Home /News /explained /

WHAT ARE THE BENEFITS OF OPEN RAN TECHNOLOGY AND WHY ARE MOBILE NETWORK COMPANIES WAITING FOR THIS PRV GH

Explained: ఓపెన్‌ ఆర్‌ఏఎన్‌ టెక్నాలజీ ప్రయోజనాలు ఏంటి? మొబైల్ నెట్‌వర్క్ సంస్థలు దీనికోసం ఎందుకు ఎదురుచూస్తున్నాయి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓపెన్‌‌ ఆర్‌ఏఎన్‌తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మొబైల్‌ కమ్యూనికేషన్స్‌కు ఇది భవిష్యత్తుగా నిలవనుంది. టెలికాం (telecom) కంపెనీల నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తెచ్చే ఈ కొత్త విధానం ఆవిష్కరణ కోసం సిద్ధంగా ఉంది. ఈ టెక్నాలజీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
ఓపెన్‌‌ ఆర్‌ఏఎన్‌ (Radio access network) టెక్నాలజీకి క్వాడ్‌ దేశాలు సమ్మతి తెలపడంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని అతిపెద్ద టెలికాం, టెక్నాలజీ కంపెనీ (Technology companies)లు దాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఓపెన్‌‌ ఆర్‌ఏఎన్‌ (open RAN)తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మొబైల్‌ కమ్యూనికేషన్స్‌ (Mobile communications) కు ఇది భవిష్యత్తుగా నిలవనుంది. టెలికాం (telecom) కంపెనీల నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తెచ్చే ఈ కొత్త విధానం ఆవిష్కరణ కోసం సిద్ధంగా ఉంది. ఈ టెక్నాలజీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

* ఓపెన్‌ ఆర్‌ఏఎన్‌ అంటే ఏంటి?

ఆర్‌ఏఎన్‌ అంటే రేడియో యాక్సెస్‌ నెట్‌వర్క్‌. మొబైల్‌ నెట్‌వర్క్‌లో ఇది అత్యంత కీలకమైన తుది భాగం. సెల్‌ఫోన్ (cell phone) ఉపయోగించేటప్పుడు, మీరు పంపించే లేదా అందుకునే సమాచారం అంతా సెల్‌ఫోన్‌ టవర్‌ ద్వారా ప్యాకేజ్‌ (package) అయి వెళ్తుంది. ఇలా రాకపోకల ట్రాన్స్‌మిషన్‌కు వీలు కల్పించే హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ను ఆర్‌ఏఎన్‌ అంటారు. మొబైల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు (mobile service providers), మొబైల్‌ నెట్‌వర్క్‌ ఆపరేటర్లు (mobile network operators) ఒకలాగే ఉంటారు. కానీ ఆర్‌ఏఎన్‌ సిస్టమ్‌ తయారీదారులది విశిష్ఠమైన స్థానం.

ఆర్‌ఏఎన్‌లో ప్రాథమికంగా ఐదు ప్రముఖ సంస్థలు ఉన్నాయి. 95 శాతం కంటే ఎక్కువ మార్కెట్‌ను ఇవి నియంత్రిస్తున్నాయి. ఇందులో రెండు చైనా కంపెనీలు (china companies) – హువావే (Huawei), జడ్‌టీఈ, యూరప్‌కు చెందిన కంపెనీలు రెండు – ఎరిక్సన్‌, నోకియా కాగా, ఐదోది ఆసియాకు చెందిన దక్షిణ కొరియా సంస్థ శామ్‌సంగ్‌. ప్రముఖ కన్సెల్టెన్సీ సంస్థ డెలాయిట్‌ లెక్కల ప్రకారం హువావే, ఎరిక్సన్‌ 9, (Ericson), నోకియా.. ఈ మూడు సంస్థల నియంత్రణలోనే 80% మార్కెట్‌ ఉంది.

ఒక రహస్య యాజమాన్య పరిష్కారంగా ఒక తయారీదారు అందించే రేడియో (radio), హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ను సమీకృతం చేసే సెల్‌ సైట్స్‌ను మొబైల్‌ నెట్‌వర్క్స్‌ నెలకొల్పుతాయి. దీంతో ఆ ఆర్‌ఏఎన్‌లోని మిగిలిన భాగాలు పరస్పరం ఎలా స్పందిస్తాయన్నది రహస్యంగా ఉంటుంది. అంటే అవి ప్రామాణికంగా ఉండకపోవచ్చు లేదా ఒకే కంపెనీ నియంత్రణలో ఉండవచ్చని చెబుతోంది ఓపెన్‌‌ ఆర్‌ఏఎన్‌ పాలసీ కొలేషన్‌ (ORPC).

* ఓపెన్‌‌ ఆర్‌ఏఎన్‌తో ప్రయోజనాలేంటి?
ప్రస్తుతమున్న రహస్య ఆర్‌ఏఎన్‌తో కొన్ని దుష్ప్రజయోనాలు ఉన్నాయి. ఒకే వెండర్‌ నుంచి యాజమాన్య లేదా లైసెస్‌ సాఫ్ట్‌వేర్‌ కొనుగోలు చేయడం వల్ల అందులో మరో వెండార్‌ నుంచి ఆర్‌ఏఎన్‌ హార్డ్‌వేర్‌, మరో విక్రేత నుంచి సాఫ్ట్‌వేర్‌ (Software) కొనుగోలు చేసి ఉపయోగించే వెసులుబాటు ఉండదు. ఈ కారణంగా చాలా నెట్‌వర్క్‌ ఆపరేటర్లు ఒకే వెండార్‌ నుంచి అన్నీ కొనుగోలు చేసి తమ నెట్‌వర్క్‌లో వినియోగిస్తారు. అంతే కాదు, వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌లలో స్వల్ప మార్పు లేదా అప్‌డేట్‌ చేయాలన్నా మొత్తం హార్డ్‌వేర్‌ మరమ్మత్తు చేయాల్సి ఉంటుంది. ఇది చాలా ఖర్చు, సమయం పట్టే ప్రక్రియని అని డెలాయిట్‌ విశ్లేషిస్తోంది.

5జీ సేవలు వస్తుండటంతో..

5జీ సేవలు అందుబాటులోకి వస్తుండటంతో నెట్‌వర్క్‌ ఆపరేటర్లు తమ సేవలను అప్‌డేట్‌ (update) చేసుకోవడం లేదా పూర్తిగా కొత్త వ్యవస్థకు మారాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఓపెన్‌ ఆర్‌ఏఎన్‌ వ్యవస్థను అందిపుచ్చుకునే అవకాశం వాటికి ఇప్పుడు లభిస్తోంది. ఓఆర్‌పీసీ ప్రకారం, ఓపెన్‌‌ ఆర్‌ఏఎన్‌ సిస్టమ్స్‌ అందిపుచ్చుకోవడం ద్వారా ఒకే విక్రేతపై ఆధారపడకుండా మరింత నాజూకైన డిజైన్‌ రూపొందించుకునే పరిస్థితులు ఏర్పరుచుకోవచ్చు. దీని ద్వారా మంచి సేవలందించే సంస్థను ఎంచుకునేందుకు నెట్‌వర్క్‌ ఆపరేటర్లకు వీలు కలుగుతుంది. భారతీయ మొబైల్‌ ఫోన్‌ (Indian mobile phone users) వినియోగదారులకు అందుబాటులో ఉన్న మొబైల్‌ పోర్టింగ్‌ సేవలతో దీన్ని పోల్చవచ్చు.

ఓపెన్‌‌ ఆర్‌ఏఎన్‌ రాకతో ఖర్చులు తగ్గుతాయి. ఇప్పటి వరకు కొన్ని కంపెనీల హస్తాల్లోనే ఉన్న సాంకేతిక పరిజ్ఞానంలోకి కొత్త సంస్థలు వస్తాయి. దీంతో కొత్త ఆవిష్కణలకు వీలు కలుగుతుంది. దీని ద్వారా వర్చువల్‌ పద్ధతితో సాఫ్ట్‌వేర్‌ ఇంట్రిగేషన్‌ (software integration) వెసులుబాటు ఉంటుంది కాబట్టి నెట్‌వర్క్‌ ఆపరేటర్లు వేగంగా వాటిని అందిపుచ్చుకోగలుగుతారు.

* ఓపెన్‌ ఆర్‌ఏఎన్‌ అందిపుచ్చుకుంటున్న వేగం ఎలా ఉంది?

ఓపెన్‌ ఆర్‌ఏఎన్‌ మార్కెట్‌ (Open RAN market) ఇంకా మొగ్గదశలోనే ఉందని డెలాయిట్‌ నివేదిక సూచిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా కేవలం 35 చోట్ల మాత్రమే అది వినియోగంలోకి వచ్చింది. అది కూడా కొత్త, గ్రామీణ, అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల (markets)లో మాత్రమే. ఈ నెట్‌వర్క్‌ డిజైన్‌లో ఉన్న లాజిక్‌, క్యారియర్ అవసరాలకు తగిన వ్యూహాత్మక అనుసంధానం కారణంగా ఓపెన్‌‌ ఆర్‌ఏఎన్‌ వేగం పెరుగుతుందని ఈ నివేదిక విశ్లేషించింది.

