THE 2017 TERROR FUNDING CASE IN WHICH KASHMIR SEPARATIST LEADER YASIN MALIK IS SENTENCED TO LIFE DETAILS HERE GH VB
Explained: టెర్రర్-ఫండింగ్ కేసులో యాసిన్ మాలిక్‌కు జీవిత ఖైదు.. కేసు పూర్తి వివరాలు తెలుసుకోండి..
వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్
కాశ్మీర్ లోయ(Kashmir Valley)లో ఉగ్రవాద, వేర్పాటువాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన యాసిన్ మాలిక్ (56)కు తాజాగా ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఉగ్రసంస్థలకు నిధులు అందిస్తున్నాడనే నేరారోపణలపై 2017లో అతడిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) కేసు నమోదు చేసింది.
కాశ్మీర్ లోయ(Kashmir Valley)లో ఉగ్రవాద, వేర్పాటువాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన యాసిన్ మాలిక్ (56)కు తాజాగా ఢిల్లీ కోర్టు(Delhi Court) జీవిత ఖైదు విధించింది. ఉగ్రసంస్థలకు నిధులు అందిస్తున్నాడనే నేరారోపణలపై 2017లో అతడిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) కేసు నమోదు చేసింది. 2017లో అతనిని అరెస్టు చేసింది. అయితే ఈ కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు (Separatist Leader Yasin Malik) తన నేరాన్ని అంగీకరించాడు. ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చిన కేసులో (Terror-funding Case) మాలిక్‌ను దోషిగా మే 19న ఢిల్లీ కోర్టు నిర్ధారించింది. మే 25న మాలిక్‌కు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మరణ శిక్ష విధించాలని కోర్టుకు ఎన్ఐఏ విజ్ఞప్తి చేసింది కానీ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష మాత్రమే విధించింది. ఈ నేపథ్యంలో అతన్ని ఎప్పుడు అరెస్టు చేశారు? అతనిపై ఎలాంటి కేసులు నమోదు చేశారు? ఎన్ఐఏ ఏమని వాధించింది? మాలిక్ కోర్టుకు ఏం చెప్పాడు? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
యాసిన్ మాలిక్ చేసిన రెండు నేరాలకు జీవిత ఖైదు విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఐపీసీ సెక్షన్ 121 (భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం), UAPA సెక్షన్ 17 (ఉగ్రవాద చర్యకు నిధుల సేకరణ) కింద మాలిక్‌కు ఢిల్లీ కోర్టు లైఫ్ సెంటెన్స్ జారీ చేసింది. ప్రత్యేక న్యాయమూర్తి ప్రవీణ్ సింగ్ కఠినమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA), ఇండియన్ పీనల్ కోడ్ (IPC) కింద వివిధ నేరాలకు వివిధ రకాల జైలు శిక్షలు విధించారు. జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) చీఫ్ మాలిక్‌కు రూ.10 లక్షలకు పైగా జరిమానా విధించారు.
మాలిక్‌ను ఎప్పుడు అరెస్టు చేశారు?
2017లో నమోదైన తీవ్రవాద నిధుల కేసుకు సంబంధించి మాలిక్‌ను 2019లో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అతనిపై మోసిన అభియోగాలు?
ఉగ్రవాద చర్యకు పాల్పడినందుకు, ఉగ్రవాదానికి నిధులు సేకరించినందుకు, ఉగ్రవాద గ్రూపులో సభ్యుడిగా ఉన్నందుకు.. నేరపూరిత కుట్రలో భాగమైనందుకు, దేశద్రోహానికి పాల్పడినందుకు మాలిక్‌పై UAPA కింద ఎన్ఐఏ అధికారులు అభియోగాలను మోపారు. కాశ్మీర్ వేర్పాటువాదులు లోయలో రాళ్లదాడి, స్కూళ్లపై దాడి, దహనం ద్వారా సమస్యలను సృష్టించేందుకు లష్కరే తోయిబాకు చెందిన హఫీజ్ సయీద్, హిజ్బుల్-ఉల్-ముజాహిదీన్‌కు చెందిన సయ్యద్ సలావుద్దీన్లతో సహా పాకిస్తాన్ నుంచి నిధులు అందుకుంటున్నారని ఎన్ఐఏ తెలిపింది. ఈ కేసులో మాలిక్, దుఖ్తరన్-ఎ-మిల్లత్‌కు చెందిన ఆసియా ఆంద్రాబీ జమ్మూ కశ్మీర్ డెమోక్రటిక్ ఫ్రీడమ్ పార్టీకి చెందిన షబీర్ షాతో సహా డజనుకు పైగా వేర్పాటువాదులను ఎన్ఐఏ అరెస్టు చేసింది.
