• HOME
  • »
  • NEWS
  • »
  • EXPLAINED
  • »
  • US INTELLIGENCE COUNCIL REPORT TELLS WORLD IS GOING TO FACE SERIOUS PROBLEMS THAN CORONA VIRUS IN FUTURE FULL DETAILS HERE PRN GH

US Intelligence Council Report: భవిష్యత్తులో మానవాళి మనుగడ కష్టమేనా.. వచ్చే పదేళ్లలో ఏం జరగబోతోంది..?

US Intelligence Council Report: భవిష్యత్తులో మానవాళి మనుగడ కష్టమేనా.. వచ్చే పదేళ్లలో ఏం జరగబోతోంది..?

ప్రతీకాత్మక చిత్రం

భవిష్యత్తులో ప్రపంచం ఎలా ఉండబోతోంది..? అగ్ర దేశాల మధ్య పోటీ విపత్తుకు దారి తిస్తుందా..? కరోనాకన్నా తీవ్రమైన మహమ్మారులు వెంటాడబోతున్నా...?

  • Share this:
రానున్న రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు మానవాళిపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందని యూఎస్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ నివేదిక వెల్లడించింది. 2040 నాటికి ప్రపంచ దేశాల స్థితిగతులు, ప్రజలపై వాటి ప్రభావాన్ని సంస్థ అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన రాజకీయ అస్థిరత, అగ్ర దేశాల మధ్య పోటీ లేదా సంఘర్షణ గురించి నివేదిక హెచ్చరిస్తోంది. అమెరికాకు చెందిన నేషనల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ 1997 నుంచి ప్రతి నాలుగేళ్లకు ఇలాంటి నివేదిక రూపొందిస్తోంది. ప్రస్తుతం ‘గ్లోబల్ ట్రెండ్స్ 2040’ పేరుతో సంస్థ నుంచి ఏడో రిపోర్ట్ విడుదలైంది. వివిధ దేశాల్లో అంతర్గత పరిస్థితులు, దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు అనిశ్చితి, అస్థిరతను సూచిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. రాజకీయ అస్థిరత కారణంగా అనేక దేశాల్లో ప్రజలు భవిష్యత్తు గురి౦చి ఆందోళన చెందుతున్నారని సర్వే తెలిపింది. దేశాధినేతలపై నమ్మకం లేకపోవడం, ఆర్థిక విధానాలు, జనాభా, సాంకేతికత ప్రభావాలతో సంస్థలపై మరి౦త అపనమ్మక౦ పెరుగుతో౦దని నివేదిక హెచ్చరిస్తో౦ది.

* ప్రజాస్వామ్య దేశాల్లో అస్థిర పరిస్థితులు
ప్రజలు ఒక సమూహంగా ఏర్పడి ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతూ వివిధ రకాల డిమాండ్లు చేస్తున్నారని రిపోర్టు చెబుతోంది. దీంతో ప్రభుత్వాల సామర్థ్యాలు, ప్రజల అంచనాల మధ్య తేడాలు ఏర్పడుతున్నాయి. ఇవి క్రమంగా ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఫలితంగా రాజకీయ వ్యవస్థల్లో వర్గాల వారీగా ఏకీకరణ, ఉద్యమాలు, నిరసనలు, అసంతృప్తి వంటివి రాజకీయ అస్థిరతకు దారితీస్తాయి. కొన్ని సందర్భాల్లో హింస, అంతర్గత విభేధాలు, తీవ్రమైన నిరసనలతో ప్రభుత్వాలు పతనం కావచ్చు. దీంట్లో సోషల్ మీడియా, టెక్నాలజీ పాత్ర కూడా ఉంటుంది. ఇలా ప్రభుత్వాలు చేరుకోలేని అంచనాలు ప్రజాస్వామ్యాన్ని కూలదోసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నివేదిక వివరించింది. ఇలాంటి ఒత్తిళ్లు నిరంకుశ పాలనలకు దారితీసే అవకాశం కూడా ఉందని పేర్కొంది.

* మహమ్మారుల విజృంభణ
రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇప్పుడు కరోనా కారణంగా మానవాళి తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోందని నివేదిక వెల్లడించింది. ఇది ఇప్పటికే ఉన్న మార్పులను వేగవంతం చేయడంతో పాటు విభజనలకు ఆజ్యం పోసింది. ప్రభుత్వాలు మహమ్మారులను ఎదుర్కోవడం ఒక సవాలుగా మారుతోంది. సంస్థ 2017లో విడుదల చేసిన నివేదికలోనే మహమ్మారుల గురించి హెచ్చరించింది. 2023 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి వ్యాపించే అవకాశం ఉందని, దాని ప్రభావంతో ప్రపంచ దేశాల మధ్య ప్రయాణాలు, సంబంధాలు తగ్గుతాయని ఊహించింది.

