Home /News /explained /

UNIQUE FEATURES AND INTERESTING FACTS ABOUT ARCH OF THE CHENAB BRIDGE SSR GH

Chenab Arch Bridge: ప్రపంచంలోనే ఎత్తయిన వంతెనగా చీనాబ్ ఆర్చ్ బ్రిడ్జి.. దీని ప్రత్యేకతలేంటంటే..

చీనాబ్ ఆర్చ్ బ్రిడ్జి

చీనాబ్ ఆర్చ్ బ్రిడ్జి

ఐకానిక్ చీనాబ్ ఆర్చ్ బ్రిడ్జ్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఈ వంతెన కాశ్మీర్‌ని, మిగిలిన రాష్ట్రానికి, దేశానికి కలపడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. అన్ని సీజన్లలోనూ ఇది అందుబాటులో ఉంటుంది. ఈ ప్రధాన ఆర్చ్‌కు చెందిన రెండు దిగువ చివరలను...

ఇంకా చదవండి ...
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెనగా గుర్తింపు తెచ్చుకుంది చీనాబ్ ఆర్చ్ బ్రిడ్జి. సోమవారంతో ఈ వంతెన నిర్మాణం పూర్తయింది. పారిస్‌లోని ఈఫిల్ టవర్ కంటే 30 మీటర్ల ఎత్తులో దీన్ని నిచారు. ఈ వంతెన 359 మీటర్ల ఎత్తును కలిగి ఉంది. ఈ ఐకానిక్ చీనాబ్ ఆర్చ్ బ్రిడ్జ్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఈ వంతెన కాశ్మీర్‌ని, మిగిలిన రాష్ట్రానికి, దేశానికి కలపడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. అన్ని సీజన్లలోనూ ఇది అందుబాటులో ఉంటుంది. ఈ ప్రధాన ఆర్చ్‌కు చెందిన రెండు దిగువ చివరలను ఇప్పటికే అనుసంధానించారు. ఎగువ వంపు ఇప్పుడు పూర్తయింది.

చీనాబ్ ఆర్చ్ బ్రిడ్జి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు..

ఈ ప్రతిష్టాత్మక వంతెనను ఉత్తర రైల్వే నిర్మించింది. రైల్వే లింకు ప్రాజెక్టులో భాగంగా 272 కిలోమీటర్లను కలుపుతుంది. 28 వేల కోట్ల రూపాయల వ్యయంతో దీని నిర్మాణానికి రూపకల్పన చేశారు.


ఈ వంతెన భూకంపాలను తట్టుకునేలా నిర్మించారు. అధిక తీవ్రత పేలుళ్లు, రిక్టరు స్కేలుపై 8 స్థాయి కలిగిన భూకంపాలను కూడా తట్టుకునే సామర్థ్యంతో నిర్మించారు.


14 మీటర్ల డ్యూయల్ క్యారేజ్ వే ను కలిగి ఉండి 12 మీటర్ల వెడల్పుతో సెంట్రల్ అంచు కలిగి ఉన్న ఈ బ్రిడ్జ్ 120 ఏళ్ల జీవిత కాలం వరకు ఉంటుంది. 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినా తట్టుకునే సామర్థాన్ని కలిగి ఉండేలా ఏర్పాటు చేశారు.


ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన స్టీల్ ను ఉపయోగించారు. ఇది ప్రాజెక్ట్ ఖర్చును చాలా వరకు తగ్గించింది. దీంతో పాటు మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను, 200 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా కూడా తట్టుకొని నిలవగలిగే శక్తి దీని సొంతం.


రైలు లింక్ సన్నాహాలు 2002లో ప్రారంభమయ్యాయి. కశ్మీర్‌కు ఉత్తరాన ఉన్న బారాముల్లాను దిల్లీకి అనుసంధానించాలని మొదటి ప్రణాళికలో అనుకున్నారు. భాజపా నేతృత్వంలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అధిక ప్రాధాన్యతమిచ్చింది. అయితే వాతావరణ పరిస్థితులు, ఒప్పంద సమస్యల కారణంగా ఈ ప్రాజెక్టుకు చాలా ఆలస్యంగా జరిగిందని అధికారులు తెలిపారు.


2019 చివరి నాటికి నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంతో 2017 జులైలో మళ్లీ వంతెన పనులు ప్రారంభమయ్యాయి. అయితే 2018లో కాంట్రాక్టు సమస్యల కారణంగా ఆలస్యం అయింది. కరోనా మహమ్మారి కూడా ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడానికి కారణమైంది. ప్రాజెక్టు పూర్తి తేదీని డిసెంబరు 2021 నాటికి సవరించారు.


ఈ ప్రాజెక్టు పురోగతి గురించి గత నెలలో రైల్వే మంత్రిత్వ శాఖ ప్రజలకు తెలియజేసింది. చీనాబ్ వంతెన పొడవు వచ్చేసి 1315 మీటర్లు ఉంది. 17 విస్తీర్ణాలతో చీనాబ్ నది అడ్డంగా వంపుతో ఈ వంతెనను నిర్మించారు. దీని పరిధి 467 మీటర్లు.
First published:

Tags: Indian Railways, Jammu and Kashmir

తదుపరి వార్తలు