హోమ్ /వార్తలు /Explained /

Vizag Steel Plant: విశాఖ ఉక్కు ఉద్యమంలో టాలీవుడ్ ఎక్కడ? ఒక్క ట్వీట్ తో సరా?

Vizag Steel Plant: విశాఖ ఉక్కు ఉద్యమంలో టాలీవుడ్ ఎక్కడ? ఒక్క ట్వీట్ తో సరా?

పవన్, ఎన్టీఆర్, మహేశ్

పవన్, ఎన్టీఆర్, మహేశ్

ఏపీకి ఇంత అన్యాయం జరుగుతున్నా? తెలుగు సినీ పరిశ్రమకు వినిపించడం లేదా? కనిపించడం లేదా? విశాఖ ఉక్కు ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతుంటే మన టాలీవుడ్ హీరోలు ఎక్కడ ఉన్నారు? విశాఖ కోసం పారాడాల్సిన అసవరం లేదా? కేంద్రానికి వ్యతిరేకంగా నోరు విప్పలేకపోతున్నారా?

ఇంకా చదవండి ...

విశాఖ ఉక్కు ఉద్యమం ఉద్ధృతమైంది. ఇప్పటి వరకు శాంతియుత నిరసనలు.. ర్యాలీలతో ఆందోళనలకు మాత్రమే పరిమితమైన కార్మిక సంఘాలు ఇప్పుడు సమ్మె నోటీసులు కూడా ఇచ్చాయి. మార్చి 25 లోపు ఎప్పుడైనా సమ్మెకు దిగుతామంటూ యాజమాన్యానికి నోటీసులు కూడా ఇచ్చాయి. అయితే ఇంతలా ఉద్యమం ఎగసిపడుతుంటే అన్ని వర్గాల నుంచి మద్దతు రావాలి. ఇప్పటికే రాజకీయా పార్టీలు మేం మద్దతిస్తున్నాం అంటే మేం మద్ధతిస్తున్నామని చెబుతున్నాయి. కానీ ఏకతాటిపైకి వచ్చి పోరాడడం లేదు.

ఏపీతో సంబంధం లేకపోయినా.. వారికి అవరసం లేకపోయినా తెలంగాణ మంత్రి కేటీఆర్. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క లాంటివారు విశాఖ ఉద్యమానికి జై కొడుతున్నారు.. అవసరమైతే విశాఖ వచ్చి ఆందోళనలు చేస్తామంటున్నారు.. రాష్ట్రాలకు అతితంగా జాతీయ స్థాయి నేతలు సైతం కేంద్రం తీరుపై మండిపడుతున్నారు. ఆంధ్రుల ఆందోళనల్లో న్యాయం ఉందని అంటున్నారు.. ఇంతమంది సపోర్ట్ చేస్తున్నా.. టాలీవుడ్ నుంచి సరైన సపోర్ట్ లేకపోవడంపై తీవ్ర విమర్శులు వెల్లువెత్తుతున్నాయి.

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అనే నినాదం మూడు దశాబ్దాల నాటి కిందటిది.. మళ్లీ అదే నినాదం ఎందుకు వినిపించాల్సి వస్తోంది. ఇప్పుడు మరోసారి దిక్కులు పిక్కటిల్లేలా కార్మిక సంఘాలు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం చేస్తున్నా.. కేంద్రం చెవులకు అది వినిపించడం లేదు. ఏపీ రాజకీయ నేతల్లో ఐకమత్యం లేకపోవడంతో ఈ ఉద్యమాన్ని కేంద్రం లైట్ తీసుకుంటుందనే వాదనా ఉంది. ఇలాంటి సమయంలో మేం ఉన్నామంటూ సినీ రంగ పరిశ్రమ కదిలి రావాల్సిన అవసరం ఉంది. ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతుంతే స్పందించాల్సిన అవసరం మన టాలీవుడ్ కు లేదా? ఎక్కడో ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల్లో అన్యాయం జరుగుతుంటే ట్వీట్లతో పాటు.. తోచినంత నగదు ఇచ్చి పబ్లిసిటీ చేసుకునే టాలీవుడ్ పెద్దలు.. ఇప్పుడు ఆంధ్రాకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఎందుకు నోరు విప్పడం లేదు అనే వాదన తెరపైకి వస్తోంది.

