మహిళకు ముద్దులు.. ఆ ఫొటోలో ఉన్నది తానేనన్న మంత్రి.. ఇంతకీ ఆ మహిళ ఎవరంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ఓ మహిళకు మంత్రి ముద్దులు పెడుతున్న ఫొటో ఒకటి బయటకు లీకైంది. ఇది కాస్తా రాజకీయ వర్గాల్లో తీవ్ర వేడిని రాజేసింది.

 • Share this:
  ఓ మహిళకు మంత్రి ముద్దులు పెడుతున్న ఫొటో ఒకటి బయటకు లీకైంది. ఇది కాస్తా రాజకీయ వర్గాల్లో తీవ్ర వేడిని రాజేసింది. ఈ ఫొటో నిజమైనదేనా, లేక ఎవరైనా మార్ఫ్ చేసి ఉంటారా అనే వాదనలు కూడా ప్రారంభం అయ్యాయి. అయితే ఈ ఫొటో వ్యవహారంపై స్పందించిన సదురు మంత్రి అందులో ఉన్నది తానేనని అంగీకరించాడు. ఫొటో నిజమైనదేనని ఒప్పుకున్నాడు. ఈ ఘటన యూకేలో చోటుచేసుకుంది. ఆ ఫొటోలో ఉన్నది యూకే ఆరోగ్య శాఖ మంత్రి మాట్ హన్‌కాక్(Matt Hancock). వివరాలు.. రూపర్డ్ మర్డోక్ కు చెందిన ద సన్ టాబ్లాయిడ్ ఈ ముద్దు ఫోటోను కవర్ పేజీ బ్యానర్ ఐటమ్‌గా ప్రచురించింది. అయితే ఫొటోలను ఎలా సంపాదించిందో మాత్రం వెల్లడించలేదు.

  ఈ ఫొటో మే 6 నుంచి 11 మధ్య కాలంలో తీసిందని.. అప్పటికీ ఇంకా లాక్‌డౌన్ నిబంధనలు ఎత్తివేయలేదని పేర్కొంది. ఇంట్లో వ్యక్తులతో తప్ప బయటివారికి హాగ్స్ ఇవ్వడం, వారితో శారీరక సంబంధం పెట్టుకోవడానికి అనుమతించని రోజుల్లో ఈ ఘటన జరిగిందని తెలిపింది. అంతేకాకుండా ఆ ఫొటోలో ఉన్న మహిళను హన్‌కాక్.. 2000 సంవత్సరంలో Oxford Universityలో కలిశాడనే ఆరోపణలు ఉన్నాయి. గత నెలలోనే ఆమెను Hancock తన సహాయ అధికారిగా నియమించుకున్నారట. అంటే ప్రస్తుతం ఆమె ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగుతున్నారు.

  ఇక, వీరికి సంబంధించిన ఫొటో తీవ్ర స్థాయిలో చర్చకు దారితీసింది. దీంతో స్పందించిన హన్‌కాక్.. ఆ ఫొటో తనదేనని అంగీకరించాడు. అయితే తాను సోషల్ డిస్టెన్స్ పాటించలేకపోయానని.. నిబంధనలు ఉల్లంఘించానని చెప్పాడు. ప్రజలను క్షమాపణ కోరారు. దేశాన్ని కరోనా పరిస్థితుల నుంచి కాపాడేందుకు కృషి చేస్తానని చెప్పారు.
  Published by:Sumanth Kanukula
  First published: