హోమ్ /వార్తలు /Explained /

Explained: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో మళ్లీ తెరపైకి వచ్చిన నియో-నాజీ గ్రూప్ అజోవ్ రెజిమెంట్.. అసలు ఏంటీ రెజిమెంట్‌..?

Explained: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో మళ్లీ తెరపైకి వచ్చిన నియో-నాజీ గ్రూప్ అజోవ్ రెజిమెంట్.. అసలు ఏంటీ రెజిమెంట్‌..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రష్యా దండయాత్ర తర్వాత ఒక ఉక్రెయిన్ నియో-నాజీ గ్రూప్ మళ్లీ వెలుగులోకి వచ్చింది. అదే అజోవ్ రెజిమెంట్. ప్రస్తుతం ఉక్రెయిన్‌పై పట్టును నిలుపుకోవడానికి అజోవ్ రెజిమెంట్ భయపడుతోంది.

రష్యా(Russia) దండయాత్ర తర్వాత ఒక ఉక్రెయిన్ నియో-నాజీ గ్రూప్ మళ్లీ వెలుగులోకి వచ్చింది. అదే అజోవ్ రెజిమెంట్. ప్రస్తుతం ఉక్రెయిన్‌పై(Ukraine) పట్టును నిలుపుకోవడానికి అజోవ్ రెజిమెంట్ భయపడుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ రైట్ వింగ్ గ్రూప్ హిస్టరీ(History), ఈ యూనిట్‌కు రష్యాపై ఎందుకు వ్యతిరేకత ఏర్పడింది? వంటి విషయాలు తెలుసుకుందాం. ఒక రకంగా ఉక్రెయిన్‌ను 'డీనాజిఫై' చేయాలన్న పుతిన్ ప్రతిజ్ఞను అజోవ్ బెటాలియన్ ప్రేరేపించినట్లు వార్తలు వస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతున్న తరుణంలో ఈ ఉక్రేనియన్(Ukraine) తీవ్రవాద మిలిటరీ రెజిమెంట్ మళ్లీ వార్తల్లో నిలుస్తుంది. కీవ్‌పై దాడి లక్ష్యాలలో ఉక్రెయిన్‌ను "డీనాజిఫై చేయడం" ఒకటని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ఇటీవల "అజోవ్ ఫైటర్స్" తమ బుల్లెట్లకు(Bullets) పంది కొవ్వు పూస్తున్నట్లు చూపించే వీడియోను ఉక్రెయిన్ నేషనల్ గార్డ్ ట్వీట్ చేసింది. ఉక్రెయిన్‌లో రష్యా కోసం పోరాడుతున్న ముస్లిం చెచెన్‌లపై వీటిని ఉపయోగించారని గార్డ్ పేర్కొంది. ఇదే సమయంలో డేంజరస్ ఇండివిడ్యువల్స్ అండ్ ఆర్గనైజేషన్స్ పాలసీ ప్రకారం అజోవ్ బెటాలియన్‌పై విధించిన నిషేధాన్ని ఫేస్‌బుక్ కంపెనీ వెనక్కి తీసుకోవడం గమనార్హం.

రైతులకు శుభవార్త : ఆ రుణాలన్నీ మాఫీ -రూ. 16,144 కోట్ల భారం తగ్గినట్లే -సాగుకు భారీగా నిధులు


అజోవ్ రెజిమెంట్ అంటే ఏమిటి?

అజోవ్ అనేది ఆల్ట్రా-రైట్ ఆల్-వాలంటీర్ పదాతిదళ సైనిక విభాగం. దీని సభ్యులు అల్ట్రా- నేషలిస్ట్స్, అతివాదులు. నియో-నాజీ, శ్వేతజాతీయుల ఆధిపత్య భావజాలం ఉన్న దాదాపు 900 మంది సైనికులతో కూడిన యూనిట్ ఇది. మే 2014లో అల్ట్రా-నేషనలిస్ట్ "పేట్రియాట్ ఆఫ్ ఉక్రెయిన్" సంస్థ నుంచి వాలంటరీ గ్రూప్‌గా ఏర్పడింది. ఈ గ్రూప్ వ్యవస్థాపక సభ్యుల్లో కొందరు నియో-నాజీ సోషల్ నేషనల్ అసెంబ్లీ (SNA)కి చెందినవారు సైతం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఉక్రెయిన్‌లోని మైనారిటీ వర్గాలపై SNA గ్రూప్ దాడులు చేసింది. జెనోఫోబిక్, నియో-నాజీ ఆలోచనలను ప్రచారం చేస్తున్నట్లు.. వలసదారులు, వారి అభిప్రాయాలను వ్యతిరేకించే వ్యక్తులపై దాడులకు పాల్పడుతున్నట్లు రెండు గ్రూపులపై నిందలు ఉన్నాయి.

ఈ యూనిట్‌కు ఆండ్రీ బిలేట్స్కీ నాయకత్వం వహించారు. ఉక్రెయిన్ పేట్రియాట్, SNA రెండింటికీ నాయకుడిగా పనిచేశారు. 2010లో ఉక్రెయిన్ జాతీయ ఉద్దేశం "ప్రపంచంలోని శ్వేతజాతీయులను చివరి క్రూసేడ్‌ (పవిత్ర యుద్ధం)లో గెలిపించడం" అని బిలేట్స్కీ చెప్పారు. 2014 నుంచి 2019 వరకు పార్లమెంటు సభ్యుడు అయిన తర్వాత యూనిట్ నుంచి బిలెట్స్కీ నిష్క్రమించారు. 2014లో ఉక్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ నుంచి ఈ బెటాలియన్ నిధులు పొందింది.

