UP TO 93 PERCENT DISCOUNT ON UAE WORK PERMITS THESE ARE THE NEW RULES AND REGULATIONS GH VB
Explained: UAE వర్క్ పర్మిట్స్పై 93 శాతం వరకు డిస్కౌంట్.. అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు ఇవే..
ప్రతీకాత్మక చిత్రం
UAEలోని ప్రైవేట్ రంగ కంపెనీలు మంత్రిత్వ శాఖ ఫీజు(Ministry Fees)లో 93 శాతం వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. ప్రభుత్వం నిర్దేశించిన ఎమిరేటైజేషన్ రేట్లను(Emiratisation Rates) మించడం, కొన్ని ఇతర ప్రమాణాలను పాటిస్తే ఈ డిస్కౌంట్ లభిస్తుంది.
UAEలోని ప్రైవేట్ రంగ కంపెనీలు మంత్రిత్వ శాఖ ఫీజు(Ministry Fees)లో 93 శాతం వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. ప్రభుత్వం నిర్దేశించిన ఎమిరేటైజేషన్ రేట్లను(Emiratization Rates) మించడం, కొన్ని ఇతర ప్రమాణాలను పాటిస్తే ఈ డిస్కౌంట్ లభిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ ఎమిరేటైజేషన్ మంగళవారం ప్రైవేట్ రంగ సంస్థలకు కొత్త వర్గీకరణ వ్యవస్థను ప్రకటించింది. జూన్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త విధానంలో కంపెనీలను(Companies) మూడు రకాలుగా విభజించారు. మొదటి రేటింగ్(Rating) పొందిన సంస్థలు ఫీజులపై భారీ తగ్గింపును పొందుతాయి, అయితే మూడో రేటింగ్ పొందిన వారు అన్ని రుసుములను పూర్తిగా చెల్లించాలి.
రెండు సంవత్సరాల వర్క్ పర్మిట్ జారీ, కాంట్రాక్ట్ రెన్యువల్స్‌తో కూడిన అనేక సేవలకు తగ్గింపులు వర్తిస్తాయి. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ ఎమిరేటైజేషన్ మినిస్టర్ డాక్టర్ అబ్దుల్రహ్మాన్ అల్ అవార్ మాట్లాడుతూ.. ఈ ప్రమాణాలలో ఎమిరేటైజేషన్, ఉద్యోగుల సాంస్కృతిక వైవిధ్యం, కార్మిక నియమాలకు కట్టుబడి ఉంటామని వివరించారు.
కేటగిరీ 1
ఇటీవల UAE క్యాబినెట్ తీర్మానం ప్రకారం ప్రైవేట్ రంగ సంస్థలు తమ ఎమిరేటైజేషన్ రేట్లను ఏటా 2 శాతం పెంచాలి. ఈ నిబంధనలు అనుసరించిన కంపెనీలు 'ఫస్ట్ రేటింగ్' పొందుతాయి. గరిష్ట తగ్గింపులను పొందడానికి అర్హత సాధిస్తాయి. ఇటువంటి కంపెనీలు అసలు రుసుము 3450 దినార్లు కాకుండా 250 దినార్లు మాత్రమే చెల్లిస్తాయని అని అల్ అవార్ వివరించారు. కంపెనీలు అన్ని కార్మిక నియమాలను అనుసరించి, వేజ్ ప్రొటెక్షన్ సిస్టమ్‌కు కట్టుబడి ఉంటే, ఇతర ప్రయోజనాలను, రేటింగ్‌ను పొందుతాయి. అందులో 2 శాతం కంటే కనీసం మూడు రెట్లు ఎక్కువ వార్షిక ఎమిరేటైజేషన్ రేటును పెంచడం, ప్రతి సంవత్సరం కనీసం 500 మంది పౌరులను నియమించుకోవడానికి, శిక్షణ ఇవ్వడానికి ఎమిరాటీ టాలెంట్ కాంపిటీటివ్నెస్ ప్రోగ్రామ్ నఫీస్‌తో ఒప్పందం చేసుకోవడం, చిన్న, మధ్య తరహా సంస్థగా రిజిస్టర్ అయి ఉండటం వంటివి ఉన్నాయి.
కేటగిరీ 2
అన్ని UAE కార్మిక చట్టాలు, నిబంధనలను అనుసరించి, ఇతర ప్రమాణాలను పాటించని ప్రైవేట్ సంస్థలు ఈ రేటింగ్‌ను పొందుతాయి. అల్ అవార్ మాట్లాడుతూ..‘ఆ కంపెనీలు డిస్కౌంట్లను కూడా అందుకుంటాయి. ఫీజులో 1,200 దినార్లు చెల్లిస్తారు. వారి తగ్గింపు రేటు మొదటి కేటగిరీ కింద వచ్చే కంపెనీల కంటే ఎక్కువగా ఉండదు’ అని వివరించారు.
కేటగిరీ 3
నిబంధనలను ఉల్లంఘించే లేదా కార్మిక చట్టానికి కట్టుబడి ఉండని సంస్థలు ఈ రేటింగ్‌ను పొందుతాయి. అటువంటి కంపెనీలు అన్ని రుసుములను పూర్తిగా చెల్లించవలసి ఉంటుందని మంత్రి చెప్పారు.
సాంస్కృతికంగా విభిన్నమైన శ్రామికశక్తి
కార్యాలయంలో సమతుల్య సాంస్కృతిక వాతావరణాన్ని తీసుకొచ్చేందుకు విభిన్న నేపథ్యాలకు చెందిన ఉద్యోగులను నియమించుకోవడం వల్ల ప్రైవేట్ సంస్థలు ప్రయోజనం పొందుతాయని అల్ అవార్ చెప్పారు. ఓ దేశం నుంచి గరిష్టంగా 20 శాతం ఉద్యోగులను నియమించుకునే ప్రైవేట్ కంపెనీలు సాంస్కృతిక వైవిధ్యం ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయని వివరించారు. ఇది కంపెనీలకు సేవా రుసుములపై డిస్కౌంట్లను పొందడంలో సహాయపడటమే కాకుండా ప్రతిభావంతులను ఆకర్షించడానికి మరింత సౌలభ్యాన్ని అందిస్తుందన్నారు.
సంస్థలను కేటగిరీలుగా ఎలా విభజిస్తారు
కొన్ని నెలలుగా అభివృద్ధి చేసిన ఎలక్ట్రానిక్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మంత్రిత్వ శాఖ ఇన్స్పెక్టర్లు ఇచ్చే ఇన్పుట్ల ఆధారంగా రేటింగ్‌లు ఇస్తారు. ఇన్స్పెక్టర్లు ఆయా సంస్థలను సందర్శిస్తారు. వారు పరిశీలించి ఇన్పుట్లను ఇస్తారు.
ఎమిరేటైజేషన్ టార్గెట్
ఎమిరేటైజేషన్ రేట్లు ఏటా 2 శాతం పెంచేందుకు యూఏఈ కేబినెట్ గతంలోనే ఆమోదం తెలిపింది. 2026 నాటికి ఈ రేటును 10 శాతానికి పెంచడమే లక్ష్యమని పేర్కొంది. దీనివల్ల అన్ని ఆర్థిక రంగాల్లో పౌరులకు ఏటా 12,000 కంటే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నిబంధనలు పాటించని కంపెనీలు 2023 జనవరి నుంచి ఉద్యోగం పొందని ప్రతి పౌరునికి నెలకు 6,000 దినార్లను చెల్లించాలి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.