హోమ్ /వార్తలు /Explained /

Water War: తెలుగు రాష్ట్రాల మధ్య జల యుద్ధం.. కొనసాగుతోన్న లెటర్ వార్.. వివాదం ఎందుకంటే?

Water War: తెలుగు రాష్ట్రాల మధ్య జల యుద్ధం.. కొనసాగుతోన్న లెటర్ వార్.. వివాదం ఎందుకంటే?

కేసీఆర్, జగన్(ఫైల్ ఫోటోలు)

కేసీఆర్, జగన్(ఫైల్ ఫోటోలు)

Water disputes: తెలుగు రాష్ట్రాల మధ్య జల యుద్ధానికి ముగింపు లేదా..? అసలు ఎందుకు రెండు రాష్ట్రాలు వెనక్కు తగ్గడం లేదు.. ఇందులో ఎవరి వాదన నిజం.. అసలు ఈ వివాదాని ప్రధాన కారణం ఏంటి..?

తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ కు ఇప్పట్లో ఎండ్ కార్డ్ పడేలా లేదు. లేఖల యుద్ధం కొనసాగుతూనే ఉంది.  ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) రెండూ రాష్ట్రాలు మరొకరి తీరును తప్పు పడుతూ లేఖాస్త్రాలు సంధించుకుంటున్నాయి. కేఆర్ఎంబీ (KRM), జీఆర్ఎంబీ (GRMB)కి వరుస లేఖలు రాస్తూ వాటర్ వార్ ను కొనసాగిస్తున్నాయి. కేఆర్ఎంబీ (Krishna River Management Board), జీఆర్ఎంబీ (godavari river management board) కి వరుస లేఖలు రాస్తూ వాటర్ వార్ హీట్ ను పెంచుతున్నాయి. కృష్ణా జలాలను చెరి సగం పంచాలంటూ తెలంగాణ రాసిన లేఖకు ఏపీ ప్రభుత్వం కౌంటరిచ్చింది. రెండో ట్రైబ్యునల్ ఆదేశాల ప్రకారమే నీటి పంపకాలు జరగాలని డిమాండ్ చేసింది. 2021-22కి 70-30శాతం లెక్కన కృష్ణా జలాలు (krishna water) కేటాయించాలని కేఆర్ఎంబీని కోరింది. కృష్ణా జలాలను 50-50శాతం కింద కేటాయించాలంటూ తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖపై ఏపీ అభిప్రాయం కోరింది కేఆర్ఎంబీ. తెలంగాణ డిమాండ్ పై అభ్యంతరం తెలిపిన ఏపీ సర్కార్.. 70-30 నిష్పత్తిలోనే కేటాయింపులు చేయాలని డిమాండ్ చేసింది. ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి వాటాలు ప్రాజెక్టుల వారీగా జరగలేదని కేఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్లింది ఆంధ్రప్రదేశ్. కేవలం.. చెన్నై, హైదరాబాద్ తాగునీటి విషయంలో మాత్రమే కొన్ని నిబంధనలు ఉన్నాయన్న ఏపీ సర్కార్ మిగతాదంతా పాత పద్ధతిలోనే కొనసాగించాలని కోరింది. తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న50-50 నిష్పత్తిలో కృష్ణా జలాలను పంపిణీ చేయాలన్న డిమాండ్ సరైంది కాదని అభిప్రాయపడింది ఏపీ. శ్రీశైలం (srisailam) నుంచి చెన్నై(chennai)కు… సాగర్ నుంచి హైదరాబాద్ (hyderabad) కు తాగునీటి కోసం మాత్రమే నీళ్లను తీసుకునేందుకు వెసులుబాటు ఉందని ఏపీ చెబుతోంది. ప్రస్తుతం, రాష్ట్రానికి 1059 టీఎంసీల నీటి అవసరం ఉందని కేఆర్ఎంబీకి లేఖ రాసింది ఆంధ్రప్రదేశ్. కృష్ణా జలాల్లో ఏపీ వాటా నుంచి ఆ నీటిని వెంటనే కేటాయించాలని కోరింది.

