హోమ్ /వార్తలు /Explained /

Hanuman Birth Place: ఆంజనేయుడి జన్మస్థలం ఇదే అనడానికి టీటీడీ సంపాదించిన ఆధారాలు ఇవే..!

Hanuman Birth Place: ఆంజనేయుడి జన్మస్థలం ఇదే అనడానికి టీటీడీ సంపాదించిన ఆధారాలు ఇవే..!

ఎవరి వాదన ఎలా ఉన్నా ఆంజనేయుడు పుట్టింది తిరుమల ఏడుకొండలలోని అంజనాద్రి అంటోంది టీటీడీ. అనడమే కాదు.. అందుకు సంబంధించిన బ్రహ్మాండపురాణాన్ని హనుమంతుడి బర్త్ సర్టిఫికెట్‌గా చూపిస్తోంది. ఇక్కడే కర్నాటక తెరపైకి వచ్చింది. హనుమంతుడు విషయంలో ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తెచ్చింది. మా అంజన్నను మీరెలా క్లెయిమ్ చేసుకుంటారని నిలదీస్తోంది.

ఎవరి వాదన ఎలా ఉన్నా ఆంజనేయుడు పుట్టింది తిరుమల ఏడుకొండలలోని అంజనాద్రి అంటోంది టీటీడీ. అనడమే కాదు.. అందుకు సంబంధించిన బ్రహ్మాండపురాణాన్ని హనుమంతుడి బర్త్ సర్టిఫికెట్‌గా చూపిస్తోంది. ఇక్కడే కర్నాటక తెరపైకి వచ్చింది. హనుమంతుడు విషయంలో ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తెచ్చింది. మా అంజన్నను మీరెలా క్లెయిమ్ చేసుకుంటారని నిలదీస్తోంది.

Lord Hanuman: హనుమంతుడు, ఆంజనేయుడు, రామబంటు, వాయు పుత్రుడు, భక్త కౌసల్యుడు, మారుతీ అని ఆయనను పిలిచింది పేర్లకన్నా జన్మస్థలం మావే అంటూ వినిపించే వాదనలు మరింత ఎక్కువ అయ్యాయి.

శ్రీ రామ జన్మభూమి అయోధ్యలో మందిర నిర్మాణంకు శంఖుస్థాపన చేసిన నాటి నుంచి రామ బంటు హనుమాన్ జన్మస్థలపై విభిన్న కథనాలు వినిపించాయి. హనుమ జన్మస్థలం హంపి అంటూ ఒకరు, జార్ఖండ్, గుజరాత్, హర్యానా, మహారాష్ట్ర అంటూ సమాధానాలు వినిపిస్తూ వచ్చాయి. ఒక్కటే ప్రశ్న మరెన్నో సమాధానాలు వినిపించాయి. ఐతే వీటన్నికి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఫుల్ స్టాప్ పెడుతూ ఆధారాలతో సహా కలియుగ నాయకుడు కొలువైన వెంకటచలమే అంజనా దేవి ఆంజనేయుడుకి జన్మనిచ్చిన పుణ్యస్థలమని స్పష్టం చేసింది. అసలు టీటీడీ ఎలాంట అంశాలను ప్రామాణికంగా తీసుకుంది. అంజనాద్రే హనుమ జన్మస్థలం అని రుజువు చేసిన టీటీడీ వద్ద ఉన్న ఆధారలలేంటి..? హనుమంతుడు., ఆంజనేయుడు, రామబంటు, వాయు పుత్రుడు, భక్త కౌసల్యుడు, మారుతీ అని ఆయనను పిలిచింది పేర్లకన్నా జన్మస్థలం మావే అంటూ వినిపించే వాదనలు మరింత ఎక్కువ అయ్యాయి. ఈ కలియుగాన వెంకటాచలంగా పిలువబడే అంజనాద్రే నిజమైన హనుమ జన్మస్థలమని పలువురు పండితులు, స్థానికులు, భక్తులు టీటీడీ దృష్టికి తీసుకెళ్లారు.

సానుకూలంగా స్పందించిన టీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి ప్రత్యేక పండితుల కమిటీని ఏర్పాటు చేసి....వేదాల్లో నిష్ఠాగరిష్టులైన వారిని హనుమ జన్మస్థలంపై అధ్యయనం చేయాలని కోరారు. శాస్త్రం, శాస‌నాలు, పురాణాలు, శాస్త్రీయ ఆధారాల‌తో ఉగాది నాడు ఈ విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల‌న్నారు. హ‌నుమంతుని జ‌న్మ‌స్థానం అంజనాద్రి అని నిరూపించేందుకు ఉన్న ఆధారాలు, ఇత‌ర వివ‌రాల‌తో త్వ‌ర‌లో స‌మ‌గ్ర‌మైన పుస్త‌కాన్ని తీసుకురావాల‌న్నారు. అంజ‌నాద్రి కొండ‌లో హ‌నుమంతుడు జ‌న్మించాడ‌నే విష‌యాన్ని ఆధారాల‌తో నిరూపించేందుకు 2020 డిసెంబ‌రులో టిటిడి పండితుల‌తో ఒక క‌మిటీని ఏర్పాటుచేసిన విష‌యం విదిత‌మే. ఈ క‌మిటీలో ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ఆచార్య స‌న్నిధానం సుదర్శ‌న‌శ‌ర్మ‌, జాతీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ఆచార్య ముర‌ళీధ‌ర శ‌ర్మ‌, ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి, ఆచార్య జాన‌మ‌ద్ది రామ‌కృష్ణ‌, ఆచార్య శంక‌ర‌నారాయ‌ణ‌, ఇస్రో శాస్త్రవేత్త రేమెళ్ల మూర్తి, రాష్ట్ర పురావ‌స్తు శాఖ డెప్యూటీ డైరెక్ట‌ర్ విజ‌య్‌కుమార్ స‌భ్యులుగా ఉన్నారు. టిటిడి ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ క‌న్వీన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ క‌మిటీలోని పండితులు ప‌లుమార్లు స‌మావేశాలు నిర్వ‌హించి లోతుగా ప‌రిశోధ‌న చేసి హ‌నుమంతుడు అంజ‌నాద్రిలోనే జ‌న్మించాడ‌ని రుజువు చేసేందుకు బ‌ల‌మైన ఆధారాలు సేక‌రించారు.

Tirumala Tirupati Devasthanam, Tirumala Temple, Birth Place of Lord Hanuman, Lord Hanuman, Anjaneya Swamy, Hanuman Temple, Tirumala News, TTD Board, Tirumala Timing, Tirupati, Tirupati news, Andhra Pradesh, Andhra Pradesh News, Ap news, Andhra News, తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల ఆలయం, ఆంజనేయుని జన్మస్థలం, హనుమాన్, ఆంజనేయ స్వామి, హనుమాన్ ఆలయం, తిరుమల వార్తలు, తిరుపతి వార్తలు, తిరుమల సమయాలు, టీటీడీ బోర్డు, తిరుపతి, ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వార్తలుlord hanuman birth place anjanidri hills, ttd eo javahar reddy shows proofs, what is the hanuman birth place, lord hanuman birth place contravention, tirumala was lord hanuman birth place, ఆంజనేయుడి పుట్టిన ప్రదేశం ఇదే. ఆధారాలు చూపించిన ఈవో జవహర్ రెడ్డి, హనుమంతుడి పుట్టిన ప్రదేశంపై వివాదం, అంజనేయుడి పుట్టిన ప్రదేశం, హనుమతి పుట్టిన ప్రదేశం ఇదే
అంజనాద్రిపై హనుమంతుడి ఆలయం.

శివ‌, బ్ర‌హ్మ‌, బ్ర‌హ్మాండ‌, వ‌రాహ‌, మ‌త్స్య పురాణాలు, వేంక‌టాచ‌ల మ‌హ‌త్యం గ్రంథం, వ‌రాహ‌మిహిరుని బృహ‌త్‌సంహిత గ్రంథాల ప్ర‌కారం శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి చెంత గ‌ల అంజ‌నాద్రి కొండే ఆంజ‌నేయుని జ‌న్మ‌స్థాన‌మ‌ని స్పష్టం చేసారు. హిందువుల ఆరాధ్య‌దైవం, క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారు కొలువైన తిరుమ‌ల హ‌నుమంతుని జ‌న్మ‌స్థానంగా కూడా గుర్తింపు పొంద‌నుంది. ఈ నెల 13న తెలుగు సంవ‌త్స‌రాది ఉగాదినాడు ఈ విష‌యాన్ని పురాణాలు, శాస‌నాలు, శాస్త్రీయ‌ ఆధారాల‌తో స‌హా నిరూపించేందుకు సిద్ధమైన టీటీడీ... శ్రీరామ నవమి నాడు రుజువు చేస్తే బాగుంటుందని భావించి నవమినాడే కీలక ప్రకటన చేసింది.

టీటీడీ పరిగణలోకి తీసుకున్న అంశాలేంటి.?

టీటీడీ ఏర్పాటు చేసిన వేద అధ్యయన కమిటీ ముఖ్యంగా నాలుగు అంశాలను ప్రామాణికంగా తీసుకుంది. పౌరాణిక ప్రమాణాలు, వాఙ్మయ ప్రమాణాలు, శాసన ప్రమాణాలు, భౌగోళిక ప్రమాణాలుగా తీసుకున్నారు. కలియుగ నాయకుడైన శ్రీవేంకటేశ్వరుడు.., పురాణ పురుషుడు, పురాణప్రియుడు కూడా.., కలౌ వెంకట నాయకుని గురించి తెలిపే వేద పురాణాలకన్నా ప్రాచీనమైన గ్రంధాలూ మారేవి లేవు అని పురాణాలూ చెపుతున్నాయి. స్కంద, వరాహ, బ్రహ్మాండ పురాణాలు, శ్రీవారి మహత్యాన్ని తెలిపే వేంకటాచల మహత్యంలోను హనుమ జన్మస్థలపై ఎంతో వివరంగా తెలియజేస్తున్నాయి. ఒక్కో యుగంలో ఒక్కో పేరుతో పిలువబడిన పర్వతానికి 20కి పైగా పేర్లు ఉన్నాయని ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి. కృత యుగంలోవృషభాద్రి, త్రేతాయుగంలో అంజనాద్రి, ద్వాపర యుగంలో శేషాద్రి, ఈ కలియుగంలో అంజనాద్రిగా పిలువబడుతోందని వేద మహర్షులు, మహా మునులు రాసిన గ్రంధాల్లో నిక్షిప్తం చేసారు. బ్రహ్మాండ పురాణంలో తీర్థఖండలో దేవతలు అంజనాదేవికి స్తుతిస్తూ.., ఎంతో గొప్ప తపస్సు చేసి బాల హనుమాన్ కు జన్మనిచ్చిన ఈ పర్వతమును అంజనాద్రి అని పిలువబడుతుందని పేర్కొనబడింది. ఇవన్నీ భావిస్తోత్తర పురాణ, వేంకటాచల మహత్యంలో పేర్కొనబడ్డాయి.

lord hanuman birth place anjanidri hills, ttd eo javahar reddy shows proofs, what is the hanuman birth place, lord hanuman birth place contravention, tirumala was lord hanuman birth place, ఆంజనేయుడి పుట్టిన ప్రదేశం ఇదే. ఆధారాలు చూపించిన ఈవో జవహర్ రెడ్డి, హనుమంతుడి పుట్టిన ప్రదేశంపై వివాదం, అంజనేయుడి పుట్టిన ప్రదేశం, హనుమతి పుట్టిన ప్రదేశం ఇదే
హనుమంతుడి ఆలయం

బ్రహ్మాండ పురాణంలో చెప్పబడిన వృత్తాంతం ప్రకారం కేసరి అనే వానరుడుకి అంజనా దేవిని ఇచ్చి వివాహం చేయగా...వారికీ ఎంత కాలం అయిన సంతాన ప్రాప్తి కలుగ లేదు. అంజనాదేవి గృహం వద్దకు వచ్చిన సోదమ్మను పుత్ర భాగ్యం ఉందా లేదా...?? అని అడుగగా.., నీ కోరిక నెరవేరుతుందని సోదమ్మ సమాధానం ఇస్తుంది. పుత్ర భాగ్యం కలగాలంటే వృష్జాబాద్రిపై ఏడు వేల సంవత్సరాలు కఠోర జపం ద్వారా పుత్ర భాగ్యం కలుగుతుందని సోదమ్మ చెప్పి వెళ్లినట్లు తీర్థఖండలో చెప్పబడింది. కఠోర తపస్సు వెంకటాద్రిపై అంజాదేవి చేయటం... ద్వాదశి ప్రధమ పాదంలో సూర్యోదయ ఘడియల్లో మహాబలవంతుడైన సుపుత్రుడైన హనుమంతునికి జన్మనివ్వడం కూడా తిరుమలలోని ఆకాశ గంగ తీర్థంకు సంపంలో ఉన్న జాపాలి అని గ్రంధాలు పేర్కొంటున్నాయి. పుడుతూనే ఆకలితో ఉదయ పర్వతం మీద ఉన్న సూర్యుని ఎర్రని పండుగ భావించిన మారుతీ శ్రీ వెంకటాచలం నుంచి ఉదయగిరి పర్వతంపైకి ఎగర సాగాడు. సుడిగిగా బాల హనుమాన్ ను భావించిన బ్రహ్మ బ్రహ్మాస్త్రాన్నీ ప్రయోగించగా.., తోకతో పక్కకు తోశాడని.., అప్పుడే దేవతలు హనుమ జన్మరహస్యాన్ని గుర్తించి అనేక వరాలు ప్రసాదించారు. రామాయణంలో ప్రస్తావించిన సుమేరు పర్వతమే వెంకటచలంగా చెప్పబడుతోంది.

Lord Hanuman Birth Place, Lord Hanuman Birth Place Tirumala, ttd news, Tirumala news, ap news, హనుమంతుడి జన్మస్థలం, టీటీడీ న్యూస్, తిరుమల న్యూస్, ఏపీ న్యూస్
ఆంజనేయస్వామి

వాఙ్మయ ప్రమాణాలు

ధర్మ సందేహాలకు వాఙ్మయ ప్రమాణాలతో మరియు శాసన ప్రమాణాలతో రుజువు చేస్తే.., వాటికీ మరింత విలువ అధికంగా ఉంటుంది. తమిళంలో అనువదించిన కంబరామాయణంలోని వరాహ పురాణం చెప్పినట్లే సీతను వెతుకుతున్న వానరులు వెంకటాచలంకు వచ్చారని విషయాన్నీ స్పష్టంగా తెలిపారు. క్రీ.శ 1268-1369లో వేదంతా దేశిక ఆచార్యులు హంసదూత మనే కావ్యంలో వెంకటాద్రే అంజనాద్రి అని తెలిపారు. తరువాతి కాలంలో (1361) అణ్ణంకరాచార్యులు శేషాద్రిని అంజనాద్రి అని కీర్తించగా, 1408-1502 వరకు అన్నమాచార్యులు షణ్ముఖప్రియా కీర్తనలో వెంకటాద్రే అంజనాద్రి అని పాడారు. ఇక శ్రీరంగం రామానుజ చార్యులు 17వ శతాబ్దంలో తాను రాసిన కఠోపనిశబ్దష్యానికి మంగళ శ్లోకంగా అంజనాద్రి నాథుని నమస్కరించారట. ఇక స్ట్రాటన్ అనే అధికారి 1800 సంవత్సరంలో తిరుమల గుడి గురించి విషయాలను సవాల్ ఏ జవాబ్ అనే పుస్తకాన్ని రాసాడు. ఆ పుస్తకంలో అంజనాద్రి అనే పదం పై వివరణ ఇస్తూ.. ఆంజనేయుడి జన్మస్థలం అని చెప్పాడు. అంజనాద్రి మహత్యం అనే అప్రకాశితమైన గ్రంధం లండన్ లో ఉన్న ఇండియన్ అఫ్ రికార్డ్ లైబ్రరీ లో ఉంధీ. ఈ గ్రంధం కూడా అంజనాద్రే హనుమ జన్మస్థలం అని వ్రాసినట్లు తెలుస్తోంది.

తిరుమలలో హనుమంతుడి విగ్రహం

శాసన ప్రమాణాలు

వేదాలకు నెలవు, పురాణ ఇతి హాసాలకు ఆధారం శీలా శాసనాలు. వేంకటాచల మహాత్యమే ప్రామాణికం అనడానికి ఆలయంలోని రెండు శిలా శాసనాలు అభ్యం అయ్యాయి. మొదటి శాసనం 1491 జూన్ 27వ తేదికి చెందినది కాగా రెండవది 1545 మార్చ్ 6వ తేదీ నాటిది. అలాగే శ్రీరంగంలో ఒక శిలాశాసనం తురుస్కులు ఆక్రమణ చేసినప్పుడు శ్రీరంగ నాథుని ఉత్సవ బేరాన్ని తిరుమల శ్రీవారి ఆలయానికి తీసుకెళ్లారు. తిరిగి అంజనాద్రి నుంచి గోపనార్యుడునే విజయనగర ప్రతినిధి ప్రతిష్టించినట్లు అందులో వెల్లడించారు. క్రీ.శ 16వ శతాబ్దానికి చెందిన ఎట్టుర్ లక్ష్మి కుమార తాతాచార్య అనే ముని హనుమద్వింశతిః అనే స్త్రోత్రం కాంచీపురం వరద రాజా స్వామి శిలాశాసనంలో వ్రాయబడినది. ఎవరైతే అంజనాద్రి క్షేత్రాన్ని రక్షించే వాడో అటువంటి వాడే వీర పురుషుడు అని అర్థం అతడే వీర హనుమాన్ అని చెప్పారు. తిరుమలలోను, తిరుపతిలోని మరెన్నో శిలాశాసనాలు తెలుపుతున్నాయి.

భౌగోళిక ప్రమాణాలు

అంజనాదేవి హనుమంతునికి జన్మనిచ్చింది కాబట్టే వెంకటాద్రికి అంజనాద్రి అనే పేరు వచ్చిందట. జనక మహారాజు శతానంద మహర్షిని ఇలా ప్రశ్నించాడట. శతానంద మహర్షి ఈ పర్వతానికి అంజనాద్రి అనే పేరు ఎలా వచ్చిందని ప్రశ్నించాడు. అందుకు అంజనాద్రి చరిత్రను శతానంద మహర్షి చెపుతూ.., కేసరి, అంజనాదేవి అనే దంపతులలు సంతానం కలుగక పోవడంతో మతంగా మహర్షి దగ్గరకు వెళ్లి సుపుత్రయోగం, పున్నమ నరక విముక్తికి మార్గం చెప్పాలని ప్రార్ధిస్తుంది. పంప సరోవరానికి యాభై యోజనాల దూరంలో నృసింహ ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమానికి దక్షిణ దిశలలో నారాయణ పర్వతం ఉందని మతంగా మహర్షి చెపుతాడు. అక్కడ స్వామి పుస్కరిణి ఉంది. అక్కడ పుణ్యస్నానం ఆచరించి, అక్క నుంచి ఒక యోజన దూరంలో ఉన్న ఆకాశ గంగ తిర్థంలో 12 ఏళ్ళపాటు తపస్సు చేస్తే పుత్రబాగ్యం పుత్రబాగ్యం కలుగుతుందని మతంగా మహర్షి అంజనాదేవికి సుపుత్ర బాగ్యం కలిగే మార్గం చెపుతారు. మాతంగి మహర్షి చెప్పిన విధంగానే వెంకటాద్రికి చేరుకున్న అంజనాదేవి పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించి,అస్వద వృక్షాని ప్రదిక్షన్ చేసి, అక్కడ నుంచి ఒక క్రోస దూరంలో ఉన్న ఆకాశ గంగ తిర్థంలో తపస్సు ఆచరిస్తుంది అంజనాదేవి. ముందుగా బక్ష బోజ్యదులన్ని వదిలిపెట్టి దేహాని కటివలె మలుచుకొని తపస్సు ఆచరిస్తుంది. తపస్సును మెచ్చిన వాయు దేవుడు అంజనాదేవి చేతిలో ఒక ఫలాని ఇస్తాడు. ఆ ఫలం ద్వార అంజనాదేవి సుపుత్ర యోగం కలిగి, తొమ్మిది మాసాలు మోసి హనుమాన్ కు ఆ ఆకాశ గంగ తీర్థం సమీపంలోని జాపాలిలో శ్రావణమాసంలో హరివాసంలో జన్మనిస్తుంది. చిరంజీవి హనుమ పుట్టిన స్థాలం కాబట్టే వేంకటాచలనికి అంజనాద్రి అనే పేరు వచ్చిందని ద్వాదశ పురాణాలు పేర్కొంటున్నాయి. అదుకే ఆ బ్రహ్మ దేవుడు అంజనాదేవికి శేషాద్రి పర్వతం అంజనాద్రి అనే పేరుతో పిలువబడుతుందని వరం ఇచ్చునట్లు భావిశోత్తర పురాణంలో స్పష్టం చేయబడింది.


ఇన్ని ఆధారాలతో సహా హనుమ జన్మస్థలం తిరుమల, కలియుగ వైకుంఠం, అంజనాద్రి, వెంకటాచలం అనే విషయాన్ని టీటీడీ నిర్దారించింది. కేవలం శ్రీవేంకటేశ్వరుని సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టి రుజువు చేశామని.., శ్రీవారి ఆజ్ఞతో జరిగిన నిర్ధారణ కావడంతో ఎలాంటి వివాదాలు రావని కోరుకుంటున్నట్లు టీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేసారు. ప్రశ్నలు ఏవైనా ఉంటె టీటీడీని అడగవచ్చని.. మరో రెండు మాసాల్లో హనుమ జన్మస్థలం అంజనాద్రి అనే పుస్తకం విడుదల చేయనున్నట్లు ఈవో తెలిపారు.

First published:

Tags: Andhra Pradesh, Tirumala, Ttd

ఉత్తమ కథలు