TOP UP LOAN ON CAR LOAN HOW TO APPLY WHEN TO APPLY BANKS OFFERING BA
Top-Up on Car Loan: కారు లోన్ మీద కూడా టాప్ అప్ తీసుకోవచ్చు? ఎలా తీసుకోవచ్చు? ఎంత ఇస్తారు?
ప్రతీకాత్మక చిత్రం
How to Apply for Top on Car Loan | కారు కొనడానికే కాదు. ఆ తర్వాత అవసరం అయితే దానిపై టాప్ అప్ లోన్ కూడా తీసుకోవచ్చు. అయితే, అందుకు ఉండాల్సిన అర్హతలు, ఏయే బ్యాంకులు ఎంత శాాతం టాప్ అప్ కార్ లోన్ ఇస్తున్నాయో తెలుసుకోండి.
నిర్ధిష్ట ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అందించే లోన్లు లేదా రుణాలను వ్యక్తులు ఎంచుకుంటారు. వర్సనల్ లోన్ (Personal Loan) , హోమ్ లోన్ (Home Loan), కార్ లోన్ (Car Loan) .. వంటి ఎన్నో రకాల లోన్లు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే పెళ్లి (Loan for Wedding), వైద్య అవసరాలు, ఇంటి పునర్నిర్మాణం (Home Loan Top Up) , వ్యాపార విస్తరణ వంటి అవసరాలకు అనుకోకుండా డబ్బు అవసరమైన సందర్భంలో.. ఇప్పటికే తీసుకున్న రుణాలపై టాప్ అప్ లోన్స్ తీసుకోవచ్చు.
టాప్ అప్ లోన్ అంటే ఏంటి? (What is Top Up Loan)
టాప్-అప్ లోన్ అనేది ఇప్పటికే ఉన్న లోన్ కంటే ఎక్కువ మొత్తంలో తీసుకునే రుణం. ప్రస్తుత లోన్‌పై సకాలంలో చెల్లింపులు చేసేవారు టాప్-అప్ లోన్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది రుణదాతలు తమ ప్రస్తుత కస్టమర్లకు అందించే యాడ్-ఆన్ సౌకర్యంగా చెప్పుకోవచ్చు. కార్లోన్పై తీసుకునే టాప్ అప్ లోన్‌ను ‘టాప్ అప్ కార్ లోన్’ అంటారు.
ప్రస్తుత కార్ లోన్‌పై టాప్-అప్ లోన్ అంటే? (Car Loan Top Up)
మీరు కార్ లోన్ తీసుకున్న తరువాత.. వ్యాపార, వ్యక్తిగత అవసరాలు, హౌజ్ రెన్నొవేషన్, పెళ్లి, వైద్య అత్యవసర ఖర్చులు వంటి వాటి కోసం అదనపు నిధులు అవసరమైతే, ఇప్పటికే ఉన్న కార్ లోన్‌పై టాప్-అప్ లోన్ తీసుకోవచ్చు. ఈ లోన్‌ను సులభంగా పొందవచ్చు. రుణదాత వద్ద ఇప్పటికే మీ వివరాలను ఉన్నందువల్ల తక్కువ డాక్యుమెంటేషన్ అవసరమవుతుంది. లోన్ ప్రాసెసింగ్‌కు కూడా చాలా తక్కువ సమయం పడుతుంది. రుణ గ్రహీతలు కనీసం 9 నెలల పాటు మంచి లోన్ రీపేమెంట్ రికార్డు కలిగి ఉంటే.. ఇప్పటికే ఉన్న కార్ లోన్ విలువలో 150% వరకు టాప్-అప్ లోన్ పొందవచ్చు.
అయితే ఈ టాప్ అప్ లోన్ అమౌంట్, వీటిపై వర్తించే వడ్డీ రేట్లు రుణదాతను బట్టి మారవచ్చు. ప్రధాన బ్యాంకులు అన్నీ టాప్ అప్ కార్ లోన్లు అందిస్తున్నాయి. ఈ జాబితాలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లు తమ కార్ లోన్లపై పెద్ద మొత్తంలో టాప్-అప్ లోన్లు అందిస్తున్నాయి. టాప్-అప్ లోన్‌గా పొందగలిగే లోన్ మొత్తం అనేది.. మీ ప్రస్తుత కార్ లోన్ విలువ, మీ రీపేమెంట్ ట్రాక్ రికార్డ్, వయసు, కారు మోడల్ వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది.
టాప్-అప్ కార్ లోన్‌ను ఎప్పుడు ఎంచుకోవాలి? (How to avail Car Loan Top Up)
ఇప్పటికే కార్ లోన్ తీసుకున్నవారికి, ఇతర అవసరాలకు అదనపు నిధులు అవసరమైనప్పుడు టాప్ అప్ లోన్‌కు వెళ్లవచ్చు. ఈ అదనపు నిధులకు అర్హత పొందేందుకు ప్రస్తుత కార్ లోన్‌పై నిర్ణీత సంఖ్యలో EMIలను క్రమం తప్పకుండా చెల్లించి ఉండాలి.
కఠినమైన డాక్యుమెంటేషన్, కొత్త లోన్ బ్యాంకుల చుట్టూ తిరగడం, ఎక్కువ సమయం కేటాయించడం.. వంటి అవాంతరాలు లేకుండా ఆర్థిక అవసరాలు తీర్చుకోవాలనుకునే వారు టాప్ అప్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.