నిన్నటి వరకు నారా రోహిత్, మరో ఇద్దరు ముగ్గురు మినహా ఎవరూ స్టీల్ ప్లాంట్ కు జరుగుతున్న అన్యాయంపై నోరు మెదిపింది లేదు. కేటీఆర్ ఉక్కు ఉద్యమానికి జై కొట్టిన తరువాత.. డ్యామేజ్ కంట్రోల్ లా మెగాస్టర్ చిరంజీవి.. ఒక ట్వీట్ తో నేను ఉన్నాను అంటూ తెరపైకి వచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం పునరాలించుకోవాలి అంటూ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లోనే తన ఆవేదనను వినిపించారు. కాలేజీ రోజుల్లోనే విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొన్నానని నాటి రోజులను ఆయన గుర్తు చేశారు. కాలేజీలో చదువుకునే సమయంలో విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని బ్రష్‌తో రాశానని చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇన్నేళ్లయినా క్యాప్టివ్‌ గనులు కేటాయించకపోవడం, నష్టాలు వస్తున్నాయనే సాకుతో ప్రైవేటుపరం చేయాలనుకోవడం సమంజసం కాదని మెగాస్టార్ అన్నారు. లక్షలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన విశాఖ ఉక్కును ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నాలను కేంద్రం విరమించుకోవాలని కోరుతున్నాను అన్నారు. ఉద్యోగులు, కార్మికుల భవిష్యత్తును, ప్రజల మనోభావాల గుర్తించి కేంద్రం ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలి అన్నారు. విశాఖ ఉక్కును పరిరక్షించుకోవడమే ఇప్పుడు మనముందున్న ప్రధాన కర్తవ్యమని పిలుపు ఇఛ్చారు. ఇది ప్రాంతాలకు, పార్టీలకు, రాజకీయాలకు అతీతమైన, న్యాయ సమ్మతమైన హక్కు. ఆ హక్కును ఉక్కు సంకల్పంతో కాపాడుకుందాం అని చిరంజీవి పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి: తమ్ముడి కోసమే మెగాస్టార్ గళమెత్తారా? స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి చిరంజీవి జైకొట్టడానికి అదే కారణమా?

ఏపీకి ఇంత అన్యాయం జరుగుతున్న సమయంలో ఈ ఒక్క ట్వీట్ సరిపోతుందా? మెగాస్టార్ చిరంజీవిలాంటి వాళ్లు ఉద్యమంలో ముందుకు వచ్చి నడిపిస్తే టాలీవుడ్ అంతా ఆయన వెనుక నడిచే అవకాశం ఉంటుంది. ఇలా ఎదో ట్వీట్ చేసి వదిలిస్తే ఎవరు పట్టించుకుంటారు. కనీసం చిరంజీవి ట్వీట్ అయినా చేశారు. మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి? స్టార్ హీరోలు అందరూ ఏమయ్యారు. బాలయ్య, వెంకటేష్, నాగార్జున లాంటి వారికి విశాఖ ఉక్కు సమస్య పట్టదా..  మహేష్, జూనియర్ ఎన్టీఆర్, బన్నీ, ప్రభాష్ ,చరణ్ లాంటి స్టార్లకు అసలు ట్వీట్ చేసే సమయం కూడా లేదా?

సాధారణంగా ప్రస్తుతం సినిమా షూటింగ్‌లకు హాట్‌స్పాట్ విశాఖ అనే చెప్పాలి. విభజన సమయంలో కొందరైతే విశాఖకు తరలి వెళ్లడానికి కూడా సిద్ధమయ్యారు. మరికొందరైతే స్టూడియోలు పెట్టి విశాఖపై మమకారం చాటుకున్నామంటూ స్టేట్ మెంట్లు ఇచ్చారు. అలాంటి విశాఖకు ఇప్పుడు కష్టం వస్తే ఒక్కరు కూడా ముందుకు రాకపోవడం శోచనీయం. అంటే టాలీవుడ్ సినిమా స్టార్లు.. స్టార్ డైరెక్టర్లు, బడా నిర్మాతలకు విశాఖ కష్టం కనిపించడం లేదా? స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చిరంజీవి ట్వీట్ చేశారు. విశాఖ కార్మికులకు మద్దతు పలికారు. కానీ ఈ మద్దతు సరిపోతుందా? ఫైట్ చేయాల్సిన సమయంలో ట్వీట్ చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా? అయితే టాలీవుడ్ పెద్దలు ఎందుకు నోరు మెదపడంలేదన్నదానిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమయంలో లేక సైలెంట్ అవుతున్నారా? కేంద్రంతో గొడవెందుకులే అని భయపడుతున్నారా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు?

First published:

Tags: Allu Arjun, Balayya, Jr ntr, Mahesh, Nagarjuna, Prabhas, Ramcharan, Tollywood, Venkatesh, Visakha, Visakhapatnam, Vizag, Vizag Steel Plant

ఉత్తమ కథలు