ఎన్ఐఏ వాదనలు ఇవే..
మాలిక్‌కు మరణశిక్ష విధించాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బుధవారం కోర్టును కోరింది. ఎన్ఐఏ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాశ్మీరీ వలసలకు యాసిన్ మాలిక్ కారణమని కోర్టుకు తెలిపారు. 56 ఏళ్ల మాలిక్ ఒక "హార్డ్ కోర్ క్రిమినల్" అని, అతని చర్యలు సమాజాన్ని ప్రభావితం చేశాయని, లోయలో దారుణాలకి దారితీశాయని, అందుకే మరణ శిక్ష విధించాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. స్వాతంత్ర్య పోరాటం పేరుతో తీవ్రవాద కార్యకలాపాల కోసం అతను విస్తృతమైన నెట్వర్క్ రూపొందించాడని చెప్పింది. 2016 జూలైలో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీ హత్య తర్వాత - 2016లో మాలిక్ నిరసన క్యాలెండర్లను అందరికీ పంపించి నిరసనలకు నాయకత్వం వహించాడని ఎన్ఐఏ పేర్కొంది. ఆ ఆందోళనల్లో 89 రాళ్లదాడి కేసులు నమోదయ్యాయని పేర్కొంది.
కోర్టుకు మాలిక్ ఏం చెప్పాడు?
తనపై మోపిన అభియోగాలకు తాను వ్యతిరేకంగా వాదించడం లేదని మాలిక్ మే 10న కోర్టుకు తెలిపాడు. కోర్టు విచారణకు హాజరైన మాలిక్ కోర్టు హాలులో మాట్లాడుతూ.. ‘‘నేను 28 ఏళ్లుగా ఏదైనా ఉగ్రవాద కార్యకలాపాలు లేదా హింసకు పాల్పడ్డానని ఇండియన్ ఇంటెలిజెన్స్ ఈ విషయాన్ని రుజువు చేస్తే, నేను రాజకీయాల నుంచి కూడా రిటైర్ అవుతాను. ఉరిశిక్షకు అంగీకరిస్తాను. ఏడుగురు ప్రధాన మంత్రులతో నేను పనిచేశాను." అని యాసిన్ చెప్పాడు. తనకు మరణశిక్ష విధించాలని NIA చేసిన డిమాండ్‌పై, మాలిక్ మాట్లాడుతూ, "నేను ఏ క్షమాభిక్షను అడుక్కోను, కేసు ఈ కోర్టులో ఉంది. ఈ విషయంలో నిర్ణయం తీసుకునే బాధ్యతను నేను కోర్టుకే వదిలిపెట్టాను." అని అన్నాడు.
కోర్టు ఏం చెప్పింది?
“సాక్షుల వాంగ్మూలాలు, డాక్యుమెంటరీ సాక్ష్యాలు దాదాపు నిందితులందరూ వేర్పాటువాదానికి పాల్పడ్డారని.. పాకిస్తానీ స్థాపన మార్గదర్శక హస్తం నిధుల కింద తీవ్రవాద/ఉగ్రవాద సంస్థలతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారని తేలింది." అని ఎన్ఐఏ న్యాయమూర్తి నేరారోపణ ఉత్తర్వులను జారీ చేస్తూ పేర్కొన్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.