హోమ్ /వార్తలు /Explained /

Explained: టీవీ స్క్రీన్లలో QLED, UHD, OLED డిస్‌ప్లేల మధ్య తేడా ఏంటి..? వీటిలో ఏది బెస్ట్..?

Explained: టీవీ స్క్రీన్లలో QLED, UHD, OLED డిస్‌ప్లేల మధ్య తేడా ఏంటి..? వీటిలో ఏది బెస్ట్..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం మనకు అనేక రకాల టీవీలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈరోజుల్లో టీవీ పర్ఫార్మెన్స్‌ను వాటి డిస్‌ప్లేల ఆధారంగా నిర్ణయిస్తున్నాయి. వీటిలో QLED, UHD, OLED వంటివి ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న డిస్‌ప్లే రకాలు.

ప్రస్తుతం మనకు అనేక రకాల టీవీలు(Televisions) అందుబాటులో ఉన్నాయి. అయితే ఈరోజుల్లో టీవీ పర్ఫార్మెన్స్‌ను వాటి డిస్‌ప్లేల(Display) ఆధారంగా నిర్ణయిస్తున్నాయి. వీటిలో QLED, UHD, OLED వంటివి ప్రస్తుతం మార్కెట్‌లో(Market) అందుబాటులో ఉన్న డిస్‌ప్లే రకాలు. ఏ రకానికి చెందిన డిస్‌ప్లే ఉపయోగకరంగా ఉంటుంది? వీటి ప్రయోజనాలు ఏంటి? వంటి వివరాలు తెలుసుకుందాం.

Explained : PPF అకౌంట్ అంటే ఏంటి..? PPF అకౌంట్‌ను ఎందుకు ఓపెన్ చేయాలి..? దీని ప్రయోజనాలు ఏవి..?


* QLED అంటే ఏంటి?

QLED అంటే క్వాంటం-డాట్ లైట్-ఎమిటింగ్ డయోడ్. QLED డిస్‌ప్లే సాధారణ LED డిస్‌ప్లే లాగా ఉంటుంది. ఇది డిస్‌ప్లే బ్రైట్‌నెస్‌, కలర్‌ను సూపర్-ఛార్జ్ చేయడానికి "క్వాంటం డాట్స్" అని పిలిచే అల్ట్రాఫైన్ కణాలను ఉపయోగిస్తుంది. QLED టెక్నాలజీని ఉపయోగించే డిస్‌ప్లేలు మెరుగైన రంగులను అందిస్తాయి. QLEDని 2013లో సోనీ పరిచయం చేసినప్పటికీ, Samsung ఇప్పుడు QLED టీవీలను విక్రయిస్తోంది. Sony, Vizio, Hisense, TCL వంటి ఇతర QLED తయారీదారులతో పార్ట్నర్‌షిప్స్ ఏర్పరచుకుంది. క్వాంటం డాట్స్‌లో చిన్న కణాలపై కాంతి ప్రకాశిస్తే మెరుస్తుంది. అవి వైరస్ కంటే కూడా చిన్నవి. అవి చాలా స్థిరంగా ఉంటాయి. LED డిస్‌ప్లేల మాదిరిగా కాకుండా వాటి ప్రభావం కాలక్రమేణా తగ్గిపోదు.

TSPSC Job Notification: నిరుద్యోగులకు అలర్ట్.. TSPSC నుంచి త్వరలో మరో జాబ్ నోటిఫికేషన్.. ఖాళీలు, విద్యార్హతలివే

 OLED అంటే ఏంటి?

ఆర్గానిక్ లైట్-ఎమిటింగ్ డయోడ్ (OLED) అనేది ఎలక్ట్రిసిటీ ద్వారా టోస్టర్‌లోని హీటింగ్ ఎలిమెంట్‌తో సమానంగా మెరిసే పదార్థాన్ని ఉపయోగించి తయారు చేశారు. OLEDలను ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌తో తయారు చేశారు. ప్రతి LED రంగుకు వేరే కర్బన సమ్మేళనం కూర్పు అవసరం కాబట్టి అవి కన్‌జంక్షన్‌లో వర్క్‌ చేసే భారీ ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌ను కలిగి ఉంటాయి. ప్రతి OLED పిక్సెల్ ఎంత విద్యుత్ ప్రవాహాన్ని పొందుతుంది అనేదానిపై ఆధారపడి, అది కాంతి ఫ్రీక్వెన్సీని ఉత్పత్తి చేస్తుంది. ఎక్కువ ఎలక్ట్రిసిటీ ఉంటే OLEDలు మరింత కాంతిని ఉత్పత్తి చేస్తాయి. OLED డిస్‌ప్లే చాలా ముదురు నలుపు రంగులను అందిస్తుంది. రోజుకు ఆరు గంటల పాటు TV చూస్తే, OLED TV జీవితకాలం దాదాపు 22 సంవత్సరాలు ఉంటుందని LG కంపెనీ తెలిపింది.

Explained : PPF అకౌంట్ అంటే ఏంటి..? PPF అకౌంట్‌ను ఎందుకు ఓపెన్ చేయాలి..? దీని ప్రయోజనాలు ఏవి..?


UHD అంటే ఏంటి?

UHD అనేది డిస్‌ప్లే టెక్నాలజీ రకం కాదు. ఇది అల్ట్రా హై డెఫినిషన్‌ని సూచిస్తుంది. ఇది డిస్‌ప్లే రిజల్యూషన్. ఇది 1080p లేదా 1,920 x 1,080, ఫుల్‌ HD కంటే ఎక్కువ రేంజ్‌. అల్ట్రా హై డెఫినిషన్ (UHD) దానిని నాలుగు రెట్లు పెంచి 3,840 x 2,160 రిజల్యూషన్‌గా చేస్తుంది. దీనిని 4K అని కూడా సూచిస్తారు.

Russia: మాస్కో సమీపంలో కనిపించిన పుతిన్ 'డూమ్‌ డే' విమానం.. ఆందోళనలో పశ్చిమ దేశాలు.. కారణం ఏంటంటే..


* వీటిలో ఏది బెస్ట్?

QLED, UHDని పోల్చలేం. ఎందుకంటే అవి ఒకేలా ఉండవు. అయినప్పటికీ UHDని పూర్తి HD, QLED లేదా OLED వంటి ఇతర డిస్‌ప్లే రిజల్యూషన్‌లతో Neo QLED, QD-OLED, NanoCell వంటి ఇతర డిస్‌ప్లే టెక్నాలజీలతో పోల్చవచ్చు. ఇలా అన్నింటినీ పోల్చి చూసినప్పుడు OLEDనే మెరుగ్గా ఉంటుంది. ఇది అధిక కాంట్రాస్ట్ రేషియోలను కలిగి ఉంది. తక్కువ శక్తిని ఉపయోగిస్తుంది. మెరుగైన వ్యూయింగ్ యాంగిల్స్ కలిగి ఉంటుంది. ఎక్కువ లైఫ్‌టైమ్, ఎక్కువ బ్రైట్‌నెస్, పెద్ద స్క్రీన్ సైజుతో వచ్చే ఈ డిస్‌ప్లేలు.. తక్కువ ధరల్లోనే అందుబాటులో ఉంటాయి.

First published:

Tags: 5g technology, Explained, LED TV

ఉత్తమ కథలు