Hanuman Birth Place: హనుమంతుని జన్మస్థానం తిరుమలే..! టీటీడీ చెప్తున్న ఆధారాలు ఇవే..!

హనుమంతుడి జన్మస్థానంపై టీటీడీ పరిశోధన

హనుమంతుని (Hanuman) జన్మస్థలం తిరుమలే(Tirumala) అని నిరూపించేందుకు టీటీడీ పాలకమండలి (TTD Board) అన్ని రకాల ఆధారాలతో సిద్ధమైంది. ఈ క్రమంలో ఆంజనేయుని జన్మరహస్యాన్ని ప్రకటించనుంది.

 • Share this:
  రామబంటు హనుమంతుని జన్మస్తలంపై సర్వత్రా సందిగ్ధత నెలకొంది. హనుమ జన్మస్థలం ఎక్కడ? పురాణ ఇతిహాసాలు హనుమ జన్మస్థలం ఎక్కడని చెపుతున్నాయి..? ఈ ఒక్క ప్రశ్నకు ఎన్నో సమాధానాలు.. కొందరు మహా రాష్ట్రాల్లో అంటుంటే, గుజరాత్ అంటూ మరి కొందరు, జార్ఖండ్ లోనే హనుమంతుడు జన్మిండానికి వాదోప వాదాలు వినిపిస్తున్నారు. కలియుగంలో శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన ఆ ఏడు కొండల్లే అసలైన మారుతీ జన్మ స్థలమని టీటీడీ చెప్తోంది. దీనిని నిరూపిస్తామని కూడా ప్రకటించింది. శ్రీవారి ఆలయం ఎదుట ఉన్న బేడి ఆంజనేయ స్వామి చరిత్ర ఏం చెపుతోంది...? హనుమ పుట్టిన పుణ్యభుమి తిరుమలగా టీటీడీ రుజువు చేయనుంది. అసలు టీటీడీ వద్ద ఉన్న ఆధారాలేంటి..? ఇన్నాళ్లూ తెరపైకి రాని హనుమ జన్మస్థలం ఇప్పుడు రావడికి కారణం కూడా లేకపోలేదు. హనుమ జన్మస్థలం తిరుమల కొండల్లోని జాపాలి తీర్థం అని, జాపాలి తీర్ధంను టీటీడి నిర్లక్ష్యం చేస్తోందని చరిత్రకారులు, భక్తులు విమర్శలు చేస్తున్నారు. దీంతో టీటీడీ ఈఓ కెఎస్ జవహర్ రెడ్డి పండితులను, ఆగమ సలహాదారులకు హనుమ స్థలంపై పురాణా, ఇతిహాసాలను అధ్యయనం చేసి హనుమ జన్మస్థలం ఎక్కడ అనే విషయాని తెలపాలని ఆదేశించారు.

  హనుమ జన్మస్థలం అంజనాద్రి పేరిట డా.ఏవిఎస్జి హనుమథ్ ప్రసాద్ గ్రంధాన్ని రచించారు. హనుమ చరిత్రకు శ్రీ పరాశర సంహిత గ్రంథంప్రామాణికం అని, స్కంద పురాణంలోను ఇదే అంశాని ప్రస్తావించినట్లు పురాణాలూ చెపుతున్నాయి. పవన సుతుడు, రామ భక్తుడు, అంజనీ పుత్రుని జన్మస్థల వివాదం ఈ నాటిది కాదు. హనుమంతుడి జన్మస్థలం ఇక్కడే అంటూ ఎన్నో పుణ్యక్షేత్రాలు ప్రసిద్ది చెందుతున్నాయి. అంజనాదేవి హనుమతునికి జన్మనిచ్చిన స్థలంగా మరికొన్ని ఆలయాలు విరాజిల్లుతున్నాయి. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రపంచ ప్రఖ్యాత హైందవ పవిత్ర పుణ్య క్షేత్రం తిరిమాలలో వెలసిన జాపాలి హనుమాన్ ఆలయ ఒకటి. ఈ నేపధ్యంలో అంజనీపుత్రుని జన్మస్తలంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. తిరుమల గిరులకు అంజనాద్రి అనే పేరు ఎలా వచ్చిందో ముందుగా తెలుసుకోవాలి. పవన పుత్రుడు హనుమతినికి తిరుమల గిరులకు ఉన్న సంబంధం ఏంటి. ఇన్ని ప్రశ్నలకు సమాధానం కావాలంటే త్రేతాయుగం కాలం నాటికి వెళ్ళాల్సిందే.

  పచ్చని కొండల నుదుటిన ఏర్రటి సింధూరంగా విరాజిల్లుతున్న జాపాలి మహా తీర్థం హనుమ జన్మస్థలమని చరిత్ర కారులు., పురాణ...ఇతిహాసాలు చెపుతున్నాయి. రాముని జన్మస్థలమైనా.., శ్రీ వేంకటేశ్వరుని కలియుగం వైకుంఠం ఎక్కడ అని తెలిపేవే..! మహా మునులు, మహర్షులు రచించిన గ్రంథాలు. వేంకటాద్రి పర్వతంలోనే హనుమంతుడు జన్మించాడని పురాణాలు, వేద గ్రంథాలు చెపుతున్నాయి. వేంకటాచల మహాత్యం, భావిశోత్తర పురాణంలో ఆంజనేయ జన్మస్థలంపై ప్రస్తావించినట్లు వేదపండితులు చెపుతున్నారు. వేంకటేశ్వరుడు కొలువైన శేషాచలంలో హనుమ వైభవం గురించి పూర్తిగా అధరాలు ఉన్నాయి.

  Tirumala Tirupati Devasthanam, Tirumala Temple, Birth Place of Lord Hanuman, Lord Hanuman, Anjaneya Swamy, Hanuman Temple, Tirumala News, TTD Board, Tirumala Timing, Tirupati, Tirupati news, Andhra Pradesh, Andhra Pradesh News, Ap news, Andhra News, తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల ఆలయం, ఆంజనేయుని జన్మస్థలం, హనుమాన్, ఆంజనేయ స్వామి, హనుమాన్ ఆలయం, తిరుమల వార్తలు, తిరుపతి వార్తలు, తిరుమల సమయాలు, టీటీడీ బోర్డు, తిరుపతి, ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వార్తలు
  హనుమంతుడి జన్మస్థలంపై టీటీడీ పరిశోధన


  ఒక్కో యుగంలో ఒక్కో పేరుతో పిలువబడ్డ అంజనాద్రి పర్వతం

  కృతయుగంలో తిరుమల కొండను వృషబాద్రి అని, త్రేతాయుగంలో అంజనాద్రని, ద్వాపర యుగంలో శేషాచలం అని, కలియుగంలో వెంకటాచలం పిలువబడుతోందని పురాణాల్లో పేర్కొనబడ్డాయి. నాలుగు యుగాలలో తిరుగిరులకు నాలుగు పేర్లతో పిలువబడుతోందని మహర్షులు లిఖించిన పురాణాలు చెపుతున్నాయి. త్రేతాయుగంలో అంజనాద్రి అనే పేరు ఎందుకు వచ్చిందో భావిశోత్త్రర పురాణంలో పూర్తి వివరాలు తెలపబడ్డాయి. భావిసోత్తర పురాణంలోని మొదటి అధ్యయంలోని 79వా శ్లోకం నుంచి హనుమ జన్మస్థలం, జన్మ రహస్యం గురించి చెప్పబడింది.

  జనక మహారాజు శతానంద మహర్షికి చెప్పిన కథే....ఆంజనేయ జన్మరాసహ్యం
  అంజనాదేవి హనుమంతునికి జన్మనిచ్చింది కాబట్టే వెంకటాద్రికి అంజనాద్రి అనే పేరు వచ్చిందట. జనక మహారాజు శతానంద మహర్షిని ఇలా ప్రస్నించాడట. శతానంద మహర్షి ఈ పర్వతానికి అంజనాద్రి అనే పేరు ఎలా వచ్చిందని ప్రశ్నించాడు. అందుకు అంజనాద్రి చరిత్రను శతానంద మహర్షి చెపుతూ......కేసరి, అంజనాదేవి అనే దంపతులలు సంతానం కలుగక పోవడంతో మాతంగి మహర్షి దగ్గరకు వెళ్లి సుపుత్రయోగం, పున్నమ నరక విముక్తికి మార్గం చెప్పాలని ప్రార్ధిస్తుంది. పంప సరోవరానికి యాభై యోజనాల దూరంలో నృసింహ ఆశ్రమం ఉంది , ఆ ఆశ్రమానికి దక్షిణ దిశలలో నారాయణ పర్వతం ఉందని మాతంగి మహర్షి చెపుతాడు. అక్కడ స్వామి పుస్కరిణి ఉందని.., అక్కడ పుణ్యస్నానం ఆచరించి, అక్కడి నుంచి ఒక యోజన దూరంలో ఉన్న ఆకాశ గంగ తీర్థంలో 12 ఏళ్ళపాటు తపస్సు చేస్తే పుత్రబాగ్యం పుత్రభాగ్యం కలుగుతుందని మాతంగి మహర్షి అంజనాదేవికి మార్గం చెపుతారు.

  హనుమంతుడి జన్మస్థలంపై టీటీడీ పరిశోధన


  మాతంగి మహర్షి చెప్పిన విధంగానే వెంకటాద్రికి చేరుకున్న అంజనాదేవి పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించి, అశ్వద వృక్షాని ప్రదక్షిణ చేసి, అక్కడ నుంచి ఒక క్రోస దూరంలో ఉన్న ఆకాశ గంగ తీర్థంలో తపస్సు ఆచరిస్తుంది అంజనాదేవి. ముందుగా బక్ష బోజ్యదులన్ని వదిలిపెట్టి దేహాని కటివలె మలుచుకొని తపస్సు ఆచరిస్తుంది. తపస్సును మెచ్చిన వాయు దేవుడు అంజనాదేవి చేతిలో ఒక ఫలాని ఇస్తాడు. ఆ ఫలం ద్వార అంజనాదేవి సుపుత్ర యోగం కలిగి, తొమ్మిది మాసాలు మోసి హనుమాన్ కు ఆ ఆకాశ గంగ తీర్థం సమీపంలోని జాపాలిలో శ్రవణ మాసంలో హరివాసంలో జన్మనిస్తుంది. చిరంజీవి హనుమ పుట్టిన స్థలం కాబట్టే వేంకటాచలనికి అంజనాద్రి అనే పేరు వచ్చిందని ద్వాదశ పురాణాలు పేర్కొంటున్నాయి. అదుకే ఆ బ్రహ్మ దేవుడు అంజనాదేవికి శేషాద్రి పర్వతం అంజనాద్రి అనే పేరుతో పిలువబడుతుందని వరం ఇచ్చునట్లు భావిశోత్తర పురాణంలో స్పష్టం చేయబడింది.

  జపాలిలో స్వయం వ్యక్తమైన హనుమంతుడు
  జాపాలి ప్రాంతంలో హనుమ జన్మస్తలనికి ప్రతీకగా హనుమాన్ ఆలయానికి నిర్మించారు. పూర్వం జాపాలి అనే మహర్షి తన శిష్యులతో కలసి శ్రీ వేంకటేశ్వరుని ఆరాధించేవాడట. స్వామి వారికి సేవలు చేసేవాడట. శ్రీ శ్రీనివాసునికై జాపాలి మహర్షి జపం ఆచరించి, ప్రసన్నం చేసుకోవడంతో ఈ తీర్థానికి జాపాలి అనే పేరు వచ్చింది. 15వ శతాబ్దంలో విజయ రాఘవ రాయులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాలు చెపుతున్నాయి. మొదట దట్టమైన అటవీ ప్రాంతంలో పూజకు నోచుకోని ఆలయం 15వ శతాబ్దం అనంతరం పూజలు దూపదీప నైవేద్యాలు సమర్పిస్తున్నారు. తిరుమల క్షేత్రం మహంతుల పాలనలోకి వెళ్ళిన తరువాత జపాలి తిర్ధాని అభివృద్ధి చేశారు. ఇప్పటికీ జపాలీ తీర్థం మహంతుల పాలనలోనే ఉంది. ఇక తిరుమలలో స్వామి వారి ఆలయానికి అభిముఖంగా అంజలి ఘటిస్తున్న బంగిమలో బేడి ఆంజనేయ స్వామి మనకు దర్శనమిస్తారు. త్రేతాయుగంలో రామబద్రునికి సేవ చేసిన హనుమంతుడు.., కలియుగంలో వెంకటేశ్వరుడే రాముడిగా భావించి కనులార స్వామి వారిని వీక్షిస్తూ.., స్వామి వారికి సేవ చేస్తున్నాడు. భగవంతునికి భక్తుడు ఏప్పుడు ఒక మెట్టు పైనే అనే మాటకు నిదర్శనంగా వెంకన్న ఆలయానికంటే హనుమ ఆలయం ఎత్తులో ఉంటుంది.
  అసలు బేడి ఆంజనేయ స్వామి అనే పేరు ఆలయానికి ఎందుకు వచ్చిందో అందరికి సందేహం వస్తుంది. త్రేతాయుగంలో బాల హనుమ ఒంటెను వెతుకుతూ అంజనాద్రి పర్వతాని వీడేంత పనిచేసాడట. అందుకోసమే ఆ అంజనాదేవి ఆంజనేయుని కాళ్ళకు, చేతులకు సంకెళ్ళు వేసింది అంట. కలియుగం ప్రారంభం నుంచి వరాహ స్వామి, శ్రీవారికి నైవేద్యం సమర్పణ అనంతరం బేడి ఆంజనేయ స్వామి వారికీ నైవేద్య సమర్పణ జరుగుతోందని స్థల పురాణం చెబుతోంది.

  తిరుమల హనుమ జన్మస్థలమని పురాణాల ద్వారా నిర్ధారించిన కమిటీ
  హిందువుల ఆరాధ్య‌దైవం, క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారు కొలువైన తిరుమ‌ల హ‌నుమంతుని జ‌న్మ‌స్థానంగా కూడా గుర్తింపు పొంద‌నుంది. ఈ నెల 13న తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది నాడు ఈ విష‌యాన్ని పురాణాలు, శాస‌నాలు, శాస్త్రీయ‌ ఆధారాల‌తో స‌హా నిరూపించేందుకు ‌టిటిడి సిద్ధమైంది. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల కార్యాల‌యంలో ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి ఈ విష‌యంపై క‌మిటీ స‌భ్యుల‌తో సుదీర్ఘంగా స‌మీక్షించారు..

  క‌మిటీలోని పండితులు జ్యోతిష్య శాస్త్రం, శాస‌నాలు, పురాణాలు, శాస్త్రీయ ఆధారాల‌తో ఉగాది నాడు టీటీడీ పుస్తకాన్ని భక్తులకు అందించనుంది. హ‌నుమంతుని జ‌న్మ‌స్థానం అంజనాద్రి అని నిరూపించేందుకు ఉన్న ఆధారాలు, ఇత‌ర వివ‌రాల‌తో త్వ‌ర‌లో స‌మ‌గ్ర‌మైన పుస్త‌కాన్ని తీసుకొస్తోంది టీటీడీ. అంజ‌నాద్రి కొండ‌లో హ‌నుమంతుడు జ‌న్మించాడ‌నే విష‌యాన్ని ఆధారాల‌తో నిరూపించేందుకు 2020 డిసెంబ‌రులో టిటిడి పండితుల‌తో ఒక క‌మిటీని ఏర్పాటుచేసిన విష‌యం విదిత‌మే. ఈ క‌మిటీలో ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ఆచార్య స‌న్నిధానం సుదర్శ‌న‌శ‌ర్మ‌, జాతీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ఆచార్య ముర‌ళీధ‌ర శ‌ర్మ‌, ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి, ఆచార్య జాన‌మ‌ద్ది రామ‌కృష్ణ‌, ఆచార్య శంక‌ర‌నారాయ‌ణ‌, ఇస్రో శాస్త్రవేత్త రేమెళ్ల మూర్తి, రాష్ట్ర పురావ‌స్తు శాఖ డెప్యూటీ డైరెక్ట‌ర్ విజ‌య్‌కుమార్ స‌భ్యులుగా ఉన్నారు. టిటిడి ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ క‌న్వీన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ క‌మిటీలోని పండితులు ప‌లుమార్లు స‌మావేశాలు నిర్వ‌హించి లోతుగా ప‌రిశోధ‌న చేసి హ‌నుమంతుడు అంజ‌నాద్రిలోనే జ‌న్మించాడ‌ని రుజువు చేసేందుకు బ‌ల‌మైన ఆధారాలు సేక‌రించారు. శివ‌, బ్ర‌హ్మ‌, బ్ర‌హ్మాండ‌, వ‌రాహ‌, మ‌త్స్య పురాణాలు, వేంక‌టాచ‌ల మ‌హ‌త్యం గ్రంథం, వ‌రాహ‌మిహిరుని బృహ‌త్‌సంహిత గ్రంథాల ప్ర‌కారం శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి చెంత గ‌ల అంజ‌నాద్రి కొండే ఆంజ‌నేయుని జ‌న్మ‌స్థాన‌మ‌ని యుగం ప్ర‌కారం, తేదీ ప్ర‌కారం నిర్ధారించారు
  Published by:Purna Chandra
  First published: