హోమ్ /వార్తలు /Explained /

Omicron Variant: ఒమిక్రాన్ వ్యాప్తికి ప్రధాన కారణం ఇదేనా..? అదే ప్రపంచాన్ని ప్రమాదంలో పడేస్తుందా?

Omicron Variant: ఒమిక్రాన్ వ్యాప్తికి ప్రధాన కారణం ఇదేనా..? అదే ప్రపంచాన్ని ప్రమాదంలో పడేస్తుందా?

ప్రపంచమంతా కరోనా బారి నుంచి కాస్త ఉపశమనం పొందగా, చైనాలో మాత్రం ఒమిక్రాన్ వేరియంట్ లో కొత్త సబ్ వేరియంట్ పుట్టుకొచ్చి, వాయి వేగంతో వ్యాప్తి చెందుతోంది. వైరస్ వ్యాప్తి కట్టడికి  లాక్‌డౌన్‌ విధించినా ఫలితం కానరాలేదు.(ప్రతీకాత్మక చిత్రం)

ప్రపంచమంతా కరోనా బారి నుంచి కాస్త ఉపశమనం పొందగా, చైనాలో మాత్రం ఒమిక్రాన్ వేరియంట్ లో కొత్త సబ్ వేరియంట్ పుట్టుకొచ్చి, వాయి వేగంతో వ్యాప్తి చెందుతోంది. వైరస్ వ్యాప్తి కట్టడికి లాక్‌డౌన్‌ విధించినా ఫలితం కానరాలేదు.(ప్రతీకాత్మక చిత్రం)

రెండు డోసుల వ్యాక్సిన్ దాటుకుని ప్రజలకు సంక్రమిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Variant) 'వ్యాక్సిన్ నేషనలిజం' ఎంత పెద్ద తప్పో చెప్పకనే చెబుతోంది. ఇప్పటికీ డెల్టా వేరియంట్ ఇంకా ప్రజలను పీడిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో అసాధారణ మ్యుటేషన్లతో వేగిరంగా సంక్రమించే ఒమిక్రాన్ పెను ప్రమాదంగా అవతరిస్తోంది.

ఇంకా చదవండి ...

అభివృద్ధి చెందిన దేశాలు వ్యాక్సిన్ ట్రయల్స్ (Vaccine Trials) ఇంకా పూర్తి కాకముందే తమకే మొట్టమొదటగా వ్యాక్సిన్లు సరఫరా చేయాలని ఫార్మా కంపెనీలతో అగ్రిమెంట్లు కుదుర్చుకున్నాయి. ధనిక దేశాలన్నీ తమ ప్రజల కోసం వ్యాక్సిన్లను దోచేస్తుంటే పేద దేశాలు మాత్రం నిస్సహాయ స్థితిలో నేలచూపులు చూశాయి. ఇలాంటి అన్యాయాన్ని వ్యాక్సిన్ నేషనలిజంగా (Vaccine Nationalism) అభివర్ణించారు నిపుణులు. అయితే గబగబా కోట్లాది వ్యాక్సిన్లు తీసుకున్నంత మాత్రాన కరోనా వైరస్‌ నుంచి తప్పించుకుంటామనుకుంటే పొరపాటే. రెండు డోసుల వ్యాక్సిన్ దాటుకుని ప్రజలకు సంక్రమిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Variant) 'వ్యాక్సిన్ నేషనలిజం' ఎంత పెద్ద తప్పో చెప్పకనే చెబుతోంది. ఇప్పటికీ డెల్టా వేరియంట్ ఇంకా ప్రజలను పీడిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో అసాధారణ మ్యుటేషన్లతో వేగిరంగా సంక్రమించే ఒమిక్రాన్ పెను ప్రమాదంగా అవతరిస్తోంది.

కరోనా మహమ్మారిని జయించాలంటే టీకాలు తప్పనిసరి. కొత్త, భయంకరమైన మ్యుటేషన్లు పుట్టకుండా.. ప్రజల ప్రాణాలను మహమ్మారి హరించకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందేలా అన్ని దేశాలు కృషి చేయాలి. పగలు, ప్రతీకారాలు పక్కనపెట్టి దేశాలన్నీ తమ బంధాలను బలపరుచుకోవాలి. ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించే ప్రయత్నాలను మానుకోవాలి. కరోనా పుణ్యమా అని అది జరుగుతుందా? అనేది తెలియాలి.

వ్యాక్సినేటెడ్ ప్రజల్లో కరోనా వైరస్ లోని స్పైక్ ప్రొటీన్‌ ను టీకాలు బ్లాక్ చేసేస్తాయి. అయితే వ్యాక్సినేషన్ తీసుకోని వారిలో వైరస్ పరివర్తన చెందుతుంది. ఈ వైరస్ మానవ కణాన్ని హైజాక్ చేసి వేలకొద్దీ కాపీలను తయారు చేస్తుంది. ఈ వైరస్ కాపీ చేయడంలో పొరపాటు లేదా లోపం ఉన్నట్లయితే.. ఒక మ్యుటేషన్ పుట్టుకొస్తుంది. ఈ మ్యుటేషన్లు కాలక్రమేణా పెరిగిపోయి.. కొత్త వేరియంట్లు ఉద్భవించటానికి కారణమవుతాయి. అందుకే ప్రతి ఒక్కరికి టీకాలు అందించడం అత్యావశ్యకం. కేవలం ధనిక దేశాలు మాత్రమే టీకాలు తీసుకున్నా.. భవిష్యత్తులో టీకా తీసుకోని ప్రజల నుంచి ఆ టీకాల రక్షణను సైతం చీల్చుకుని ప్రజలందరి ప్రాణాలను మింగేసే కొత్త వేరియంట్లు పుట్టుకు రావచ్చు.

వ్యాక్సిన్ నేషనలిజం అంటే ఏంటి..?

ఇతర దేశాలకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాకముందే వారి సొంత జనాభాకు వ్యాక్సిన్‌లను సరఫరా చేయడానికి ఔషధ తయారీదారులతో ప్రభుత్వాలు ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు వ్యాక్సిన్ నేషనలిజం ఏర్పడుతుంది. హార్వర్డ్ పొలిటికల్ రివ్యూలో ఒక నివేదిక ప్రకారం, వ్యాక్సిన్ పరిశోధనను వేగవంతం చేయడంలో సహాయపడటానికి యూఎస్ మే 2020 నాటికి ఆస్ట్రాజెనెకాకు $1.2 బిలియన్లు చెల్లించింది. బదులుగా 300 మిలియన్ల వ్యాక్సిన్ డోస్‌లకు తమకే సమర్పించాల్సిందిగా ఒప్పందం కుదుర్చుకుంది.

యూకే, జపాన్, కెనడా వంటి సంపన్న దేశాలన్నీ ఇలాంటి బిలియన్-డాలర్ ఒప్పందాలే కుదుర్చుకున్నాయి. దాంతో ఈ ఏడాది చివరి నాటికి ఉత్పత్తి అయ్యే 96% ఫైజర్, 100% మోడెర్నా వ్యాక్సిన్లు సంపన్న దేశాలకే దక్కనున్నాయి. ఇలాంటప్పుడు పేద దేశాలకు సరిపడా వ్యాక్సిన్లు అందక అవి తీవ్రమైన వేరియంట్ల పుట్టుకకు కేంద్రంగా మారుతాయి. ఆ వేరియంట్లు ప్రపంచం మొత్తానికి వ్యాపించి మళ్లీ మారణహోమం సృష్టించే ప్రమాదం ఉంది.

ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించకపోవడం వల్లే యూరప్ దేశాలలో డెల్టా వేరియంట్ విజృంభించి కొత్త కరోనా వేవ్ లకు దారి తీస్తోంది. దీన్నే అన్‌వ్యాక్సినేటెడ్ పాండెమిక్ గా అభివర్ణిస్తున్నారు నిపుణులు. అన్ని దేశాలు కలిసికట్టుగా అందరికీ సమానంగా వ్యాక్సిన్ అందించగలిగితేనే మహమ్మారిని నాశనం చేయగలం. లేదంటే వ్యాక్సినేషన్ నేషనలిజానికి పాల్పడే దేశాలను కూడా ఎవరూ కాపాడలేరనేది నిపుణులు చెబుతున్న మాట.

ఐకమత్యం విషయంలో లోపాలు

అభివృద్ధి చెందుతున్న దేశాలకు వ్యాక్సిన్ అందించాలనే ఉద్దేశంతో డబ్ల్యూహెచ్ఓ కోవాక్స్ కార్యక్రమం ప్రారంభమైంది. కానీ దాని నిధులు మాత్రం పెరిగిన దాఖలాలు లేవు. ప్రస్తుత నిధులతో అభివృద్ధి చెందుతున్న ప్రపంచ జనాభాలో 20 శాతం మందికి కూడా వ్యాక్సిన్ అందించడం సాధ్యం కాకపోవచ్చు. ఇప్పటికిప్పుడు నిధులు అందించి.. వ్యాక్సిన్ల కోసం ఆర్డర్ పెడితే మాత్రమే వెనుకబడిన ప్రజలకు వ్యాక్సిన్ అందించడం సాధ్యమవుతుంది. కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కోవాలంటే ఒక్కరే కృషి చేస్తే సరిపోదని.. అంతర్జాతీయంగా అన్ని దేశాలు పరస్పర సహకారంతో ముందడుగు వేయాలని యూఎన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికీ కరోనా మహమ్మారి ప్రజలను వణికిస్తూనే ఉందని.. అందుకే అన్ని దేశాలు ఇప్పటికైనా ఐక్యమత్యాన్ని అవలంబించాలని యూఎన్ అధికారులు కోరుతున్నారు. కరోనాకి సంబంధించి ఇంటెలిజెంట్ ప్రాపర్టీ రైట్స్ క్యాన్సిల్ చేయాలని ఇప్పటికే సౌత్ ఆఫ్రికా, ఇండియా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ని కోరాయి. కానీ ఫార్మా ఇండస్ట్రీ, సంపన్న దేశాలు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇలాంటి ధోరణి కారణంగానే ప్రపంచం దేశాలు కరోనాని అంతమొందించడంలో ఇప్పటికీ విఫలమవుతున్నాయి.

ఇండియా సంగతి ఏంటి..?

ఈయూ దేశాల వ్యాక్సిన్ నేషనలిజం వారి ద్వంద్వ ప్రమాణాలను తేట తెల్లం చేస్తోంది. భారతదేశం మాత్రం ఇలాంటి చర్యలకు దూరంగా ఉంది. ఆపరేషన్ వ్యాక్సిన్ మైత్రిలో భాగంగా ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని దేశాలకు వ్యాక్సిన్లను ఇండియా పంపిణీ చేసింది. పరాగ్వే, బోట్స్‌వానా, వియత్నాం, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, కామెరూన్, యూఏఈ వంటి దేశాలకు ఎగుమతి చేసేందుకు ఇండియా రెడీగా ఉంది. సమానమైన ప్రపంచ వ్యాక్సిన్ ఆర్డర్ పునరుద్ధరించిన నేపథ్యంలో ఇండియా అన్ని రూల్స్ ఫాలో అవుతోంది.

First published:

Tags: Corona virus, Omicron corona variant

ఉత్తమ కథలు