హోమ్ /వార్తలు /Explained /

Explained: వరి కొనుగోలుపై కేంద్రం, రాష్ట్రం దోబూచులాట.. అసలు బాధ్యులెవరు..? కారణాలు ఇవేనా..

Explained: వరి కొనుగోలుపై కేంద్రం, రాష్ట్రం దోబూచులాట.. అసలు బాధ్యులెవరు..? కారణాలు ఇవేనా..

దేశ రాజకీయాల్లో భూకంపం సృష్టించడానికి కేసీఆర్ ఢిల్లీలో అడుగుపెట్టగానే కేంద్రం వణికిపోయి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిందంటూ టీఆర్ఎస్ మద్దతుదారులు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటుండగా, కేసీఆర్ కమిషన్ల వల్లే తెలంగాణలో ఇంధన ధరలు ఎక్కువగా ఉన్నాయని కమలదళం కౌంటిర్ ఇస్తున్నది.

దేశ రాజకీయాల్లో భూకంపం సృష్టించడానికి కేసీఆర్ ఢిల్లీలో అడుగుపెట్టగానే కేంద్రం వణికిపోయి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిందంటూ టీఆర్ఎస్ మద్దతుదారులు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటుండగా, కేసీఆర్ కమిషన్ల వల్లే తెలంగాణలో ఇంధన ధరలు ఎక్కువగా ఉన్నాయని కమలదళం కౌంటిర్ ఇస్తున్నది.

Explainer: వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం పరస్పర విభిన్నమైన వైఖరిని ప్రదర్శించడం రైతన్నకు శాపంగా మారింది. గత కొన్నేళ్లుగా రగులుకుంటున్న ఈ వివాదం ఈ ఏడాది ఖరీఫ్‌ పంట కొనుగోలు విషయానికి వచ్చే సరికి మరింత వేడి రగిల్చింది.

ఇంకా చదవండి ...

  (G.SrinivasaReddy,News18,Khammam)

  వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం పరస్పర విభిన్నమైన వైఖరిని ప్రదర్శించడం రైతన్నకు శాపంగా మారింది. గత కొన్నేళ్లుగా రగులుకుంటున్న ఈ వివాదం ఈ ఏడాది ఖరీఫ్‌ పంట కొనుగోలు విషయానికి వచ్చే సరికి మరింత వేడి రగిల్చింది. ఇది రాజకీయ దుమారంగా మారిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. విస్తుగొలిపే విషయం ఏంటంటే అక్కడ కేంద్రంలోనూ, ఇక్కడ రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న పార్టీలు రెండూ విభిన్న వైఖరి ప్రదర్శిస్తూ ఆందోళనలకు దిగడం మరింత గందరగోళానికి దారితీస్తోంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వమే తెలంగాణలో పండిన వంద శాతం వరి ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనంటూ గురువారం ఏకంగా సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ఇందిరాపార్కు వద్ద ధర్నా చేశారు. కేంద్రం దిగొచ్చేదాకా ఈ ఆందోళన కొనసాగుతుందంటూ సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

  Farmers: రోడ్డెక్కిన రైతన్నలు.. ఆ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు..


  మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సరిగా నిర్వహించేలా క్షేత్ర స్థాయిలో వత్తిడి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్న రెండు పార్టీలు రైతులను గందరగోళానికి గురిచేస్తున్నాయని కాంగ్రెస్‌ మండిపడుతోంది. ఆ పార్టీ కూడా గురువారం హైదరాబాద్‌లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించింది.

  ఇలా ఒకే విషయంలో పరస్పర విభిన్న వాదనలతో ఎవరికి వాళ్లే ఆందోళన బాట పట్టడం పట్ల ఒంకింత అసహనం, ఆందోళన రేకెత్తుతోంది. బాధ్యులైన వాళ్లే ఇలా ఆందోళనకు దిగితే అసలు చేయాల్సిందెవరన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనికి జవాబు చెప్పే పరిస్థితి లేదు. ఎవరికి వాళ్లే రాజకీయంలో పడిపోయారన్న విమర్శ వస్తోంది. రైతు సమస్యను ఉన్నది ఉన్నట్టుగా తీసుకుని పరిష్కారం దిశగా ఏమీ చేయకుండా కేవలం రాజకీయ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

  MLC Elections: రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పార్టీ మారితే ఇలా చేస్తారా.. ఈ సారి తాడో పేడో తేలాల్సిందే..