ప్రతీకాత్మక చిత్రం


కానీ ప్రస్తుతం విజృంభిస్తోన్న కోవిడ్-19ను తాము ఊహించలేదని నివేదిక రచయితలు తెలిపారు. ఇంతకు ముందు చేసిన ఎన్నో అధ్యయనాల్లో ప్రపంచ మహమ్మారుల ప్రభావం ప్రస్తావనకు రావడం గమనార్హం. కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థ, పాలన, భౌగోళిక, రాజకీయ పరమైన సమస్యలు, టెక్నాలజీ విషయంలో కొత్త అనిశ్చితులు సృష్టించిందని నివేదిక వెల్లడించింది. వాతావరణ మార్పులు, జనాభా పెరుగుదల కూడా ఇలాంటి మార్పులకు కారణమవుతున్నాయని తెలిపింది.

* భౌగోళిక, రాజకీయ విభేదాలు
ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపడానికి ప్రముఖ దేశాలు ఎన్నో ఏళ్లుగా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే వివిధ దేశాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. రానున్న రెండు దశాబ్దాల్లో ఈ పోటీ తీవ్రంగా పెరుగుతుందని నివేదిక తెలిపింది. ఇందులో భాగంగా ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థల ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం కొనసాగుతోంది. మత సంస్థలు, సమూహాలు, ఇతర ప్రభుత్వేతర సంస్థలు క్రియాశీలంగా మారి, వ్యవస్థలపై ప్రభావం చూపే స్థాయికి ఎదిగే అవకాశం ఉంది.

* తీవ్రవాదం బలోపేతం
కొత్తరకం ఆయుధాల ఉపయోగాన్ని నిరోధించడం కష్టంగా మారటం, ఉగ్రవాదం, జాత్యహంకారం, పర్యావరణవాదం, ప్రభుత్వ వ్యతిరేక కారణంగా ఏర్పడే తీవ్రవాదం వంటి సమస్యలను రైట్, లెఫ్ట్ వింగ్ తీవ్రవాదులు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఐరోపా, లాటిన్ అమెరికా, ఉత్తర అమెరికాలో ఈ రకమైన పరిస్థితుల పునరుద్ధరణకు అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది. కృత్రిమ మేధస్సు, ఆగ్యుమెంటెడ్ రియాలిటీని వాడుకునే తీవ్రవాదులు వర్చువల్ టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్‌లను ఉపయోగించవచ్చు.

Jammu kashmir, jk news, jk terror groups, Cyber Recruitment, Pak Terror Groups, fake video, ISI, Whatsapp groups, LeT, sleeper cells, Facebook, Youtube,పాక్ ముష్కరులు, ఐఎస్ఐ, స్లీపర్ సెల్స్, ఫేస్ బుక్, సైబర్ రిక్రూట్మెంట్.
ప్రతీకాత్మక చిత్రం


* అమెరికా, చైనా మధ్య పోటీ
అమెరికా, చైనా మధ్య పోటీ కారణంగా ప్రపంచ దేశాలు రెండు గ్రూపులుగా విడిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. 2004లో సంస్థ విడుదల చేసిన నివేదిక మధ్య ప్రాచ్యంలో ఒక ఉగ్రవాద సంస్థ ఉద్భవించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆ తరువాత ISIS ఏర్పడింది. కానీ అంత సామర్థ్యం ఉన్న నివేదిక.. అమెరికా, చైనా మధ్య వివాదాలను మాత్రం ఊహించలేకపోయింది. అందువల్ల భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు మరిన్ని ఎదురయ్యే అవకాశాలను కొట్టిపారేయలేం.

Detention centers, Xinjiang detention centers, Uyghurs, Muslim minorities, Mass detention in China, Vocational training centers, Uyghur Muslims, Qelbinur Sidik, చైనా, వీగర్ ముస్లింలు, మైనారిటీలపై దాడులు, నిర్బంధ కేంద్రాలు
ప్రతీకాత్మక చిత్రం


వాతావరణ మార్పులు, కరువు, అశాంతి కారణంగా 2030ల ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా విపత్తు ఏర్పడే అవకాశం ఉందని నివేదిక ఊహిస్తోంది. ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి చేసే సామాజిక ఉద్యమాలు ఒక కొత్త ప్రపంచ సంకీర్ణానికి దారితీయవచ్చని తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఏర్పడటానికి అవకాశాలను ఈ నివేదిక ఊహించింది. ఇవి కచ్చితంగా జరుగుతాయని ఎవరూ చెప్పలేరు. కానీ అవకాశాలను ఊహించడం ద్వారా పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు వ్యవస్థలను సిద్ధం చేయవచ్చని నివేదిక పేర్కొంది.
First published:

అగ్ర కథనాలు