Home /News /explained /

WE ARE ALL FORGET GREAT TELUGU FREEDOM FIGHTER PUDIPEDDI SUNDARA RAMAIAH TODAY HIS VARDHANTHI NGS

Freedom Fighter: స్వాతంత్ర్య పోరాటంలో తెలుగు వీరులు ఎందరో.. దేవుడు బాబు గురించి ఎప్పుడైనా విన్నారా..?

తెలుగు వీరుడు దేవుడు బాబు

తెలుగు వీరుడు దేవుడు బాబు

Telugu Freedom Fighter: ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు.. కానీ అలాంటి మహానీయుల్లో చాలమంది నేటి యువతకు గుర్తు ఉండరు.. చరిత్ర ఎప్పుడో వారిని కనుమరుగయ్యేలా చేసింది. ముఖ్యంగా భారత స్వతంత్య్ర సమరంలో తెలుగు వీరులు చాలామందే ఉన్నారు. అందులో దేవుడు బాబు ఒకరు.. అయితే ఆయన గురంచి నేటి తరానికి పెద్దగా తెలియకపోవడం శోచనీయం.

ఇంకా చదవండి ...
  Telugu Freedom Fighter: ఎందరో వీరుల త్యాగఫలం మనం నేడు అనుభవిస్తున్న స్వాతంత్య్రం.. ఎందరో మహాను భావులు.. అందులో మన తెలుగువారు (Telugu Freedom Fighter) కూడా ఉన్నారు. అయితే చరిత్ర (History) అందులో కొందరిని మాత్రమే గుర్తుంచుకుంది. అంటే తెలుగు వీరుల్లో అతి కొద్ది మంది మాత్రమే నేటి జనరేషన్ కు తెలుసు.. విప్లవం నా జన్మహక్కు" అని తెలుగు గడ్డపై గర్జించిన వీరుడు అల్లూరి సీతారామరాజు (Alluri sita rama raju).... భారత దేశంలో బ్రిటిష్ దుర్మార్గాలను వ్యతిరేకిస్తూ...మన్యం ప్రాంతంలోని గిరిజనులను చైతన్య పరచి సమీపంలోని అన్ని పోలీసుస్టేషన్లపై దాడులు చేసి, రెండు సంవత్సరాలపాటు బ్రిటిషు వారిని ముప్పుతిప్పలు పెట్టి చివరికి స్వరాజ్యం కోరకు అమరుడయ్యాడు. స్వాంతంత్య్ర పోరాటంలో్ తెలుగు వీరుడు అంటే అందరికి గుర్తుండే పేరు అల్లూరి.. ఇక ఏ జాతికైనా తన ఉనికిని చాటడానికి ఒక పతాకం కావాలి. అలాంటి పతాకాన్ని మన భారత జాతికి అందించిన మహనీయుడు పింగళి వెంకయ్య (pingali venkayya). ఆయన మన తెలుగువాడు కావడం తెలుగు జాతి అదృష్టం. ఈ ఇద్దరి గురించి తెలియని నేటి జనరేషన్ ఉండదు. అలాగే 1857 నాటి మొదటి భారత స్వాతంత్ర యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు, ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి (uyyalawada narasimha reddy). సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు.. అయితే చరిత్ర పుస్తకాలు పెద్దగా ఈ మహాను భావుడి గురించి చెప్పకపోయినా.. ఇటీవల చిరంజీవి నటించిన (సైరా నరసింహా రెడ్డి)  ఉయ్యలవాడ సినిమాతో ఆయన చరిత్ర కూడా అందరికీ తెలిసింది. అయితే ఇంకా తెలియని వీరులు ఎందరో ఉన్నారు. అందులో విశాఖపట్నం జిల్లా (Visakhpatnam District)కు చెందిన దేవుడు బాబు ఒకరు. అసలు ఈ పేరు ఎప్పుడు ఎక్కడా విని ఉండరేమో నేటి యువత. అంతెందుకు ఆయన జన్మించిన విశాఖ వాసులకే పెద్దగా ఆయన ఎవరో తెలియకపోవచ్చు.. అయితే ఇవాళ ఆయన వర్ధంతి ఈ సందర్భంగా ఈ దేవుడు బాబు ఎవరు..? ఆయన గొప్పతనం ఏంటో తెలుసుకుందాం..

