UP Assembly Elections: 2017లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఈ 54 స్థానాల్లో 29 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఏడు చోట్ల భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలు గెలిచాయి. సమాజ్ వాదీ పార్టీ 11 చోట్ల గెలుపొందగా, ఆరు సీట్లను బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(BSP) నెగ్గింది.
ఏడు విడతలుగా జరుగుతున్న ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు(UP Assembly Elections) చివరిదశకు చేరుకొన్నాయి. వారణాసి, మీర్జాపూర్, అజమ్‌గర్ డివిజన్లలోని తొమ్మిది జిల్లాల్లో మిగిలిన 54 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరనున్నాయి. ఈ స్థానాల్లో అధికార భారతీయ జనతా పార్టీ(BJP), దాని ప్రధాన ప్రత్యర్థి సమాజ్ వాదీ పార్టీ(SP) మధ్య రసవత్తర పోరు నెలకొంది.ఆయా డివిజన్లలో పట్టు నిలుపుకోవాలని భారతీయ జనతా పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది. అదే విధంగా అజమ్గర్లో బలంగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ.. ఇతర ప్రాంతాల్లోనూ అదే స్థాయిలో రాణించాలని ప్రయత్నిస్తోంది. అయితే ఈ రెండు ప్రధాన పార్టీల అవకాశాలు ఈ విడత ఎన్నికల్లో వాటితో జత కట్టిన పార్టీల పనితీరుపై ఆధారపడి ఉన్నాయి. అదే విధంగా ఈ డివిజన్లలో పెద్ద సంఖ్యలో ఉన్న వెనుకబడిన వర్గాల నిర్ణయం కూడా కీలకం కానుంది. ఈ విడత శాసనసభ ఎన్నికలు జరుగనున్న నియోజకవర్గాలు అట్రాలియా, గోపాల్పూర్, సగాడి, మాబారక్పూర్, అజమ్‌గర్, నిజామాబాద్, ఫులూర్-పొవై, దీదర్‌గంజ్, లాల్గంజ్(ఎస్సీ), మెహ్‌నగర్(ఎస్సీ), మధుబన్, ఘోసి, ముహమ్మాబాద్- గోహ్న(ఎస్సీ), మావు, బదల్పూర్, షాగంజ్, గాజిపూర్, జంగిపూర్, జహూరాబాద్, మొహమ్మదాబాద్, జమానియా, ముగల్సరై, సకల్దిహా, సైదరాజా, చకియా(ఎస్సీ), పింద్ర, అజ్గరా(ఎస్సీ), శివ్పూర్, రోహానియా, వారణాసి ఉత్తరం, వారణాసి దక్షిణం, వారణాసి కంటోన్మెంట్, సెవపూరి, భదోహి, జ్ఞాన్పూర్, ఔరాయి(ఎస్సీ), చన్బే(ఎస్సీ), మిర్జాపూర్, మజ్హవాన్, రోబర్ట్స్గంజ్, ఒబ్రా(ఎస్టీ), దుద్హి(ఎస్టీ). ఈ నియోజకవర్గాల్లో 11 శాసనసభ స్థానాలు షెడ్యూల్ట్ క్యాస్టులకు, రెండు శాసనసభ నియోజకవర్గాలు షెడ్యూల్డ్ ట్రైబ్స్‌కు కేటాయించారు.
2017లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఈ 54 స్థానాల్లో 29 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఏడు చోట్ల భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలు గెలిచాయి. సమాజ్ వాదీ పార్టీ 11 చోట్ల గెలుపొందగా, ఆరు సీట్లను బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(BSP) నెగ్గింది. మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, మిగిలిన ఐదు స్థానాల్లో ఇతర చిన్న పార్టీలు విజయం సాధించాయి.మార్చి 7వ తేదీన ఏడో విడత శాసనసభ ఎన్నికలు ఉత్తర్‌ప్రదేశ్‌లో జరగనున్నాయి. ఈస్ట్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని శాసనసభ నియోజకవర్గాల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులే కాకుండా భౌగోళిక విభిన్న పరిస్థితులు కూడా ప్రభావం చూపనున్నాయి.వారణాసి పార్లమెంట్ నియోజవర్గం నుంచి పార్లమెంట్‌ను ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 శాసనసభ ఎన్నికల సమయం నుంచి వారణాసి పార్లమెంట్ నియోజవర్గంలోని అన్ని స్థానాల్లో మోదీ ప్రభంజనం పనిచేస్తోంది. వారణాసి ఎన్నికల్లో బ్రాండ్ మోదీ పేరుతో భాజపా విజయాలను దక్కించుకొంటోంది.
2017 ఎన్నికల్లో వారణాసితో ప్రధాని మోదీకి ప్రత్యేక అనుబంధం, హిందుత్వవాదం, వెనుకబడిన వర్గాల మద్దతు బాగా పని చేసింది. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీల కూటమి భాజపాకు గట్టి సవాళ్లనే విసిరింది. ఆయా ప్రాంతాల్లో దళితులు, ఓబీసీ వర్గాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. గాజిపూర్, ఘోసి, జౌన్పూర్, లాల్గంజ్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో బహుజన్ సమాజ్ వాదీ పార్టీ నెగ్గింది. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అజమ్‌గర్ నుంచి విజయం సాధించారు.2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో దళితులు ఓటు బ్యాంకు విలువ, వాస్తవంగా బాగా వెనుకబడిన వర్గాల అవసరం ఎన్నికల ఫలితాల్లో కనిపించింది. రోబర్ట్స్గంజ్, మిర్జాపూర్‌లో కుర్మి- ఓబీసీ ప్రజలు ఎక్కువగా ఉంటారు. అక్కడ భాజపా కూటమిలో పోటీ చేసిన అప్నాదళ్(S) విజయం సాధించడంలో ఆశ్చర్యం లేదు. అప్పాదళ్ అధ్యక్షుడు అనుప్రియపటేల్ మోదీ కేబినెట్లో కొనసాగుతున్నారు. అదే విధంగా ఈ ఎన్నికల్లోనూ భాజపాతో పొత్తు పెట్టుకొన్నారు.
బీజేపీకికూటములే బలం
2017 శాసనసభ ఎన్నికల్లో ఈ స్థానాల్లో భాజపా పట్టు సాధించిందంటే కారణం దాని కూటమి పార్టీలు. అప్నాదళ్, సుహుల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(SBSP) పార్టీలు కీలకమైన కుర్మి, రాజ్‌భర్ వెనుకబడిన వర్గాల మద్దతును కూడగట్టాయి. ఎస్బీఎస్పీ మూడు స్థానాల్లో, అప్నాదళ్ నాలుగు స్థానాల్లో విజయం సాధించాయి. నిషాద్ పార్టీ స్వతంత్రంగా పోటీ చేసి ఓ స్థానాన్ని గెలుచుకొంది. ఈ ఎన్నికల్లో భాజపా పొత్తులో ముగ్గురు అభ్యర్థులను ఎన్నికల్లో దించింది. గతేడాది డిసెంబరులో వారణాసిలో కాశీవిశ్వనాథుడి గుడి నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఆ ప్రభావం హిందువుల మీద కనిపిస్తుంది. వారణాసి నుంచి మోదీ పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటి నుంచి ఆ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో భాజపా హవా కనిపిస్తోంది. అదే విధంగా అజమ్గర్లో ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌కు మంచి పట్టు ఉంది. ఆ పార్టీతో పొత్తు పెట్టుకొన్న పార్టీలపై భాజపా నేరారోపణలు చేస్తోంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.