Home /News /explained /

THE DEATH OF A 12 YEAR OLD BOY DUE TO A NIPAH INFECTION HAS SENT HEALTH OFFICIALS IN KERALA SCRAMBLING TO CONTAIN THE DEADLY VIRUS HERE IS WHAT YOU NEED TO KNOW GH SSR

Explained: Nipah Effect: కేరళను వణికిస్తున్న నిఫా వైరస్.. వ్యాప్తిలో కోవిడ్ కంటే తక్కువే కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే..

నిఫా వైరస్ సోకి చనిపోయిన వ్యక్తి మృతదేహం తరలింపు

నిఫా వైరస్ సోకి చనిపోయిన వ్యక్తి మృతదేహం తరలింపు

కోవిడ్ సెకండ్ వేవ్ (Covid Second Wave) తరువాత అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో కేరళ(Kerala) ముందుంటోంది. ఇది చాలదన్నట్లు నిఫా వైరస్ (NiV) అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఉత్తర కోజికోడ్ జిల్లాకు చెందిన 12 ఏళ్ల బాలుడు నిఫా వైరస్ (Nipah Virus) బారిన పడి ఇటీవల మరణించాడు. దీంతో అతడిని కలిసిన వారిని ట్రేస్ చేసి ఐసోలేషన్‌లో ఉంచారు.

ఇంకా చదవండి ...
కోవిడ్ సెకండ్ వేవ్ (Covid Second Wave) తరువాత అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో కేరళ(Kerala) ముందుంటోంది. ఇది చాలదన్నట్లు నిఫా వైరస్ (NiV) అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఉత్తర కోజికోడ్ జిల్లాకు చెందిన 12 ఏళ్ల బాలుడు నిఫా వైరస్ (Nipah Virus) బారిన పడి ఇటీవల మరణించాడు. దీంతో అతడిని కలిసిన వారిని ట్రేస్ చేసి ఐసోలేషన్‌లో ఉంచారు. అధిక మరణ రేటు ఉన్న ఈ వైరస్ (Virus) వ్యాప్తిని నిరోధించేందుకు కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే గత అనుభవాలతో ఈ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొంటామని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ (Kerala Health Minister) చెబుతున్నారు . నిఫా వైరస్.. కోవిడ్-19కి కారణమయ్యే కరోనా వైరస్ (Corona Virus) మాదిరిగా తీవ్రమైన అంటువ్యాధిగా కనిపించదు. కానీ దీని తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల కరోనాతో పోలిస్తే మరింత ప్రమాదకరంగా పరిణమిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

* నిఫా వైరస్ (Nipah Virus) అంటే ఏంటి?
నిఫా అనేది జూనోటిక్ వైరస్(zoonotic virus). ఇది ముందు జంతువుల్లో ఉద్భవించింది. తరువాత మానవులకు సోకింది. ఇలా వ్యాపించే వాటిని జూనోటిక్ వైరస్‌లు అంటారు. ఈ వైరస్ తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్, మెదడువాపు లేదా బ్రెయిన్ పీవర్‌కు కారణమవుతుంది. 1998- 99లో మలేషియాలోని నిఫా అనే గ్రామంలో ఈ వైరస్‌ మొదటిసారి విజృంభించింది. దీంతో ఆ గ్రామం పేరుమీదుగానే దీనికి నిఫా వైరస్ అని నామకరణం చేశారు. అప్పట్లో సింగపూర్ కూడా నిఫా వైరస్‌కు తీవ్రంగా ప్రభావితమైంది.

ఇది కూడా చదవండి: Nipah- Corona Difference: నిఫా-కోవిడ్ మధ్య తేడా ఏంటి? వాటి లక్షణాలు ఏంటి?.. ఏది ప్రమాదకరం?

నిఫా వైరస్ ఫ్రూట్ బ్యాట్ (Fruit Bat) లేదా ఫ్లయింగ్ ఫాక్సెస్ అనే గబ్బిలాల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ప్టెరోపోడిడే (Pteropodidae) కుటుంబానికి చెందిన ఈ గబ్బిలాలు చెట్లపై నివసిస్తూ పండ్లను తింటాయి. ఇవి దక్షిణ, ఆగ్నేయాసియా అంతటా కనిపిస్తాయి.