ఇదే సమయంలో నియో-నాజీ భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలను గ్రూప్ లీడర్స్ ఖండించారు. 2015లో అజోవ్ రిక్రూట్‌మెంట్లలో 10 నుంచి 20% మంది నియో-నాజీలు అని అప్పటి రెజిమెంట్ ప్రతినిధి ఆండ్రీ డయాచెంకో తెలిపారు. అజోవ్ సభ్యుల యూనిఫారాలు, శరీరాలపై కనిపించే 'హకెన్‌క్రూజ్', SS రెగాలియా వంటి నాజీ చిహ్నాలు ఉన్నాయి. అజోవ్ సైనికుల యూనిఫాం కూడా నియో-నాజీ వోల్ఫ్‌సాంగెల్ చిహ్నాన్ని కలిగి ఉండటం గమనార్హం. తాము నియో-నాజీలుగా, ఫార్-రైట్ అల్ట్రా-నేషనలిస్టులుగా వ్యక్తిగతంగా బెటాలియన్‌లోని చాలా మంది సభ్యులు అంగీకరించారు. నివేదికల ప్రకారం సాయుధ దళాలలో నియో-నాజీల గ్రూప్ ఉన్న ఏకైక దేశం ఉక్రెయిన్ మాత్రమే.

 Dirty Bomb : ఉక్రెయిన్ పై రష్యా దాడికి అసలు కారణం ఇదేనట..న్యూక్లియర్ "డర్టీ బాంబ్" రెడీ చేస్తున్న ఉక్రెయిన్!

పుతిన్ "డీనాజిఫికేషన్" ప్రకటన.. అజోవ్ ఫైటర్లను తొలగించే ప్రయత్నమా?

ఉక్రెయిన్‌లోని తూర్పు ప్రాంతమైన డొనెట్స్క్‌లో రష్యా అనుకూల వేర్పాటువాదులకు వ్యతిరేకంగా పోరాడిన బెటాలియన్ ఇది. నవంబర్ 2014లో డాన్‌బాస్ ప్రాంతాన్ని పుతిన్ ఆక్రమించిన తర్వాత.. అధికారికంగా నేషనల్ గార్డ్ ఆఫ్ ఉక్రెయిన్‌లో ఈ యూనిట్ విలీనమైంది. అప్పటి ప్రెసిడెంట్ పెట్రో పోరోషెంకో నుంచి ఈ రెజిమెంట్ ప్రశంసలు పొందింది.

రష్యా అనుకూల తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా తన సొంత సైన్యం చాలా బలహీనంగా ఉందని గుర్తించిన తర్వాత.. అజోవ్ ఫైటర్స్‌కు ఉక్రేనియన్ ప్రభుత్వం మద్దతిచ్చింది. ఈ దళాలు ఒలిగార్చ్‌ల నుంచి ప్రైవేట్‌గా నిధులు పొందాయి. ఈ విషయంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఎనర్జీ మాగ్నెట్ బిలియనీర్ ఇగోర్ కొలోమోయిస్కీ ప్రముఖుడు. 2014లో రష్యా అనుకూల తిరుగుబాటుదారులతో పోరాడేందుకు అనేక ఇతర బెటాలియన్లకు కూడా కొలొమోయిస్కీ నిధులు సమకూర్చారు. దొనేత్సక్ ప్రాంతానికి బిలియనీర్ గవర్నర్ అయిన సెర్హి తరుటా నుంచి కూడా అజోవ్ రెజిమెంట్ నిధులు పొందింది. ఉక్రెయిన్‌ను మాదకద్రవ్యాలకు బానిసలైన, నియో-నాజీ నాయకత్వం నుంచి విముక్తి చేస్తామని పుతిన్ ప్రతిజ్ఞ చేశారు.

Petrol Diesel ధరల కంటే భారీ షాకిచ్చే ఘటన: పెట్రోల్ బంకులో డీజిల్ అంటూ నీళ్లు అమ్మేస్తున్నారు!


ఉక్రెయిన్ రైట్ ట్రైనింగ్ గ్రౌండ్‌గా మారుతుందా?

ఉక్రెయిన్- రష్యా యుద్ధం కారణంగా అనేక మంది శ్వేతజాతీయుల ఆధిపత్యవాదులు, నియో-నాజీలు కొత్తగా ఉద్భవించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్ పోరాటం కొన్ని మితవాద గ్రూపులకు రియట్ వరల్డ్ ఫైటింగ్ ఎక్స్‌పీరియన్స్‌ పొందేందుకు అవకాశం కల్పిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అనేక మితవాద గ్రూపులు ఉక్రెయిన్‌కు ప్రయాణించడం పట్ల తాము ఆందోళన చెందుతున్నామని తీవ్రవాద గ్రూపులను పర్యవేక్షించే వాచ్‌డాగ్స్ ప్రకటించాయి.


పాశ్చాత్య దేశాలకు చెందిన తీవ్రవాద గ్రూపులు ఉక్రెయిన్ యుద్ధాన్ని తమ స్వదేశాల్లో భవిష్యత్తులో హింసకు శిక్షణగా భావించవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రష్యాకు వ్యతిరేకంగా యుద్ధంలో చేరడానికి ఆసక్తి ఉన్న విదేశీ పౌరుల కోసం "అంతర్జాతీయ దళాన్ని" ఉక్రెయిన్ పెంచింది. ఉక్రెయిన్‌పై దాడి చేయడం వల్ల తీవ్రవాద గ్రూపులు ఈ ఘర్షణల్లో పాల్గొనేందుకు ఆన్‌లైన్ యాక్టివిటీస్‌ పెంచినట్లు నివేదికలు చెబుతున్నాయి.

First published:

Tags: Explained, Russia, Russia-Ukraine War, Ukraine

ఉత్తమ కథలు