తిరుమల: పచ్చని ప్రకృతి రమణీయతకు పుట్టిన ఇల్లు శేషాచలం అటవీ ప్రాంతం. కోయిల రాగాలు, పక్షుల పదనిసలు, గజరాజుల ఘీంకారాలు, నెమ్మళ్ల నాట్య సోయగాలతో పాటు ఎన్నో వేల ఔషధ మొక్కలు కలిగిన అరుదైన అటవీ ప్రాంతానికి రక్షణ కరువైంది. జీవ వైవిధ్యా నిలయంగా ఉన్న అటవీ ప్రాంతం తరచు అగ్నికి ఆహుతి అవుతోంది. ఎగసి పడుతున్న మంటల వల్ల అరుదైన వృక్ష, జంతువులు అంతరించి పోయే ప్రమాదం ఉందని ప్రకృతి ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పంచే.., శేషాచల అటవీ ప్రాంతం దేశంలోనే ఏంతో ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. అందుకే భారత ప్రభుత్వం యునెస్కో మార్గదర్శకాల మేరకు శేషాచల అటవీ ప్రాంతాన్ని బయోస్పియర్ రిసర్వుగా ప్రటకటించింది. ప్రపంచంలో ఎక్క లేని నాణ్యమైన, అరుదైన ఎర్రచందనం పుట్టినిల్లు శేషాచలం. శేషాచల కొండలు నెలవయ్యాయని శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి ఈ ఏడు శేషాచల కొండలూ భౌగోళికంగా విశిష్టమైన సర్పాకృతిలో కనబడుతుంటాయి.
ఇక్కడన్న భౌగోళిక, ప్రకృతి సంపదను టీటీడీ అటవీశాఖ పరిరక్షిస్తోంది. ఏడు కొండలు తిరుమలలో మొదలై కర్నూలు జిల్లాలోని కుందేరు నది వరకు 4756 చ.కి.మీ విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి. శేషాచల కొండల్లో సుమారు 365 జలపాతాలున్నాయి. జీవ వైవిధ్యం ఇక్కడ విస్తృతంగా ఉండటంతో ప్రభుత్వం జాతీయ స్థాయిలో 1989లో శేషాచలాన్ని శ్రీవేంకటేశ్వర అభయారణ్యంగా ప్రకటించి. ఇక్కడి అరుదైన భౌగోళిక, ఆధ్యాత్మిక, ప్రకృతి సంపదను పరిరక్షిస్తోంది. ఐతే తరచూ చెలరేగుతున్న కార్చిచ్చుతో జీవాల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్నాయి.
అటవీ ప్రాంతంలో సహజంగానే అనేక జంతు జాతికి నెలవుగా మారుతుంది. సప్తగిరుల్లో ఎన్నో రకాల క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచర జీవులు, కీటకాలు, సూక్ష్మ జీవులు, శిలీంధ్రాలతో శేషాచల అడవి జీవ వైవిద్యాన్ని చాటుకుంటోంది. ఇక్కడ ఇప్పటి వరకూ 38 రకాల క్షీరదాలను గుర్తించారు. ఏనుగులు, చిరుతపులి, వేటకుక్కలు, ఎలుగు బంట్లు, పునుగుపిల్లి, గుంటనక్కలు, అడవి పంది, అడవిపిల్లి, ముంగిస, కణితులు, దుప్పులు, చుక్కల జింక, కొండ గొర్రె, బెట్లు ఉడత, దేవాంగ పిల్లి ఉన్నాయి. క్షీరదాలతోపాటు 178 రకాల పక్షిజాతులను కూడా గుర్తించారు. ఇక్కడే ప్రత్యేకించి చెప్పుకోదగిన 27 రకాల సరీసృప జాతులు ఉన్నాయి. ఇందులో 3 కొత్తరకాల సర్పాలు బయోస్పియర్ రిజర్వు ల్యాబ్ పరిశోధనల్లో వెలుగులోకి వచ్చాయి. వీటితోపాటు 12 రకాల ఉభయచర జీవులను, 12 రకాల బల్లి జాతులు కనుగొన్నారు అటవీ శాఖా అధికారులు. ఇందులో అంతరించిపోయే దశలో ఉన్న బంగారు బల్లి ప్రధానమైందిగా చెప్పుకోవచ్చు. భారతదేశంలో హిమాలయపర్వత శ్రేణుల్లో తప్ప మరెక్కడా కనిపించని అరుదైన జాతిగా పునుగుపిల్లి రికార్డుల్లోకి చేరింది. ప్రస్తుతం ఇవి తిరుమల కొండల్లో తమ ఆవాసాలను ఏర్పాటు చేసుకున్నాయి.
సంజీవని వనంగా పిలిచే శేషాచలంలో 1450 రకాల మొక్కలు ఉన్నాయి. ఇందులో 1300 మొక్కల వరకూ అపారమైన ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని పరిశోధనలో తేలింది. ఇవి శేషాచలంలో తప్ప ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. అగ్నిప్రమాదాల్లో ఈ అరుదైన వృక్ష జాతులు తక్కువ కాలంలోనే అంతరించేపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు చర్యలుఫైర్ ప్రొటె స్టింగ్ వాల్స్ నిర్మించటం, బోద కసువును తొలగించే ప్రయత్నం చేయాల్సి ఉంది. ప్రమాదాలను తక్షణమే గుర్తించే విధంగా ఫారెస్ట్ గార్డ్స్‌తో కూడిన వాచ్‌టవర్స్ ఏర్పాటు చేసి అటవీ ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు అటవీ ప్రాంతాన్ని పరిశీలించాల్సి ఉంటుంది.
మంటలు ఆర్పేందుకు అందుబాటులోకి వచ్చిన రసాయన పదార్థాలను వినియోగించాల్సిన అవసరం ఉంది. 24 గంటలూ తగినంత సిబ్బందిని అందుబాటులోకి ఉంచి... చెట్ల మధ్య రాపిడి వల్ల మంటలు విస్తరించకుండా ముందస్తు చర్యలు చెప్పటాల్సిన అవసరం ఉంది.
అటవీప్రాంతాల్లో అగ్గి పడే అవకాశాలు తగ్గించేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వేసవిలో జనాన్ని అడవుల్లోకి అనుమతించకుండా ప్రత్యేక శ్రద్ద చూపాలవి పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Tirumala