ఇటు కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం తప్పు పట్టింది. ఈ విషయంపై కేఆర్ఎంబీకి ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ లేఖ రాసింది. కృష్ణా ట్రిబ్యునల్ గతంలోనే రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు జరిపిందని ఏపీ ప్రభుత్వం లేఖలో పేర్కొంది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపుల పైన ఇంకా ట్రిబ్యునల్ దగ్గర విచారణ జరుగుతోందని తెలిపింది. ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రతిపాదించిన 50:50 ఫార్ములా సమంజసం కాదని పేర్కొంది. వాస్తవానికి ఏపీకి 70 శాతం తెలంగాణకి 30శాతం కేటాయింపులు జరపాల్సి ఉందని, ఈ ఏడాది నీటి కేటాయింపులు ఈ ప్రాతిపదికనే చేపట్టాలని సూచించింది. అప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం నీటి వినియోగం చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కేఆర్‌ఎంబీని కోరింది.

అసలు ఎందుకీ వివాదం..

భారతదేశంలోని పెద్ద నదుల్లో కృష్ణ నాలుగోది. మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో ప్రవహిస్తోన్న ఈ నది పొడవులో గంగ బ్రహ్మపుత్ర గోదావరుల తరువాతి స్థానంలో ఉంటుంది. దాదాపు 1300 కిలోమీటర్లు ప్రవహించే ఈ నది మహారాష్ట్ర నుంచి కర్ణాటక అక్కడి నుంచి తెలంగాణ ఆ తరువాత ఆంధ్రాలోకి వస్తుంది. సుమారు 90 కిలోమీటర్ల దూరం తెలంగాణలో ప్రవహించి ఆ తరువాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల సరిహద్దుగా ఉంటుంది. నదికి ఒకవైపు తెలంగాణ మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉంటాయి. అలంపురం నుంచి ముక్త్యాల వరకు ఈ నది రెండు రాష్ట్రాలకు సరిహద్దు. ఆ తరువాత పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి పంపకాల వివాదాలు ఉండేవి. ఒకే రాష్ట్రంలో ఉన్నప్పటికీ తెలంగాణ ఆంధ్ర మధ్య కూడా కృష్ణా నీటి విషయంలో వివాదం ఉంది. కృష్ణానదిపై శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్టులు తెలంగాణ ఆంధ్రాలకు ఉమ్మడిగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకు కుడివైపున ఏపీ ఉండగా ఎడమవైపున తెలంగాణ ఉంది. వీటికి ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు తెలంగాణ భూభాగంలో ఉండగా దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజీ ఏపీ భూభాగంలో ఉంది. ఇవి కాక అనేక లిఫ్టు పథకాలు ఉన్నాయి. రెండు రాష్ట్రాల అవసరాలను ఈ ప్రాజెక్టులు తీరుస్తున్నాయి.

2014లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయాయి. బేసిన్ల లెక్కల ప్రకారం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా బేసిన్ 68శాతం ఉండగా నీటి వాటా 37 శాతం వచ్చింది. ఇక ఆంధ్రలో కృష్ణా బేసిన్ 32శాతం ఉండగా నీటి వాటా 64 శాతం వచ్చింది. ఉమ్మడి రాష్ట్రానికి ముందు నుంచి ఉన్న 811 టీఎంసీల నీటిని రెండు రాష్ట్రాలు పంచుకున్నాయి. ఏపీకి 512 టీఎంసీలు తెలంగాణకు 299 టీఎంసీలు అనుకున్నారు. ఇది తాత్కాలిక సర్దుబాటు మాత్రమే. ఆంధ్రాకు వచ్చిన దాంట్లో తిరిగి కోస్తాకు 367 టీఎంసీలు సీమకు 145 టీఎంసీలు అనుకున్నారు. ఇది కేవలం ఒప్పందం మాత్రమే. తీర్పు కాదు. నిజానికి కృష్ణా బేసిన్ తక్కువ ఉన్నప్పటికీ ఆంధ్రాకు ఎక్కువ నీటి కేటాయింపు రావడానికి ముందు చెప్పుకున్నట్టు కృష్ణా డెల్టా తన హక్కు ఉపయోగించడం దిగువన ఉండడం వంటివి కారణాలు.. సహజ జల సూత్రాల్లో బేసిన్ నిబంధన ప్రామాణికంగా తీసుకుంటే తెలంగాణకు మొదటి వినియోగదారు నిబంధన ప్రామాణికంగా తీసుకుంటే ప్రత్యక్షంగా కోస్తా పరోక్షంగా రాయలసీమకు మేలు. కాబట్టి బేసిన్ రూల్ కోసం తెలంగాణ ఫస్ట్ యూజర్ రూల్ కోసం ఆంధ్రప్రదేశ్ పట్టుబడుతుంటాయి.

First published:

Tags: Andhra Pradesh, Hyderabad, Krishna water, Telangana, Water dispute

ఉత్తమ కథలు