హోమ్ /వార్తలు /Explained /

Five villages History: తెలంగాణ, ఏపీల సరిహద్దులో 5 గ్రామాల పంచాయితీ.. వాటి అసలు చరిత్ర ఇదే..

Five villages History: తెలంగాణ, ఏపీల సరిహద్దులో 5 గ్రామాల పంచాయితీ.. వాటి అసలు చరిత్ర ఇదే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కాలం గడుస్తున్న కొద్దీ పరిస్థితులు మారినప్పడల్లా అప్పుడు పోగొట్టుకున్న ప్రాంతాల విలువ, అవసరం తెలుస్తోంది. దానికోసం డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.  ఇపుడు ఐదు గ్రామాల కథ అలాగే ఉంది. ఇంతకీ ఆ ఐదూళ్ల చరిత్ర ఏంటి? ఎవరి పాలనలో ఉండేవి ఏపీ నా తెలంగాణనా ?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Khammam, India

(G. Srinivas reddy, News18, Khammam)

ఐదూళ్లు (Five Villages). మహాభారతంలో పంచపాండవులకు ఐదూళ్లిచ్చినా చాలంటూ శ్రీకృష్ణుడు రాయబారం నడుపుతాడు. యుద్ధాన్ని నివారించి, ఇరు పక్షాల నడుమ సయోధ్య కుదర్చడానికి గానూ ఆయన చేసిన ప్రయత్నం నాడు విఫలమైంది. ఫలితంగా మహాభారత యుద్ధం జరిగింది. అది పురాణకాలం. యుగాలు మారినా.. కాలాలు మారినా.. రాజకీయాలు మారినా.. నేతల వైఖరి మారడంలేదు. ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విషయంలోనూ రాజకీయాలే పరమావధిగా మారుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తాజాగా నెలకొన్న వివాదం (Five Villages) చినికి చినికి గాలివానగా మారనుందా.. అంటే అదే వాతావరణం కనిపిస్తోంది. ఎటపాక (Etapaka) , కన్నాయిగూడెం (Kannayigudem), పిచుకలపాడు (Pichukala padu), పురుషోత్తపట్నం (Purushottham Patnam), గుండాల (Goondala) గ్రామాలను తెలంగాణ (Telangana)కు ఇవ్వాలని తాజాగా రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ (Minister Puvvada Ajay Kumar) ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ఊర్ల గుండా కరకట్ట నిర్మిస్తే ఇక గోదావరి వరదల నుంచి శాశ్వతంగా భద్రాచలం పట్టణానికి రక్షణ ఉంటుందన్నది ఆయన వాదన.

భద్రాచలంలో మునక ఉందని..

గత వారం రోజులుగా వరద తీవ్రతను దగ్గరి నుంచి పరిశీలిస్తూ, పునరావాస ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి పువ్వాడ (Minister Puvvada Ajay kumar) పోలవరం డ్యాం ఎత్తు పెంచడం వల్ల కూడా భద్రాచలం (Bhadrachalam) మునకకు దారితీసిందని వ్యాఖ్యానించడం దుమారాన్ని రేపింది. దీనిపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జలవనరుల మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ కేంద్రం అనుమతించిన మేరకే పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఉందని పేర్కొన్నారు. గతంలో వచ్చిన అనేక వరదలను ఉదహరిస్తూ పోలవరం నిర్మాణానికి ముందు కూడా భద్రాచలంలో మునక ఉందని చెప్పుకొచ్చారు. వరదలు వచ్చిన ప్రతిసారీ గోదావరి పరివాహక ప్రాంతంలో ఇలాంటి పరిస్థితులు సాధారణం అన్నది మంత్రి అంబటి మాట. డ్యాం ఎత్తును 45.72 మీటర్ల వరకు పెంచుకునేందుకు కేంద్రం. అనుమతించిన విషయం కొత్తదేం కాదన్నది ఆయన మాట.  ఒకవైపు మునుగుతుంటే మరోవైపు ఎత్తుపెంచడం ఎలా సబబు అన్నది తెలంగాణ మంత్రి మాట. మొత్తానికి గోదావరి వరదల వల్ల మరోసారి రెండు తెలుగురాష్ట్రాల నడుమ వివాదం మొదలైంది.

ఏపీలో కలుపుతూ నిర్ణయం తీసుకుంటున్నా..

నిజానికి తెలంగాణ (Telangana) ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఎక్కడా భద్రాచలం ముచ్చట రాలేదనే చెప్పాలి. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విభజన చట్టంలో భద్రాచలం మినహా పోలవరం (Polavaram) ముంపు మండలాలన్నిటినీ ఆంధ్రప్రదేశ్‌లోనే కలుపుతూ నిర్ణయం తీసుకుంటున్నా, నాటి ఉద్యమ నేత, నేటి తెలంగాణ సీఎం కేసీఆర్‌ (CM KCR) మారు మాట్లాడలేదు. ఆ రోజుకు ఆయనకు ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యం కనుక, భద్రాచలం విషయం పట్టింపు కాలేదన్న చర్చ అప్పట్లో నడిచింది. కానీ ప్రజాసంఘాలు, జర్నలిస్టు సంఘాలు, ఇంకా ఇతర పార్టీలు సైతం భద్రాచలం డివిజన్‌ను ఉన్నది ఉన్నట్టుగా ఖమ్మం ఉమ్మడి జిల్లాలోనే ఉంచాలి.. తెలంగాణకే ఇవ్వాలన్న డిమాండ్‌ చేశారు.

కానీ పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతం కనుక.. చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, కుక్కునూరు, వేలురుపాడు మండలాలు మొత్తంగా, బూర్గంపాడు, భద్రాచలం మండలాలు పాక్షికంగా ఆంధ్రలో కలిసిపోయాయి. భద్రాచలం మండలం అయితే కేవలం భద్రాచలం పట్టణం మినహా ఇంకేమీ మిగలలేదనే చెప్పాలి. చివరకు భద్రాచలం పంచాయతీకి ఉన్న డంపింగ్‌యార్డు సైతం ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లిపోయింది. భద్రాద్రి సీతారాములకు ఉన్న ఆస్తి వందల ఎకరాలున్న పురుషోత్తపట్నం సైతం అటే వెళ్లిపోయింది. నిజానికి దశాబ్దాల ప్రత్యేక రాష్ట్ర సాధన కల నెరవేరుతున్న వేళ, నష్టపోతున్న ప్రాంతం పెద్దగా పట్టలేదనే చెప్పాలి. కాలం గడుస్తున్న కొద్దీ పరిస్థితులు మారినప్పడల్లా అప్పుడు పోగొట్టుకున్న ప్రాంతాల విలువ, అవసరం తెలుస్తోంది. దానికోసం డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

చరిత్ర ఏం చెబుతోంది..?

కుతుబ్‌షాహీల కాలంలో భద్రాచలం ప్రాంతం గోల్కొండ సామ్రాజ్యంలోనే ఉంది. అనంతరం 1724లో ఔరంగజేబు గోల్కొండను కొట్టడం, ఇక్కడ పాలకులుగా అసఫ్‌జాహీలను నియమించడం.. తర్వాత కాలంలో జరిగిన ఒప్పందంలో భాగంగా ఈ ప్రాంతం ఆంగ్లేయుల పరమైంది. ఇక్కడ దుమ్ముగూడెం వద్ద సరకుల రవాణా నౌకలకు అనుకూలంగా ఉంటుందన్న కారణంగా అప్పట్లో నైజాం నుంచి ఆంగ్లేయులు తీసుకున్నారన్నది ఓ వాదన. ఇలా కలిసిన ప్రాంతం అంతా చాలాకాలం చింతపల్లి తాలూకాలో ఉంది. ఇలా చారిత్రకంగా, గోదావరికి అవతల ఉండటం, భాష, ఆహారపు అలవాట్లు, సంస్కృతి, సంప్రదాయాలు, వివాహ సంబంధాల రీత్యా.. మరీ ముఖ్యంగా పోలవరం సబ్‌మెర్జెన్స్‌ కారణంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ ప్రాంతం తెలంగాణలోనే ఉండాలని పెద్దగా పట్టుపట్టలేదు.

ముంపు నుంచి రక్షించడానికి..

నిజానికి పోలవరం (Polavaram) కోసం సేకరిస్తున్న లక్ష ఎకరాలకు పైగా భూమి అంతా ఈ ఏడు మండలాల పరిధిలోనే ఉంది. కానీ తాజాగా తెలంగాణ రవాణామంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ డిమాండ్‌ చేస్తున్న ఐదు ఊళ్లు అనేవి కేవలం భద్రాచలం పట్టణాన్ని ముంపు నుంచి రక్షించడానికి కరకట్ట నిర్మించడం కోసమేనన్నది ఆయన వాదన. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలోనే అప్పట్లో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు ముందుచూపుతో అప్పటి ముఖ్యమంత్రిని ఒప్పించి నిధులు కేటాయించి, కరకట్ట నిర్మాణాన్ని పూర్తిచేయించారు. 70 అడుగుల ప్రమాదకరమైన వరదను సైతం ఈ కరకట్ట ఆపగలిగిందంటే నాటి పాలకుల ముందు చూపు మాత్రమే.

దాన్ని మరింత విస్తరించి, అస్సలు ప్రమాద పరిస్థితి రానీయవద్దన్న మంత్రి పువ్వాడ డిమాండ్‌కు సానుకూలత వస్తున్నా, ఒక రాష్ట్రంలోని ప్రాజెక్టు సబ్‌మెర్జెన్స్‌ ప్రాంతాన్ని మరొక రాష్ట్రంలోని ఒక పట్టణం కోసం కేటాయిస్తారా.. అసలు ఆ అసవరం సైంటిఫిక్‌గా ఉందా అన్నది చర్చ జరగాల్సి ఉంది. అయితే వరదలు వచ్చినప్పడు మాత్రమే కాకుండా, ఇలాంటి సున్నితమైన, అత్యవసరమైన అంశాలపై కంటిన్యూవస్‌గా పోరాడాల్సిన అవసరం ఉందన్నది జనం మాట.

First published:

Tags: AP Telangana border, Khammam, Polavaram, Puvvada Ajay Kumar

ఉత్తమ కథలు