అతి త్వరలోనే ఓపెన్‌‌ ఆర్‌ఏఎన్‌కు సంబంధించి పరిశ్రమ స్థాయిలో ఒప్పందాలు, ప్రమాణాలు, వ్యవస్థలు, నిబంధనలు రూపుదిద్దుకుంటాయనడంలో సందేహం లేదు. దీన్ని అందిపుచ్చుకున్న క్వాడ్‌ దేశాలు (Quad countries) దీని విస్తరణ, స్వీకరణపై పరిశ్రమల స్థాయి చర్చలను సమన్వయపరుస్తామని ప్రకటించాయి.
ఈ ఓ-ఆర్‌ఏఎన్‌ ఒప్పందంలో రిలయన్స్ జియో (jio), భారతీ ఎయిర్‌టెల్‌ (Airtel), వొడాఫోన్‌ (Vodafone) భాగమని నివేదికలు సూచిస్తున్నాయి. భారత్‌కు చెందిన ఇతర మొబైల్‌ ఫోన్ సర్వీస్‌ ప్రొవైడర్లు కూడా ఓపెన్‌‌ ఆర్‌ఏఎన్‌ వ్యవస్థ ద్వారా 5జీ నెట్‌వర్క్‌ సేవలందించేందుకు కృషి చేస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వపు మేక్‌ ఇన్ ఇండియా (make in india)కు కూడా ఈ ఓపెన్‌‌ ఆర్‌ఏఎన్‌ సరిపోతుంది. ఈ సంవత్సరం మే నెలలో టెలికాం రంగానికి ప్రకటించిన పనితీరు ఆధారిత రాయితీ పథకంలో కోర్‌ ట్రాన్స్‌మిషన్ పరికరాలు, 4జీ/5జీ, నెక్స్ట్ జనరేషన్ రేడియో యాక్సెస్‌ నెట్‌వర్క్‌, వైర్‌లెస్‌ ఈక్విప్‌మెంట్‌ వంటివి ఉన్నాయి.

* ఇందులో చైనా కోణమేంటి?
దేశభద్రతకు ఆమోదయోగ్యం కాని విక్రేత నుంచి పొంది ఇప్పటికే ఇన్‌స్టాల్‌ చేసిన 5జీ వ్యవస్థను నిషేధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. హూవావేకు చెందిన ఎక్విప్‌మెంట్‌ ఉపయోగంపై అమెరికా ఇలాగే కొరడా ఝుళిపించింది. విశ్వసనీయ విక్రేతల నుంచి పొందిన ఎక్విప్‌మెంట్‌ను మాత్రమే దేశంలోని నెట్‌వర్క్‌ ఆపరేటర్లు (network operators) ఉపయోగించాలని భారత్‌ చెబుతోంది. దీనికి కారణం హువావే సంస్థ చైనా (china) నియంత్రణలో ఉండటం. ఆ పరికరాలు నిఘాకు తోడ్పడుతున్నాయనే అనుమానాలు ఉన్నాయి.

మరో వైపు 5జీ ఆవిర్భావిస్తున్న వేళ ప్రపంచంలోని రెండు ప్రముఖ ఆర్థిక వ్యవస్థల మధ్య యుద్ధం (war) రాజుకుంటోంది. చైనాకు చెందిన హువావే సంస్థ సాంకేతిక పరిజ్ఞానాన్ని దొంగిలించిందని అమెరికా ఆరోపిస్తోంది. మరో వైపు 5జీ సాంకేతిక పరిజ్ఞానంలో చైనా దూసుకుపోతోంది. 5జీకి సంబంధించిన పేటెంట్లలో సింహ భాగం అంటే మొత్తం 5జీ పేటెంట్లలో ఐదో వంతు చైనాకు చెందిన హువే, జడ్‌టీవీవే ఉన్నాయి.

అమెరికా (America)లో ఇటీవల జరిగిన క్వాడ్‌ సమావేశంలో టెలికమ్యూనికేషన్స్ నెట్‌వర్క్స్‌ భద్రత (security), వైవిధ్యం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చాయి. సురక్షితమైన, పారదర్శకమైన 5జీ, 5జీ నెట్‌వర్క్‌ తర్వాత కూడా మెరుగుదల కోసం పారిశ్రామిక సంస్థలతో సమన్వయం చేసుకుంటామని క్వాడ్‌ దేశ నాయకులు తెలిపారు. విశ్వసనీయ విక్రేతలు, ఓపెన్‌‌ ఆర్‌ఏఎన్‌ వంటి విధానాలకు ప్రోత్సహం, సృజనాత్మకతకు చేయూత వంటి వాటిని పరిశీలిస్తామని క్వాడ్‌ ఉమ్మడి ప్రకటన విడుదల చేసింది.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: 5G, BUSINESS NEWS, Information Technology, Latest Technology, Mobile App, Mobile News, Telecom

తదుపరి వార్తలు