THE PRICE OF CRUDE OIL IS NEARING ITS HIGHEST LEVEL SINCE 2018 AND HOW INDIA IS IMPACTED GH SSR
Explained: అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడానికి కారణమేంటి? భారత్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
ప్రతీకాత్మక చిత్రం
భారత్‌లో ఇంధన ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో ఆ ప్రభావం మన దేశంపై కూడా తీవ్రంగా పడింది. బ్యారెల్ చమురు ధర 2018 తర్వాత గరిష్ఠాన్ని చేరడంతో భారత్ సహా పలు దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగాయి.
భారత్‌లో ఇంధన ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో ఆ ప్రభావం మన దేశంపై కూడా తీవ్రంగా పడింది. బ్యారెల్ చమురు ధర 2018 తర్వాత గరిష్ఠాన్ని చేరడంతో భారత్ సహా పలు దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగాయి.
ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధర రూ.100 దాటింది. కొన్ని రాష్ట్రాల్లో రూ.110ని సైతం అధిగమించింది. దీంతో సామాన్యుడిపై ఇంధనం ధర గుదిబండగా మారింది. అసలు ఈ ధరలు ఇలా నిరంతరం పెరగడానికి కారణం ఏంటి? అంతర్జాతీయ డిమాండ్ వల్ల భారత్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది? వంటి విషయాలు తెలుసుకుందాం.
* ఇంధన ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
ఈ వారం ప్రారంభంలో బ్యారెల్(159 లీటర్లు)కు బ్రెంట్ చమురు ధర 85 డాలర్లను (రూ.6381) అధిగమించింది. 2018 తర్వాత మూడేళ్లలో ఇదే గరిష్ఠం. కరోనా మహమ్మారి నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న తరుణంలో ఇంధనానికి డిమాండ్ గణనీయంగా పెరిగింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. అయితే ఇదే సమయంలో ఒపెక్ (పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సమాఖ్య) దేశాలు ఉత్పత్తిని నిదానంగా పెంచుతున్నాయి. తక్కువ సరఫరాను కొనసాగిస్తున్నాయి. ఏడాది క్రితం బ్యారెల్ చమురు ధర 45 డాలర్లు ఉండే ప్రస్తుతం ఇది రెట్టింపు అయింది.
తాజాగా ఒపెక్ దేశాలు తమ రెండో సమావేశంలో ధరల పెరుగుదల ఉన్నప్పటికీ ముడి చమురు సరఫరాను రోజుకు 4,00,000 బ్యారెల్స్ చొప్పున మాత్రమే పెంచుతామని పునరుద్ఘాటించాయి. చమురు ఉత్పత్తిలో అగ్ర స్థానంలో ఉన్న సౌదీ అరేబియా, రష్యా, ఇరాక్, యూఏఈ, కువైట్ లాంటి దేశాలు గత నవంబరులో పెంచిన ఉత్పత్తి కంటే 14 శాతం తక్కువగా ప్రొడ్యూస్ చేస్తామని ప్రకటించాయి. 2020లో కరోనా మహమ్మారి కారణంగా సరఫరాలో భారీ కోతకు అంగీకరించిన ఒపెక్ ప్లస్ దేశాలు డిమాండ్ పుంజుకున్న తర్వాత ఆ స్థాయిలో ఉత్పత్తిని చేపట్టడం లేదు. ముడి చమురు ధరలు పెరగడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణను బలహీన పరుస్తుందని, ఒపెక్ దేశాలు సరఫరాను వేగవంతం చేయాలని భారత్ లాంటి చమురు దిగుమతి దేశాలు వాదిస్తున్నాయి.
S&P గ్లోబల్ ప్లాట్స్ అనలిటిక్స్ నివేదిక ప్రకారం ఆసియాలో సహజ వాయువు డెలివరీ ఆల్ టైం గరిష్ఠానికి చేరుకున్నాయి. MMBTU (మెట్రిక్ మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్) కు అత్యధికంగా 56.3 డాలర్లకు చేరింది. రష్యాలో ఏర్పడిన ఇడా హరికేన్ల వల్ల సహజవాయువు సరఫరాలో అంతరాయాలు ఏర్పడ్డాయి. దీంతో ఐరోపాలో డిమాండ్ అధికమైంది. ఇదే సమయంలో అమెరికాలో శీతాకాలం వల్ల సహజవాయు సరఫరాలో సమస్యలు తలెత్తడంతో కొరత ఏర్పడింది.
* భారత్ పై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
అధిక ముడి చమురు ధరల వల్ల పెట్రోల్, డీజిల్ రేట్లు ఈ ఏడాది క్రమం తప్పకుండా సరికొత్త రికార్డులను అందుకుంటున్నాయి. దేశ రాజధానిలో గత మూడు వారాల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.4.65లు పెరిగి రూ.105.84గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.5.75లు పెరిగి రూ.94.6 వద్ద కొనసాగుతోంది. గత ఏడాది సెప్టెంబరులో పెట్రోల్ వినియోగం 9 శాతం పెరిగినప్పటికీ డీజిల్ శాతం మాత్రం 6.5 శాతం తక్కువ ఉంది.
మహమ్మారి కారణంగా భారత్ లో డీజిల్ కంటే పెట్రోల్ వాడకం ఎక్కువైంది. భారత్ లో పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంలో డీజిల్ వాడకం 38 శాతంగా ఉంది. ముఖ్యంగా పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో డీజిల్ ను అధికంగా ఉపయోగిస్తున్నారు. S&P గ్లోబల్ ప్లాట్స్ అనలిటిక్స్ నివేదిక ప్రకారం రాబోయే పండగ సీజన్, వచ్చే కొన్ని నెలల్లో డీజిల్ కు డిమాండ్ బాగా పెరుగుతుందని పేర్కొంది. వినియోగం ఎక్కువవుతుందని స్పష్టం చేసింది.
ఇదే సమయంలో అంతర్జాతీయంగా సహజవాయువు ధరలు కూడా పెరిగాయి. ప్రభుత్వాధీనంలో ఉన్న ఓఎన్జీసీ సహజవాయువు ధరను గత ఆరు నెలల కాలంలో ప్రతి mmbtuకి 1.79 డాలర్ల నుంచి 2.9 డాలర్లుగా నిర్ణయించింది. PPAC కూడా అల్ట్రా డీప్ వాటర్ నుంచి వెలికితీసిన గ్యాస్ కోసం mmbtuకి 6.13 డాలర్లకు సీలింగ్ ధరను పెంచింది.
గ్యాస్ ధరల పెరుగుదల కారణంగా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(CNG), వంట గ్యాస్(PNG) ధరపై ప్రభావం పడింది. దిల్లీలో సీఎన్జీ ఈ నెలలో కిలోకు రూ.4.56 చొప్పున పెరిగి రూ.49.8కి చేరింది. పీఎన్జీ ధర రూ.4.2 పెరిగి రూ.35.11కి చేరింది. అంతేకాకుండా అంతర్జాతీయంగా బొగ్గు ధరలు కూడా పెరగడంతో భారత్ లో థర్మల్ పవర్ ప్లాంట్లలో బొగ్గు కొరతకు దారితీసింది. దీంతో పాటు అనేక బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్లలో తక్కువ నిల్వల కారణంగా పంజాబ్, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో విద్యుత్ అంతరాయాలకు దారితీసింది. ఫలితంగా పవర్ ఎక్స్చేంజ్లో సాధారణ ధరల కంటే అధిక ధరలకు రాష్ట్రాలు కొనుగోలు చేయాల్సి వచ్చింది.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.