వ్యక్తిగత, వ్యాపార అవసరాలు, ఇతర ఖర్చుల కోసం తక్షణ నిధులు అవసరమైనప్పుడు సైతం వీటిని ఎంచుకోవచ్చు.
ఒక వ్యక్తి వివిధ బ్యాంకుల్లో వివిధ రకాల రుణాలను (multiple loans) తీసుకోవడానికి బదులుగా రుణ ఏకీకరణ (debt consolidation) కోసం చూస్తున్నప్పుడు టాప్-అప్ లోన్లు బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తాయి.
కార్ లోన్‌పై టాప్-అప్ లోన్స్ అందిస్తున్న బ్యాంకులు..
హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank Car Loan Top Up)
HDFC బ్యాంక్ నుంచి తీసుకున్న ప్రస్తుత కార్ లోన్‌పై.. లోన్ విలువలో 150% వరకు టాప్-అప్ లోన్ పొందవచ్చు. ఈ బ్యాంక్‌లో టాప్-అప్ లోన్‌కు అర్హత పొందడానికి కస్టమర్లు కనీసం 9 నెలల పాటు లోన్ రీపేమెంట్ రికార్డును నిర్వహించాలి. మీరు వేరే బ్యాంకు నుంచి కార్ లోన్ తీసుకున్నప్పటికీ, హెచ్‌డీఎఫ్‌డీ బ్యాంకులో అకౌంట్ ఉంటే.. మీ ప్రస్తుత కార్ లోన్‌పై HDFC టాప్-అప్ లోన్‌ను అందిస్తుంది. హెచ్డీఎఫ్సీ ప్రస్తుత కస్టమర్లు నెట్‌బ్యాంకింగ్ లేదా హెచ్డీఎఫ్సీ ఏటీఎమ్‌ల ద్వారా కూడా టాప్-అప్ కార్ లోన్ పొందవచ్చు.
ఐసీఐసీఐ బ్యాంక్ టాప్-అప్ లోన్ (ICICI Bank Car Loan Top up)
ఇతర బ్యాంకులతో పోలిస్తే ఐసీఐసీఐ బ్యాంక్ టాప్-అప్ లోన్ ప్రాసెసింగ్ వేగంగా ఉంటుంది. డాక్యుమెంటేషన్ అవసరం కూడా తక్కువే. ఇప్పటికే ICICI బ్యాంక్ నుంచి కార్ లోన్ పొందిన కస్టమర్లు మాత్రమే టాప్ అప్ కార్ లోన్ పొందవచ్చు. దీనిపై వడ్డీ రేట్లు 9.35% నుంచి ప్రారంభమవుతాయి. బ్యాంకు అధికారిక వెబ్సైట్ ద్వారా, కస్టమర్ సపోర్ట్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా బ్యాంకు బ్రాంచ్ ద్వారా ఈ టాప్-అప్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
యాక్సిక్ బ్యాంక్ (Axis Bank Car Loan Top Up)
యాక్సిస్ బ్యాంక్ నుంచి తీసుకున్న కారు లోన్‌పై.. 50% వరకు టాప్-అప్ లోన్ పొందవచ్చు. యాక్సిస్ బ్యాంక్ టాప్-అప్ లోన్‌పై వడ్డీ రేటు 13.99% నుంచి ప్రారంభమవుతుంది. టాప్-అప్ కార్ లోన్ కనీస రుణం రూ.1 లక్ష ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లు ఎలాంటి డాక్యుమెంటేషన్ అవసరం లేకుండా టాప్-అప్ లోన్లపై ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లను ఆస్వాదించవచ్చు.
కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Bank Car Loan Top Up)
కోటక్ మహీంద్రా బ్యాంక్ తమ కార్ లోన్ కస్టమర్లకు కోటక్ ప్రైమ్ ట్రాక్ రికార్డ్ (KPTR), రిప్లస్ (Replus) అనే రెండు ప్రొడక్ట్స్ కింద టాప్-అప్ లోన్‌ను అందిస్తోంది. కోటక్ ప్రైమ్ ట్రాక్ రికార్డ్ లోన్ ఆఫర్ కింద.. మంచి రీపేమెంట్ హిస్టరీ ఉన్న కస్టమర్లు మాత్రమే టాప్-అప్ లోన్ పొందవచ్చు. రిప్లస్ అనేది 2 ఇన్ 1 లోన్ ఆఫర్. దీంట్లో కస్టమర్లు వ్యక్తిగత రుణం (పర్సనల్ లోన్), రీఫైనాన్స్ ప్రయోజనాలను ఒకేసారి పొందవచ్చు. ఇది మీ ప్రస్తుత కార్ లోన్‌పై సులభమైన ప్రీ-అప్రూవ్డ్ టాప్-అప్ లోన్‌ను అందిస్తుంది. ఈ బ్యాంకులో టాప్-అప్ కార్ లోన్ పొందడానికి కనీసం 12 నెలల పాటు కార్ లోన్‌ను విజయవంతంగా నిర్వహించి ఉండాలి. కోటక్ మహీంద్రా టాప్-అప్ కార్ లోన్‌ను 12 నెలలు, 24 నెలలు, 36 నెలల్లో తిరిగి చెల్లించే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ప్రస్తుత కార్ లోన్‌పై ఈ బ్యాంకు గరిష్టంగా 25 రెట్ల EMI వరకు టాప్-అప్ లోన్ అందిస్తుంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.