గ్లోబల్ వార్మింగ్(Global Warming)కు కారణమయ్యే అవకాశం ఉన్న బొగ్గు, చమురు, గ్యాస్ ప్రాజెక్టులను గుర్తించడానికి, కార్బన్ బాంబు(Carbon Bombs)లను నిర్వీర్యం చేయడానికి కొందరు పర్యావరణవేత్తలు(Environmentalists), న్యాయవాదులు, ఉద్యమకారులు ఒక్కటయ్యారు. ఈ సంవత్సరం మే(May) నెలలో ది గార్డియన్ సంస్థ చేసిన పరిశోధనాత్మక ప్రాజెక్ట్(Project) తర్వాత కార్బన్ బాంబులు(Carbon Bombs) అనే పదం ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 195 ప్రైవేట్ కంపెనీలు 'కార్బన్ బాంబ్' ప్రాజెక్ట్‌లు చేపడుతున్నట్లు ప్రాజెక్ట్ (Project) పేర్కొంది. వాటి నుంచి వాతావరణంలోకి భారీ మొత్తంలో CO2 ఉద్గారాలు విడుదలవుతున్నట్లు భావిస్తున్నారు.
కార్బన్ బాంబులు అంటే ఏంటి?
ది గార్డియన్ తన నివేదికలో.. కార్బన్ బాంబుల గురించి వివరిస్తూ ఒక చమురు లేదా గ్యాస్ ప్రాజెక్ట్ దాని జీవిత కాలంలో కనీసం ఒక బిలియన్ టన్నుల CO2 ఉద్గారాలకు విడుదల చేస్తుందని చెప్పింది. బొగ్గు, చమురు లేదా గ్యాస్ వెలికితీసినప్పుడల్లా అది కాలుష్యం, పర్యావరణ క్షీణతకు దారితీస్తుందని, ఇంధనాన్ని మండించినప్పుడు కార్బన్ ఉద్గారాలు పెద్ద మొత్తంలో విడుదలవుతాయని పేర్కొంది.
మొత్తంగా యూఎస్, రష్యా, పశ్చిమాసియా, ఆస్ట్రేలియా, భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి 195 ప్రాజెక్టులను గుర్తించింది.
నివేదిక ప్రకారం.. ఆయా కంపెనీలు 2015 పారిస్ ఒప్పందంలో అంగీకరించిన ఉద్గారాల పరిమితిని సమిష్టిగా అధిగమిస్తారు. 19వ శతాబ్దపు మధ్యకాలంలో పరిశ్రమల కోసం విస్తృతంగా ఉపయోగించిన బొగ్గు కారణంగా పారిశ్రామిక పూర్వ స్థాయిలతో పోలిస్తే ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెంటిగ్రేడ్లు పెరిగింది. ఒప్పందం ప్రకారం 1.5 డిగ్రీలకు తగ్గించాలి. సగటు ప్రపంచ ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి.
పరిశోధన ఏం చెబుతోంది?
పరిశోధన ప్రకారం.. ఈ కార్బన్ బాంబు ప్రాజెక్టులలో 60 శాతం కంటే ఎక్కువ ఇప్పటికే జరుగుతున్నాయి. బొగ్గు, చమురు, గ్యాస్ కార్యకలాపాలతో పాటు, మీథేన్ ముప్పును ప్రత్యేకంగా పేర్కొంది. మీథేన్ సాధారణంగా గ్యాస్ కార్యకలాపాల నుంచి విడుదల అవుతుంది. ఇది పవర్ఫుల్ గ్రీన్హౌస్ వాయువు, 20 సంవత్సరాలలో CO2 కంటే 86 రెట్లు ఎక్కువ వేడిని సృష్టిస్తుంది. ఈ కార్యకలాపాలను నిర్వహిస్తున్న కంపెనీలను నివేదికలో తప్పుబట్టారు. ప్రత్యేకించి రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం, సరఫరా తగ్గడం, ఇంధన డిమాండ్‌లో పెరుగుదలతో ముప్పు మరింత పెరిగిందని సూచిస్తోంది. రష్యా చమురును పాశ్చాత్య దేశాలు నిషేధించినందున, చమురు, గ్యాస్ ఉత్పత్తి చేసే కంపెనీల ప్రయోజనం కోసం ధరలు పెరిగాయి.
హరిత ఇంధన వనరులను ఉపయోగించకపోవడాన్ని నివేదిక విమర్శించింది. ఎక్సాన్‌మొబిల్, టోటల్, చెవ్రాన్, షెల్, బిపి (బ్రిటీష్ పెట్రోలియం) వంటి ఎనర్జీ కంపెనీలు బొగ్గు బాంబు ప్రాజెక్టులు చేపడుతుందని పేర్కొంది. 2050 నాటికి గ్లోబల్ కార్బన్ ఉద్గారాలను వీలైనంత తగ్గించడానికి, నెట్ జీరో ఎమిషన్స్ సాధించడానికి రోడ్ మ్యాప్‌ను రూపొందించిన అంతర్జాతీయ సంస్థ అయిన ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీకి నివేదిక సూచనలు చేసింది. నెట్ జీరో ఎమిషన్స్ అంటే అటవీ విస్తీర్ణాన్ని పెంచడం, మానవ నిర్మిత ఉద్గారాలను తగ్గించడం వంటి పద్ధతుల ద్వారా వాతావరణంలోకి విడుదలయ్యే కార్భన్ ఉద్గారాలను తగ్గించాలి.
కార్బన్ బాంబులను ‘నిర్వీర్యం’ చేయడానికి ప్లాన్ ఏంటి?
ఈ లక్ష్యం కోసం పనిచేస్తున్న నెట్‌వర్క్‌ను లీవ్ ఇట్ ఇన్ గ్రౌండ్ ఇనిషియేటివ్(లింగో) అంటారు. దాని లక్ష్యం "శిలాజ ఇంధనాలను భూమిలో వదిలివేయడం, అవి లేకుండా జీవించడం నేర్చుకోవడం. వాతావరణ మార్పులకు మూలం శిలాజ ఇంధనాలను మండించడమేనని, 100 శాతం పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం దీనికి పరిష్కారమని సూచిస్తున్నారు. ప్రపంచం నలుమూలల చేపడుతున్న కార్బన్ బాంబు ప్రాజెక్టులను ది గార్డియన్ తన వెబ్సైట్లో పేర్కొంది. ఇందులో అదానీ గ్రూప్‌కు చెందిన కార్మైకేల్ కోల్ ప్రాజెక్ట్, కోల్ ఇండియా యాజమాన్యంలోని ఛత్తీస్‌గఢ్‌లోని గెవ్రా కోల్ మైన్స్, తూర్పు జార్ఖండ్‌లోని రాజ్‌మహల్ కోల్ మైన్స్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Carbon death, Environment, Explained, Pollution, World environmental day