Home /News /explained /

Evaru Meelo Koteeswarulu: రూ.1 కోటి గెలుచుకోవాలా? 'ఎవరు మీలో కోటీశ్వరులు' గేమ్ షోకి రిజిస్టర్ చేయండిలా

Evaru Meelo Koteeswarulu: రూ.1 కోటి గెలుచుకోవాలా? 'ఎవరు మీలో కోటీశ్వరులు' గేమ్ షోకి రిజిస్టర్ చేయండిలా

Evaru Meelo Koteeswarulu: రూ.1 కోటి గెలుచుకోవాలా? 'ఎవరు మీలో కోటీశ్వరులు' గేమ్ షోకి రిజిస్టర్ చేయండిలా
(image: Gemini TV)

Evaru Meelo Koteeswarulu: రూ.1 కోటి గెలుచుకోవాలా? 'ఎవరు మీలో కోటీశ్వరులు' గేమ్ షోకి రిజిస్టర్ చేయండిలా (image: Gemini TV)

Evaru Meelo Koteeswarulu Registration | మీరు జెమినీ టీవీలో ప్రసారం కాబోయే ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? ఎలా రిజిస్టర్ చేయాలో తెలుసుకోండి.

    జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా 'ఎవరు మీలో కోటీశ్వరులు' గేమ్ షోను జెమినీ టీవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమమే పేరు మార్చుకొని జెమినీ టీవీలో రాబోతోంది. ఈ గేమ్ షోకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. ఆసక్తిగల వారు ఈ గేమ్ షోలో పాల్గొనడానికి ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే మార్చి 29న మొదటి ప్రశ్న జెమినీ టీవీలో ప్రసారమైంది. ఈ షోలో పాల్గొనాలంటే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఈ సమాధానం చెప్పడం ద్వారా గేమ్ షోకి రిజిస్టర్ కావొచ్చు. ఎస్ఎంఎస్ ద్వారా లేదా సన్ నెక్స్‌ట్ యాప్‌లో రిజిస్టర్ చేయొచ్చు. మరి జెమినీ టీవీలో త్వరలో ప్రసారం కాబోతున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' గేమ్ షోకి ఎలా రిజిస్టర్ చేయాలో తెలుసుకోండి.

    New Rules from April 1: సామాన్యులకు అలర్ట్... రేపటి నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే

    PAN Aadhaar Link Status: మీ పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ అయిందా? ఒక్క నిమిషంలో తెలుసుకోండిలా

    Evaru Meelo Koteeswarulu Registration: ఎస్ఎంఎస్ ద్వారా రిజిస్టర్ చేయండి ఇలా


    ముందుగా మీ ఫోన్‌లో ఛాట్ విండో ఓపెన్ చేయండి.
    EMK అని టైప్ చేసి స్పేస్ ఇవ్వండి.
    ప్రశ్నకు సరైన ఆప్షన్‌ను క్యాపిటల్ లెటర్‌లో టైప్ చేయండి.
    మళ్లీ స్పేస్ ఇచ్చి మీ వయస్సును టైప్ చేయండి.
    ఆ తర్వాత స్పేస్ ఇచ్చి మీ జెండర్‌ను టైప్ చేయండి.
    మేల్ అయితే M ఫీమేల్ అయితే F అని టైప్ చేయాలి.
    ఆ తర్వాత రాష్ట్రం పేరు టైప్ చేయాలి.
    ఆంధ్రప్రదేశ్ అయితే AP, తెలంగాణ అయితే TS, ఇతర రాష్ట్రాలకు చెందిన వారైతే O అని టైప్ చేయాలి.
    ఆ మెసేజ్‌ను 509093 నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి.
    ఉదాహరణకు తెలంగాణకు చెందిన 25 ఏళ్ల యువకుడు తన ఆప్షన్ బీగా ఎంచుకుంటే ఈ కింది ఫార్మాట్‌లో ఎస్ఎంఎస్ పంపాలి.
    EMK B 25 M TS అని టైప్ చేసి 509093 నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి.


    Evaru Meelo Koteeswarulu Registration: సన్ నెక్స్‌ట్ యాప్ ద్వారా రిజిస్టర్ చేయండి ఇలా


    ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో సన్ నెక్స్‌ట్ యాప్ డౌన్‌లోడ్ చేయండి.
    తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేయండి.
    Evaru Meelo Koteeswarulu బ్యానర్ కనిపిస్తుంది.
    Click Here to Participate పైన క్లిక్ చేయండి.
    సరైన సమాధానాన్ని సెలెక్ట్ చేయండి.
    ఆ తర్వాత వయస్సు, జెండర్, రాష్ట్రం, జిల్లా, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
    చివరగా సబ్మిట్ చేయాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Evaru Meelo Koteeswarulu, Jr ntr, NTR

    తదుపరి వార్తలు