• HOME
  • »
  • NEWS
  • »
  • EXPLAINED
  • »
  • WATER CONSERVATION WHY CLIMATE FINANCING SHOULD BE FOCUSED ON ADDRESSING WATER CRISIS GH SRD

Water Conservation: పర్యావరణ నిధులు నీటి సంక్షోభాన్ని ఆపగలిగాయా?

Water Conservation: పర్యావరణ నిధులు నీటి సంక్షోభాన్ని ఆపగలిగాయా?

ప్రతీకాత్మక చిత్రం

Water Conservation: ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటోన్న సమస్యల్లో ప్రధానమైంది నీటి ఎద్దడి. తగినన్ని నీటి వనరులు లేకపోవడం, వాతావరణ మార్పులు లాంటి కారణాల వల్ల విశ్వవ్యాప్తంగా ఎంతో మంది తమ స్థావరాలను వదిలి వలస వెళ్తున్నారు.

  • Last Updated:
  • Share this:
ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటోన్న సమస్యల్లో ప్రధానమైంది నీటి ఎద్దడి. తగినన్ని నీటి వనరులు లేకపోవడం, వాతావరణ మార్పులు లాంటి కారణాల వల్ల విశ్వవ్యాప్తంగా ఎంతో మంది తమ స్థావరాలను వదిలి వలస వెళ్తున్నారు. ఇటీవలే అంతర్జాతీయ సంస్థ వాటర్ ఎయిడ్ ప్రచురించిన రిపోర్టు ప్రకారం 2030 కల్లా నీటి సంక్షోభంతో శుష్క, అర్ధ శుష్క ప్రాంతాల్లో నివసించే ప్రజల్లో దాదాపు 24 మిలియన్ల నుంచి 700 మిలియన్ల మంది వలస వెళ్తారని పేర్కొంది. 2050 కల్లా ఈ సంఖ్య 5 బిలియన్లు(500 కోట్లు)కు చేరుకుంటుందని స్పష్టం చేసింది. "టర్న్ ద టైడ్: ద స్టేట్ ఆఫ్ వరల్డ్స్ వాటర్ 2021" అనే శీర్షికతో రాసిన ఈ జర్నల్ ప్రకారం ప్రస్తుతం 4 బిలియన్ల మంది నీటి సంక్షోభంతో ఉండే ప్రాంతాల్లో నివసిస్తున్నారని పేర్కొంది.

ప్రకృతి వైపరీత్యాలు నీటి సంక్షోభంతోనే ఎక్కువ..
ఊహించలేని విధంగా పర్యావరణ మార్పులు సంభవిస్తున్నాస్తున్నాయని, వర్షపాత స్థాయిని అంచనా వేయలేకపోతున్నారని ఈ నివేదిక తెలిపింది. 2001 నుంచి 2018 మధ్య సంభవించిన ప్రకృతి విపత్తుల్లో 74 శాతం నీటికి సంబంధించినవేనని నిప్పులాంటి నిజాన్ని నిగ్గు తేల్చింది. ఊహించని విధంగా ఏర్పడుతున్న ఈ నీటి అనిశ్చితి నానాటికి పెరుగుతోందని, సమగ్రమైన నీటి నిర్వహణ ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేసింది.

వైద్య సదుపాయాలు అందడంలేదు..
ప్రస్తుతం ప్రపంచమంతా కోవిడ్ తో పోరాడుతున్న తరుణంలో ప్రాథమిక వైద్యసదుపాయలు అవసరమైన చాలా ప్రదేశాల్లో నీటి సంక్షోభం తీవ్రంగా ఉంది. ఇది ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుంది. నీటి సంక్షోభం కారణంగా చాలా హెల్త్ కేర్ సెంటర్లలో వైద్య సంక్షోభం తలెత్తుతుందని నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నాలుగు హెల్త్ కేర్ కేంద్రాల్లో ఒకదాంట్లో నీటి తాకిడి ఉందని, ఫలితంగా 2 బిలియన్ల జీవితాలను ప్రభావితం చేస్తోందని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం తక్కువ అభివృద్ధి చెందిన 46 దేశాల్లో ప్రతి రెండూ హెల్త్ కేర్ సెంటర్లలో ఒకదాంట్లో నీటి ఎద్దడి ఉంది. కనీసం అక్కడ తాగునీరు అందట్లేదు. ఫలితంగా ప్రాథమిక ఆరోగ్య కార్యకర్తలపై ఈ నీటి ప్రభావం పడడటమే కాకుండా వారి ఆరోగ్యం ప్రమాదంలో పడవేస్తుంది. అంతేకాకుండా వారి విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. రోగులకు చికిత్స చేయకుండా నీటి సమస్య వారిని నిరోధిస్తుంది.

పర్యావరణ నిధులు..
ఈ నీటి సంక్షోభాన్ని నివారించడానికి అత్యవసరంగా పర్యావరణ నిధులపై(Climate Finance) దృష్టిసారించాల్సిన ఆవశ్యకత ఉంది. వాటర్ ఎయిడ్ రిపోర్టు ప్రకారం వాతావరణ మార్పులు ప్రతి ఒక్కరిపై గణనీయంగా పడుతుంది. కోట్ల మందికి అధికారిక మార్గాల ద్వారా నీటి వనరులు అందక సమాజంలో అట్టడుగుకు దిగజారుతున్నారు. వాతావరణం సంక్షోభం ఎదుర్కొంటున్న దేశాల్లో పేద, తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు ఈ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. వాటర్ ఎయిడ్ రిపోర్టు ప్రకారం.. ప్రభుత్వ, ప్రైవేటు వనరుల ద్వారా ఈ దేశాలకు సహాయం చేయాలని 2009లోనే ధనిక దేశాలు తీర్మానించాయి. 2020 కల్లా 100 బిలియన్ల డాలర్లను పర్యావరణ నిధులుగా ఇవ్వాలని ప్రతిపాదించాయి. అయితే 2018నాటి కేవలం 78 బిలియన్ డాలర్లు మాత్రమే అభివృద్ధి చెందుతున్న దేశాలకు చేరాయి. దీన్ని బట్టి చూస్తే వాతావరణ మార్పులపై ప్రపంచ వ్యాప్తంగా కేవలం 5 శాతం నిధులను మాత్రమే ఖర్చు చేశాయి. ఈ 5 శాతం మొత్తంగా కూడా టార్గెట్ దేశాలన్నింటికీ వెళ్లలేదు. చాలా కొద్ది నిధులను కేటాయించిన కారణంగా వాతావరణ మార్పుల వల్ల బిలియన్ల మంది ప్రాణాలు ప్రమాదంలో పడనున్నాయి.

ఒక్కో వ్యక్తికి ఒక్కో డాలరు మాత్రమే..
వాతావరణానికి హాని కలిగించే దేశాలు నీటి పెట్టుబడిలో కేవలం ఏడాదిలో ఒక్కో వ్యక్తికి ఒక్క డాలరు మాత్రమే అందుకుంటున్నాయని, ఈ అసమతుల్యతకు తగిన పరిష్కారాలను కనుగొనాలని వాటర్ ఎయిడ్ ఇండియా ఛీఫ్ ఎగ్జిక్యూటీవ్ వీకే మాధవన్ చెప్పారు. వాతావరణ మార్పులు వల్ల పేదరికంలో ఉండే ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించడమైనేది అత్యంత దయనీయంగా మారిందని, వారికి చాలా అన్యాయం చేసినట్లే అవుతుందని ఆయన అన్నారు. ఈ సంక్షోభంలో అత్యంత తక్కువ వాటా కలిగిన పేద ప్రజలు.. అత్యధికంగా ప్రభావితం చెందుతున్నారని తెలిపారు. సురక్షితమైన నీటి వనరులు లభించకపోతే వారి ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా నీటి భారం వారిపై అధికంగా పడుతుందని చెప్పారు. ఫలితంగా మెరుగైన జీవితాన్ని జీవింలేరని ఆయన వెల్లడించారు.
Published by:Sridhar Reddy
First published: