Home /News /explained /

UAE GOLDEN JUBILEE FROM TENTS TO SKYSCRAPERS FIFTY YEARS OF UAE REIGN GH EVK

UAE Golden Jubilee: గుడారాల నుంచి ఆకాశ హర్మ్యాల వరకు.. 50 సంవత్సరాల UAE విజయ ప్రస్థానం

 ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

United Arab Emirates | 1971, డిసెంబర్ 2న.. అబుదాబి, అజ్మాన్, దుబాయ్, ఫుజైరా, రస్ అల్ ఖైమా, షార్జా, ఉమ్ అల్ క్వైన్‌లతో కూడిన ఏడు ఎమిరేట్‌ల సమాఖ్యగా UAE ఏర్పడింది. ప్రతి ఎమిరేట్‌ను ఒక షేక్ పాలిస్తాడు. వారందరూ కలిసి ఫెడరల్ సుప్రీం కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తారు. ఇలా యాభై ఏళ్లు పూర్తి చేసుకొన్న‌యూఏఈ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు సిద్ధమైంది. ఆ దేశం ఏర్పడి ఈ గురువారం అంటే డిసెంబర్ 2 నాటికి 50 ఏళ్లు పూర్తికానున్నాయి. మధ్యప్రాచ్యంలోని ఈ చిన్న దేశం ఎన్నో ప్రత్యేకతలకు నిలయంగా మారింది. పశ్చిమ ఆసియాలో (Western Asia) ని అరేబియా ద్వీపకల్ప దేశమైన యూఏఈకి ఒమన్, సౌదీ అరేబియా సరిహద్దులుగా ఉన్నాయి. పర్షియన్ గల్ఫ్‌ (Gulf) లో ఖతార్, ఇరాన్‌ (Iran)లతో సముద్ర సరిహద్దులను కలిగి ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం నుంచి లోతైన డైవింగ్ పూల్ వరకు.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఎన్నో ప్రత్యేకతలకు కేంద్రంగా మారింది.

1971, డిసెంబర్ 2న.. అబుదాబి, అజ్మాన్, దుబాయ్, ఫుజైరా, రస్ అల్ ఖైమా, షార్జా, ఉమ్ అల్ క్వైన్‌లతో కూడిన ఏడు ఎమిరేట్‌ల సమాఖ్యగా UAE ఏర్పడింది. ప్రతి ఎమిరేట్‌ను ఒక షేక్ పాలిస్తాడు. వారందరూ కలిసి ఫెడరల్ సుప్రీం కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తారు. వారిలో ఒకరు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడిగా పనిచేస్తారు. షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్-నహ్యాన్ (Sheikh Zayed bin Sultan Al-Nahyan) నేతృత్వంలో ఈ దేశం ఏర్పడింది. ఆయనను యూఏఈ జాతిపితగా పిలుస్తారు. 1971 డిసెంబర్ 2 ఫెడరేషన్ ఏర్పడినప్పటి నుంచి షేక్ జాయెద్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1966 నుంచి అబుదాబి ఎమిరేట్ పాలకుడిగా పనిచేశారు. గత 50 సంవత్సరాల్లో ఈ దేశం ఒక ఎడారి అవుట్‌పోస్ట్ నుంచి ప్రాంతీయ శక్తి కేంద్రంగా మారింది.

చమురు నిల్వలతో సంపద
UAE జనాభాలో 90 శాతం మంది విదేశీయులు ఉన్నారు. స్థానిక ఎమిరేట్స్ కలిసి ఒక ఫెడరేషన్‌గా యూఏఈ ఏర్పడింది. ఈ ఫెడరేషన్ ఏర్పడే నాటికి జనాభా దాదాపు మూడు లక్షలుగా ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 10 మిలియన్లకు పెరిగింది. అయితే ఆ దేశంలో కఠినమైన చట్టాలు అమల్లో ఉన్నందువల్ల వారిలో ఎక్కువ మంది పౌరసత్వానికి అనర్హులుగా మిగిలిపోయారు. యూఏఈ ప్రధాన ఆదాయ వనరు చమురు. చమురు నుంచి ఆర్జించిన సంపదతోనే ఆ దేశం ప్రస్తుత స్థాయికి ఎదిగింది. ఒకప్పుడు బ్రిటీషర్ల రక్షణలో ఉన్న ఈ దేశం.. గుడారాలు, సాధారణ మట్టి ఇటుకలతో నిర్మించిన ఇళ్ల సమూహంగా ఉండేది.

Open Book Exam: బుక్ చూసి ప‌రీక్ష‌లు రాయ‌డం ఈజీ కాదు.. ఓపెన్ బుక్ ఎగ్జామ్స్‌ మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసిన ఢిల్లీ యూనివ‌ర్సిటీ


కానీ ఇప్పుడు ఆర్థికంగా, రాజకీయంగా మధ్యప్రాచ్యంలో ప్రధాన దేశంగా ఎదిగింది. ఈ దేశంలోని దుబాయ్.. ఇప్పుడు బ్రష్ ట్రేడ్, ఫైనాన్షియల్ సెంటర్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనమైన బుర్జ్ ఖలీఫా వంటి ఆకాశహర్మ్యాలతో చూపరులను ఆకట్టుకుంటోంది.

 విదేశాంగ విధానంతో ఎదుగుదల
యూఏఈ దివంగత అధ్యక్షుడు షేక్ జాయెద్ అరబ్ జాతీయవాదాన్ని గాఢంగా విశ్వసించారు. ఏడు ఎమిరేట్స్‌ను ఒకే ఫెడరేషన్‌గా ఏకం చేసేందుకు ఆయన ఎంతో కృషి చేశారు. ప్రస్తుతం ఈ దేశం అరబ్ ప్రపంచంలో ఏకైక క్రియాత్మక ఫెడరల్ వ్యవస్థగా మిగిలిపోయింది. ప్రపంచంలోని అగ్రశ్రేణి ముడి ఉత్పత్తిదారులలో UAE ఒకటి. 1970ల నుంచి UAE వేగంగా వృద్ధిని నమోదు చేసింది. అయితే ఇందుకు కారణం దేశంలోని చమురు, గ్యాస్ నిల్వలేనని చెప్పుకోవచ్చు. ఈ సహజ సంపదతో వ్యాపారాలు చేపట్టిన ఈ చిన్న దేశం ఇప్పుడు ఒక ధనిక దేశంగా ఎదిగింది.

అయితే రాజధాని అబుదాబి (Abu Dhabi)తో పోలిస్తే తక్కువ చమురు వనరులు ఉన్న దుబాయ్ ఆర్థిక, రవాణా, పర్యాటక, మీడియా హబ్‌గా వికసించింది. సౌదీ అరేబియా తరువాత అరబ్ ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా యూఏఈ నిలుస్తోంది. దీంతోపాటు ఈజిప్ట్, ఇరాక్, సిరియా వంటి సాంప్రదాయ శక్తుల పతనంతో రాజకీయ ప్రభావాన్ని సైతం సంపాదించుకుంటోంది. 2011లో కొన్ని అరబ్‌ దేశాలు ఎదుర్కొన్న అరబ్ స్ప్రింగ్ (Arab Spring) తిరుగుబాట్లను చూసిన UAE మెరుగైన విదేశాంగ విధానాన్ని అవలంభిస్తోంది. ఒక బలమైన శక్తిగా యుద్ధాలలో పాల్గొనడం నుంచి మధ్యప్రాచ్యం, ఆఫ్రికా (Africa)లోని అనేక వివాదాల్లో మధ్యవర్తిత్వం వహించడం వరకు ఎన్నో మైలురాళ్లను ఆ దేశం చూసింది.

ప్రత్యేక నిర్ణయాలతో అభివృద్ధి
పొలిటికల్ ఇస్లాం అనే భావనకు వ్యతిరేకమైన UAE, గత సంవత్సరం ఇజ్రాయెల్‌ను గుర్తిస్తున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచింది. కొన్ని దశాబ్దాల అరబ్ ఏకాభిప్రాయాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. యెమెన్ సంఘర్షణలో జోక్యం చేసుకున్న సమయంలో మానవ హక్కుల సంఘాలు యూఏఈని విమర్శించాయి. హక్కుల ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపణలు, అసమ్మతివాదుల అసంతృప్తి వంటివి ఎమిరేట్స్ పెట్టుబడులను ఏమాత్రం అడ్డుకోలేకపోయాయి. దీంతో ఈ దిశగా మరిన్ని ముందుజాగ్రత్త చర్యలు చేపట్టి విజయవంతంగా పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది.

Explained: రైతు సంఘాలు ఎంఎస్‌పీ హామీ కోసం ఎందుకు డిమాండ్ చేస్తున్నాయి... గ్యారెంటీడ్ ఎంఎస్‌పీ అంటే ఏంటీ?


పెట్టుబడులను ఆకర్షించడానికి ఇటీవలి సంవత్సరాలలో చట్టాలను మార్చడంతో పాటు నిబంధనలను సైతం సడలించింది. ఇప్పుడు ఈ దేశం తనను తాను జీరో టాక్స్ హెవెన్‌గా పేర్కొంటోంది. స్థానికేతర యాజమాన్యంపై యూఏఈ పరిమితిని ఎత్తివేసింది. బిజినెస్ వెంచర్లపై పూర్తిగా విదేశీ నియంత్రణను అనుమతించింది. దీంతోపాటు పెట్టుబడిదారులకు, కళాకారులు, వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు వంటి ప్రతిభావంతులకు లాంగ్ టర్మ్ గోల్డెన్ వీసాలను సైతం అందించింది.

19వ శతాబ్దంలో ట్రూషియల్ స్టేట్స్‌గా పేరొందిన ఏడు ఎమిరేట్స్.. 1892 నుంచి బ్రిటిష్ రక్షిత ప్రాంతంగా ఉన్నాయి. కానీ ఎమిరేట్స్‌లో అతిపెద్ద, సంపన్నమైన, చమురు నిల్వలు ఉన్న అబుదాబిని పాలించిన షేక్ జాయెద్.. మొత్తం ఏడు ఎమిరేట్స్‌ను కలిపి ఒక శక్తిమంతమైన దేశంగా మార్చాలనుకున్నారు. ఇతర ఎమిరేట్స్‌ను ఒప్పించి ఒక ఫెడరేషన్‌గా యూఏఈని ఏర్పాటు చేశారు. గురువారం నాటికి ఈ దేశం 50 వసంతాలు పూర్తిచేసుకోనుంది. ఈ స్వర్ణోత్సవ వేడుకల్లో ఎయిర్‌షో, మౌంటెయిన్ లేక్‌పై ఫ్లోటింగ్ థియేట్రికల్ ప్రదర్శన, కవాతులు, కచేరీలు వంటి ఏర్పాట్లు ఉంటాయని అధికార వర్గాలు వెల్లడించాయి.
Published by:Sharath Chandra
First published:

Tags: Dubai, UAE

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు