హోమ్ /వార్తలు /Explained /

Russia-USA: రష్యాను ఆ విషయంలో దెబ్బతీయడమే లక్ష్యమన్న యూఎస్.. పుతిన్ వెనక్కి తగ్గుతాడా..?

Russia-USA: రష్యాను ఆ విషయంలో దెబ్బతీయడమే లక్ష్యమన్న యూఎస్.. పుతిన్ వెనక్కి తగ్గుతాడా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతోంది. రష్యా దురాక్రమణ చర్యలను తప్పుబడుతూ యూఎస్, యూరోపియన్‌ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా రష్యా ఆర్థిక సంస్థలపై దెబ్బకొట్టాయి.

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతోంది. రష్యా దురాక్రమణ చర్యలను తప్పుబడుతూ యూఎస్(US), యూరోపియన్‌ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా రష్యా(Russia) ఆర్థిక సంస్థలపై దెబ్బకొట్టాయి. ప్రస్తుతం రష్యా నుంచి ఆయిల్‌(Oil) దిగుమతిని నిలిపివేస్తున్నట్లు యూఎస్‌ ప్రెసిడెంట్‌ జో బైడెన్‌ ప్రకటించారు. రష్యా ప్రధాన ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టడమే లక్ష్యమని, ఆయిల్‌, గ్యాస్‌ దిగుమతులు నిలిపివేస్తున్నామని బైడెన్‌(Biden) పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై(Ukraine) రష్యా దురాక్రమణకు బదులుగా యూఎస్‌ తీసుకొన్న అతి పెద్ద నిర్ణయం ఇదే కావడం గమనార్హం. రష్యాను వెనక్కి తగ్గేలా చేయడానికి సైనిక చర్యలకంటే ఆర్థిక మూలాలను నిర్వీర్యం చేయడమే మేలని కొందరు నిపుణులు చెబుతున్నారు.

రష్యా ఆయిల్‌ దిగుమతులపై యూఎస్‌ ఆంక్షలు ఏంటి?

రష్యా నుంచి ఆయిల్‌, లిక్విడ్‌ నేచురల్‌ గ్యాస్‌, బొగ్గు దిగుమతులను యూఎస్‌ రద్దు చేసింది. రష్యాలో ఎనర్జీ సెక్టార్‌లో పెట్టుబడులు కూడా పెట్టమని తేల్చేసింది. అమెరికన్ల సాయంతో కానీ, ఇతర మార్గాల్లో ప్రయోజనం పొందిగాని ప్రపంచంలోని ఏ ఇతర కంపెనీలూ రష్యా ఎనర్జీ సెక్టార్‌లో పెట్టుబడులు పెట్టకుండా చర్యలు తీసుకొన్నట్లు ప్రకటించింది. రష్యా ఆయిల్‌ను ఇకపై యూఎస్‌ పోర్టులలో అనుమతించరని, పుతిన్ దారుణాలకు ఇది అమెరికన్ ప్రజల ఎదురుదెబ్బని బైడెన్‌ పునరుద్ఘాటించారు.

 Russia Ukraine War: 10 రోజుల్లోనే కిమ్‌ను పక్కకు నెట్టేసిన పుతిన్.. ఆంక్షల్లో ఇప్పుడు రష్యా నం.1

ఈ నిర్ణయానికి అన్ని విభాగాల మద్దతు ఉందని నమ్ముతున్నామని, ఉక్రెయిన్‌ ప్రజల కోసం యూఎస్‌లో భారీ ర్యాలీలు నిర్వహించారని చెప్పారు. అయితే ఇప్పటికే యూఎస్‌ ఆర్థిక మాంద్యంలో ఉందని, తాజా ఆంక్షలతో గ్యాసోలిన్‌ ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు. రష్యా ఆయిల్‌పై యూరోపియన్‌ దేశాలు ఆధారపడినంత కాలం యూఎస్‌ ఆంక్షలు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

రష్యా ఆయిల్‌ ఎగుమతుల ప్రాధాన్యం ఎంత?

ఆయిల్‌ ఉత్పత్తిలో ప్రపంచంలోనే రష్యా మూడో స్థానంలో ఉంది. రోజుకు 10.5 మిలియన్‌ బ్యారెల్స్‌ను తయారు చేస్తోంది. ప్రపంచంలోని ఆయిల్‌ ఉత్పత్తుల్లో 11 శాతం వాటా రష్యాదే కావడం గమనార్హం. ఆయిల్‌ ఉత్పత్తిలో తొలి రెండు స్థానాల్లో అమెరికా, సౌదీ అరేబియా ఉన్నాయి. 2020 సమాచారం మేరకు ప్రపంచంలోని ఆయిల్‌ ఉత్పత్తుల్లో 20 శాతం వాటాతో యూఎస్‌, 13 శాతంతో సౌదీ అరేబియా ఉన్నాయి. రష్యా ఎగుమతుల్లో 44 శాతం, మాస్కోకు అందే పన్నుల్లో 17 శాతం ఆయిల్‌ ద్వారానే లభిస్తుంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగాలంటే ఆయిల్‌ ఆర్థిక మూలాలు అవసరం, అందుకే దాని ప్రధాన ఆర్థిక మూలాలను దెబ్బకొడుతున్నామని బైడెన్‌ వవ్యాఖ్యనించారు. యూఎస్‌ ఆయిల్‌ను రష్యా నుంచి ఎక్కువగా కొనడం లేదు, రష్యా ఆయిల్‌ ఎగుమతుల్లో యూఎస్‌కు 3 శాతమే వెళ్తోంది. 2021లో రోజుకు రష్యా నుంచి యూఎస్‌ 700,000 బ్యారెల్స్ దిగుమతి చేసుకొనేదని తెలిసింది.

Ukraine Civilian Deaths : రష్యా దాడిలో 400 మంది ఉక్రెయిన్ పౌరులు మృతి

రష్యా నుంచి ఎక్కువగా ఆయిల్‌ దిగుమతి చేసుకొనేదెవరు?

యూఎస్‌తోపాటు యూరోపియన్‌ దేశాలకూ రష్యా దిగుమతులు ప్రధానం. ఆయిల్‌ కోసం రష్యాపైనే ఎక్కువగా జర్మనీ ఆధారపడింది. జర్మనీ ఆయిల్‌ దిగుమతుల్లో 30 శాతం మాస్కో నుంచే వస్తోంది. రష్యా నుంచి ఎక్కువగా ఆయిల్‌ దిగుమతి చేసుకొనే దేశాలలో వరుసగా జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ, యూకే, సౌత్‌ కొరియా, యూఎస్‌, జపాన్‌ ఉన్నాయి. రష్యాపై ఎక్కువ ప్రభావం పడాలంటే ఆయిల్‌ దిగుమతి చేసుకొంటున్న పెద్ద దేశాలన్నీ యూఎస్‌తో కలవాల్సిన అవసరం ఉంది.

అయితే ప్రస్తుతం ఆయిల్ విషయంలో ఏ నిబంధనలనూ విధించే ఉద్దేశం లేదని జర్మనీ స్పష్టం చేసింది. యూరోపియన్‌ మిత్ర దేశాలు ఆయిల్‌ దిగుమతులు కొనసాగింవచ్చని కూడా యూఎస్‌ ప్రకటించింది. యూరోపియన్ మిత్రదేశాలు మాతో చేరే స్థితిలో లేవని అర్థం చేసుకొని ముందుకెళ్తున్నామని యూఎస్‌ ప్రకటించింది. అన్ని యూరోపియన్‌ దేశాల కంటే యూఎస్‌లోనే ఎక్కువ ఆయిల్‌ ఉత్పత్తి అఅవుతుందని బైడెన్‌ చెప్పారు. రష్యాపై దీర్ఘకాలంలో ఆయిల్‌ కోసం ఆధారపడకుండా యూరోపియన్‌ దేశాలతో కలిపి పనిచేస్తున్నామని చెప్పారు.

2022 చివరికి రష్యా నుంచి ఆయిల్‌ దిగుమతులను పూర్తిగా నిలిపివేస్తామని యూకే చెప్పింది. రష్యాపై ఆయిల్‌ కోసం ఆధారపడకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించామని ఫ్రాన్స్‌ ప్రెసిడెంట్‌ ఇమ్మానుయేల్‌ మాక్రాన్ చెప్పారు. రష్యా ఆయిల్‌ దిగుమతులకు సంబంధించి యూరోపియన్‌ యూనియన్‌ నిర్ణయాలను పాటించేందుకు ఇటలీ అంగీకరించింది. సమీపంలో యూఎస్‌ ఆంక్షలతో పుతిన్‌ వెనక్కి తగ్గే అవకాశం లేదని విశ్లేషకులు అంటున్నారు. యూరోపియన్‌ దేశాల దీర్ఘకాలిక వ్యూహాల ప్రభావం 2023కి రష్యాపై కనిపించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

First published:

Tags: Russia, Russia-Ukraine War, Ukraine, USA

ఉత్తమ కథలు