  స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో జనాభాకు తగినంతగా ఆహార ధాన్యాల ఉత్పత్తి లేకపోవడం.. ధాన్యం ఉత్పత్తి అయ్యే ప్రాంతాలకు, జనాభా పరంగా ఎక్కువగా ఉండడం, ఆహార ధాన్యాల అవసరం, వినియోగం అధికంగా ఉండే ప్రాంతాలకు సమన్వయం లేకపోవడం, ఫలితంగా కరవు మరణాలు నమోదు అధికంగా ఉండేది. ఈ దుస్థితిని నివారించడానికి ఉత్పత్తి, సేకరణ, నిల్వ, సరఫరా, పంపిణీ కార్యక్రమాలను సమన్వయం చేయడానికి భారత ఆహార సంస్థను ఏర్పాటు చేయడం, ప్రజా పంపిణీ వ్యవస్థను రూపొందించడం.. ఫలితంగా తిండి లేకుండా ఏ ఒక్కరూ మరణించరాదన్న భావనతో ఒక పటిష్టమైన ఆహార పంపిణీ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.

  Telangana Farmers: ధాన్యం కొనుగోలు చేసిన 24 గంట‌ల్లో రైతుల ఖాతాల్లో డ‌బ్బులు జ‌మ‌.. కానీ ఇప్పుడు ఇలా..


  రైతులు పండించిన ధాన్యాన్ని క్షేత్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎఫ్‌సీఐ సేకరించి, కేంద్ర, రాష్ట్ర గిడ్డుంగుల్లో నిల్వ చేస్తుంది. ఇలా నిల్వ చేసిన ధాన్యాన్ని రాష్ట్రాల అవసరాల మేరకు ఎక్కడికక్కడ సరఫరా చేస్తుంటుంది. ఆహార భద్రత నిమిత్తం తిండి గింజలు పండిస్తున్న రైతులకు కనీస మద్దతు ధరను ఏటా ఉత్పత్తి వ్యయం అంచనా ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దీనికోసం ఒక మార్కెట్‌ స్థిరీకరణ నిధి సైతం ఏర్పాటైంది.

  Smart Tv: స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరల్లో లభ్యం.. కేవలం రూ.7,990 మాత్రమే..


  నికరమైన ఆదాయం ఉండే పంటగా గతంలో పేరున్న వరి పైరుకు ఇప్పుడా పరిస్థితి లేదు. ఇన్పుట్‌ కాస్ట్‌ ఏటికేడు పెరిగిపోవడం, ఎంఎస్‌పీ లభించకపోవడంతో వరి రైతు దిగాలు పడుతున్నాడు. దీనికితోడు గత కొన్నేళ్లుగా తెలంగాన రాష్ట్ర ప్రభుత్వం 'నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం' అన్న నినాదంతో వరి సేద్యాన్ని ప్రోత్సహిస్తూ వస్తోంది. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నికరమైన సాగునీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో లక్షల కోట్ల వ్యయంతో భారీ ఎత్తిపోతల పథకాల నిర్మాణం సాగుతోంది. ఏటా కోటి ఎకరాల్లో వరి పండించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరకముందే వరి ధాన్యం కొనే పరిస్థితి లేకుండా పోయింది.

  Telangana Politics: తెలంగాణలో మరో సమరణానికి మొదలైన సందడి.. టీఆర్ఎస్ నుంచి వాళ్లకే టికెట్లు..?


  పంట ఉత్పత్తితో బాటుగా, మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభ్యం అయ్యేలా చూడాల్సిన బాధ్యత సైతం ప్రభుత్వంపై ఉంది. దీనికోసం గత కొన్నేళ్లుగా రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం వేస్తున్న సాగు అంచనాకు, వాస్తవ సాగుకు భారీ తేడా ఉండడంతో వరి ధాన్యం కుప్పలు తెప్పలుగా మార్కెట్‌ను ముంచెత్తుతున్న పరిస్థితి. దీంతో ఇచ్నిన వాగ్దానం మేరకు కనీస మద్దతు ధరను రైతుకు ఇవ్వలేకపోవడం.. ఈ నెపాన్ని అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒకరిపై ఒకరు నెట్టుకుంటూ వాస్తవ పరిస్థితిని గందరగోళంగా మార్చిన పరిస్థితి ఉంది.

  Whatsapp Chat: శ్రీరామచంద్రతో శ్రీరెడ్డి వాట్సాప్ చాట్ వైరల్.. హౌస్ నుంచి బయటకు పంపించేయండి అంటూ..


  నిజానికి రాష్ట్ర వ్యవసాయశాఖ, పౌక సరఫరాల శాఖ అంచనాల ప్రకారం ఈ ఖరీఫ్‌లో వరి సాధారణ సాగు అంచనా 41.34 లక్షల ఎకరాలు, కానీ నిజానికి అది 61.75 లక్షల ఎకరాలుగా ఉంది. ఇక ధాన్యం దిగుబడి అంచనాలో సైతం భారీ తేడా ఉంది. ఇక తాజాగా ఈ ఖరీఫ్‌లో కేంద్రం తాము కేవలం 40 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యమే ఎఫ్‌సీఐ ద్వారా సేకరిస్తామంటూ స్పష్టం చేయడంతో రైతన్నల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అది కూడా పచ్చిబియ్యం మాత్రమే కొనుగోలు చేస్తామని, ఇక నుంచి పారాబాయిల్డ్‌ రైస్‌ను సేకరించలేమని స్పష్టం చేసింది. ఇప్పటిదాకా పారాబాయిల్డ్‌ వినియోగిస్తున్న రాష్ట్రాల్లో సైతం వారి అవసరాల మేరకు ఆ బియ్యం ఉత్పత్తి జరుగుతోందని పేర్కొంది.

  పైగా ఇలా సేకరించిన పారా బాయిల్డ్‌ బియ్యం నిల్వలు మరో నాలుగేళ్లకు సరిపడా గోదాముల్లో ఉన్నట్టు చెబుతోంది. మరోవైపు ఈ సేకరణను నలభై లక్షల టన్నుల నుంచి తొంబై లక్షల టన్నులకు పెంచాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. పైపెచ్చు పారాబాయిల్డ్‌ రైస్‌ను భారీ ఉత్పత్తి చేస్తున్న తెలంగాణ రాష్ట్రంలో వినియోగించేది మాత్రం పచ్చిబియ్యం కావడంతో, పారాబాయిల్డ్‌ రైస్‌ను కేంద్రం కొనడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య లక్ష్యం 6,821 కాగా, ఇప్పటిదాకా 5,027 ఏర్పాటు చేశారు. అయినా కొనుగోలు చేసింద ఇప్పటిదాకా 12.69 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఇంకా కొనుగోలు చేయాల్సిన ధాన్యం 88.74 లక్షల మెట్రిక్‌ టన్నులు.

  Wife: నా భర్తను విడిచిపెట్టండంటూ.. తన కొడుకుతో అడవి బాట పట్టిన భార్య.. ఏం జరిగిందంటే..


  ఆరుగాలం శ్రమించి, పెట్టుబడులు పెట్టి పండించిన పంటను కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేకపోవడంతో రైతన్నలు తీవ్రమైన నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయారు. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలను కాచుకుని మరీ పండించినా గిట్టుబాటు ధర అటుంచి, అసలు కొనుగోలు చేసే పరిస్థితే లేకపోవడంతో రైతులు ఆందోళన బాట పట్టారు. కొంతమంది రైతన్నలు ఆత్మహత్య యత్నాలను పాల్పడుతున్యనారు.

  డిసెంబర్ 2, 2021 పెళ్లి ముహూర్తం.. కాబోయే భర్త ఆమెతో ఆ ఒక్క మాట అన్నాడు.. ముగింపు ఊహించలేకపోయాడు..


  సంగారెడ్డి జిల్లా కల్హేర్‌ మండల కేంద్రానికి చెందిన రైతు గుడిపల్లి విష్ణువర్దన్‌రెడ్డి ఆత్మహత్యయత్నం చేశారు. ధాన్యం కుప్పలు పడిగాపులు కాస్తున్నా, వర్షాలకు తడిసి మొలకలు వస్తున్నా తూకాలు వేయకపోవడంతో నిరాశ చెంది ఆ రైతు ఆత్మహత్యయత్నం చేసినట్టు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. దీంతో నైనా పరిస్థితి తీవ్రతను అంచనా వేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో ధాన్యం సేకరణపై ఓ నిర్దిష్టమైన ప్రణాళికను రూపొందించి, రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ‌

  Bigg Boss 5 Telugu: భారీగా పడిపోయిన షణ్ముఖ్ గ్రాఫ్.. నంబర్ వన్ స్థానంలోకి వచ్చిన మరో కంటెస్టెంట్..


  దీనికితోడు ధాన్యం నిల్వ చేయడానికి అవసరమైన గోదాములు సైతం ఖాళీగా లేని పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఎఫ్‌సీఐ గోడౌన్ల సామర్థ్యం 6,67,551 మెట్రిక్‌ టన్నులు కాగా, ఇప్పటికే 5,70,041 టన్నుల ధాన్యం ఉంది. సెంట్రల్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పోరేషన్‌ కు చెందిన గోదాముల్లో 1,93,488 మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం ఉండగా, ఇప్పటికే 1,58,288 ‌టన్నుల నిల్వలున్నాయి. ఇంకా స్టేట్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పోరేషన్‌ గోదాముల్లో సామర్థ్యానికి మించి 7,80,391 మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉంది. ఇంకా పీఈజీ లలో 1,97,639 మెట్రిక్‌ టన్నులు, పీడబ్ల్యూఎస్‌లలో 2,36,316 టన్నుల మేర నిల్వలున్నాయి. ఇక కొత్తగా నిల్వలు పెట్టే పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వాలు ధాన్యం నిల్వ సామర్ధ్యాన్ని సైతం పెంచుకోవాల్సిన అవసరం ఉంది.

  Published by:Veera Babu
  First published:

  Tags: CM KCR, Farmer, Farmers bank accounts, Modi

  ఉత్తమ కథలు