Explained: ధనిక దేశమైన బ్రిటన్‌లో ఆహార పదార్థాల కొరత.. సమస్యకు కారణాలు ఏంటి ?

ప్రతీకాత్మక చిత్రం

మెక్‌డొనాల్డ్స్ ఆగస్టులో యూకేలోని 1,250 రెస్టారెంట్లలో మిల్క్‌షేక్‌లను అమ్మడం ఆపివేసింది. అందుకు ఫుడ్ ట్రక్ డ్రైవర్ల కొరతే ప్రధాన కారణం. చికెన్ సరఫరా లేక నండోస్ ఫుడ్ చైన్ యూకేలోని కొన్ని అవుట్‌లెట్‌లను మూసివేయాల్సి వచ్చింది.

  • Share this:
ప్రస్తుతం యూకేలోని ఫుడ్ ఇండస్ట్రీస్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీనికి ప్రధాన కారణం కార్మికులు, ట్రక్ డ్రైవర్ల కొరతేనని స్పష్టమవుతోంది. డ్రైవర్ల కొరత వల్ల ఫుడ్ ప్రొడక్ట్స్ సరఫరాలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. బ్రెగ్జిట్ (బ్రిటన్‌ నిష్క్రమించే ప్రక్రియ), కరోనా, పన్ను సంస్కరణలు, డ్రైవింగ్ టెస్ట్ బ్యాక్‌లాగ్‌ల వల్ల లక్షల సంఖ్యలో ట్రక్ డ్రైవర్ల కొరత ఏర్పడింది. గత వారంలో ఫుడ్ అండ్ డ్రింక్ ఫెడరేషన్ (FDF) అధిపతి ఇయాన్ రైట్ మాట్లాడుతూ.. కొన్ని ఆహార ఉత్పత్తుల సరఫరాలో శాశ్వత కొరత ఏర్పడే అవకాశం ఉందన్నారు. కార్మికులు అందుబాటులో లేనందున ముఖ్యమైన ఆహార పదార్థాలను సరఫరా చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కానీ యూకే ప్రభుత్వం మాత్రం శాశ్వత కొరత అనేది ఉండదని చెబుతోంది.

మెక్‌డొనాల్డ్స్ ఆగస్టులో యూకేలోని 1,250 రెస్టారెంట్లలో మిల్క్‌షేక్‌లను అమ్మడం ఆపివేసింది. అందుకు ఫుడ్ ట్రక్ డ్రైవర్ల కొరతే ప్రధాన కారణం. చికెన్ సరఫరా లేక నండోస్ ఫుడ్ చైన్ యూకేలోని కొన్ని అవుట్‌లెట్‌లను మూసివేయాల్సి వచ్చింది.

* యూకేలోని కార్మికుల కొరత ఏం చెబుతోంది?
బ్రిటన్ వ్యాప్తంగా అనేక రంగాలు, వ్యాపారాలు కార్మికుల కొరతను ఎదుర్కొంటున్నాయని బ్రిటిష్ పౌల్ట్రీ కౌన్సిల్ (BPC) పేర్కొంది. బ్రెగ్జిట్ తరువాత యూకేలో శాశ్వత నివాసితులు కాని కార్మికులు నిరంతరాయంగా వలస పోతున్నారు. కార్మిక సిబ్బంది, నైపుణ్యాల కొరత ఆహార ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తూనే ఉంటుందని బ్రిటీష్ మీట్ ప్రాసెసర్స్ అసోసియేషన్ (BMPA) ఆగస్టులో వివరించింది.

అనేక మీట్ (Meat) తయారీ కంపెనీలకు క్రిస్టమస్ షెడ్యూల్ ప్రకారం ఆహారాలను ఉత్పత్తి చేసేందుకు ఇంకా ఆరు వారాలే మిగిలి ఉన్నాయని బీఎంపీఎ వ్యాఖ్యానించింది. పిగ్ మీట్, గామన్ రోస్ట్‌ల కొరత అనేది ఇప్పుడు అనివార్యంగా కనిపిస్తోందని అభిప్రాయపడింది. మీట్ కంపెనీలకు ఈ కార్మికుల కొరత నుంచి గట్టెక్కడం కష్టసాధ్యంగా మారిందని బీఎంపీఎ ఒక ప్రకటనలో తెలిపింది.

కొంతమంది రిటైలర్లు డ్రైవర్లకు ఉద్యోగంలో చేరే సమయంలోనే బోనస్‌లు చెల్లిస్తున్నారు. ఈ డ్రైవర్లను తమ సరఫరాదారుల నుంచే నియమించుకుంటున్నారు. దాంతో తయారీదారుల వద్ద పనిచేసే డ్రైవర్ల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఫలితంగా వారు తమ ఉత్పత్తులను పంపిణీ కేంద్రాలకు తరలించడం కష్టతరం అవుతోంది. అలాగే ముడిసరుకులను తీసుకు రావడంలో కూడా తయారీ దారులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని బీఎంపీఎ వెల్లడించింది. విస్తుపోయే నిజమేమిటంటే.. తయారీదారులు ఫుడ్ సప్లై చేయడంలో విఫలమవుతున్నారని రిటైలర్లు జరిమానాలు విధిస్తున్నారు.

Sleep: నగ్నంగా పడుకోవడం వల్ల ఎన్నో లాభాలు.. చాలా సమస్యలకు పరిష్కారం.. అవేంటో తెలుసుకోండి

Revanth Reddy: కాంగ్రెస్ ముఖ్యనేత కీలక వ్యాఖ్యలు.. రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్

* ట్రక్ డ్రైవర్ల కొరత ఎందుకు ఉంది?
ఏప్రిల్‌లో రోడ్ హౌలేజ్ అసోసియేషన్ (RHA) డ్రైవర్ కొరతను తగ్గించడానికి తక్షణమే చొరవ తీసుకోవాలని పిలుపునిచ్చింది. ఏప్రిల్ 2021 నుంచి అమల్లోకి వచ్చిన IR35 పన్ను మార్పుల కారణంగా డ్రైవర్ల కొరత మరింత తీవ్రతరమైందని తెలుస్తోంది. కరోనా మహమ్మారి విజృంభనకు ముందే ఈయూ(EU) ట్రక్కర్లు బ్రెగ్జిట్ కారణంగా ఇంటి ముఖం పట్టారని ఆర్‌హెచ్‌ఏ వెల్లడించింది. లాక్‌డౌన్ కాలంలో కొత్త డ్రైవర్‌లను పరీక్షించడంలో సంబంధిత అధికారులు చాలా వెనుకబడ్డారని తెలిపింది. ప్రభుత్వం త్వరితగతిన డ్రైవర్ల కొరతను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆర్‌హెచ్‌ఏ పిలుపునిచ్చింది.
Published by:Kishore Akkaladevi
First published: