హోమ్ /వార్తలు /Explained /

Explained: RFID ట్యాగ్‌లతో అమర్‌నాథ్ యాత్రికుల ట్రాకింగ్‌.. RFID ట్యాగ్స్ అంటే ఏంటి..? ఇవి ఎలా పనిచేస్తాయి..?

Explained: RFID ట్యాగ్‌లతో అమర్‌నాథ్ యాత్రికుల ట్రాకింగ్‌.. RFID ట్యాగ్స్ అంటే ఏంటి..? ఇవి ఎలా పనిచేస్తాయి..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

త్వరలో ప్రారంభం కానున్న అమర్‌నాథ్ యాత్ర కోసం హోం శాఖ అధికారులు తాజాగా ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష నిర్వహించారు. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID- Radio Frequency Identification) ట్యాగ్‌లను ఉపయోగించి యాత్రికులందరినీ ట్రాక్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇంకా చదవండి ...

త్వరలో ప్రారంభం కానున్న అమర్‌నాథ్ యాత్ర కోసం హోం శాఖ అధికారులు తాజాగా ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష నిర్వహించారు. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID- Radio Frequency Identification) ట్యాగ్‌లను ఉపయోగించి యాత్రికులందరినీ ట్రాక్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ టెక్నాలజీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.  RFID అంటే రేడియో ఫ్రీక్వేన్సీ ఐడెంటిఫికేషన్‌. ఇది ట్యాగ్‌లు(Tags), రీడర్‌లు(Readers) ఉండే వైర్‌లెస్ ట్రాకింగ్ సిస్టమ్. ఇందులో రేడియో తరంగాల ద్వారా వ్యక్తులు ఉన్న ప్రాంతాన్ని గుర్తించడం, సమాచారం చేరవేయడం జరుగుతుంది. చేతితో పట్టుకోగల లేదా స్తంభాలు, భవనాల వంటి స్థానాల్లో ఏర్పాటు చేయగలిగేలా పరికరాలు ఉంటాయి. ట్యాగ్‌లు ఎన్‌క్రిప్టెడ్ సమాచారం, సీరియల్‌ నంబర్లు, చిన్న వివరణలను ట్రాన్స్‌ఫర్‌ చేయగలవు. ఏవియేషన్‌ ఇండ్రస్ట్రీస్‌ కోసం తయారు చేసిన ఎక్కువ మొమరీ ఉన్న ట్యాగ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఎన్ని రకాల RFID ట్యాగ్‌లు ఉన్నాయి?ప్రస్తుతం ప్యాసివ్‌, యాక్టివ్‌ RFID ట్యాగ్‌లు ఉన్నాయి. యాక్టివ్ RFIDలు వాటి సొంత పవర్ సోర్స్‌ను ఉపయోగిస్తాయి, ఎక్కువగా బ్యాటరీలను ఉపయోగిస్తాయి. యాక్టివ్ ట్యాగ్‌లు ప్రతి కొన్ని సెకన్లకు సమాచారాన్ని సేకరించగలవు, రీడర్ సమీపంలోకి వచ్చిన వెంటనే యాక్టివేట్‌ అవుతాయి. ప్యాసివ్‌ RFIDలు, రీడర్‌ నుంచి ట్రాన్స్‌మిట్‌ అయ్యే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్‌ ఎనర్జీ ద్వారా యాక్టివేట్‌ అవుతాయి. రీడర్‌కు సమాచారాన్ని తిరిగి ప్రసారం చేయడానికి ట్యాగ్‌కి ఈ శక్తి సరిపోతుంది. యాక్టివ్ ట్యాగ్‌లు, ప్యాసివ్‌ ట్యాగ్‌లతో పోలిస్తే  దాదాపు 300 అడుగుల రీడ్ రేంజ్‌ ఉంటుంది.

Shocking: ఎయిమ్స్ చరిత్రలో తొలిసారి.. ఆరేళ్ల బాలిక అవయవదానం... అసలేం జరిగిందంటే..