* ఈ వ్యాధి ప్రజలను ఎలా ప్రభావితం చేస్తుంది?
నిఫా వైరస్ వ్యాప్తి చెందడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వైరస్‌ను వ్యాపింపచేసే ఫ్రూట్ బ్యాట్‌ తిన్న పండ్లను మనుషులు తిన్నప్పుడు లేదా ముడి ఖర్జూర రసాన్ని తాగినప్పుడు ఈ వైరస్ మానవులకు సోకుతుందని నమ్ముతారు. ఫ్రూట్ బ్యాట్‌కు ఖర్జూర అత్యంత ఇష్టమైన పండు కావడం గమనార్హం. గబ్బిలాల లాలాజలం లేదా మూత్రం వంటి స్రావాలు పండ్లకు ఉంటే, వాటిని తిన్న వ్యక్తులకు నిఫా వైరస్ సోకుతుంది. గబ్బిలాలు ఆవాసం ఏర్పరచుకునే చెట్లు ఎక్కే వ్యక్తులకు సైతం గతంలో నిఫా ఇన్ఫెక్షన్ సోకింది.

ఏదైనా ఒక ఇంటర్మీడియట్ హోస్ట్ ద్వారా కూడా వైరస్ మనుషులకు సోకుతుంది. మలేషియా(malaysia), సింగపూర్‌లో(Singapore) 1998-99లో వ్యాప్తి చెందిన నిఫా వైరస్.. జబ్బుపడిన పందుల ద్వారా వ్యాపించినట్లు భావిస్తున్నారు. వైరస్ సోకిన వ్యక్తి శరీర స్రావాల ద్వారా కూడా ఇతరులకు ఇన్‌ఫెక్షన్ సోకుతుంది. బంగ్లాదేశ్, భారత్‌లో వ్యాప్తి చెందిన నిఫా కేసులు మనుషుల నుంచి మనుషులకు సోకినట్లు గుర్తించారు. ఈ వైరస్ శ్వాస సంబంధ స్రావాలు, లాలాజలం ద్వారా ప్రయాణించవచ్చు. అంటే బాధితులు దగ్గినప్పుడు ఇతరులకు వైరస్ సంక్రమించే అవకాశం ఉంది.

* వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి?
నిఫా వైరస్ సోకిన వారిలో తేలికపాటి నుంచి తీవ్రమైన వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఇన్‌ఫెక్షన్ సోకిన వారిలో మెదడు వాపు (ఎన్సెఫాలిటిస్)తో పాటు మరణం కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయని US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) వెల్లడించింది. నిఫా ఇన్‌ఫెక్షన్ లక్షణాలను భారత జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (NCDC) వెల్లడించింది. దీని బారిన పడిన వారిలో జ్వరం, మానసిక సమస్యలు, తీవ్రమైన బలహీనత, తలనొప్పి, శ్వాసకోశ సమస్యలు, దగ్గు, వాంతులు, కండరాల నొప్పి, మూర్ఛ, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైరస్‌ ఇంక్యుబేషన్ కాలం 4-14 రోజుల వరకు ఉంటుంది. అంటే వ్యాధి సోకిన వారిలో లక్షణాలు బయటపడటానికి ఎక్కువ రోజులు పట్టవచ్చు. ఇది ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే వ్యాధి సోకిన వారికి తెలియకుండానే.. వైరస్ వారి నుంచి ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

బాధితుల్లో 3-14 రోజుల్లో జ్వరం, తలనొప్పి వంటివి కనిపిస్తాయి. తరచుగా దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి శ్వాస సంబంధ సమస్యలు సైతం కనిపిస్తాయి. తరువాతి దశలో మగతగా ఉండటం, అయోమయం, మానసిక సమస్యలు వంటి తీవ్రమైన మెదడు వాపు (ఎన్సెఫాలిటిస్) లక్షణాలు ఎదురవుతాయి. క్రమంగా 24-48 గంటల్లో బాధితులు కోమాలోకి వెళ్లే అవకాశాలు కూడా ఉంటాయని CDC తెలిపింది.

* ఇన్‌ఫెక్షన్‌ను ఎలా నిర్ధారిస్తారు?
కోవిడ్-19 మాదిరిగానే నిఫా ఇన్‌ఫెక్షన్‌ను RT-PCR పరీక్ష ద్వారా గుర్తిస్తారు. గొంతు లేదా ముక్కు నుంచి తీసిన స్రావాల శాంపిల్స్, సెరెబ్రోస్పానియల్ ద్రవం, మూత్రం, రక్తం వంటి శాంపిల్స్ పరీక్షించి వ్యాధిని నిర్ధారించవచ్చు. లక్షణాలు ఉన్నవారిలో యాంటీబాడీ టెస్టుల ద్వారా కూడా నిఫా ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించవచ్చు.

* వైరస్ వ్యాప్తి ఎలా ఉంటుంది? ఇది ప్రాణాంతకంగా మారుతుందా?
2018లో కేరళలో నిఫా వైరస్ వెలుగు చూసిన తరువాత.. అప్పటి వ్యాప్తి రేటును గ్లోబల్ వైరస్ నెట్‌వర్క్ (GVN) వెల్లడించింది. నిఫా వైరస్ R ఫ్యాక్టర్ రేటు 0.43గా నమోదైనట్లు పేర్కొంది. R- నంబర్ లేదా R నాట్ అని పిలిచే ఈ సంఖ్య.. వ్యాధి సోకిన వ్యక్తి ద్వారా ఎంతమందికి వైరస్ సంక్రమిస్తుందో తెలుపుతుంది. కోవిడ్-19 విషయంలో R నంబర్ 1 కంటే ఎక్కువగా ఉంది. అంటే దీని వ్యాప్తి రేటు ఎక్కువ అని అర్థం. నిఫాకు మాత్రం ఈ సంఖ్య 1 కంటే తక్కువగా ఉండటం వల్ల.. వైరస్ ఇతరులకు వ్యాపించక ముందే నశించిపోయే అవకాశాలు ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. గతంలో ఇలాగే వైరస్ కేసులు కనుమరుగయ్యాయి.

అయితే నిఫా వైరస్ మరణాల రేటు మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఇది 40-75 శాతం పరిధిలో ఉంటుంది. కేరళలో 2018లో వైరస్ వ్యాప్తి చెందినప్పుడు.. ఇన్‌ఫెక్షన్ సోకిన మొత్తం 19 మందిలో 17 మంది చనిపోయారు. అంటే మరణాల రేటు 89 శాతంగా నమోదైంది. కోవిడ్-19 మరణాల రేటు మాత్రం కేవలం రెండు శాతంగానే నమోదైంది. అయితే వైద్య మౌలిక సదుపాయాల స్థాయి, అవగాహన, వ్యాప్తికి ప్రతిస్పందనపై వ్యాప్తి రేటు, మరణాల రేటు ఆధారపడి ఉంటాయి.

* చికిత్స ఉందా?
ప్రస్తుతం నిఫా వైరస్‌కు ప్రత్యేకమైన మందులు లేదా టీకాలు అందుబాటులోకి రాలేదు. పరిశోధన, అభివృద్ధి కోసం WHO దీన్ని ప్రాధాన్యత కలిగిన వ్యాధిగా గుర్తించింది. వ్యాధి బారిన పడిన వ్యక్తులకు ఇంటెన్సివ్ సపోర్టివ్ కేర్ ద్వారా తీవ్రమైన శ్వాస, న్యూరోలాజిక్ సమస్యలకు చికిత్స అందించాలని సంస్థ సిఫార్సు చేస్తుంది. ఇమ్యునోథెరపీటిక్ చికిత్సల (మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీలు) ద్వారా బాధితులకు ఉపశమనం లభిస్తుందని సీడీసీ తెలిపింది. NiV ఇన్ఫెక్షన్ల చికిత్స కోసం రిపావిరిన్ యాంటీవైరల్ మందును భారతదేశ NCDC సిఫారసు చేస్తోంది. ఇది నిఫా బాధితుల మరణాల రేటును తగ్గించడంలో సహాయపడుతుందని తెలిపింది.

* వైరస్ కట్టడికి కేరళ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
కేరళ గతంలో ఇలాంటి సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంది. 2018లో నిఫా వ్యాప్తి సమయంలో.. ఎబోలా ప్రోటోకాల్‌లో శిక్షణ పొందిన అధికారిని నియమించారు. నిఫా ఉన్నట్లు అనుమానించిన అందరినీ పరీక్షించి, వారిని ఐసోలేషన్‌లో ఉంచడం ద్వారా వైరస్‌ను కట్టడి చేశారు. అయితే ఇప్పటికే కోవిడ్-19 మార్గదర్శకాలను పాటిస్తున్నందువల్ల నిఫా వ్యాప్తి గతంలో మాదిరిగా ఉండకపోవచ్చని వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Published by:Sambasiva Reddy
First published:

Tags: Coronavirus, Covid, Explained, Kerala, Nipah, Virus

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు