైరస్ ఉండవచ్చు కానీ RTPCR తప్పుగా చూపించే అవకాశం ఉంది. ఇటువంటి సందర్భాల్లో RTPCR పరీక్షను మరోసారి చేయడం ద్వారా వైరస్​ను సులభంగా గుర్తించవచ్చు. అందువల్ల, మొదటి RTPCR రిపోర్ట్​ నెగెటివ్​ వస్తే.. RTPCR టెస్ట్​ రెండోసారి చేయాలని డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు.

5. RTPCR ఎంత నిర్దిష్టమైనది?

ముక్కు, గొంతు నుంచి శాంపిల్​ స్వీకరించినప్పుడు RTPCR 98% కచ్చితమైన ఫలితాన్ని ఇస్తుంది. అంటే 100 శాంపిల్స్​ తీసుకుంటే అందులో కేవలం 2 శాంపిల్స్​కు​ మాత్రమే తప్పుగా పాజిటివ్​ రిపోర్ట్​ ఇచ్చే అవకాశం ఉంది. అంటే మీ శాంపిల్​లో వైరస్ లేనప్పటికీ.. వైరస్​ ఉన్నట్లు రిపోర్ట్​ ఇస్తుంది.

6. ఆర్టీపీసీఆర్ రిపోర్ట్​లో సిటి వాల్యూ అంటే ఏమిటి?

CT అంటే సైకిల్ థ్రెషోల్డ్. CT వాల్యూ వైరస్​ లోడ్​ను సూచిస్తుంది. తక్కువ Ct వాల్యూ ఉంటే వైరల్ లోడ్ ఎక్కువగా ఉందని అర్ధం చేసుకోవచ్చు.

7. ఎక్కువ సిటి వాల్యూ ఉంటే అర్థం?

CT వాల్యూకి, వ్యాధి తీవ్రతకి మధ్య ఎటువంటి సంబంధం లేదు. CT వాల్యూ కేవలం వైరల్ లోడ్ గురించి మాత్రమే చెబుతుంది. తక్కువ CT వాల్యూ ఉంటే రోగిలో ఎక్కువ వైరల్ లోడ్ ఉందని అర్ధం. CT వాల్యూ 24 కటాఫ్​ కంటే తక్కువగా ఉన్న పేషెంట్లు కరోనాను ఇతరులకు ఎక్కువగా వ్యాప్తి చేసే అవకాశం ఉంది. అదే CT వాల్యూ ఎక్కువగా ఉంటే కరోనా సంక్రమణ ప్రమాదం తక్కువ.

8. RAT టెస్ట్​ అంటే ఏంటి?

RAT అంటే రాపిడ్ యాంటిజెన్ టెస్ట్. వైరస్​ నిర్ధారణకు ఇది ప్రత్నామ్నాయ మార్గం. RTPCR టెస్ట్​ ద్వారా న్యూక్లియిక్ ఆమ్లం (RNA)ను గుర్తిస్తే.. RAT ద్వారా శాంపిల్​లోని ప్రోటీన్‌ను కనుగొనవచ్చు.

9. RTPCR కన్నా RAT టెస్ట్​తో ప్రయోజనాలేంటి?

RAT టెస్ట్​ చాలా వేగవంతంగా రిజల్ట్ ఇస్తుంది. ఇది కేవలం 15 నుంచి 30 నిమిషాల్లో ఫలితాన్ని ఇస్తుంది.

10. RAT ప్రతికూలతలు ఏంటి?

RAT టెస్ట్​ 50% కంటే తక్కువ సెన్సివిటీ కలిగి ఉంటుంది. కాబట్టి దీనితో కచ్చితంగా వైరస్​ నిర్ధారణ చేయలేం. కచ్చితమైన ఫలితం కోసం RTPCR టెస్ట్​ చేయించుకోవాలి.

11. ఈ టెస్ట్​లకు ఏ శాంపిల్ అవసరం?

a. ముక్కు, గొంతు నుండి స్వాబ్​ శాంపిల్​ అవసరం.

12. ఈ టెస్ట్​లు ఎప్పుడు చేయాలి?

కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే ఈ టెస్ట్​లు చేయాలి.

13. టెస్ట్​ ఎప్పుడు రిపీట్​ చేయాలి?

రోగి కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఎటువంటి లక్షణాలు లేకపోతే టెస్ట్​ మరోసారి చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ, కోలుకున్న తర్వాత కూడా పాజిటివ్​ వచ్చినా సరే ఆందోళన చెందాల్సిన పని లేదు.

Published by:Shiva Kumar Addula
First published:

Tags: Corona cases, Corona test, Coronavirus, Covid-19, Covid-19 test

ఉత్తమ కథలు