  మహాత్మాగాంధీ పిలుపు మేరకు ఉప్పు సత్యాగ్రహం, విదేశీ హటావో, ఖాదీ ఉద్యమం తదితర ఉద్యమాల్లో చాలా చురుకుగా పాల్గొని, జైలుకి వెళ్లి, లాఠీ దెబ్బలు కూడా తిన్న ఎంతోమంది స్వాతంత్య్ర సమరయోధులు చరిత్రలో కనుమరుగయ్యారు. అలాంటి వారిలో పూడిపెద్ది సుందరరామయ్య ఒకరు. ఆయన 12–8–1912న విశాఖపట్నంలో జన్మిం చారు. 1982 సెప్టెంబర్‌ 23న, తన 70వ ఏట కన్నుమూశారు.

  ఇదీ చదవండి: స్కూల్స్ లో కరోనా భయం.. థర్డ్ వేవ్ సంకేతాలేనా..?

  1929లో గాంధీగారి పిలుపుమేరకు, న్యాయశాస్త్రంలో పట్టా కోసం జరిగే పరీక్షలను సైతం వదులుకుని, అతి పిన్న వయసులోనే, అనగా తన 17వ ఏటనే, స్వాతంత్య్రం కోసం పోరాడిన యువకుడుగా గుర్తింపు పొందారు. మొదట హార్బర్‌లో టైం ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చినప్పుడు, బ్రిటిష్‌ వాళ్ళు తయారు చేసిన గడియారం పెట్టుకుని పని చేయాలని, ఒక బ్రిటిష్‌ అధికారి చెప్పడంతో, అది నచ్చక తొలి రోజే రాజీనామా చేసేశారు.

  ఇదీ చదవండి: జగన్ సార్కార్ కు మరో షాక్.. లక్ష జరిమానా..? ఎందుకో తెలుసా..?

  ఆయన చేసిన పలు సేవా కార్యక్రమాలు
  పేదవారైన స్వాతంత్య్ర సమరయోధులను జైలులో పెట్టినప్పుడు కుల, మతాలకు అతీతంగా, వారివారి కుటుంబ సభ్యులందరికీ, మూడుపూటలా, ఇంట్లో వండించి క్యారేజీలు పంపించేవారు, మందులు, బట్టలు, డబ్బు కూడా పంపించేవారు. గర్భిణీ స్త్రీలకి నొప్పులొస్తే, తన కారు, డ్రైవర్‌ని ఇచ్చి, వాళ్ళని హాస్పిటల్‌లో దింపించేవారు. స్టోన్‌ హౌస్‌ అనే ఇల్లు కట్టించి, అందులో, 105 మంది పేద పిల్లలకి పెళ్లిళ్లు చేయించారని చెబుతుం టారు.

  ఇదీ చదవండి: ఆంధ్రప్రదేశ్ లో వింత ఆచారం.. ఇలా పెళ్లి చేస్తే పంటలు బాగా పండుతాయంట..?

  ఎలాంటి స్వార్థం లేకుండా, తన ఇంటి పక్క ఖాళీ స్థలం, ఉచితంగా పేదవారికి ఇచ్చారు, నూకరాజు కార్ల రిపేర్‌ షెడ్, దేవుడమ్మ టీ దుకాణం పెట్టుకుని ఇలాగే జీవనోపాధిని పొందారు. విశాఖలో పూడిపెద్ది సుందరరామయ్యను దేవుడు బాబు అని పిలిచేవారు. ఈ రోజు ఆయన వర్ధంతి.. ఈ సందర్భంగా ఇలాంటి వీరుడు గురించి అందరికీ తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Independence Day 2021, Visakhapatnam, Vizag

  తదుపరి వార్తలు