RFIDలు ఎలా పని చేస్తాయి?తక్కువ ఫ్రీక్వెన్సీ(LF), హై ఫ్రీక్వెన్సీ(HF), అల్ట్రా-హై ఫ్రీక్వెన్సీ(UHF) వద్ద రేడియో తరంగాలను ఉపయోగించి రీడర్‌తో కమ్యూనికేట్ చేయడానికి RFID ట్యాగ్‌లు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, యాంటెన్నాను ఉపయోగిస్తాయి. రేడియో తరంగాల రూపంలో ట్యాగ్ ద్వారా తిరిగి పంపిన మెసేజ్‌ డేటాలోకి ట్రాన్స్‌లేట్‌ అవుతుంది. దాన్ని హోస్ట్ కంప్యూటర్ సిస్టమ్ అనలైజ్ చేస్తుంది. బార్‌కోడ్‌ల వలె కాకుండా, ఎక్కడో ఉన్న వస్తువులను RFIDల ద్వారా గుర్తించవ్చు. వాటి రేంజ్‌ కూడా పెద్దగా ఉంటుంది.

RFIDలు సాధారణంగా ఎక్కడ ఉపయోగిస్తారు? అవి ఆచరణాత్మకంగా ప్రతిచోటా ఉన్నాయి. రిటైల్ దిగ్గజాలు వాటిని ఇన్వెంటరీ ట్రాకింగ్ కోసం ఉపయోగిస్తాయి. RFID చిప్‌లు ల్యాబ్‌లలో యాక్సెస్ కీలుగా ఉపయోగపడతాయి. అవి క్రెడిట్ కార్డ్‌లు, లైబ్రరీ పుస్తకాలలో కూడా ఉంటున్నాయి. ఈ ఏడాది తన బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ .. ఇ-పాస్‌పోర్ట్‌లను జారీ చేయాలనే ప్రభుత్వ ప్రణాళిక గురించి మాట్లాడారు. ఇవి RFID చిప్‌లు ఉండే  పేపర్ పాస్‌పోర్ట్‌లు కావచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా టోల్ చెల్లింపుల కోసం ఉపయోగిస్తున్న ఫాస్ట్‌ట్యాగ్‌లు కూడా RFID ట్యాగ్‌ల కిందకే వస్తాయి.

RFID ట్యాగ్‌లను హ్యాక్ చేయడం సాధ్యమేనా?షేర్‌ చేస్తున్న డేటా ప్రకారం ట్యాగ్, రీడర్ మధ్య ఎన్‌క్రిప్షన్ గ్రేడ్‌లను ప్రవేశపెట్టవచ్చు. మెమరీలో ఎన్‌క్రిప్టెడ్‌ డేటా, క్రిప్టోగ్రాఫిక్ కీ ఉంటాయి. సాధారణ డేటాను దొంగిలించడం కష్టమైనప్పటికీ.. క్రిప్టోగ్రాఫిక్ సమాచారాన్ని సేకరించేందుకు హ్యాకర్లు 'సైడ్-ఛానల్ అటాక్స్'ని ఉపయోగించవచ్చు. ట్యాగ్ తయారీదారులు సెక్యూరిటీ ఫీచర్లను మెరుగుపరుస్తూనే ఉన్నందున హ్యాక్ చేయడం అంత సులభం కాదు.

అమర్‌నాథ్ యాత్రలో RFIDలను ఎందుకు ఉపయోగిస్తున్నారు?అమర్‌నాథ్ యాత్రికులందరినీ RFID ట్యాగ్‌లను ఉపయోగించి ట్రాక్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తీర్థయాత్రకు భద్రతా ముప్పు ఉందని తెలియడంతో ఈ నిర్ణయం తీసుకొంది. యాత్రకు సంబంధించిన భద్రతా సన్నద్ధతను సమీక్షించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశం అనంతరం ఈ నిర్ణయం ప్రకటించారు. కేంద్ర హోంశాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో..‘జమ్మూ, కాశ్మీర్ ప్రధాన కార్యదర్శి ద్వారా మొదటిసారిగా ప్రతి అమర్‌నాథ్ యాత్రికుడికి RIFD కార్డ్ ఇస్తారు. రూ.5 లక్షల ఇన్సూరెన్స్‌ కూడా ఉంటుంది. యాత్ర ప్రయాణ మార్గంలో టెంట్ సిటీ, వైఫై హాట్‌స్పాట్‌లు, లైటింగ్ వంటి సదుపాయాలు కల్పిస్తారు’ అని పేర్కొంది.

Published by:Veera Babu
First published:

Tags: Amarnath Yatra, Amarnath Yatra 2022, Explained, Rfid

ఉత్తమ కథలు