Home /News /explained /

VIZAG STEEL PLANT WORKERS PROTEST FIGHT IN TELANGANA POLITICS NGS

Vizag Steel Plant: బావమరిది బాటలోనే బావ: తెలంగాణ రాజకీయాలను తాకిన విశాఖ ఉద్యమ సెగ?

కేటీఆర్, హరీశ్ రావు (ఫైల్ ఫోటోలు)

కేటీఆర్, హరీశ్ రావు (ఫైల్ ఫోటోలు)

విశాఖ ఉక్కు ఉద్యమం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. విశాఖలో కార్మిక సంఘాల ఆందోళనలకు మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు జై కొట్టడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. అమ్మకు అన్నం పెట్టలేనోడు.. పిన్నమ్మకు బంగారు గాజులు పెడతానన్నట్లు ఉందంటూ సెటైర్లు వేస్తున్నాయి విపక్షాలు. ఆ సెటైర్లుకు టీఆర్ఎస్ నేతలు సైతం స్ట్రాంగ్ గానే కౌంటర్లు ఇస్తున్నారు.

ఇంకా చదవండి ...
  విశాఖ ఉద్యమం రోజు రోజుకూ తీవ్రమవుతోంది. కార్మిక సంఘాలు, నిర్వాసితులు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ప్రాణాలు అయినా అర్పిస్తామంటున్నారు. ముఖ్యంగా లోక్ సభలో నిర్మాలాసీతారామన్ లిఖిత పూర్వక సమాధానం తరువాత ఉద్యమ రూపం మారింది. ఇక విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడానికే కేంద్రం సిద్ధమైందని వంద శాతం స్పష్టత రావడంతో కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.

  విశాఖ ఉద్యమ ప్రభావం ఏపీ రాజకీయాలపైనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఉక్కు ఉద్యమంలో ఎలా ముందుకు వెళ్లాలో తెలియక ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు జుత్తు పీక్కుంటున్నాయి. కేంద్రాన్ని తిట్టలేక.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను సమర్థించలేక.. ఒకరిపై ఒకరి తప్పు నెట్టేస్తూ కాలయాపన చేస్తున్నాయి  అనే విమర్శిలు వినిపిస్తున్నాయి.  రాజీయాలకు అతీతంగా అందరూ ముందుకు రావాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఏపీ రాజకీయాల్లో ఇప్పటికే విశాఖ ఉక్కు నిప్పు రాజేసింది. ఆ ప్రభావం మున్సిపల్ ఎన్నికలపైనే పడే అవకాశాలు కనిపిస్తుండడంతో రాజకీయ పార్టీల్లో గుబులు మొదలైంది.

  ఓవైపు ఏపీ రాజకీయ నేతలను కలవరపెడుతున్న విశాఖ ఉక్కు ఉద్యమం.. ఇప్పుడు తెలంగాణలోనూ సెగలు రేపుతోంది. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ విశాఖ ఉక్కు ఉద్యమానికి జై కొట్టారు. పోరాడి సాధించిన విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది అన్నారు. కేంద్రం తీరు చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాలను.. ఊరుకుంటే సింగరేణిని కూడా అమ్మేసాలా ఉందని మండిపడ్డారు. అందుకే అవసరమైతే సీఎం కేసీఆర్ అనుమతి తీసుకుని విశాఖ వచ్చి నిరసన తెలుపుతానని కేటీఆర్ స్పష్టం చేశారు..

  కేవలం కేటీఆర్ మాత్రమే కాదు.. బావ హరీష్ రావు సైతం అదే మాట చెప్పారు. ఓ ఛానెల్ ఇంట్వర్వ్యూలో మాట్లాడిన ఆయన విశాఖ ఉక్కును అమ్మేస్తుంటే  చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. అలా చూస్తూ ఊరుకుంటే రేపు తెలంగాణలో ప్రభుత్వ సంస్థలను కూడా కేంద్రం అమ్మేస్తుందని.. అందుకే విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలిపాం అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సైతం విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలిపారు..

  అయితే టీఆర్ఎస్ పార్టీలోని బావ, బావమరిది ఇద్దరూ విశాఖ ఉద్యమానికి మద్దతు తెలపడంపై విపక్షాలు విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అయితే కేటీఆర్ దురుద్దేశంతోనే విశాఖ ఉక్కుకు మద్దతు పలికారంటూ ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఆయన విశాఖ ఉక్కు ఉద్యమాన్ని ఎత్తుకున్నారంటూ ఆరోపించారు. అటు బీజేపీ నేతలు సైతం విశాఖ ఉక్కుతో మీకేమి సంబంధం అంటూ.. టీఆర్ఎస్ ను నిలదీస్తున్నారు. విజయశాంతి అయితే అమ్మకు అన్నం పెట్టలేనోడు.. పిన్నమ్మకు బంగారు గాజులు పెడతానన్నట్లు ఉందంటూ సెటైర్ వేశారు. దీంతో ప్రస్తుతం తెలంగాణలో ఉక్కు ఉద్యమం చుట్టూ రాజీకయం రచ్చ రచ్చ అవుతోంది.

  ఇదీ చదవండి: విశాఖలో కేటీఆర్ కు పాలాభిషేకం? తెలంగాణ మంత్రికి జై కొడుతున్న ఆంధ్రా జనం

  విపక్షాల విమర్శలకు మంత్రి కేటీఆర్ ఘాటుగానే రిప్లై ఇచ్చారు. విశాఖ ఉక్కును తుక్కు తుక్కు చేసి అమ్మేస్తున్నారని అయితే దీనిపై ప్రశ్నిస్తే ఏపీతో మీకేం పని అంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ దేశంలో లేదా? మేం మాట్లాడకూడదా? 80 వేల మంది బీఎస్‌ఎన్ఎల్‌ ఉద్యోగులను రోడ్డుపై పడేసింది. దేశంలో మాకు భాగస్వామ్యం లేదా? ఇవాళ విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్ముతున్నారు. రేపు సింగరేణి, బీహెచ్‌ఈఎల్‌పై కూడా పడతారు. ఏపీకి కష్టం వచ్చింది కదా.. మాకేంటి సంబంధం అని మేం నోరు మెదపకుండా ఉంటే ఎలా? రేపు మాకు కష్టం వస్తే ఎవరు ఉంటారు? ఎవరికో కష్టం వచ్చింది.. నాకెందుకులే అనుకుంటే సరికాదు. మొదట భారతీయులం.. తర్వాతే తెలంగాణ బిడ్డలం అంటూ కేటీఆర్ స్టాంగ్ కౌంటర్ ఇచ్చారు. కారణం ఏదైనా ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో విశాఖ ఉద్యమం హైలైట్ అవుతోంది.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, AP Politics, Harish Rao, KTR, Revanth reddy, Telangana, Trs, Vijayashanti

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు